Genesis - ఆదికాండము 21 | View All

1. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారాను గూర్చి చేసెను.

1. The LORD blessed Sarah, as he had promised,

2. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయకాలములో శారా గర్భవతియై అతని ముసలి తనమందు అతనికి కుమారుని కనెను.
గలతియులకు 4:22, హెబ్రీయులకు 11:11

2. and she became pregnant and bore a son to Abraham when he was old. The boy was born at the time God had said he would be born.

3. అప్పుడు అబ్రాహాము తనకు పుట్టిన వాడును తనకు శారా కనిన వాడు నైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను.
మత్తయి 1:2, లూకా 3:34

3. Abraham named him Isaac,

4. మరియదేవుడు అబ్రాహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను.
అపో. కార్యములు 7:8

4. and when Isaac was eight days old, Abraham circumcised him, as God had commanded.

5. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు.

5. Abraham was a hundred years old when Isaac was born.

6. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. వినువారెల్ల నా విషయమై నవ్వుదురనెను.

6. Sarah said, 'God has brought me joy and laughter. Everyone who hears about it will laugh with me.'

7. మరియశారా పిల్లలకు స్తన్యమిచ్చునని యెవరు అబ్రాహాముతో చెప్పును నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా? అనెను.

7. Then she added, 'Who would have said to Abraham that Sarah would nurse children? Yet I have borne him a son in his old age.'

8. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను.

8. The child grew, and on the day that he was weaned, Abraham gave a great feast.

9. అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి
గలతియులకు 4:29

9. One day Ishmael, whom Hagar the Egyptian had borne to Abraham, was playing with Sarah's son Isaac.

10. ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము; ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండడని అబ్రాహాముతో అనెను.
గలతియులకు 4:30

10. Sarah saw them and said to Abraham, 'Send this slave and her son away. The son of this woman must not get any part of your wealth, which my son Isaac should inherit.'

11. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను.

11. This troubled Abraham very much, because Ishmael also was his son.

12. అయితే దేవుడు ఈ చిన్న వాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకు వలన అయినది యే నీ సంతానమనబడును.
హెబ్రీయులకు 11:18, మత్తయి 1:2, రోమీయులకు 9:7

12. But God said to Abraham, 'Don't be worried about the boy and your slave Hagar. Do whatever Sarah tells you, because it is through Isaac that you will have the descendants I have promised.

13. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనికూడ ఒక జనముగా చేసెదనని అబ్రాహాముతో చెప్పెను.

13. I will also give many children to the son of the slave woman, so that they will become a nation. He too is your son.'

14. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితో కూడ హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేరషెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను.

14. Early the next morning Abraham gave Hagar some food and a leather bag full of water. He put the child on her back and sent her away. She left and wandered about in the wilderness of Beersheba.

15. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి

15. When the water was all gone, she left the child under a bush

16. యీ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, వింటి వేత దూరము వెళ్లి అతని కెదురుగా కూర్చుండెను. ఆమె యెదురుగా కూర్చుండి యెలుగెత్తి యేడ్చెను.

16. and sat down about a hundred yards away. She said to herself, 'I can't bear to see my child die.' While she was sitting there, she began to cry.

17. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరూ నీకేమివచ్చినది? భయపడకుము; ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు;

17. God heard the boy crying, and from heaven the angel of God spoke to Hagar, 'What are you troubled about, Hagar? Don't be afraid. God has heard the boy crying.

18. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను.

18. Get up, go and pick him up, and comfort him. I will make a great nation out of his descendants.'

19. మరియదేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను.

19. Then God opened her eyes, and she saw a well. She went and filled the leather bag with water and gave some to the boy.

20. దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను.

20. God was with the boy as he grew up; he lived in the wilderness of Paran and became a skillful hunter.

21. అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను.

21. His mother got an Egyptian wife for him.

22. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతియైన ఫీకోలును అబ్రాహాముతో మాటలాడినీవు చేయు పనులన్నిటిలోను దేవుడు నీకు తోడైయున్నాడు గనుక.

22. At that time Abimelech went with Phicol, the commander of his army, and said to Abraham, 'God is with you in everything you do.

23. నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక, నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివైయున్న యీ దేశమునకు చేసెదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పెను.

23. So make a vow here in the presence of God that you will not deceive me, my children, or my descendants. I have been loyal to you, so promise that you will also be loyal to me and to this country in which you are living.'

24. అందుకు అబ్రాహాము ప్రమాణము చేసెదననెను.

24. Abraham said, 'I promise.'

25. అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసికొనిన నీళ్ల బావివిషయమై అబ్రాహాము అబీమెలెకును ఆక్షేపింపగా అబీమెలెకు ఈ పని యెవరు చేసిరో నేనెరుగను;

25. Abraham complained to Abimelech about a well which the servants of Abimelech had seized.

26. నీవును నాతో చెప్పలేదు; నేను నేడే గాని యీ సంగతి వినలేదని చెప్పగా.

26. Abimelech said, 'I don't know who did this. You didn't tell me about it, and this is the first I have heard of it.'

27. అబ్రాహాము గొఱ్ఱెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకిచ్చెను. వారిద్దరు ఇట్లు ఒక నిబంధన చేసికొనిరి.

27. Then Abraham gave some sheep and cattle to Abimelech, and the two of them made an agreement.

28. తరువాత అబ్రాహాము తన గొఱ్ఱెల మందలో నుండి యేడు పెంటి పిల్లలను వేరుగా నుంచెను గనుక

28. Abraham separated seven lambs from his flock,

29. అబీమెలెకు అబ్రాహాముతో నీవు వేరుగా ఉంచిన యీ యేడు గొఱ్ఱెపిల్లలు ఎందుకని యడిగెను. అందుకతడు

29. and Abimelech asked him, 'Why did you do that?'

30. నేనే యీ బావిని త్రవ్వించినందుకు నా సాక్ష్యార్థముగా ఈ యేడు గొఱ్ఱె పిల్లలను నీవు నాచేత పుచ్చుకొనవలెనని చెప్పెను.

30. Abraham answered, 'Accept these seven lambs. By doing this, you admit that I am the one who dug this well.'

31. అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేరషెబా అనబడెను.

31. And so the place was called Beersheba, because it was there that the two of them made a vow.

32. బెయేరషెబాలో వారు ఆలాగు ఒక నిబంధన చేసికొనిన తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతియైన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్లెను.

32. After they had made this agreement at Beersheba, Abimelech and Phicol went back to Philistia.

33. అబ్రాహాము బెయేరషెబాలో ఒక పిచుల వృక్షమునాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను.

33. Then Abraham planted a tamarisk tree in Beersheba and worshiped the LORD, the Everlasting God.

34. అబ్రాహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా నుండెను.

34. Abraham lived in Philistia for a long time.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Genesis - ఆదికాండము 21 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
ఇస్సాకు జననం, శారా ఆనందం. (1-8) 
పాత నిబంధనలో ఇస్సాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. దేవుడు వారిద్దరినీ పంపుతానని వాగ్దానం చేసినందున అతను యేసులా ఉన్నాడు మరియు వారి రాక కోసం ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇస్సాకు ఖచ్చితంగా జన్మించినట్లు దేవుడు చెప్పినప్పుడు జన్మించాడు మరియు మనం కొద్దిసేపు వేచి ఉండవలసి వచ్చినప్పటికీ, దేవుడు తన వాగ్దానాలను ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటాడని అది గుర్తుచేస్తుంది. అతని పేరు, ఇస్సాకు, "నవ్వు" అని అర్ధం, ఎందుకంటే అతని పుట్టుక అతని కుటుంబానికి చాలా ఆనందాన్ని ఇచ్చింది. కీర్తనల గ్రంథము 22:9-10 హోషేయ 11:1-2 

ఇస్మాయిల్ ఇస్సాకు‌ను వెక్కిరించాడు. (9-13) 
ఈ కథ మన స్వంత చర్యలు లేదా అధికారాలపై ఆధారపడకూడదని బోధిస్తుంది, కానీ దేవుని వాగ్దానాలపై విశ్వసించాలని. ఇష్మాయేలు ఇస్సాకు పట్ల అసహ్యకరమైనవాడు మరియు దేవుని ఒడంబడికను గౌరవించలేదు. పిల్లలు ఆడుతున్నప్పుడు కూడా, దేవుడు శ్రద్ధ వహిస్తాడు మరియు వారి చర్యలకు వారిని బాధ్యులను చేస్తాడు. ఇతరులను ఎగతాళి చేయడం తప్పు మరియు దేవుడిని కలవరపెడుతుంది. దేవుడు వాగ్దానం చేసిన ప్రత్యేక పిల్లలను ఎగతాళి చేస్తారు, కానీ మనం దానిని ఇబ్బంది పెట్టకూడదు. ఇష్మాయేలు తప్పుగా ప్రవర్తిస్తున్నాడని అబ్రాహాము కలత చెందాడు, కాని కుటుంబ శ్రేణిని కొనసాగించే వ్యక్తి ఇస్సాకు అని దేవుడు అతనికి చూపించాడు. కాబట్టి, ఒడంబడిక ఇతర వ్యక్తులతో కలగకుండా చూసుకోవడానికి ఇష్మాయేలు బయలుదేరవలసి వచ్చింది. శారా ఈ విషయాన్ని గ్రహించలేదు, కానీ దేవుడు ప్రతిదీ చక్కగా జరిగేలా చేశాడు.

హాగర్ మరియు ఇష్మాయేలు బయట పడతారు, వారు దేవదూత ద్వారా ఉపశమనం పొందారు మరియు ఓదార్పు పొందారు. (14-21) 
హాగర్ మరియు ఇష్మాయేలు అబ్రహం కుటుంబంలో బాగా ప్రవర్తించలేదు, కాబట్టి వారు శిక్షించబడ్డారు. మన దగ్గర ఉన్న దానిని మనం అభినందించనప్పుడు, మనం దానిని కోల్పోవచ్చు. వారు అరణ్యంలో చాలా కష్టపడ్డారు, ఎందుకంటే వారికి నీరు అయిపోయింది మరియు ఇష్మాయేలు అలసిపోయి దాహంతో ఉన్నాడు. హాగరుకు నీరు ఎక్కడ దొరుకుతుందో చూపించడం ద్వారా దేవుడు వారికి సహాయం చేశాడు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే భవిష్యత్తులో వారు ఎలాంటి గొప్ప పనులు చేస్తారో మాకు తెలియదు. ఇష్మాయేలు అడవి మనిషి కాబట్టి అడవిలో నివసించాడు, కానీ దేవుడు అతనితో ఉన్నాడు మరియు అతనిని చూసుకున్నాడు.

అబ్రహంతో అబీమెలెకు ఒడంబడిక. (22-34)
దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడని అబీమెలెకు నమ్మాడు. దేవుడు ఆశీర్వదించే వ్యక్తులతో స్నేహం చేయడం మరియు మనపట్ల దయ చూపే వారి పట్ల దయ చూపడం చాలా ముఖ్యం. అబ్రహాము నివసించిన ప్రదేశాలలో నీటి బావులు ముఖ్యమైనవి, కాబట్టి అతను సమస్యలను నివారించడానికి బావిని ఉపయోగించడానికి తనకు అనుమతి ఉందని నిర్ధారించుకున్నాడు. నిజాయితీపరుడు తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించాలి. అబ్రహం చాలా కాలం పాటు మంచి ప్రదేశంలో నివసించాడు మరియు బహిరంగంగా తన మతాన్ని ఆచరించాడు. అతను ఒక ప్రత్యేక ప్రదేశంలో దేవుణ్ణి ప్రార్థించాడు మరియు తనతో చేరమని ఇతరులను ఆహ్వానించాడు. మంచి వ్యక్తులు ఇతరులకు కూడా మంచిగా మారేందుకు ప్రయత్నించాలి. మనం ఎక్కడ ఉన్నా దేవుని పూజించాలి తప్ప సిగ్గుపడకూడదు.


Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |