Genesis - ఆదికాండము 32 | View All

1. యాకోబు తన త్రోవను వెళ్లుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి.

2. యాకోబు వారిని చూచి-ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను.

మహనయీం అంటే “రెండు శిబిరాలు” లేక “రెండు సేనలు”. తన శిబిరంతోపాటు దేవుని సేనలు కూడా అక్కడున్నాయని యాకోబుకు నమ్మకం కుదిరింది.

3. యాకోబు ఎదోము దేశమున, అనగా శేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి-

“ఎదోం”– ఆదికాండము 25:30. ఎదోం దేశం యాకోబు ఉన్నచోటికి చాలా దూరాన మృత సముద్రానికి దక్షిణంగా ఉంది. “ఏశావు”– అతని దీవెన, జన్మహక్కు దొంగిలించినందుకు ఏశావు తనపై పగతీర్చుకుంటాడా అని యాకోబు భయపడ్డాడు – వ 7,8; ఆదికాండము 27:36 ఆదికాండము 27:41-42.

4. మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాబానునొద్ద నివసించి యుంటిని;

యాకోబు ఏశావును “యజమాని” అనీ తనను “సేవకుడు” అనీ అనడం ద్వారా తమ మధ్య శాంతి నెలకొనాలని, తాను అతనికి లోబడేందుకు సిద్ధపడుతున్నట్టుగా (కనీసం మాటల్లో) ఉండడం గమనించండి.

5. నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసీజనమును కలరు; నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియచేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారి కాజ్ఞాపించెను.

6. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగివచ్చి-మేము నీ సహోదరుడైన ఏశావునొద్దకు వెళ్లితివిు; అతడు నాలుగువందలమందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా

7. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి

8. -ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసినయెడల మిగిలిన గుంపు తప్పించుకొనిపోవుననుకొని, తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించెను.

9. అప్పుడు యాకోబు-నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా-, నీ దేశమునకు నీ బంధువులయొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా,

“ప్రార్థించాడు”– యాకోబు మొదటి సారిగా ప్రార్థనలో దేవునితో మాట్లాడ్డం చూస్తున్నాం. ఇందుకు అతనికి కలిగిన భయమే కారణం. “తిరిగి వెళ్ళు”– ఆదికాండము 31:3.

10. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దానుదాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని.

యాకోబుకు తన పాపాలూ తప్పిదాలూ తెలుసు. తన క్షేమానికీ భద్రతకూ కృపే ఆధారమని కొంతవరకు అర్థం చేసుకోగలిగాడు. తన మంచితనం గురించి ఇక్కడ వాదించడం లేదు గాని తనకు మేలు కలుగజేస్తానని (ఆదికాండము 28:13-15) మాట ఇచ్చిన దేవుని వాగ్దానాలు, విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నాడు. గ

11. నా సహోదరుడైన ఏశావు చేతినుండి దయచేసి నన్ను తప్పించుము; అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను.

12. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు, విస్తారమగుటవలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను.
హెబ్రీయులకు 11:12

13. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయైన ఏశావు కొరకు ఒక కానుకను

యాకోబు తన భద్రతకోసం దేవుణ్ణి వేడుకుని కూడా, ఏశావును శాంతిపరచడానికి తన స్వంత ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుడు అది చెయ్యడని అనుకొన్నాడా? దేవుడిచ్చే భద్రత గురించి మరింత విశ్వాసం ఉన్న మరొక వ్యక్తితో యాకోబును పోల్చిచూడండి – ఎజ్రా 8:21-23.

14. అనగా రెండువందల మేకలను ఇరువది మేక పోతులను రెండువందల గొఱ్ఱెలను ఇరువది పొట్టేళ్లను

15. ముప్పది పాడి ఒంటెలను వాటి పిల్లలను నలుబది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసికొని మందమందను వేరు వేరుగా

16. తన దాసులచేతి కప్పగించి మీరు మంద మందకు నడుమ ఎడముంచి నాకంటె ముందుగా సాగిపొండని తన దాసులతో చెప్పెను.

17. మరియు వారిలో మొదటివానితో నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని-నీవెవరివాడవు? ఎక్కడికి వెళ్లుచున్నావు? నీ ముందరనున్నవి యెవరివని నిన్ను అడిగినయెడల

18. నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావుకొరకు పంపబడిన కానుక; అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను.

19. అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుకవలన అతని సమాధానపరచిన తరువాత నేను అతని ముఖము చూచెదను; అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏశావును చూచి

20. మీరు-ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్ప వలెననియు రెండవవానికిని మూడవవానికిని మందల వెంబడి వెళ్లిన వారికందరికిని ఆజ్ఞాపించెను.

21. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను.

22. ఆ రాత్రి అతడు లేచి తన యిద్దరు భార్యలను తన యిద్దరు దాసీలను తన పదకొండుమంది పిల్లలను తీసికొని యబ్బోకు రేవు దాటిపోయెను.

23. యాకోబు వారిని తీసి కొని ఆ యేరు దాటించి తనకు కలిగినదంతయు పంపి వేసెను.

24. యాకోబు ఒక్కడు మిగిలి పోయెను; ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను.

“తెల్లవారేవరకు”– ఈ పోరాటం కేవలం శారీరకమైనది మాత్రమే కాదు. యాకోబు రాత్రంతా ఇలా కుస్తీపడుతూ ఉండగలగడం అసాధ్యం. ఎలాగైనా దేవదూత యాకోబు యొక్క మనసులో, సంకల్పంలో మార్పు కలిగించాలని వచ్చాడు. ఆయన దృష్టిలో అది మరింత ప్రాముఖ్యమైన సంగతి. “ఒక వ్యక్తి”– మానవ రూపంలో ఒక ద

25. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటిమీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటవలన యాకోబు తొడ గూడువసిలెను.

“గెలవకపోవడం”– ఈ మహా బలాఢ్యుడైన దేవదూత ఒక మనిషిని గెలవలేకపోవడమా? యెషయా 37:36 పోల్చిచూడండి. శరీరాన్ని తేలికగా జయించగలిగాడు. అయితే యాకోబు మనో సంకల్పాన్నీ అంతరంగ స్వభావాన్నీ జయించడం ఆయనకు కష్టతరమై పోయింది. తన తొడకీలు తప్పడం వల్ల యాకోబు ఇక పెనుగులాడలేకపోయాడు.

26. ఆయన-తెల్లవారు చున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు-నీవు నన్ను ఆశీర్వ దించితేనే గాని నిన్ను పోనియ్యననెను.

“దీవిస్తేనే”– తాను పట్టుకుని ఉన్నదెవరినో చివరికి యాకోబు గుర్తించినట్టున్నాడు. యాకోబుకు ఇప్పుడు దీవెనలు కలగాలంటే తనను తాను (తన స్వభావాన్ని) గుర్తించి తానేమై ఉన్నాడో ఒప్పుకోవాలి (ఆదికాండము 25:26 ఆదికాండము 27:36). “పేరు” అంటే అతని స్వభావం, గుణాలు.

27. ఆయన నీ పేరేమని యడుగగా అతడు- యాకోబు అని చెప్పెను.

28. అప్పుడు ఆయననీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను.

“యాకోబు”– ఆ రాత్రి దేవుడు అతనిలో లోతైన మార్పు తేగలిగాడు. యాకోబు తన మరణం వరకు తన పాప స్వభావంనుండి విముక్తుడు కాలేదు గాని మోసకరమైన జిత్తులు, తనపై తనకున్న నిబ్బరం ఆ రాత్రితో సమసిపోయాయి. ఆ రాత్రి యాకోబు గెలిచాడన్నది నిజమే గాని దేవదూత కూడా గెలిచాడు. ఆ మల్లయుద్

29. అప్పుడు యాకోబు-నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందు కాయన-నీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను.

“పేరు”– న్యాయాధిపతులు 13:17-18 యెషయా 9:6. “దీవించాడు”– తాను కోరినదాన్ని యాకోబు పొందాడు (వ 26). మత్తయి 7:9-12 పోల్చి చూడండి.

30. యాకోబు-నేను ముఖా ముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను.

“పెనూయేల్”అంటే “దేవుని ముఖం” అని అర్థం. ఆదికాండము 16:13 న్యాయాధిపతులు 6:22-23 న్యాయాధిపతులు 13:22 కూడా చూడండి. వాళ్ళు దేవుణ్ణి దేవదూత రూపంలో లేక మానవ రూపంలో చూశారు గాని ఆయన యొక్క మహిమాన్విత ఆత్మరూపంలో కాదు – ఆదికాండము 2:19 నిర్గమకాండము 33:18-23 యోహాను 1:18 1 తిమోతికి 6:15-16.

31. అతడు పెనూయేలునుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను; అప్పుడతడు తొడకుంటుచు నడిచెను.

కుంటుతూ నడవడం అతనికి అస్తమానమూ తన బలహీనతలనూ దేవుని కృపనూ జ్ఞప్తికి తెస్తూవుంది. 2 కోరింథీయులకు 12:7-10 లో ఇలాంటిదే ఉంది. దేవుణ్ణి నిజంగా కలిసినవారు అంతకుముందు ఉన్నట్టు ఉండలేరు.

32. అందుచేత ఆయన యాకోబు తొడగూటిమీది తుంటినరము కొట్టినందున నేటివరకు ఇశ్రాయేలీయులు తొడ గూటిమీదనున్న తుంటినరము తినరు.Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |