Genesis - ఆదికాండము 19 | View All

1. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికి లోతు సొదొమ గవినియొద్ద కూర్చుండియుండెను. లోతు వారిని చూచి వారిని ఎదు ర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారముచేసి
హెబ్రీయులకు 13:2, లూకా 17:28, 2 పేతురు 2:7

“దేవదూతలు”– ఈ దేవదూతలు కూడా మనుషుల ఆకారంలో వచ్చారు – ఆదికాండము 18:1-2 ఆదికాండము 18:22. పురాతన ప్రపంచంలో అతి పాపిష్ఠి నగరంగా సొదొమ ప్రసిద్ధికెక్కింది. పాపంపై దేవుని కోపం, దండనలకు ఉదాహరణగా ఇప్పుడు అది నాశనం కాబోతున్నది (2 పేతురు 2:6 యూదా 1:7 ద్వితీయోపదేశకాండము 29:23 ద్వితీయోపదేశకాండము 32:32 యెహెఙ్కేలు 16:49-50). ఆదికాండము 6:7 లేవీయకాండము 18:24 నోట్స్ చూడండి.

2. నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని యింటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్లు కడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. అందుకు వారు ఆలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ల బుచ్చెదమని చెప్ప్పిరి.

వారు ఆరుబయటే రాత్రి గడుపుతామని అనడం బట్టి లోత్ ఇంటి పరిస్థితి మనకర్థం అవుతున్నది.

3. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని యింట ప్రవేశించిరి. అతడు వారికి విందుచేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి.

4. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుష్యులు, బాలురును వృద్ధులును ప్రజలందరును నలుదిక్కులనుండి కూడివచ్చి ఆ యిల్లు చుట్టవేసి
యూదా 1:7

ఇది ఘోర పాపం. దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో ఇది మరణానికి తగిన పాపమని ఆయన చెప్పాడు (లేవీయకాండము 18:22 లేవీయకాండము 20:13). కొత్త ఒడంబడిక కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది (రోమీయులకు 1:26-27 1 కోరింథీయులకు 6:9 1 తిమోతికి 1:10 యూదా 1:7).

5. లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసికొని రమ్మని అతనితో చెప్పగా

6. లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్లి తన వెనుక తలుపువేసి

7. అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి;

8. ఇదిగో పురుషుని కూడని యిద్దరు కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసికొని వచ్చెదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి.

ఆ కాలంలో ఆతిథ్యం ఆనవాయితీ ప్రకారం అతిథులను కాపాడవలసిన బాధ్యత గృహస్థునిదే. అయినా ఆ దుర్మార్గుల చేతికి తన కూతుళ్ళను మూర్ఖంగా ఇవ్వజూపడం గర్హించదగ్గ తెగింపు చర్య.

9. ఈ మనుష్యులు నా యింటినీడకు వచ్చియున్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారునీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు; కాగా వారికంటె నీకు ఎక్కువ కీడు చేసెదమని చెప్పి లోతు అను ఆ మనుష్యునిమీద దొమ్మిగాపడి తలుపు పగులగొట్టుటకు సమీపించిరి.

లోత్ న్యాయవంతుడైనప్పటికీ సొదొమ ప్రజలకు అతడంటే లెక్కలేదు.

10. అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసికొని తలుపు వేసిరి.

11. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి.

తన ప్రజలను కాపాడుకునేందుకు దేవుని పద్ధతులు దేవునికి ఉన్నాయి. అయితే 8వ వచనంలో ఉన్న తెగింపు చర్యల వంటివి కావవి.

12. అప్పుడా మనుష్యులు లోతుతో ఇక్కడ నీకు మరియెవరున్నారు? నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగినవారినందరిని వెలుపలికి తీసికొని రమ్ము;

13. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితివిు; వారిని గూర్చిన మొర యె హోవా సన్నిధిలో గొప్పదాయెను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా

న్యాయం, లోక క్షేమం దృష్ట్యా సొదొమ నాశనం కావలసిందే. ఆదికాండము 6:7 నోట్ పోల్చి చూడండి.

14. లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడ నైయున్న తన అల్లుళ్లతో మాటలాడిలెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి; యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవు చున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేయువానివలె నుండెను.

లోత్ అల్లుళ్ళకు కూడా అతడంటే లెక్కలేదు.

15. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టిలెమ్ము; ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండ నీ భార్యను ఇక్కడనున్న నీ యిద్దరు కుమార్తెలను తీసికొని రమ్మని చెప్పిరి.

16. అతడు తడవు చేసెను. అప్పుడు అతనిమీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతనిచేతిని అతని భార్యచేతిని అతని యిద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసికొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి.

అది ఎలాంటి గడ్డు పరిస్థితో లోత్ ఇంకా అర్థం చేసుకోలేకపోయినట్టుంది. సొదొమ వదిలివెళ్ళేందుకు మనసు లేదు. అతడి గృహమూ, సంపదా అక్కడ ఉన్నాయి. అతడలా సంకోచిస్తున్నప్పటికీ దేవుడతణ్ణి కరుణించాడు. లోత్ నశించకుండా తప్పించుకున్నది దేవుని కరుణవల్లే గాని అతడి యోగ్యతవల్ల కాదు. ఎఫెసీయులకు 2:4 ఎఫెసీయులకు 28:1 2 పేతురు 3:9 మొ।। చూడండి.

17. ఆ దూతలు వారిని వెలుపలికి తీసికొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనునట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించి పోకుండ ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా
లూకా 17:31-32

18. లోతు ప్రభువా ఆలాగు కాదు.

లోత్ తన నివాసం ఎక్కడో నిర్ణయించే భారం దేవునికి వదిలి పెట్టడానికి ఇష్టం లేదు. ఇంకా తన స్వార్థపూరిత నిర్ణయాలే చేస్తున్నాడు.

19. ఇదిగో నీ కటాక్షము నీ దాసునిమీద వచ్చినది; నా ప్రాణము రక్షించుటవలన నీవు నాయెడల కనుపరచిన నీ కృపను ఘనపరచితివి; నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను; ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో

20. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది గదా, నేను బ్రదుకుదునని చెప్పినప్పుడు

21. ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని;

22. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము; నీ వక్కడ చేరువరకు నేనేమియు చేయలేననెను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను.

అబ్రాహాము ప్రార్థనలకు జవాబుగా దేవుడు లోత్‌ను తప్పించనున్నాడు (వ 29). అందుకని లోత్ సొదొమలోనుంచి బయటికి వచ్చేదాకా దాన్ని నాశనం చేయలేకపోయాడు. నోవహు విషయంలోనూ (6,7 అధ్యాయాలు), ఈ యుగాంతంలో దేవుని ప్రజల విషయంలోనూ ఇంతే (ప్రకటన గ్రంథం 14:14-16 ప్రకటన గ్రంథం 15:1). “సోయరు” అంటే “చిన్నది” అని అర్థం.

23. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను.

25. ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారినందరిని నేల మొలకలను నాశనము చేసెను.

26. అయితే లోతు భార్య అతని వెనుకనుండి తిరిగి చూచి ఉప్పు స్థంభమాయెను.
లూకా 17:31

లోత్ తన భార్యపై ప్రభావం ఎక్కువగా చూపలేకపోయాడు. ఆమెకు ఇష్టమైనదంతా సొదొమలోనే ఉంది. లూకా 17:32 చూడండి.

27. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి

ఆదికాండము 18:22 చూడండి.

28. సొదొమ గొమొఱ్ఱాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలె లేచుచుండెను.
ప్రకటన గ్రంథం 9:2

29. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడుచేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసికొని, లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండ అతని తప్పించెను.

అబ్రాహాము ప్రార్థనల వల్ల లోత్ తప్పించుకున్నాడు. అబ్రాహాము కోసమే దేవుడు అలా చేశాడు.

30. లోతు సోయరులో నివసించుటకు భయపడి, తన యిద్దరు కుమార్తెలతో కూడ సోయరునుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని యిద్దరు కుమార్తెలును ఒక గుహలో నివసించిరి.

లోత్ తన కూతుళ్ళపై కూడా ఎలాంటి దైవభక్తి సంబంధమైన ప్రభావమూ చూపలేకపోయాడు. ఇక్కడ జరిగినదానికి బాధ్యుడు అతనే. లోత్ చరిత్ర శోచనీయం. కానీ ఇది అనేక గుణపాఠాలు నేర్పుతుంది. ఇతడు దేవుణ్ణి నమ్మి న్యాయవంతుడని లెక్కలోకి వచ్చిన వ్యక్తి (2 పేతురు 2:6-8). అయితే పేరాశ మూలాన తగనిదాన్ని ఎన్నుకొన్నాడు. సొదొమకు దూరంగా నివసించడానికి నిశ్చయించుకోలేదు. సొదొమ ఎలాంటిదో అతడికి తెలుసు. ఆ ప్రజల ప్రవర్తనవల్ల విసికిపోయాడు. కానీ అక్కడే నివసించాలని నిర్ణయించుకున్నాడు. దేవుని భయభక్తుల్లో ఉపదేశంలో తన కూతుళ్ళను పెంచలేదు. పాపవిముక్తి పొందినప్పటికీ శరీర స్వభావానికి లొంగిన విశ్వాసులకు ఇతడు గుర్తుగా ఉన్నాడు. అలాంటివారు గొప్ప నష్టాన్ని అనుభవిస్తారు – 1 కోరింథీయులకు 3:1-15. దేవుని వాక్కు ద్వారా మనం ఈ లోకం నిజ స్థితి ఎలాంటిదో, అందులో జీవించడమెలాగో నేర్చుకుందాం (1 యోహాను 2:16-17 2 కోరింథీయులకు 6:14-18). మనకు స్వార్థం మూలంగా, లోకంతో రాజీపడడం మూలంగా ఎంత నష్టం కలుగుతుందో నేర్చుకుందాం.

31. అట్లుండగా అక్క తన చెల్లెలితో మన తండ్రి ముసలి వాడు; సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు.

32. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగచేసికొందము రమ్మని చెప్పెను.

33. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు.

34. మరునాడు అక్క తన చెల్లెలిని చూచినిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలాగున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను.

35. ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు.

36. ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి.

మోయాబువాళ్ళు, అమ్మోనువాళ్ళు అటు తరువాత ఇస్రాయేల్‌వారికి పగవారయ్యారు. లోత్ కూతుళ్ళు అతడితో చేసిన పాపం వంటి పాపానికీ, ఆ మాటకొస్తే అన్ని రకాల పాపాలకూ కూడా దీర్ఘకాలిక ఫలితాలుంటాయి.

37. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటివరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.

38. చిన్నదికూడ కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటివరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.

“బెన్ అమ్మి”– అంటే “నా ప్రజల కొడుకు”.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Genesis - ఆదికాండము 19 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
సొదొమ నాశనం, మరియు లోతు విడుదల. (1-29) 
లోతు అనే ఒక మంచి వ్యక్తి ఉండేవాడు, కానీ అతను ఒక నగరంలో నివసించాడు, అక్కడ అందరూ చాలా చెడ్డవారు. దేవుడు లోతును మరియు అతని కుటుంబాన్ని రక్షించాలనుకున్నాడు, కాబట్టి నగరం నాశనం చేయబడకముందే వారిని విడిచిపెట్టమని హెచ్చరించాడు. లాట్ సంకోచంగా ఉన్నందున బయలుదేరడానికి చాలా సమయం పట్టింది, ఇది వ్యక్తులు మారాలని తెలిసినప్పుడు కానీ కోరుకోనప్పుడు వారికి ఇది జరగవచ్చు. మనం దేవుని దయతో రక్షింపబడ్డాము, మనం దానికి అర్హులైనందున కాదు. మన పాపపు మార్గాలను విడిచిపెట్టడానికి సహాయం చేయడంలో దేవుని శక్తిని మనం గుర్తించాలి. పాపం నుండి రక్షింపబడిన మనందరికీ ఇది ఒక ఆజ్ఞ, వెనక్కి తిరిగి చూడకుండా పారిపోవాలని లోతు చెప్పబడింది. మనం మన పాత పద్ధతులకు తిరిగి రాకూడదు లేదా ఈ ప్రపంచంలోని విషయాలతో సంతృప్తి చెందకూడదు. బదులుగా, మనం స్వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవాలి. దేవుడు పాపం పట్ల కోపంగా ఉన్నాడని మరియు అది నాశనానికి దారితీస్తుందని నగరం నాశనం చేయడం మనకు చూపిస్తుంది. దీని నుండి మనం పాఠాలు నేర్చుకుని పాపానికి దూరంగా ఉండాలి.


లోతు పాపం మరియు అవమానం. (30-38)
చాలా సురక్షితంగా భావించడం మరియు చెడు పనులు చేయకుండా మనం సురక్షితంగా ఉన్నామని అనుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ కథ మనకు చూపుతుంది. మంచిగా ఉండాలని ప్రయత్నించి, తన చుట్టూ జరుగుతున్న చెడు విషయాల గురించి కలత చెందిన లోతు కూడా, అతను ఒంటరిగా ఉన్నప్పుడు, శోదించబడతాడని ఆశించకుండా తప్పు చేశాడు. అతిగా మద్యం సేవించడం కూడా చాలా ప్రమాదకరం, ఎందుకంటే ప్రజలు తెలివిగా ఉన్నప్పుడు వారు ఎప్పటికీ చేయని పనులను చేయగలరు. మనం ప్రేమించే మరియు విశ్వసించే వ్యక్తులు కూడా కొన్నిసార్లు చెడు పనులు చేయడానికి మనల్ని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించవచ్చు, కాబట్టి మనం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి మరియు ప్రమాదం గురించి జాగ్రత్తగా ఉండాలి. మనుషులు చెడ్డపనులు చేసినప్పుడు, వారు మరచిపోతారని మరియు వారి మంచి పేరును పోగొట్టుకుంటారని కూడా ఈ కథ మనకు బోధిస్తుంది.


Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |