Genesis - ఆదికాండము 21 | View All

1. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారాను గూర్చి చేసెను.

1. yehōvaa thaanu cheppina prakaaramu shaaraanu darshin̄chenu. Yehōvaa thaanichina maaṭachoppuna shaaraanu goorchi chesenu.

2. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయకాలములో శారా గర్భవతియై అతని ముసలి తనమందు అతనికి కుమారుని కనెను.
గలతియులకు 4:22, హెబ్రీయులకు 11:11

2. eṭlanagaa dhevuḍu abraahaamuthoo cheppina nirṇayakaalamulō shaaraa garbhavathiyai athani musali thanamandu athaniki kumaaruni kanenu.

3. అప్పుడు అబ్రాహాము తనకు పుట్టిన వాడును తనకు శారా కనిన వాడు నైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను.
మత్తయి 1:2, లూకా 3:34

3. appuḍu abraahaamu thanaku puṭṭina vaaḍunu thanaku shaaraa kanina vaaḍu naina thana kumaaruniki issaaku anu pēru peṭṭenu.

4. మరియదేవుడు అబ్రాహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను.
అపో. కార్యములు 7:8

4. mariyu dhevuḍu abraahaamu kaagnaapin̄china prakaaramu athaḍu enimidi dinamula vaaḍaina issaaku anu thana kumaaruniki sunnathi chesenu.

5. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు.

5. abraahaamu kumaaruḍaina issaaku athaniki puṭṭinappuḍu athaḍu noorēṇḍlavaaḍu.

6. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. వినువారెల్ల నా విషయమై నవ్వుదురనెను.

6. appuḍu shaaraa dhevuḍu naaku navvu kalugajēsenu. Vinuvaarella naa vishayamai navvuduranenu.

7. మరియశారా పిల్లలకు స్తన్యమిచ్చునని యెవరు అబ్రాహాముతో చెప్పును నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా? అనెను.

7. mariyu shaaraa pillalaku sthanyamichunani yevaru abraahaamuthoo cheppunu nēnu athani musalithanamandu kumaaruni kaṇṭini gadaa? Anenu.

8. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను.

8. aa pillavaaḍu perigi paalu viḍichenu. Issaaku paalu viḍichina dinamandu abraahaamu goppa vindu chesenu.

9. అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి
గలతియులకు 4:29

9. appuḍu abraahaamunaku aiguptheeyuraalaina haagaru kanina kumaaruḍu parihasin̄chuṭa shaaraa chuchi

10. ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము; ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండడని అబ్రాహాముతో అనెను.
గలతియులకు 4:30

10. ee daasini deeni kumaaruni veḷlagoṭṭumu; ee daasi kumaaruḍu naa kumaaruḍaina issaakuthoo vaarasuḍai yuṇḍaḍani abraahaamuthoo anenu.

11. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను.

11. athani kumaaruni baṭṭi aa maaṭa abraahaamunaku mikkili duḥkhamu kalugajēsenu.

12. అయితే దేవుడు ఈ చిన్న వాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకు వలన అయినది యే నీ సంతానమనబడును.
హెబ్రీయులకు 11:18, మత్తయి 1:2, రోమీయులకు 9:7

12. ayithē dhevuḍu ee chinna vaani baṭṭiyu nee daasini baṭṭiyu neevu duḥkhapaḍavaddu. shaaraa neethoo cheppu prathi vishayamulō aame maaṭa vinumu; issaaku valana ayinadhi yē nee santhaanamanabaḍunu.

13. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనికూడ ఒక జనముగా చేసెదనని అబ్రాహాముతో చెప్పెను.

13. ayinanu ee daasi kumaaruḍunu nee santhaanamē ganuka athanikooḍa oka janamugaa chesedhanani abraahaamuthoo cheppenu.

14. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితో కూడ హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేరషెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను.

14. kaabaṭṭi tellavaarinappuḍu abraahaamu lēchi aahaaramunu neeḷla thitthini theesikoni aa pillavaanithoo kooḍa haagarunaku appagin̄chi aame bhujamu meeda vaaṭini peṭṭi aamenu pampivēsenu. aame veḷli beyērshebaa araṇyamulō iṭu aṭu thiruguchuṇḍenu.

15. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి

15. aa thitthilōni neeḷlu ayipōyina tharuvaatha aame oka poda krinda aa chinnavaani paḍavēsi

16. యీ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, వింటి వేత దూరము వెళ్లి అతని కెదురుగా కూర్చుండెను. ఆమె యెదురుగా కూర్చుండి యెలుగెత్తి యేడ్చెను.

16. yee pillavaani chaavu nēnu chooḍalēnani anukoni, viṇṭi vētha dooramu veḷli athani kedurugaa koorchuṇḍenu. aame yedurugaa koorchuṇḍi yelugetthi yēḍchenu.

17. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరూ నీకేమివచ్చినది? భయపడకుము; ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని యున్నాడు;

17. dhevuḍu aa chinnavaani moranu vinenu. Appuḍu dhevuni dootha aakaashamu nuṇḍi haagarunu pilichi haagaroo neekēmivachinadhi? Bhayapaḍakumu; aa chinnavaaḍunna chooṭa dhevuḍu vaani svaramu vini yunnaaḍu;

18. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను.

18. neevu lēchi aa chinnavaani lēvanetthi nee chetha paṭṭukonumu; vaanini goppa janamugaa chesedhanani aamethoo anenu.

19. మరియదేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను.

19. mariyu dhevuḍu aame kannulu terachinanduna aame neeḷla ooṭa chuchi veḷli aa thitthini neeḷlathoo nimpi chinnavaaniki traaganicchenu.

20. దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను.

20. dhevuḍu aa chinnavaaniki thooḍaiyuṇḍenu. Athaḍu perigi peddavaaḍai aa araṇyamulō kaapuramuṇḍi vilukaaḍaayenu.

21. అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను.

21. athaḍu paaraanu araṇyamulō nunnappuḍu athani thalli aigupthudheshamunuṇḍi oka streeni techi athaniki peṇḍlichesenu.

22. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతియైన ఫీకోలును అబ్రాహాముతో మాటలాడినీవు చేయు పనులన్నిటిలోను దేవుడు నీకు తోడైయున్నాడు గనుక.

22. aa kaalamandu abeemelekunu athani sēnaadhipathiyaina pheekōlunu abraahaamuthoo maaṭalaaḍineevu cheyu panulanniṭilōnu dhevuḍu neeku thooḍaiyunnaaḍu ganuka.

23. నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక, నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివైయున్న యీ దేశమునకు చేసెదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పెను.

23. neevu nannainanu naa putra pautraadulanainanu van̄chimpaka, nēnu neeku chesina upakaaramu choppuna naakunu neevu paradheshivaiyunna yee dheshamunaku chesedhanani dhevuni pēraṭa ikkaḍa naathoo pramaaṇamu cheyumani cheppenu.

24. అందుకు అబ్రాహాము ప్రమాణము చేసెదననెను.

24. anduku abraahaamu pramaaṇamu chesedhananenu.

25. అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసికొనిన నీళ్ల బావివిషయమై అబ్రాహాము అబీమెలెకును ఆక్షేపింపగా అబీమెలెకు ఈ పని యెవరు చేసిరో నేనెరుగను;

25. abeemeleku daasulu balaatkaaramugaa theesikonina neeḷla baavivishayamai abraahaamu abeemelekunu aakshēpimpagaa abeemeleku ee pani yevaru chesirō nēneruganu;

26. నీవును నాతో చెప్పలేదు; నేను నేడే గాని యీ సంగతి వినలేదని చెప్పగా.

26. neevunu naathoo cheppalēdu; nēnu nēḍē gaani yee saṅgathi vinalēdani cheppagaa.

27. అబ్రాహాము గొఱ్ఱెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకిచ్చెను. వారిద్దరు ఇట్లు ఒక నిబంధన చేసికొనిరి.

27. abraahaamu gorrelanu goḍlanu teppin̄chi abeemelekukicchenu. Vaariddaru iṭlu oka nibandhana chesikoniri.

28. తరువాత అబ్రాహాము తన గొఱ్ఱెల మందలో నుండి యేడు పెంటి పిల్లలను వేరుగా నుంచెను గనుక

28. tharuvaatha abraahaamu thana gorrela mandalō nuṇḍi yēḍu peṇṭi pillalanu vērugaa nun̄chenu ganuka

29. అబీమెలెకు అబ్రాహాముతో నీవు వేరుగా ఉంచిన యీ యేడు గొఱ్ఱపిల్లలు ఎందుకని యడిగెను. అందుకతడు

29. abeemeleku abraahaamuthoo neevu vērugaa un̄china yee yēḍu gorrapillalu endukani yaḍigenu. Andukathaḍu

30. నేనే యీ బావిని త్రవ్వించినందుకు నా సాక్ష్యార్థముగా ఈ యేడు గొఱ్ఱ పిల్లలను నీవు నాచేత పుచ్చుకొనవలెనని చెప్పెను.

30. nēnē yee baavini travvin̄chinanduku naa saakshyaarthamugaa ee yēḍu gorra pillalanu neevu naachetha puchukonavalenani cheppenu.

31. అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేరషెబా అనబడెను.

31. akkaḍa vaariddaru aṭlu pramaaṇamu chesikoninanduna aa chooṭu beyērshebaa anabaḍenu.

32. బెయేరషెబాలో వారు ఆలాగు ఒక నిబంధన చేసికొనిన తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతియైన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్లెను.

32. beyērshebaalō vaaru aalaagu oka nibandhana chesikonina tharuvaatha abeemeleku lēchi thana sēnaadhipathiyaina pheekōluthoo philishtheeyula dheshamunaku thirigi veḷlenu.

33. అబ్రాహాము బెయేరషెబాలో ఒక పిచుల వృక్షమునాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను.

33. abraahaamu beyērshebaalō oka pichula vrukshamunaaṭi akkaḍa nitya dhevuḍaina yehōvaa pēraṭa praarthana chesenu.

34. అబ్రాహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా నుండెను.

34. abraahaamu philishtheeyula dheshamulō anēka dinamulu paradheshigaa nuṇḍenu.Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |