Genesis - ఆదికాండము 25 | View All

1. అబ్రాహాము మరల ఒక స్త్రీని వివాహము చేసికొనెను, ఆమె పేరు కెతూరా.

1. abraahaamu marala oka streeni vivaahamu chesikonenu, aame peru kethooraa.

2. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనువారిని కనెను.

2. aame athaniki jimraanu, yokshaanu, medaanu, midyaanu, ishbaaku, shoovahu anuvaarini kanenu.

3. యొక్షాను షేబను దెదానును కనెను. అష్షూరీయులు లెతూషీయులు లెయుమీయులు అనువారు ఆ దెదాను సంతతివారు.

3. yokshaanu shebanu dedaanunu kanenu. Ashshooreeyulu lethoosheeyulu leyumeeyulu anuvaaru aa dedaanu santhathivaaru.

4. eyiphaa epheru hanoku abeedaa eldaayaa anuvaaru aa midyaanu santhathivaaru.

5. వీరందరు కెతూరా సంతతివారు. అబ్రాహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు కిచ్చెను.

5. veerandaru kethooraa santhathivaaru. Abraahaamu thanaku kaliginadhi yaavatthu issaaku kicchenu.

6. అబ్రాహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానము లిచ్చి, తాను సజీవుడై యుండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్దనుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను.

6. abraahaamu thana upapatnula kumaarulaku bahumaanamu lichi, thaanu sajeevudai yundagaane thana kumaarudagu issaaku noddhanundi thoorpu thattugaa thoorpu dheshamunaku vaarini pampivesenu.

7. అబ్రాహాము బ్రదికిన సంవత్సరములు నూట డెబ్బదియైదు.

7. abraahaamu bradhikina samvatsaramulu noota debbadhiyaidu.

8. అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతిబొంది తన పితరులయొద్దకు చేర్చబడెను.

8. abraahaamu nindu vruddhaapyamunaku vachinavaadai manchi musalithanamuna praanamu vidichi mruthibondi thana pitharulayoddhaku cherchabadenu.

9. హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి; అది మమ్రే యెదుట నున్నది.

9. hittheeyudaina soharu kumaarudagu ephronu polamandali makpelaa guhalo athani kumaarulagu issaakunu ishmaayelunu athanini paathipettiri; adhi mamre yeduta nunnadhi.

10. అబ్రాహాము హేతు కుమారులయొద్ద కొనిన పొలములోనే అబ్రాహామును అతని భార్యయైన శారాయును పాతి పెట్టబడిరి.

10. abraahaamu hethu kumaarulayoddha konina polamulone abraahaamunu athani bhaaryayaina shaaraayunu paathi pettabadiri.

11. అబ్రాహాము మృతిబొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను; అప్పుడు ఇస్సాకు బేయేర్‌ లహాయిరోయి దగ్గర కాపురముండెను.

11. abraahaamu mruthibondina tharuvaatha dhevudu athani kumaarudagu issaakunu aasheervadhinchenu; appudu issaaku beyer‌ lahaayiroyi daggara kaapuramundenu.

12. ఐగుప్తీయురాలును శారా దాసియునైన హాగరు అబ్రాహామునకు కనిన అబ్రాహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి యిదే.

12. aiguptheeyuraalunu shaaraa daasiyunaina haagaru abraahaamunaku kanina abraahaamu kumaarudagu ishmaayelu vamshaavali yidhe.

13. ఇష్మాయేలు జ్యేష్ఠకుమారుడైన నేబాయోతు కేదారు అద్బయేలు మిబ్శాము

13. ishmaayelu jyeshthakumaarudaina nebaayothu kedaaru adbayelu mibshaamu

14. mishmaa doomaanamashshaa

15. హదరు తేమా యెతూరు నాపీషు కెదెమా

15. hadaru themaa yethooru naapeeshu kedemaa

16. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే, వారి పేరులు ఇవే, వారివారి జనముల ప్రకారము వారు పండ్రెండుగురు రాజులు.

16. ivi vaari vaari vamshaavalula prakaaramu vaari vaari perula choppuna ishmaayelu kumaarula yokka perulu vaari vaari graamamulalonu vaari vaari kotalalonu ishmaayelu kumaarulu veere, vaari perulu ive, vaarivaari janamula prakaaramu vaaru pandrenduguru raajulu.

17. ఇష్మాయేలు బ్రదికిన సంవత్సరములు నూట ముప్పది యేడు. అప్పుడతడు ప్రాణమువిడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను.

17. ishmaayelu bradhikina samvatsaramulu noota muppadhi yedu. Appudathadu praanamuvidichi mruthibondi thana pitharula yoddhaku cherchabadenu.

18. వారు అష్షూరునకు వెళ్లు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరువరకు నివసించువారు అతడు తన సహోదరులందరి యెదుట నివాసమేర్పరచుకొనెను.

18. vaaru ashshoorunaku vellu maargamuna haveelaa modalukoni aigupthu edutanunna shooruvaraku nivasinchuvaaru athadu thana sahodarulandari yeduta nivaasa merparachukonenu.

19. అబ్రాహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి యిదే. అబ్రాహాము ఇస్సాకును కనెను.

19. abraahaamu kumaarudagu issaaku vamshaavali yidhe. Abraahaamu issaakunu kanenu.

20. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన బెతూయేలు కుమార్తెయును సిరియా వాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసికొన్నప్పుడు నలుబది సంవత్సరములవాడు.

20. issaaku paddhanaraamulo nivasinchu siriyaa vaadaina bethooyelu kumaartheyunu siriyaa vaadaina laabaanu sahodariyunaina ribkaanu pendli chesikonnappudu nalubadhi samvatsaramulavaadu.

21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యయైన రిబ్కా గర్భవతి ఆయెను.
రోమీయులకు 9:10

21. issaaku bhaarya godraalu ganuka athadu aame vishayamai yehovaanu vedukonenu. Yehovaa athani praarthana vinenu ganuka athani bhaaryayaina ribkaa garbhavathi aayenu.

22. ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఈలాగైతే నేను బ్రదుకుట యెందుకని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగ వెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను
లూకా 1:41

22. aame garbhamulo shishuvulu okanithoo nokadu penugulaadiri ganuka aame eelaagaithe nenu bradukuta yendukani anukoni yee vishayamai yehovaanu aduga vellenu. Appudu yehovaa aamethoo nitlanenu

23. రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటె ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.
రోమీయులకు 9:12

23. rendu janamulu nee garbhamulo kalavu.Rendu janapadamulu nee kadupulo nundi pratyekamugaa vachunu. Oka janapadamu kante oka janapadamu balishtamai yundunu. Peddavaadu chinnavaaniki daasudagunu anenu.

24. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి.

24. aame prasoothi kaavalasina dinamulu nindinappudu aame garbhamandu kavalavaaru undiri.

25. మొదటివాడు ఎఱ్ఱనివాడుగా బయటికివచ్చెను. అతని ఒళ్లంతయు రోమ వస్త్రమువలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి.

25. modativaadu erranivaadugaa bayatikivacchenu. Athani ollanthayu roma vastramuvale nundenu ganuka athaniki eshaavu anu peru pettiri.

26. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని యుండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువది యేండ్లవాడు.
మత్తయి 1:2, లూకా 3:34

26. tharuvaatha athani sahodarudu bayatiki vachinappudu athani cheyyi eshaavu madimenu pattukoni yundenu ganuka athaniki yaakobu anu peru petta badenu. aame vaarini kaninappudu issaaku aruvadhi yendlavaadu.

27. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను; యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను.

27. aa chinnavaaru ediginappudu eshaavu vetaadutayandu nerpariyai aranyavaasigaa nundenu; yaakobu saadhuvai gudaaramulalo nivasinchuchundenu.

28. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను; రిబ్కా యాకోబును ప్రేమించెను.

28. issaaku eshaavu techina veta maansamunu thinuchundenu ganuka athani preminchenu; ribkaa yaakobunu preminchenu.

29. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములోనుండి వచ్చి

29. okanaadu yaakobu kalagoora vantakamu vandukonuchundagaa eshaavu alasinavaadai polamulonundi vachi

30. నేను అలసియున్నాను; ఆ యెఱ్ఱయెఱ్ఱగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను; అందుచేత అతని పేరు ఎదోము అనబడెను.

30. -nenu alasiyunnaanu; aa yerrayerragaa nunna daanilo konchemu dayachesi naaku pettumani adigenu; anduchetha athani peru edomu anabadenu.

31. అందుకు యాకోబు - నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా

31. anduku yaakobu -nee jyeshthatvamu nedu naakimmani adugagaa

32. ఏశావు - నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను

32. eshaavu -nenu chaavabovuchunnaanu gadaa jyeshthatvamu naakendukanenu

33. యాకోబు - నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణముచేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా
హెబ్రీయులకు 12:16

33. yaakobu-nedu naathoo pramaanamu cheyumanenu. Athadu yaakobuthoo pramaanamuchesi athaniki jyeshthatvamunu ammiveyagaa

34. యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావు కిచ్చెను; అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను.

34. yaakobu aahaaramunu chikkudukaayala vantakamunu eshaavu kicchenu; athadu thini traagi lechipoyenu. Atlu eshaavu thana jyeshthatvamunu truneekarinchenu.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Genesis - ఆదికాండము 25 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
కేతురా ద్వారా అబ్రహం కుటుంబం, అతని మరణం మరియు ఖననం. (1-10) 
నిజంగా మంచి వ్యక్తులు కూడా సాధారణమైన రోజులను కలిగి ఉంటారు మరియు ప్రత్యేకంగా ఏమీ జరగదు. అబ్రాహాము చివరి రోజుల్లో అదే జరిగింది. అతను కెతురా అనే స్త్రీతో ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నాడు మరియు అతని వస్తువులను తన కుటుంబంలో ఎలా పంచుకోవాలో నిర్ణయించుకున్నాడు. అతను జీవించి ఉన్నప్పుడే ఇలా చేసాడు, ఇది తెలివైన పని. ప్రజలు తమకు వీలైనప్పుడు విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. అబ్రహం చాలా కాలం జీవించాడు, 175 సంవత్సరాలు! అతను కనాను అనే వింత ప్రదేశంలో చాలా కాలం గడిపాడు. మనం ఎక్కువ కాలం జీవించకపోయినా, మంచిగా ఉండడం మరియు ఇతరులకు ఎలా మంచిగా ఉండాలో చూపించడం ముఖ్యం. అబ్రాహాముకు ఇస్సాకు మరియు ఇష్మాయేలు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు, మరియు వారు మరణించిన తరువాత అతనిని చూసుకునేవారు. అబ్రాహాము జీవించి ఉండగానే వారిని ఒకచోటికి చేర్చాడు. అబ్రాహాము విశ్వసనీయత మరియు మంచి ఉదాహరణ కోసం మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి.

దేవుడు ఇస్సాకును ఇస్మాయేలు వంశస్థులను ఆశీర్వదించాడు. (11-18) 
ఇష్మాయేలుకు పన్నెండు మంది కుమారులు ఉన్నారు, వారు ఈజిప్టు మరియు అష్షూరు మధ్య అరేబియా అనే పెద్ద ప్రాంతంలో నివసిస్తున్న వివిధ సమూహాలకు నాయకులుగా మారారు. దేవుడు ఇష్మాయేలు తల్లి హాగర్ మరియు అతని తండ్రి అబ్రహాములకు ఇష్మాయేలు చాలా మంది సంతానం కలిగి ఉంటాడని మరియు బలంగా ఉంటాడని దేవుడు వాగ్దానం చేశాడు.

ఏశావు మరియు యాకోబుల జననం. (19-26) 
ఇస్సాకు తన జీవితంలో చాలా సవాళ్లను ఎదుర్కోలేదు మరియు ప్రశాంతంగా జీవించాడు. యాకోబు మరియు ఏశావులు పిల్లలతో ఇబ్బంది పడుతున్న వారి తల్లిదండ్రులు ప్రార్థించారు మరియు వారి ప్రార్థనలకు సమాధానం ఇవ్వబడింది. దేవుని వాగ్దానాలు ఎల్లప్పుడూ నెరవేరినప్పటికీ, అవి నెరవేరడానికి చాలా కాలం పట్టవచ్చు. విశ్వాసుల విశ్వాసం పరీక్షించబడుతుంది మరియు దేవుని ఆశీర్వాదం కోసం వేచి ఉన్నప్పుడు వారు ఓపికగా ఉండాలి. తమ పిల్లలు అన్ని దేశాలకు ఆశీర్వాదంగా ఉంటారని ఇస్సాకు మరియు రెబెకాకు తెలుసు, కాబట్టి వారు పిల్లలను కనాలని చాలా ఆసక్తిగా ఉన్నారు మరియు వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెందారు. మనకు సందేహాలు వచ్చినప్పుడు, మార్గదర్శకత్వం కోసం దేవుడిని ప్రార్థించాలి. మనం పాపంతో పోరాడుతున్నప్పుడు, మనం నిజంగా దేవుణ్ణి అనుసరిస్తున్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు.

ఏశావు మరియు యాకోబు యొక్క విభిన్న పాత్రలు. (27,28) 
ఏశావు జంతువులను వేటాడడంలో మంచివాడు మరియు చివరికి తన పొరుగువారిపై పాలకుడయ్యాడు. యాకోబు సాధారణ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చాడు మరియు గొర్రెల కాపరిగా ఆనందించాడు. ఇస్సాకు మరియు రెబెకాలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మరియు వారు ఒక బిడ్డను ఎక్కువగా ప్రేమిస్తున్నప్పటికీ, వారు ఇద్దరు పిల్లలను న్యాయంగా చూసేందుకు ప్రయత్నించారు. తల్లిదండ్రులు తమ పిల్లలందరికీ న్యాయం చేయడం ముఖ్యం లేదా సమస్యలు వస్తాయి. 

ఏశావు తన జన్మహక్కును తృణీకరించి అమ్మాడు. (29-34)
ఇది యాకోబు మరియు ఏశావు అనే ఇద్దరు సోదరుల గురించిన కథ. ఏశావు చాలా పెద్దవాడు కాబట్టి జన్మ హక్కు అని పిలిచే ఒక ప్రత్యేక విషయం పొందవలసి ఉంది, కానీ యాకోబు నిజంగా దానిని కోరుకున్నాడు ఎందుకంటే అది అతనికి ముఖ్యమైనది. యాకోబు చక్కగా అడిగే బదులు, ఏశావును అతనికి ఇవ్వమని మోసగించాడు. యాకోబు నిజంగా కోరుకున్నప్పటికీ ఇలా చేయడం మంచిది కాదు. జన్మ హక్కు డబ్బు లేదా వస్తువుల గురించి కాదు, భవిష్యత్తులో జరగబోయే ప్రత్యేకత గురించి. యాకోబు ఈ ప్రత్యేకమైన విషయాన్ని విశ్వసించాడు, కానీ ఏశావు దాని గురించి పట్టించుకోలేదు. జన్మతః లాంటి మంచి పనులు కోరుకోవడం సరైంది అయినప్పటికీ వాటిని పొందేందుకు చెడు పనులు చేయడం సరికాదు. కథలో, యాకోబు వండుతున్న కొన్ని ఆహారాన్ని చూసి ఏశావువు శోదించబడ్డాడు మరియు దాని కోసం అతను తన జన్మహక్కును వదులుకున్నాడు. ఇది మంచి నిర్ణయం కాదు, ఎందుకంటే మన కోరికలు మనల్ని నియంత్రించనివ్వడం మంచిది కాదు. ఆదికాండము 25:34 డబ్బు, కీర్తి మరియు వినోదం వంటి వాటి కోసం దేవుడు, యేసు మరియు పరలోకంతో మనకున్న సంబంధాన్ని వదులుకోవడం మంచిది కాదు. ఇది ఒక చిన్న భోజనం కోసం ఎవరైనా నాయకుడిగా ఉండే హక్కు వంటి ముఖ్యమైన ఏదైనా వ్యాపారం చేసినట్లుగా ఉంటుంది. ఏశావు అలా చేసాడు మరియు దాని గురించి బాధపడలేదు. తను ఎంత దారుణమైన నిర్ణయం తీసుకున్నాడో అతనికి అర్థం కాలేదు. ముఖ్యమైన వాటికి విలువ ఇవ్వకపోవడం అంటే ఇదే. మనం తప్పుగా ఎంపిక చేసుకుంటే, అది మనల్ని నాశనం చేసే ఎంపిక మాత్రమే కాదు, దాని కోసం జాలిపడదు.


Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |