Genesis - ఆదికాండము 11 | View All

1. భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను.

1. And all the world was of one tonge and one language.

2. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి

2. And as they came from the east they founde a playne in the lande of Synear and there they dwelled.

3. మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను.

3. And they sayd one to a nother: come on let us make brycke ad burne it wyth fyre. So brycke was there stone and slyme was there morter

4. మరియు వారు మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా

4. And they sayd: Come on let vs buylde vs a cyte and a toure that the toppe may reach vnto heauen. And let vs make us a name for perauenture we shall be scatered abrode over all the erth.

5. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను.

5. And the LORde came downe to see the cyte and the toure which the childern of Ada had buylded.

6. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే; వారికందరికి భాష ఒక్కటే; వారు ఈ పని ఆరంభించి యున్నారు. ఇకమీదట వారు చేయదలచు ఏపని యైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండదు.

6. And the LORde sayd: See the people is one and haue one tonge amonge them all. And thys haue they begon to do and wyll not leaue of from all that they haue purposed to do.

7. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను.

7. Come on let vs descende and myngell theire tonge even there that one vnderstonde not what a nother sayeth.

8. ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుటమానిరి.

8. Thus ye LORde skatered them from thence vppon all the erth. And they left of to buylde the cyte.

9. దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదరగొట్టెను.

9. Wherfore the name of it is called Babell because that the LORDE there confounded the tonge of all the world. And because that the LORde from thence skatered them abrode vppon all the erth.

10. షేము వంశావళి ఇది. షేము నూరేండ్లుగలవాడై జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను.
లూకా 3:34-36

10. These are the generations of Sem: Se was an hundred yere olde and begat Arcphachsad ij. yere after the floude.

11. షేము అర్పక్షదును కనిన తరువాత ఐదువందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

11. And Se lyved after he had begot Arphachsad .v. hundred yere an begat sonnes and doughters.

12. అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను.

12. And Arphacsad lyued .xxxv. yere and begat Sala

13. అర్పక్షదు షేలహును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

13. and lyved after he had begot Sala iiij. hudred yere and .iij and begat sonnes and doughters.

14. షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను.

14. And Sala was .xxx. yere old and begat Eber

15. షేలహు ఏబెరును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

15. ad lyued after he had begot Eber .iiij. hudred and thre yere ad begat sonnes and doughters

16. ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను.

16. When Eber was .xxxiiij. yere olde he begat Peleg

17. ఏబెరు పెలెగును కనిన తరువాత నాలుగువందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

17. and lyued after he had begot Peleg foure hundred and .xxx. yere and begat sonnes and doughters.

18. పెలెగు ముప్పది యేండ్లు బ్రదికి రయూను కనెను.

18. And Peleg when he was .xxx. yere olde begat Regu

19. పెలెగు రయూను కనిన తరువాత రెండువందల తొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

19. and lyued after he had begot Regu. ij. hundred and .ix. yere and begat sonnes and doughters.

20. రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను.

20. And Regu when he had lyued .xxxij. yere begat Serug

21. రయూ సెరూగును కనిన తరువాత రెండు వందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

21. and lyued after he had begot Serug .ij. hundred and .vij. yere and begat sonnes and doughters.

22. సెరూగు ముప్పది యేండ్లు బ్రదికి నాహోరును కనెను.

22. And when Serug was .xxx. yere olde he begat Nahor

23. సెరూగు నాహోరును కనిన తరువాత రెండువందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

23. and lyued after he had begot Nahor .ij. hundred yere and begat sonnes and doughters.

24. నాహోరు ఇరువది తొమ్మిది యేండ్లు బ్రదికి తెరహును కనెను.

24. And Nahor when he was .xxix. yere olde begat Terah

25. నాహోరు తెరహును కనిన తరువాత నూటపం దొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

25. and lyved after he had begot Terah an hundred and .xix. yere and begat sonnes and doughters.

26. తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను.

26. And when Terah was .lxx. yere olde he begat Abram Nahor and Haran.

27. తెరహు వంశావళి ఇది; తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను.

27. And these are the generations of Terah. Terah begat Abram Nahor and Haran. And Haran begat Lot.

28. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రియైన తెరహు కంటె ముందుగా మృతి బొందెను.

28. And Haran dyed before Terah his father in the londe where he was borne at Vr in Chaldea.

29. అబ్రామును నాహోరును వివాహము చేసికొనిరి. అబ్రాము భార్య పేరు శారయి; నాహోరు భార్య పేరు మిల్కా, ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె.

29. And Abram and Nahor toke them wyves. Abras wyfe was called Sarai. And Nahors wyfe Mylca the doughter of Haran which was father of Milca ad of Iisca.

30. శారయి గొడ్రాలై యుండెను. ఆమెకు సంతానములేదు.

30. But Sarai was baren and had no childe.

31. తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు, అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని తీసికొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితోకూడ బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి.

31. Than toke Terah Abram his sonne and Lot his sonne Harans sonne and Sarai his doughter in lawe his sone Abrams wyfe. And they went wyth hym from Vr in Chaldea to go in to the lade of Chanaan. And they came to Haran and dwelled there.

32. తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు. తెరహు హారానులో మృతి బొందెను.

32. And when Terah was ij. hundred yere old and .v. he dyed in Haran.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Genesis - ఆదికాండము 11 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
ప్రపంచంలోని ఒక భాష, ది బిల్డింగ్ ఆఫ్ బాబెల్. (1-4) 
కొన్నిసార్లు ప్రజలు జరిగే చెడు విషయాలను మరచిపోయి, తప్పు చేయడంలో తిరిగిపోతారు. పెద్ద జలప్రళయం వచ్చినా, నోవహు మంచి వ్యక్తి అయినప్పటికీ, చాలా మంది ప్రజలు చెడ్డ పనులు చేశారు. దేవుని సహాయం మాత్రమే ప్రజలు తప్పు చేయాలనుకోవడం మానేయగలదు. ప్రజలు ప్రపంచమంతటా జీవించాలని దేవుడు కోరుకున్నాడు, అయితే కొంతమంది కలిసి ఉండాలనుకున్నారు మరియు ఒక పెద్ద టవర్ నిర్మించాలని కోరుకున్నారు. వారు విగ్రహాలను పూజించడం ప్రారంభించారు మరియు మరింత ధైర్యంగా మారారు. మనం ఒకరినొకరు చెడు పనులు చేయమని ప్రోత్సహించే బదులు మంచి పనులు చేయమని ప్రోత్సహించాలి.

భాషల గందరగోళం, బాబెల్ నిర్మాణదారులు చెదరగొట్టారు. (5-9) 
చెడు పనులు చేసే వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు దేవుడు న్యాయంగా మరియు న్యాయంగా ఉంటాడు. వారి గురించి వివరించే అవకాశం ఇవ్వకుండా అతను వారిని శిక్షించడు. ఎబెర్ అనే వ్యక్తి మంచివాడు మరియు దేవుని మార్గాలను అనుసరిస్తాడు, ఇతరులు అలా చేయరు. దేవుడు చెడ్డ వ్యక్తులను వారి ప్రణాళికలతో కొంతకాలం కొనసాగించడానికి అనుమతించాడు, కాని చివరికి వారి చర్యలు గౌరవానికి బదులుగా అవమానానికి దారితీశాయి. చెడు విషయాలు జరగడానికి దేవునికి కారణాలు ఉన్నాయి, కానీ మన తప్పులకు మనం తగిన విధంగా శిక్షించకుండా ఆయన దయ చూపిస్తాడు. ఒక పెద్ద నగరాన్ని నిర్మించడానికి ప్రజలు కలిసి పని చేయడం దేవుడు చూశాడు, కానీ వారు చాలా గర్వపడుతున్నారు మరియు తనకు అవసరం లేదని భావించారు. కాబట్టి వారు ఒకరినొకరు అర్థం చేసుకోలేరు కాబట్టి అతను దానిని తయారు చేసాడు మరియు నిర్మాణాన్ని ఆపవలసి వచ్చింది. దీని వల్ల మనం వివిధ భాషలను నేర్చుకోవలసి వచ్చినప్పటి నుండి సమస్యలను ఎదుర్కొంటోంది. కొన్నిసార్లు మనం ఒకరినొకరు అపార్థం చేసుకోవడం వల్ల కూడా వాదించుకుంటాం. బిల్డర్లు దేవుడు తమకు వ్యతిరేకమని గ్రహించి నిర్మాణాన్ని నిలిపివేశారు. వారంతా వివిధ భాషల్లో మాట్లాడుకుంటూ తమ తమ మార్గాల్లో వెళ్లారు. యేసు తిరిగి వచ్చు వరకు ప్రజలు అందరూ మళ్లీ కలిసి రారు.

షేమ్ వంశస్థులు. (10-26) 
దేవుని స్నేహితుడు మరియు యేసు పూర్వీకుడు అయిన అబ్రాము‌కు దారితీసే పేర్ల జాబితా ఇది. అబ్రాము కంటే ముందు ఉన్న వ్యక్తుల గురించి, వారి పేర్లు మరియు వయస్సు గురించి మనకు పెద్దగా తెలియదు. మనకు ముందు లేదా మనకు దూరంగా ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకోవడం కష్టం. మన జీవితాలపై మనం దృష్టి పెట్టాలి. ప్రజలు ఎక్కువ కాలం జీవించేవారు, కానీ ఇప్పుడు వారు తక్కువ జీవితాన్ని గడుపుతున్నారు, దేవుడు దానిని ఎలా ప్లాన్ చేసాడు.

తెరహు, అబ్రాము తండ్రి, లోతు తాత, వారు హారానుకు వెళ్లిపోతారు. (27-32)
ఇది పాత మరియు కొత్త నిబంధనలలో ప్రసిద్ధి చెందిన అబ్రాము అనే వ్యక్తికి సంబంధించిన కథ. అతని కుటుంబం మరియు వారి చుట్టూ ఉన్న ప్రజలు అబద్ధ దేవుళ్లను ఆరాధించారు, అయితే అబ్రాము ఒక ప్రత్యేక భూమిని వారసత్వంగా పొందేందుకు దేవుడు ఎన్నుకున్నాడు. మనం మంచి వ్యక్తులుగా మారడానికి ముందు మనం ఎక్కడి నుండి వచ్చాము మరియు ఎలా ప్రవర్తించాము అనేది గుర్తుంచుకోవడం ముఖ్యం. అబ్రాము‌కు ఇద్దరు సోదరులు ఉన్నారు, వారిలో ఒకరు అతని మేనల్లుడు లోతు తండ్రి. దురదృష్టవశాత్తు, అతని సోదరుల్లో ఒకరు తమ స్వదేశాన్ని విడిచిపెట్టడానికి ముందు మరణించారు. మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదని ఇది గుర్తుచేస్తుంది, కాబట్టి మనం జీవించి ఉన్నప్పుడు మంచి వ్యక్తులుగా ఉండటానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. దేవుడు చెప్పినట్లు అబ్రాము తన కుటుంబంతో తన ఇంటిని విడిచిపెట్టాడు. వారు ఊరను పట్టణము అనే ప్రదేశానికి వెళ్లి అబ్రాము తండ్రి చనిపోయే వరకు అక్కడే ఉన్నారు. అబ్రాము కనానుకు ఎలా దగ్గరయ్యాడో కానీ అక్కడ చేరుకోలేకపోయినట్లే చాలా మంది ప్రజలు దేవుని రాజ్యానికి దగ్గరవుతారు కానీ దానిని చేరుకోలేరు.



Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |