Genesis - ఆదికాండము 27 | View All

1. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా, అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో ననెను.

1. And it came to passe when Isaac was olde, his eyes waxed dymme of sight, and he called Esau his greater sonne, and sayde vnto him: My sonne. He answered him: Here am I.

2. అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు.

2. And he sayde: Beholde, I am olde, and knowe not whan I shal dye.

3. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసికొని అడవికి పోయి నాకొరకు వేటాడి మాంసము తెమ్ము.

3. Now therfore take thy geer, thy quyuer and thy bowe, and get the forth to the felde, and take me some venyson,

4. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నాయొద్దకు తెమ్మని చెప్పెను.

4. and make me meate (soch as I loue) and brynge it me herein, that I may eate, yt my soule maye blesse the, before I dye.

5. ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్లెను.

5. But Rebecca herde these wordes, that Isaac sayde vnto his sonne. And Esau wente his waye in to the felde, to hunte venyson, and to brynge it home.

6. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయైన ఏశావుతో

6. Then sayde Rebecca vnto Iacob hir sonne: beholde, I haue herde thy father talkinge with Esau thy brother, and sayenge:

7. మృతి బొందకమునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించునట్లు నాకొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధ పరచుమని చెప్పగా వింటిని.

7. Brynge me venyson, and make me meate, that I maye eate, and blesse the before ye LORDE, yer I dye.

8. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము.

8. Now therfore my sonne, heare my voyce, what I commaunde the:

9. నీవు మందకు వెళ్లి రెండు మంచి మేక పిల్లలను అక్కడనుండి నాయొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రి కిష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసెదను.

9. Go thy waye to the flocke, and fetch me two good kyddes, that I maye make meate of them for thy father, soch as he loueth:

10. నీ తండ్రి మృతిబొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించునట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసికొనిపోవలెననెను.

10. this shalt thou brynge in vnto thy father, that he maye eate, that he maye blesse the before his death.

11. అందుకు యాకోబు నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్ననివాడను గదా.

11. Neuertheles Iacob sayde vnto Rebecca his mother: Beholde, my brother Esau is tough, and I am smooth:

12. ఒకవేళ నా తండ్రి నన్ను తడవిచూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచినయెడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పెను.

12. then might my father peraduenture fele me, and I shulde seme vnto him as though I begyled him, and so brynge a curse vpon me and not a blessynge.

13. అయినను అతని తల్లి నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చును గాక. నీవు నా మాట మాత్రము విని, పోయి వాటిని నాయొద్దకు తీసికొని రమ్మని చెప్పగా

13. Then sayde his mother vnto him: That curse be vpon me my sonne, folowe thou my voyce: go thy waye and fetch it me.

14. అతడు వెళ్లి వాటిని తన తల్లియొద్దకు తీసికొనివచ్చెను. అతని తల్లి అతని తండ్రి కిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచెను.

14. So he wente his waye, and fetched it, and brought it vnto his mother. Then his mother made meate, acordinge as his father loued,

15. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక

15. and toke Esaus hir elder sonnes costly rayment (which she had with her in ye house) and put them vpon Iacob hir yonger sonne.

16. రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడమీద నునుపు భాగమును కప్పి

16. But the kyddes skynnes put she aboute his handes, and where he was smooth aboute the neck:

17. తాను సిద్ధపరచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతి కియ్యగా

17. and so she put the meate with bred (as she had made it) in hir sonne Iacobs hande.

18. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి - నా తండ్రీ, అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా, నీ వెవరవని అడిగెను

18. And he brought it in vnto his father, and sayde: My father. He answered: here am I, who art thou my sonne?

19. అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసియున్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి, నేను వేటాడి తెచ్చినదానిని తినుమనెను.

19. Iacob sayde: I am Esau thy firstborne sonne, I haue done as thou saydest vnto me: aryse, syt vp, and eate of my venyson, that thy soule maye blesse me.

20. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీ కెట్లు దొరికెనని అడుగగా అతడు నీ దేవుడైన యెహోవా నా యెదుటికి దాని రప్పించుట చేతనే అని చెప్పెను.

20. But Isaac sayde vnto his sonne? My sonne, how hast thou founde it so soone? He answered: The LORDE yi God brought it to my hande.

21. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, నీవు ఏశావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచెదను దగ్గరకు రమ్మని చెప్పెను.

21. The sayde Isaac vnto Iacob: Come neare my sonne, that I maye fele the, whether thou be my sonne Esau or not.

22. యాకోబు తన తండ్రియైన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవిచూచి - స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను.

22. So Iacob wete vnto Isaac his father. And whan he had felt him, he sayde: The voyce is Iacobs voyce, but the handes are the handes of Esau.

23. యాకోబు చేతులు అతని అన్నయైన ఏశావు చేతులవలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గురుతు పట్టలేక అతనిని దీవించి

23. And he knew him not, for his handes were rough like as ye handes of his brother Esau. And he blessed him.

24. ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు - నేనే అనెను.

24. And he sayde vnto him: art thou my sonsonne Esau? He answered: Yee I am.

25. అంతట అతడు అది నాయొద్దకు తెమ్ము; నేను నిన్ను దీవించునట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందు ననెను; అతడు తెచ్చినప్పుడు అతడు తినెను; ద్రాక్షారసము తేగా అతడు త్రాగెను.

25. Then sayde he: Bringe me here then to eate of thy venyson my sonne, that my soule maye blesse the. Then he brought it him, and he ate: and he brought him wyne also, and he dranke.

26. తరువాత అతని తండ్రియైన ఇస్సాకు నా కుమారుడా, దగ్గరకువచ్చి నన్ను ముద్దు పెట్టుకొమ్మని అతనితో చెప్పెను.

26. And Isaac his father sayde vnto him: Come nye, and kysse me my sonne.

27. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దుపెట్టుకొనెను. అప్పుడతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి యిట్లనెను. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసనవలె నున్నది.
హెబ్రీయులకు 11:20

27. So he came nye, and he kyssed him. Then smelled he the sauoure of his clothes, and blessed him, and sayde: Beholde, the smell of my sonne is as ye smell of the felde, which ye LORDE hath blessed.

28. ఆకాశపుమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీ కనుగ్రహించుగాక

28. God geue the of the dew of heauen, and of the fatnesse of the earth, and plenteousnes of corne and wyne.

29. జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధు జనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక

29. Nacions be thy seruauntes, and people fall downe at yi fote. Be thou lorde ouer thy brethren, and thy mothers children fall downe at thy fote. Cursed be he, that curseth the: and blessed be he, that blesseth the.

30. ఇస్సాకు యాకోబును దీవించుటయైన తరువాత యాకోబు తన తండ్రియైన ఇస్సాకు ఎదుటనుండి బయలు దేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను.
హెబ్రీయులకు 11:20

30. Now whan Isaac had made an ende of blessynge, and Iacob was scace gone out from his father Isaac, his brother Esau came from his huntinge,

31. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరచి తన తండ్రియొద్దకు తెచ్చినా తండ్రీ నన్ను దీవించునట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చినదాని తినుమని తన తండ్రితోననెను.

31. and made meate also, and brought it vnto his father, and sayde vnto him: Aryse my father, and eate of yi sonnes venyson, that thy soule maye blesse me.

32. అతని తండ్రియైన ఇస్సాకు - నీ వెవరవని అతని నడిగినప్పుడు అతడునేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడననగా

32. Then answered him Isaac his father: Who art thou? He sayde: I am Esau thy firstborne sonne.

33. ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నాయొద్దకు తెచ్చినవారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించితిని, అతడు దీవింపబడినవాడే యనెను.

33. Then was Isaac exceadingly amased aboue measure, and saide: Who? Where is then the hunter that brought me, and I haue eaten of all afore thou camest, and haue blessed him? And he shall be blessed still.

34. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్దకేక వేసి - ఓ నా తండ్రీ, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను.

34. Whan Esau herde these wordes of his father, he cried loude, and was exceadynge sory, and sayde vnto his father: O blesse me also my father.

35. అతడు - నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసికొనిపోయెను.

35. But he sayde: Thy brother came with sotyltie, and hath taken thy blessinge awaye.

36. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది; అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసికొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసికొనెనని చెప్పి - నా కొరకు మరి యే దీవెనయు మిగిల్చి యుంచలేదా అని అడిగెను.

36. Then sayde he: He maye well be called Iacob, for he hath vndermined me now two tymes. My byrth right hath he awaye, and beholde, now taketh he awaye my blessynge also. And he sayde: Hast thou not kepte one blessynge for me?

37. అందుకు ఇస్సాకు - ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరిని అతనికి దాసులుగా ఇచ్చితిని; ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించితిని గనుక నా కుమారుడా, నీకేమి చేయవలెనని ఏశావుతో ప్రత్యుత్తరమియ్యగా¸

37. Isaac answered, and sayde vnto him: I haue made him lorde ouer ye, and all his brethren haue I made his seruautes. With corne & wine haue I prouyded him. What shal I do vnto the now my sonne?

38. ఏశావు నా తండ్రీ, నీయొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రీ, నన్ను, నన్ను కూడ దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి యేడ్వగా అతని తండ్రియైన ఇస్సాకు -

38. Esau sayde vnto his father? Hast thou not one blessynge more my father? O blesse me also my father. And he lift vp his voyce, & wepte.

39. నీ నివాసము భూసారము లేకయు పైనుండిపడు ఆకాశపుమంచు లేకయు నుండును.

39. Then Isaac his father answered and sayde vnto him: Beholde, thou shalt haue a fat dwellinge vpon earth, & of ye dew of heauen from aboue:

40. నీవు నీకత్తిచేత బ్రదుకుదువు నీ సహోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడు చుండగా నీ మెడ మీదనుండి అతని కాడి విరిచివేయుదువు అని అతని కుత్తరమిచ్చెను.

40. with thy swerde shalt thou get thy lyuynge, and shalt serue thy brother. And it shall come to passe, yt thou shalt put of his yock, and plucke it from thy neck.

41. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతనిమీద పగపట్టెను. మరియఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా నున్నవి; అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను.

41. And Esau bare euell wyll vnto Iacob, because of the blessynge that his father had blessed him withall, and sayde in his herte: The tyme wyll come shortly, that my father shal mourne, for I wil slaye my brother Iacob.

42. రిబ్కా తన పెద్దకుమారుడైన ఏశావు మాటలనుగూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను - ఇదిగో నీ అన్నయైన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్నుతాను ఓదార్చుకొను చున్నాడు.

42. The was it tolde Rebecca of these wordes of hir elder sonne, and she sent, and bad call for Iacob hir yonger sonne, and saide vnto him: Beholde, thy brother Esau threateneth the, that he wil slaye the.

43. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్నకోపము చల్లారువరకు

43. And now my sonne heare my voyce: Get the vp, and flye vnto my brother Laban in Haran,

44. నీ అన్న కోపము నీమీదనుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబానునొద్ద కొన్నాళ్లు ఉండుము;

44. and tary there with him a whyle, tyll the furiousnes of thy brother be swaged, and

45. అప్పుడు నేను అక్కడనుండి నిన్ను పిలిపించెదను. ఒక్కనాడే మీ యిద్దరిని నేను పోగొట్టుకొననేల అనెను.

45. till his wrath agaynst ye be turned from the, and he forget what thou hast done vnto him. So wyll I then sende for the, and cause the be fetched from thece. Why shulde I be robbed of you both in one daye?

46. మరియరిబ్కా ఇస్సాకుతో - హేతు కుమార్తెలవలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసి కొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజనమనెను.

46. And Rebecca sayde vnto Isaac: I am weery of my life, because of the doughters of Heth: Yf Iacob take a wife of the doughters of Heth, which are as the doughters of this londe, what shall this life then profit me?



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Genesis - ఆదికాండము 27 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
ఇస్సాకు వేట కోసం ఏశావును పంపాడు. (1-5) 
అక్కడ ఇస్సాకు అనే వ్యక్తి చాలా వృద్ధుడు మరియు ఇద్దరు కొడుకులు. తన పెద్ద కొడుకు కంటే తన చిన్న కొడుకు చాలా ముఖ్యం అవుతాడని దేవుడు అతనికి చెప్పాడు, కానీ అతను ఈ విషయాన్ని మరచిపోయి తన పెద్ద కొడుకుకు తన మంచి వస్తువులన్నీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇది దేవుడు చేయాలనుకున్నది కాదు. కొన్నిసార్లు మనం దేవుడు చెప్పేది వినడానికి బదులు మనం ఏది ఉత్తమమని భావిస్తున్నామో దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాము మరియు అది మనల్ని తప్పు దిశలో నడిపిస్తుంది.

రెబెకా యాకోబుకు ఆశీర్వాదం పొందమని బోధిస్తుంది. (6-17) 
యాకోబుకు ఒక ప్రత్యేక ఆశీర్వాదం రావాలని రెబెకాకు తెలుసు, కానీ అది జరగడానికి ఆమె ఏదో దొంగచాటుగా చేసింది. ఇది యాకోబుకు లేదా వారి తండ్రి ఇస్సాకుకు న్యాయం కాదు. ఇది యాకోబు మరియు అతని సోదరుడు ఏశావు మధ్య సమస్యలను కూడా కలిగించింది. కొన్నిసార్లు ప్రజలు దేవుని ప్రణాళికకు సహాయం చేయడానికి చెడు పనులు చేస్తారు, కానీ ఇది సరైంది కాదు.  దేవుడు ఒకసారి అబ్రహాముతో పరిపూర్ణంగా ఉండమని మరియు తనను అనుసరించమని చెప్పాడు. రెబెకా ఒకప్పుడు ఏదో మూర్ఖపు మాటలు చెప్పి, శాపం తీసుకోమని చెప్పింది. కానీ యేసు తన బోధలను అనుసరించే ఎవరికైనా శాపం తీసుకున్నాడు. యేసుకు బదులుగా శాపం తీసుకోవచ్చని ఎవరైనా చెప్పడం సరైంది కాదు. 


యాకోబు, ఏశావువుగా నటిస్తూ, ఆశీర్వాదాన్ని పొందుతాడు. (18-29) 
యాకోబు తాను కోరుకున్న ఆశీర్వాదాన్ని పొందగలిగాడు, కానీ అది చాలా నిర్దిష్టంగా లేదు. ఆశీర్వాదం అబ్రహం కుటుంబానికి చేసిన ప్రత్యేక వాగ్దానాల గురించి ప్రస్తావించలేదు. ఇస్సాకు ఆ వాగ్దానాల గురించి పట్టించుకోని యాకోబు సోదరుడు ఏశావు గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇస్సాకు ఏశావును ప్రేమించాడు మరియు అది దేవుడు కోరుకున్న దాని గురించి మరచిపోయేలా చేసింది. దీని కారణంగా, ఇస్సాకు ఆశీర్వాదం చాలా బలంగా లేదా అర్థవంతంగా ఉండకపోవచ్చు.

ఇస్సాకు భయం, ఏశావువు యొక్క ప్రాముఖ్యత. (30-40) 
యాకోబుకు ప్రత్యేకమైన ఆశీర్వాదం లభించిందని తెలుసుకున్న ఏశావు చాలా గట్టిగా అరిచాడు. జీవితంలోని ముఖ్యమైన విషయాలను మనం మెచ్చుకోకుండా మరియు పట్టింపు లేని విషయాలపై దృష్టి సారిస్తే, మనం తర్వాత పశ్చాత్తాపపడవచ్చని ఈ కథ మనకు బోధిస్తుంది. యాకోబు తనను మోసగించాడని తెలుసుకున్న తండ్రి ఇస్సాకు కలత చెందాడు, కాని చివరికి అతను యాకోబు‌కు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ధృవీకరించాడు. డబ్బు లేదా కీర్తి వంటి వాటి కోసం ముఖ్యమైన విలువలు మరియు నమ్మకాలను వదులుకునే వ్యక్తులు తమను తాము నిజం చేసుకునే వారి వంటి ఆశీర్వాదాలను పొందలేరు. చివరికి, ఏశావు సాధారణ ఆశీర్వాదం మాత్రమే పొందాడు.  ఒకప్పుడు, ఏశావువు అనే వ్యక్తి చాలా చెడుగా కోరుకునేవాడు. అతను చాలా మంచి విషయాలను కలిగి ఉండటం తనకు సంతోషాన్ని కలిగిస్తుందని అతను భావించాడు, కానీ వాటిని పొందడానికి అతను ఎల్లప్పుడూ సరైన ఎంపికలు చేయలేదు. చాలా మంది అదే తప్పు చేసి చివరికి ఇబ్బందుల్లో పడుతున్నారు. ఏశావు మరియు అతని సోదరుడు మధ్య వ్యత్యాసం ఏమిటంటే, వారి తండ్రి ఆశీర్వాదం చాలా ముఖ్యమైన యేసు గురించి ఏమీ ప్రస్తావించలేదు. యేసు లేకుండా, ప్రపంచంలోని అన్ని మంచి విషయాలు నిజంగా పట్టింపు లేదు. వారి తండ్రి, ఇస్సాక్, ప్రతి ఒక్కరికి ఏమి అవసరమో మరియు దానిని ఎలా ఉపయోగించాలో ఆధారం చేసుకుని వారిని ఆశీర్వదించాడు.

ఏశావు యాకోబు ప్రాణాలకు ముప్పు తెచ్చాడు, రెబెకా యాకోబు‌ని పంపిస్తుంది. (41-46)
యాకోబుకు ప్రత్యేకమైన ఆశీర్వాదం లభించినందున ఏశావు అతనిపై అసూయపడ్డాడు. అతను కయీనులా ప్రవర్తించాడు, అతను తన సోదరుడిని చంపాడు, ఎందుకంటే అతను తన పట్ల దేవుని అనుగ్రహానికి అసూయతో ఉన్నాడు. ఏశావు యాకోబును మరియు అతని పిల్లలను చంపడం ద్వారా అధికారం నుండి నిరోధించాలనుకున్నాడు. ప్రజలు దేవుని ప్రణాళికలను ఇష్టపడకపోయినా, వారు వాటిని మార్చలేరు. యాకోబు‌ను సురక్షితంగా ఉంచడానికి, అతని తల్లి రెబెకా అతనికి ప్రమాదం గురించి హెచ్చరించింది మరియు అతనిని విడిచిపెట్టమని చెప్పింది. మన పిల్లలు చాలా ఆశాజనకంగా కనిపించినప్పటికీ, వారి జ్ఞానం మరియు ధైర్యంపై ఎక్కువగా ఆధారపడకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. చెడు పరిస్థితుల నుండి వారిని దూరంగా ఉంచేలా చూసుకోవాలి. ఈ కథను చదివినప్పుడు, మనం దేవుని నియమాలను పాటించే వ్యక్తులను మాత్రమే అనుసరించాలని గుర్తుంచుకోవాలి. మంచికి దారి తీస్తుందని భావించినా చెడు పనులు చేయకూడదు. ఈ కథలో, దేవుడు మంచి విషయాలు జరిగినప్పటికీ, ప్రజలు తీసుకున్న చెడు చర్యలకు పరిణామాలు ఉన్నాయి. చాలా మందికి ముఖ్యమైన ఆశీర్వాదాలను అందించడానికి యాకోబు దేవుడు ఎన్నుకోబడ్డాడు మరియు ప్రపంచ రక్షకుడిని ప్రపంచంలోకి తీసుకురావడానికి అతని కుటుంబం ఎంపిక చేయబడింది. ఏది ఉత్తమమో దేవునికి తెలుసు మరియు అతని ఆశీర్వాదాలు ఎవరికి లభిస్తాయో ఎంచుకునే హక్కు ఉంది. Rom 9:12-15 





Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |