Genesis - ఆదికాండము 22 | View All

1. ఆఆ సంగతులు జరిగినతరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రాహామా, అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను.
హెబ్రీయులకు 11:17

“అబ్రాహామును పరిశోధించాడు”– దేవుడు తరుచుగా కొందరు వ్యక్తుల్నీ కొన్ని విషయాలనూ త్యాగం చెయ్యమని అడుగుతాడు. అబ్రాహామును మొదట తన దేశాన్ని, బంధువులను విడిచిపెట్టమన్నాడు (ఆదికాండము 12:1). తరువాత ఇష్మాయేల్ గురించిన ఆశలను వదిలెయ్యమన్నాడు (ఆదికాండము 17:17-18). చివరిగా తన ముద్దుల కొడుకు ఇస్సాకును వదులుకోమంటున్నాడు. ఇలాగే తన కోసం సమస్తాన్నీ విడిచిపెట్టాలని యేసుప్రభువు కూడా తన శిష్యులను అడుగుతున్నాడు (మత్తయి 10:37-39 మార్కు 10:21 మార్కు 10:29-31 లూకా 9:57-62 లూకా 14:33). దేవుడు తన పట్ల తన ప్రజల ప్రేమనూ నమ్మకాన్నీ విధేయతనూ పరీక్షిస్తాడు. ఈ పరీక్షలు కష్టతరంగా, బాధకరంగా ఉన్నప్పటికీ వాటిని సహించేవారికి మేలు కలిగిస్తాయి. వారి విశ్వాసాన్ని వృద్ధి చేసి అనేక ముఖ్య పాఠాలను నేర్పిస్తాయి (ద్వితీయోపదేశకాండము 8:2 ద్వితీయోపదేశకాండము 8:16 ద్వితీయోపదేశకాండము 13:3 కీర్తనల గ్రంథము 66:10-12 యాకోబు 1:2-4 యాకోబు 1:12 1 పేతురు 1:6-7 1 పేతురు 4:12-13). ఆయన మనలో ఉంచిన మంచిని వెలికి తేవాలని దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. కానీ సైతాను మాత్రం మన భ్రష్ట స్వభావంలోని చెడును బయటికి తేవాలని పరిశోధిస్తాడు. “చిత్తం ప్రభూ”– వ 11.

2. అప్పుడాయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను
మత్తయి 3:17, మార్కు 1:11, లూకా 3:22, యాకోబు 2:21

“ఒకే ఒక కొడుకు”– ఇష్మాయేల్ దాసికి పుట్టిన కొడుకు. అబ్రాహాముకూ అతని భార్యకూ పుట్టిన ఏకైక సంతానం ఇస్సాకు. దేవుని ఒడంబడిక, ప్రమాణాలకు సంబంధించిన ఒకే ఒక కొడుకు. బైబిల్లోని ఏకైక నిజ దేవుడు ఇతర దేవుళ్ళకు నరబలి చేయకూడదన్నాడు (లేవీయకాండము 18:21 ద్వితీయోపదేశకాండము 18:9-10 2 రాజులు 17:17). ఎందుకంటే ఇతర దేవుళ్ళు దేవుళ్ళే కాదు. వాళ్ళకు ఏదైనా అర్పించడం, ఎవరికైనా సరే, తగదు. సాటి మనుషుల్ని బలి ఇవ్వడం అంతకన్నా హీనం. భూమిపై ఉన్నవన్నీ, మనుషులందరూ సృష్టికర్త అయిన దేవునికి చెందినవారు (యెహె 18:4), అంతేగాక ఆయన విమోచించినవారు రెండింతలు ఆయన సొత్తు (ఆదికాండము 1:27 కీర్తనల గ్రంథము 50:10 యెషయా 42:5 యెహెఙ్కేలు 18:4 నిర్గమకాండము 13:1-2 నిర్గమకాండము 19:5 లేవీయకాండము 20:26 1 కోరింథీయులకు 6:19-20). మనుషులంతా దేవుని ఆస్తి గనుక వారితో ఏం చెయ్యడం ఆయనకిష్టమైతే అలా చెయ్యవచ్చు. కావలిస్తే తనకు వారిని హోమబలిగా అర్పించమని కూడా అడిగే హక్కు ఆయనకు ఉంది. ఇస్సాకును అర్పించమని అబ్రాహాముకు చెప్పడం ఇలాంటిదే. దేవుడు న్యాయవంతుడు, పవిత్రుడైన దేవుడని గుర్తుంచుకోండి. తప్పు పని చెయ్యమని అబ్రాహామును ఎన్నటికీ కోరడు (యాకోబు 1:13). నిజానికి వేరొక మనిషిని బలిగా ఇమ్మని ఒక మనిషిని దేవుడు అడగడం బైబిలంతటిలో ఇక్కడ ఒక్క సారే. ఇందులో దేవునికి రెండు ఉద్దేశాలు ఉన్నట్టు చూడవచ్చు. అబ్రాహాము భక్తి, నిష్ఠ, నమ్మకాలను పరీక్షించాలని; రెండవది లోక పాపాలకోసం తన కుమారుడైన యేసుక్రీస్తును అర్పించబోతున్న తన చర్యకు ముందుగా ఒక గుర్తును చూపడం. ఇది అబ్రాహాముకు పరీక్ష: ఇస్సాకు అబ్రాహాముకు ఏకైక కుమారుడనీ, అతడి వారసుడనీ, దేవుని ఒడంబడిక అతని మూలంగా స్థిరపడుతుందనీ దేవుడు అబ్రాహాముతో చెప్పాడు (ఆదికాండము 15:4 ఆదికాండము 17:16 ఆదికాండము 17:19 ఆదికాండము 21:12 ఆదికాండము 22:2). దేవుని మాటకే వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తున్న దేవుని ఆజ్ఞ ఎదురైతే అబ్రాహాము దేవుని మాటపై ఇంకా నమ్మకం నిలుపుకుంటాడా? దేవుడు ఎలాంటి తప్పిదం చెయ్యడనీ, తన మాటను మీరడనీ నమ్ముతాడా? అబ్రాహాము ఈ పరీక్షకు నిలిచాడు. దేవుడు తననొక పని చెయ్యమన్నాడంటే దాని వెనుక సరైన కారణం తప్పక ఉంటుందనీ, దేవుడు ఏదో ఒక విధంగా తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడనీ నమ్మాడు (రోమీయులకు 4:21). ఇస్సాకును హతం చెయ్యవలసి వచ్చినా, దేవుడు తన మాటను నిలబెట్టుకునేందుకు అతణ్ణి తిరిగి బ్రతికిస్తాడని నమ్మాడు (హెబ్రీయులకు 11:17-19). ఇదంతా దేవుడు యేసుక్రీస్తు విషయంలో ఏమి చేశాడో దానికి దృష్టాంతం. ఇస్సాకులాగే యేసు కూడా తండ్రికి ఏకైక కుమారుడు (యోహాను 3:16). ఆయన ఈ లోకానికి వారసుడు (హెబ్రీయులకు 1:2). దేవుడు తన కొత్త ఒడంబడికను ఆయన ద్వారా చేశాడు (హెబ్రీయులకు 9:15). అబ్రాహాముకు మాట ఇచ్చి లోకమంతటికీ దీవెనలు కలుగుతాయని చెప్పినది నెరవేరేది యేసు మూలంగానే (అపో. కార్యములు 3:26 గలతియులకు 3:14 ఎఫెసీయులకు 1:3). దేవుడు మానవ జాతిని ప్రేమిస్తూ పాపుల కోసం ఆయన్ను బలి చేశాడు (రోమీయులకు 5:8 హెబ్రీయులకు 9:28 1 పేతురు 3:18 1 యోహాను 4:9). తరువాత తన వాగ్దానాలన్నీ నెరవేర్చేందుకు ఆయన యేసును మళ్ళీ బతికించాడు (అపో. కార్యములు 2:24 అపో. కార్యములు 2:32-36 1 కోరింథీయులకు 15:3-4). దేవుడు ఇస్సాకును “మోరియా ప్రదేశానికి” తీసుకువెళ్ళమని అబ్రాహాముతో చెప్పాడు. జెరుసలం ఉన్నది ఈ ప్రదేశంలోనే (2 దినవృత్తాంతములు 3:1). యేసుక్రీస్తు సిలువ మరణం చెంది తిరిగి సజీవంగా లేచినది జెరుసలంలోనే గదా.

3. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను.

“తెల్లవారగానే”– ఆదికాండము 17:23 ఆదికాండము 21:14. “కట్టెలు”– దేవుడు తనకు చెప్పిన దాన్ని చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నాడు. విధేయత చూపుదామని అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాడు.

4. మూడవ నాడు అబ్రాహాము కన్నులెత్తి దూరమునుండి ఆ చోటు చూచి

5. తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి

“తిరిగి వస్తాం”– అన్న అబ్రాహాము మాటలు దేవుని మీద అతడి నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి.

6. దహనబలికి కట్టెలు తీసికొని తన కుమారుడగు ఇస్సాకుమీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్లుచుండగా

“ఇస్సాకు మీద ఉంచి”– యోహాను 19:17 పోల్చి చూడండి. ఇస్సాకు పసి పిల్లవాడు కాదు. కట్టెల మోపు మోయగలవాడు. ఏమి జరుగుతూ ఉందో అతనికి తెలుస్తూనే ఉంది (వ 7)

7. ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో నా తండ్రీ అని పిలిచెను; అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱ్ఱపిల్ల ఏది అని అడుగగా

8. అబ్రాహాము నాకుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱపిల్లను చూచుకొనునని చెప్పెను.
యోహాను 1:29

9. ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలి పీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను.
యాకోబు 2:21

10. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా

అంతిమ విధేయత క్షణాలు వచ్చాయి. అబ్రాహాము వెనక్కు తీయలేదు.

11. యెహోవా దూత పరలోకమునుండి అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలి చెను; అందుకతడు చిత్తము ప్రభువా అనెను.

“యెహోవా దూత”– ఆదికాండము 16:7 నోట్. దేవుని కుమారుడు అబ్రాహామును అడ్డగించాడు. చరిత్రలో చాలా కాలం తరువాత తనను తాను అడ్డగించుకోక మనందరికోసం తనను మరణం పాలు చేసుకున్నాడు (యోహాను 10:11 యోహాను 10:1 యోహాను 10:18 గలతియులకు 1:4 ఫిలిప్పీయులకు 2:8).

12. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనపడుచున్నదనెను

13. అప్పుడు అబ్రాహాము కన్ను లెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను

14. అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేతయెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును.

“యెహోవా యీరే”– అంటే “యెహోవా చూసుకుంటాడు” అని అర్థం. నిర్గమకాండము 3:14-15 నోట్. క్రీస్తులో యెహోవా ఆ విధంగా లోక పాపాలకోసం అర్పణనూ, యజ్ఞబలినీ ఏర్పరచాడు. ఈ సంఘటన దేవుని పర్వతంపై, అంటే జెరుసలంలో జరిగింది.

15. యెహోవా దూత రెండవ మారు పరలోకమునుండి అబ్రాహామును పిలిచి యిట్లనెను

16. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున
లూకా 1:73-74, హెబ్రీయులకు 6:13-14

17. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.
మత్తయి 16:18, లూకా 1:55, హెబ్రీయులకు 6:13-14, రోమీయులకు 4:13, లూకా 1:73-74, హెబ్రీయులకు 6:13-14

“దీవిస్తాను”– దేవుని పట్ల విధేయత ఎల్లప్పుడూ దీవెనలు తెస్తుంది. ఆదికాండము 12:2-3 సంఖ్యాకాండము 6:22-27 ద్వితీయోపదేశకాండము 28:1-14 కీర్తనల గ్రంథము 1:1-2 కీర్తనల గ్రంథము 119:1 దగ్గర నోట్స్ చూడండి. “సంతానం”– అపో. కార్యములు 3:25-26 గలతియులకు 3:16.

18. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.
గలతియులకు 3:16, మత్తయి 1:1, అపో. కార్యములు 3:25, రోమీయులకు 4:13

19. తరువాత అబ్రాహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరును కలిసి బెయేరషెబాకు వెళ్లిరి. అబ్రాహాము బెయేరషెబాలో నివసించెను.

20. ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రాహామునకు తెలుపబడినదేమనగా మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను.

“నాహోరు”– ఆదికాండము 11:29.

21. వారు ఎవరెవరనగా అతని జ్యేష్టకుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రియైన కెమూయేలు,

23. ఆ యెనిమిదిమందిని మిల్కా అబ్రాహాము సహోదరుడగు నాహోరునకు కనెను.

“రిబ్కా”– ఆదికాండము 24:67.

24. మరియరయూమా అను అతని, ఉపపత్నియు తెబహును, గహమును తహషును మయకాను కనెను.Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |