Genesis - ఆదికాండము 44 | View All

1. యోసేపు ఆ మనుష్యుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెమూతిలో పెట్టుమనియు,

1. Later, Joseph told the servant in charge of his house, 'Fill the men's grain sacks with as much as they can hold and put their money in the sacks. Also put my silver cup in the sack of the youngest brother.' The servant did as he was told.

2. కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు, తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను.

2. (SEE 44:1)

3. తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు తమ గాడిదలతో కూడ పంపివేయబడిరి.

3. Early the next morning, the men were sent on their way with their donkeys.

4. వారు ఆ పట్టణమునుండి బయలు దేరి యెంతో దూరము వెళ్లక మునుపు, యోసేపు తన గృహనిర్వాహకుని చూచి నీవు లేచి ఆ మనుష్యుల వెంటబడి వెళ్లి వారిని కలిసికొని మీరు మేలుకు కీడు చేయనేల?

4. But they had not gone far from the city when Joseph told the servant, 'Go after those men! When you catch them, say, 'My master has been good to you. So why have you stolen his silver cup?

5. దేనితో నా ప్రభువు పానము చేయునో దేనివలన అతడు శకునములు చూచునో అది యిదే కదా? మీరు దీని చేయుటవలన కాని పని చేసితిరని వారితో చెప్పుమనెను.

5. Not only does he drink from his cup, but he also uses it to learn about the future. You have done a terrible thing.' '

6. అతడు వారిని కలిసికొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు

6. When the servant caught up with them, he said exactly what Joseph had told him to say.

7. వారు మా ప్రభువు ఇట్లు మాటలాడనేల? ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవును గాక.

7. But they replied, 'Sir, why do you say such things? We would never do anything like that!

8. ఇదిగో మా గోనెలమూతులలో మాకు దొరికిన రూకలను కనాను దేశములోనుండి తిరిగి తీసికొనివచ్చితివిు; నీ ప్రభువు ఇంటిలోనుండి మేము వెండినైనను బంగారము నైనను ఎట్లు దొంగిలుదుము?

8. We even returned the money we found in our grain sacks when we got back to Canaan. So why would we want to steal any silver or gold from your master's house?

9. నీ దాసులలో ఎవరియొద్ద అది దొరుకునో వాడు చచ్చును గాక; మరియు మేము మా ప్రభువునకు దాసులముగా నుందుమని అతనితో అనిరి.

9. If you find that one of us has the cup, then kill him, and the rest of us will become your slaves.'

10. అందుకతడు మంచిది, మీరు చెప్పినట్టే కానీయుడి; ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును, అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పెను.

10. Good!' the man replied, 'I'll do what you have said. But only the one who has the cup will become my slave. The rest of you can go free.'

11. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను.

11. Each of the brothers quickly put his sack on the ground and opened it.

12. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్న వానివరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను.

12. Joseph's servant started searching the sacks, beginning with the one that belonged to the oldest brother. When he came to Benjamin's sack, he found the cup.

13. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిదమీద గోనెలు ఎక్కించు కొని తిరిగి పట్టణమునకు వచ్చిరి.

13. This upset the brothers so much that they began tearing their clothes in sorrow. Then they loaded their donkeys and returned to the city.

14. అప్పుడు యూదాయును అతని సహోదరులును యోసేపు ఇంటికి వచ్చిరి. అతడింక అక్కడనే ఉండెను గనుక వారు అతని యెదుట నేలను సాగిలపడిరి.

14. When Judah and his brothers got there, Joseph was still at home. So they bowed down to Joseph,

15. అప్పుడు యోసేపు - మీరు చేసిన యీ పని యేమిటి? నావంటి మనుష్యుడు శకునము చూచి తెలిసికొనునని మీకు తెలియదా అని వారితో అనగా

15. who asked them, 'What have you done? Didn't you know I could find out?'

16. యూదా యిట్లనెను - ఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని యెట్లు కనుపరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెనో వాడును ఏలిన వారికి దాసుల మగుదుమనెను.

16. Sir, what can we say?' Judah replied. 'How can we prove we are innocent? God has shown that we are guilty. And now all of us are your slaves, especially the one who had the cup.'

17. అందుకతడు అట్లు చేయుట నాకు దూరమవునుగాక; ఎవనిచేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడుగా నుండును; మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్లుడని చెప్పగా

17. Joseph told them, 'I would never punish all of you. Only the one who was caught with the cup will become my slave. The rest of you are free to go home to your father.'

18. యూదా అతని సమీపించి ఏలినవాడా ఒక మనవి; ఒక మాట యేలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము; తమ కోపము తమ దాసునిమీద రవులుకొననీయకుము; తమరు ఫరో అంతవారుగదా

18. Judah went over to Joseph and said: Sir, you have as much power as the king himself, and I am only your slave. Please don't get angry if I speak.

19. ఏలినవాడు మీకు తండ్రియైనను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులనడిగెను.

19. You asked us if our father was still alive and if we had any more brothers.

20. అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన యొక చిన్నవాడును ఉన్నారు; వాని సహోదరుడు చనిపోయెను, వాని తల్లికి వాడొక్కడే మిగిలియున్నాడు, వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి.

20. So we told you, 'Our father is a very old man. In fact, he was already old when Benjamin was born. Benjamin's brother is dead. Now Benjamin is the only one of the two brothers who is still alive, and our father loves him very much.'

21. అప్పుడు తమరు నేనతని చూచుటకు అతని నా యొద్దకు తీసికొని రండని తమ దాసులతో చెప్పితిరి.

21. You ordered us to bring him here, so you could see him for yourself.

22. అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు. వాడు తన తండ్రిని విడిచినయెడల వాని తండ్రి చనిపోవునని యేలినవారితో చెప్పితివిు.

22. We told you that our father would die if Benjamin left him.

23. అందుకు తమరు మీ తమ్ముడు మీతో రానియెడల మీరు మరల నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి.

23. But you warned us that we could never see you again, unless our youngest brother came with us.

24. కాబట్టి నా తండ్రియైన తమ దాసుని యొద్దకు మేము వెళ్లి యేలినవారి మాటలను అతనికి తెలియచేసితివిు.

24. So we returned to our father and reported what you had said.

25. మా తండ్రి మీరు తిరిగి వెళ్లి మనకొరకు కొంచెము అహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు

25. Later our father told us to come back here and buy more grain.

26. మేము అక్కడికి వెళ్లలేము; మా తమ్ముడు మాతో కూడ ఉండిన యెడల వెళ్లుదుము; మా తమ్ముడు మాతో నుంటేనే గాని ఆ మనుష్యుని ముఖము చూడలేమని చెప్పితివిు.

26. But we answered, 'We can't go back to Egypt without our youngest brother. We will never be let in to see the governor, unless he is with us.'

27. అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని కనెనని మీరెరుగుదురు.

27. Sir, our father then reminded us that his favorite wife had given birth to two sons.

28. వారిలో ఒకడు నా యొద్దనుండి వెళ్లి పోయెను. అతడు నిశ్చయముగా దుష్ట మృగములచేత చీల్చబడెననుకొంటిని, అప్పటినుండి అతడు నాకు కనబడలేదు.

28. One of them was already missing and had not been seen for a long time. My father thinks the boy was torn to pieces by some wild animal,

29. మీరు నా యెదుటనుండి ఇతని తీసికొనిపోయిన తరువాత ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలుగల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను.

29. and he said, 'I am an old man. If you take Benjamin from me, and something happens to him, I will die of a broken heart.'

30. కావున తమ దాసుడైన నా తండ్రియొద్దకు నేను వెళ్లినప్పుడు ఈ చిన్నవాడు మాయొద్ద లేనియెడల

30. That's why Benjamin must be with us when I go back to my father. He loves him so much

31. అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసికొని యున్నది గనుక ఈ చిన్నవాడు మాయొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెండ్రుకలుగల తమ దాసుడైన మాతండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదము.

31. that he will die if Benjamin doesn't come back with me.

32. తమ దాసుడనైన నేను ఈ చిన్న వానినిగూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేనతని తీసికొని రానియెడల నా తండ్రి దృష్టియందు ఆ నింద నా మీద ఎల్లప్పుడు ఉండునని చెప్పితిని.

32. I promised my father that I would bring him safely home. If I don't, I told my father he could blame me the rest of my life.

33. కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా నుండనిచ్చి యీ చిన్నవాని తన సహోదరులతో వెళ్లనిమ్ము.

33. Sir, I am your slave. Please let me stay here in place of Benjamin and let him return home with his brothers.

34. ఈ చిన్నవాడు నాతోకూడ లేనియెడల నా తండ్రియొద్దకు నేనెట్లు వెళ్లగలను? వెళ్లినయెడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పెను.

34. How can I face my father if Benjamin isn't with me? I couldn't bear to see my father in such sorrow.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Genesis - ఆదికాండము 44 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
జోసెఫ్ యొక్క విధానం అతని సోదరులుగా ఉండి, బెంజమిన్ పట్ల వారి ప్రేమను ప్రయత్నించడం. (1-17) 
బెంజమిను గురించి తన సహోదరులు ఎలా భావిస్తున్నారో జోసెఫ్ పరిశీలించాడు. వారు జోసెఫ్‌ పట్ల ఉన్నట్లే తన పట్ల అసూయతో ఉన్నారో లేదో తెలుసుకోవాలనుకున్నాడు. వాళ్ళ నాన్న యాకోబు‌ విషయంలో ఇంకా అలాగే అనిపిస్తుందో లేదో కూడా అతను తెలుసుకోవాలనుకున్నాడు. వారు బెంజమినుతో ఒక కప్పును కనుగొన్నప్పుడు, వారు అతనిని బానిసగా విడిచిపెట్టడానికి ఒక సాకుగా ఉపయోగించుకోవచ్చు. ప్రజలు గతంలో ఏమి చేసారు లేదా భవిష్యత్తులో వారు ఏమి చేస్తారనే దాని ఆధారంగా మనం అంచనా వేయలేము. ఒక కథలో, ఒక వ్యక్తి తమ యజమానికి చెందిన ప్రత్యేక కప్పును తీసుకున్నందుకు ఇతరులను కృతజ్ఞత లేని మరియు మూర్ఖులని నిందించాడు. వారు తమ నిజాయితీని పరీక్షించడానికి లేదా వారు నీచంగా ఉన్నందున వారు దానిని తీసుకున్నారని ఆ వ్యక్తి భావించాడు. ఇతరులు క్షమించమని అడిగారు మరియు వారు గతంలో చేసిన చెడుకు దేవుడు వారిని శిక్షిస్తున్నాడని గ్రహించారు. ఇతరులు చేసే పనుల వల్ల చెడు జరిగినప్పుడు కూడా, దేవుడు న్యాయవంతుడని మరియు మనం చేసిన తప్పు ఏమిటో తెలుసునని గుర్తుంచుకోవాలి.

యోసేపుకు యూదా విన్నపం. (18-34)
జోసెఫ్ తన కుటుంబం గురించి తెలియకపోతే, యూదా వాదనలు అతన్ని ఒప్పించి ఉండవచ్చు. అయితే యోసేపు తన సహోదరులైన యాకోబు, బెన్యామీనులను ప్రేమించాడు, కాబట్టి వారి పక్షాన ఎవరూ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇతర తెగలు విడిచిపెట్టినప్పటికీ, బెంజమిన్ తెగ యూదా తెగతో అతుక్కుపోయినప్పుడు బెంజమిన్ పట్ల యూదా యొక్క విధేయతకు ప్రతిఫలం లభించింది. యేసు మనకు ఎలా సహాయం చేస్తాడనే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు, యేసు యూదా తెగ నుండి వచ్చాడని అపొస్తలుడు చెప్పాడు. హెబ్రీయులకు 7:14 తప్పు చేసిన వారి పక్షాన యేసు దేవునితో మాట్లాడి, వారిని జాగ్రత్తగా చూసుకుంటానని వాగ్దానం చేశాడు. అతను దేవుని గురించి మరియు ప్రజల గురించి శ్రద్ధ వహించాడు. యేసు యోసేపు లాంటివాడు, తన ప్రజలు తప్పులు చేసినా కూడా సహాయం చేస్తాడు. అతను వారి తప్పులను వారికి గుర్తు చేస్తాడు, కాబట్టి వారు క్షమించండి మరియు అతని సహాయం వారికి ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు. 



Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |