Genesis - ఆదికాండము 47 | View All

1. యోసేపు వెళ్లి ఫరోను చూచినా తండ్రియు నా సహోదరులును వారి గొఱ్ఱెల మందలతోను వారి పశువులతోను వారికి కలిగినదంతటితోను కనాను దేశము నుండి వచ్చి గోషెనులో నున్నారని తెలియచేసి

1. yōsēpu veḷli pharōnu chuchinaa thaṇḍriyu naa sahōdarulunu vaari gorrela mandalathoonu vaari pashuvulathoonu vaariki kaliginadanthaṭithoonu kanaanu dheshamu nuṇḍi vachi gōshenulō nunnaarani teliyachesi

2. తన సహోదరులందరిలో అయిదుగురిని వెంటబెట్టు కొనిపోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను.

2. thana sahōdarulandarilō ayidugurini veṇṭabeṭṭu konipōyi vaarini pharō samakshamandu un̄chenu.

3. ఫరో అతని సహోదరులను చూచి-మీ వృత్తి యేమిటని అడిగినప్పుడు వారు-నీ దాసులమైన మేమును మా పూర్వికులును గొఱ్ఱెల కాపరులమని ఫరోతో చెప్పిరి.

3. pharō athani sahōdarulanu chuchi-mee vrutthi yēmiṭani aḍiginappuḍu vaaru-nee daasulamaina mēmunu maa poorvikulunu gorrela kaaparulamani pharōthoo cheppiri.

4. మరియు వారు-కనాను దేశమందు కరవు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగియున్న మందలకు మేత లేదు గనుక ఈ దేశములో కొంత కాలముండుటకు వచ్చితివిు. కాబట్టి గోషెను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా

4. mariyu vaaru-kanaanu dheshamandu karavu bhaaramugaa unnanduna nee daasulaku kaligiyunna mandalaku mētha lēdu ganuka ee dheshamulō kontha kaalamuṇḍuṭaku vachithivi. Kaabaṭṭi gōshenu dheshamulō nee daasulu nivasimpa selavimmani pharōthoo anagaa

5. ఫరో యోసేపును చూచి-నీ తండ్రియు నీ సహోదరులును నీయొద్దకు వచ్చియున్నారు.

5. pharō yōsēpunu chuchi-nee thaṇḍriyu nee sahōdarulunu neeyoddhaku vachiyunnaaru.

6. ఐగుప్తు దేశము నీ యెదుట ఉన్నది, ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింప చేయుము, గోషెను దేశములో వారు నివసింప వచ్చును, వారిలో ఎవరైన ప్రజ్ఞగలవారని నీకు తోచిన యెడల నా మందలమీద వారిని అధిపతులగా నియమించుమని చెప్పెను

6. aigupthu dheshamu nee yeduṭa unnadhi, ee dheshamulōni man̄chi pradheshamandu nee thaṇḍrini nee sahōdarulanu nivasimpa cheyumu, gōshenu dheshamulō vaaru nivasimpa vachunu, vaarilō evaraina pragnagalavaarani neeku thoochina yeḍala naa mandalameeda vaarini adhipathulagaa niyamin̄chumani cheppenu

7. మరియయోసేపు తన తండ్రియైన యాకోబును లోపలికి తీసికొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను.

7. mariyu yōsēpu thana thaṇḍriyaina yaakōbunu lōpaliki theesikoni vachi pharō samakshamandu athani nun̄chagaa yaakōbu pharōnu deevin̄chenu.

8. ఫరో-నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబు నడిగి నందుకు

8. pharō-neevu jeevin̄china samvatsaramulenni ani yaakōbu naḍigi nanduku

9. యాకోబు-నేను యాత్రచేసిన సంవత్సరములు నూట ముప్పది, నేను జీవించిన సంవత్సరములు కొంచెము గాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్రచేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్ని కాలేదని ఫరోతో చెప్పి
హెబ్రీయులకు 11:13

9. yaakōbu-nēnu yaatrachesina samvatsaramulu nooṭa muppadhi, nēnu jeevin̄china samvatsaramulu kon̄chemu gaanu duḥkhasahithamainavigaa unnavi. Avi naa pitharulu yaatrachesina dinamulalō vaaru jeevin̄china samvatsaramulanni kaalēdani pharōthoo cheppi

10. ఫరోను దీవించి ఫరో యెదుటనుండి వెళ్లిపోయెను.

10. pharōnu deevin̄chi pharō yeduṭanuṇḍi veḷlipōyenu.

11. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి, ఆ దేశములో రామెసేసను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యము నిచ్చెను.

11. pharō aagnaapin̄chinaṭlu yōsēpu thana thaṇḍrini thana sahōdarulanu aigupthu dheshamulō nivasimpachesi, aa dheshamulō raamesēsanu man̄chi pradheshamulō vaariki svaasthyamu nicchenu.

12. మరియయోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపువారినందరిని వారివారి పిల్లల లెక్కచొప్పున వారికి ఆహారమిచ్చి సంరక్షించెను.

12. mariyu yōsēpu thana thaṇḍrini thana sahōdarulanu thana thaṇḍri kuṭumbapuvaarinandarini vaarivaari pillala lekkachoppuna vaariki aahaaramichi sanrakshin̄chenu.

13. కరవు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను. కరవువలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను.

13. karavu mikkili bhaaramainanduna aa dheshamandanthaṭanu aahaaramu lēkapōyenu. Karavuvalana aigupthu dheshamunu kanaanu dheshamunu ksheeṇin̄chenu.

14. వచ్చినవారికి ధాన్య మమ్ముటవలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోను దొరికిన ద్రవ్యమంత యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను.

14. vachinavaariki dhaanya mammuṭavalana aigupthu dheshamulōnu kanaanu dheshamulōnu dorikina dravyamantha yōsēpu samakoorchenu. aa dravyamanthaṭini yōsēpu pharō nagarulōniki teppin̄chenu.

15. ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరు యోసేపునొద్దకు వచ్చి-మాకు ఆహారము ఇప్పించుము, నీ సముఖమందు మేమేల చావవలెను? ద్రవ్యము వ్యయమైనది గదా అనిరి.

15. aigupthu dheshamandunu kanaanu dheshamandunu dravyamu vyayamaina tharuvaatha aiguptheeyulandaru yōsēpunoddhaku vachi-maaku aahaaramu ippin̄chumu, nee samukhamandu mēmēla chaavavalenu? Dravyamu vyayamainadhi gadaa aniri.

16. అందుకు యోసేపు-మీ పశువులను ఇయ్యుడి; ద్రవ్యము వ్యయమైపోయిన యెడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యమిచ్చెదనని చెప్పెను, కాబట్టి వారు తమ పశువులను యోసేపునొద్దకు తీసికొనవచ్చిరి.యోసేపు గుఱ్ఱములను గొర్రెల మందలను పశువుల మందలను గాడిదలను తీసికొని వారికి ఆహారమిచ్చెను

16. anduku yōsēpu-mee pashuvulanu iyyuḍi; dravyamu vyayamaipōyina yeḍala mee pashuvulaku prathigaa nēnu meeku dhaanyamicchedhanani cheppenu, kaabaṭṭi vaaru thama pashuvulanu yōsēpunoddhaku theesikonavachiri.Yōsēpu gurramulanu gorrela mandalanu pashuvula mandalanu gaaḍidalanu theesikoni vaariki aahaaramicchenu

17. ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికి ప్రతిగా అతడు వారికి ఆహారమిచ్చి సంరక్షించెను.

17. aa samvatsaramandu vaari mandalanniṭiki prathigaa athaḍu vaariki aahaaramichi sanrakshin̄chenu.

18. ఆ సంవత్సరము గతించిన తరువాత రెండవ సంవత్సరమున వారు అతని యొద్దకు వచ్చి ఇది మా యేలినవారికి మరుగుచేయము; ద్రవ్యము వ్యయమై పోయెను, పశువుల మందలును ఏలినవారి వశమాయెను, ఇప్పుడు మా దేహములును మా పొలములును తప్ప మరి ఏమియు ఏలినవారి సముఖమున మిగిలియుండలేదు.

18. aa samvatsaramu gathin̄china tharuvaatha reṇḍava samvatsaramuna vaaru athani yoddhaku vachi idi maa yēlinavaariki marugucheyamu; dravyamu vyayamai pōyenu, pashuvula mandalunu ēlinavaari vashamaayenu, ippuḍu maa dhehamulunu maa polamulunu thappa mari ēmiyu ēlinavaari samukhamuna migiliyuṇḍalēdu.

19. నీ కన్నుల యెదుట మా పొలములును మేమును నశింపనేల? ఆహారమిచ్చి మమ్మును మా పొలములను కొనుము; మా పొలములతో మేము ఫరోకు దాసులమగుదుము; మేము చావక బ్రదుకునట్లును పొలములు పాడైపోకుండునట్లును మాకు విత్తనము లిమ్మని అడిగిరి.

19. nee kannula yeduṭa maa polamulunu mēmunu nashimpanēla? aahaaramichi mammunu maa polamulanu konumu; maa polamulathoo mēmu pharōku daasulamagudumu; mēmu chaavaka bradukunaṭlunu polamulu paaḍaipōkuṇḍunaṭlunu maaku vitthanamu limmani aḍigiri.

20. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటిని ఫరో కొరకు కొనెను. కరవు వారికి భారమైనందున ఐగుప్తీయులందరు తమ తమ పొలములను అమ్మివేసిరి గనుక, భూమి ఫరోది ఆయెను.

20. aṭlu yōsēpu aigupthu bhoomulanniṭini pharō koraku konenu. Karavu vaariki bhaaramainanduna aiguptheeyulandaru thama thama polamulanu ammivēsiri ganuka, bhoomi pharōdi aayenu.

21. అతడు ఐగుప్తు పొలిమేరలయొక్క యీ చివరనుండి ఆ చివర వరకును జనులను ఊళ్లలోనికి రప్పించెను.

21. athaḍu aigupthu polimēralayokka yee chivaranuṇḍi aa chivara varakunu janulanu ooḷlalōniki rappin̄chenu.

22. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో బత్తెములు నియమించెను. ఫరో ఇచ్చిన బత్తెములవలన వారికి భోజనము జరిగెను గనుక వారు తమ భూములను అమ్మలేదు.

22. yaajakula bhoomi maatramē athaḍu konalēdu, yaajakulaku pharō battemulu niyamin̄chenu. Pharō ichina battemulavalana vaariki bhōjanamu jarigenu ganuka vaaru thama bhoomulanu ammalēdu.

23. యోసేపు ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొనియున్నాను. ఇదిగో మీకు విత్తనములు; పొలములలో విత్తుడి.

23. yōsēpu idigō nēḍu mimmunu mee bhoomulanu pharō koraku koniyunnaanu. Idigō meeku vitthanamulu; polamulalō vitthuḍi.

24. పంటలో అయిదవ భాగము మీరు ఫరోకు ఇయ్యవలెను. నాలుగు భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపు వారికిని ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై యుండునని ప్రజలతో చెప్పగా

24. paṇṭalō ayidava bhaagamu meeru pharōku iyyavalenu. Naalugu bhaagamulu polamulalō vitthuṭakunu meekunu mee kuṭumbapu vaarikini aahaaramunakunu mee pillalaku aahaaramunakunu meevai yuṇḍunani prajalathoo cheppagaa

25. వారు-నీవు మమ్ము బ్రదికించితివి, ఏలినవారి కటాక్షము మా మీదనుండనిమ్ము; ఫరోకు దాసులమగుదుమని చెప్పిరి.

25. vaaru-neevu mammu bradhikin̄chithivi, ēlinavaari kaṭaakshamu maa meedanuṇḍanimmu; pharōku daasulamagudumani cheppiri.

26. అప్పుడు అయిదవ భాగము ఫరోదని నేటివరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను, యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను. అవి ఫరోవి కావు.

26. appuḍu ayidava bhaagamu pharōdani nēṭivaraku yōsēpu aigupthu bhoomulanu goorchi kaṭṭaḍa niyamin̄chenu, yaajakula bhoomulu maatramē vinaayimpabaḍenu. Avi pharōvi kaavu.

27. ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశమందలి గోషెను ప్రదేశములో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతా నాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి.

27. ishraayēleeyulu aigupthudheshamandali gōshenu pradheshamulō nivasin̄chiri. Andulō vaaru aasthi sampaadhin̄chukoni santhaa naabhivruddhi pondi migula vistharin̄chiri.

28. యాకోబు ఐగుప్తుదేశములో పదునేడు సంవత్సరములు బ్రదికెను. యాకోబు దినములు, అనగా అతడు జీవించిన సంవత్సరములు నూటనలుబదియేడు.

28. yaakōbu aigupthudheshamulō padunēḍu samvatsaramulu bradhikenu. Yaakōbu dinamulu, anagaa athaḍu jeevin̄china samvatsaramulu nooṭanalubadhiyēḍu.

29. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి-నా యెడల నీకు కటాక్షమున్నయెడల దయచేసి నీ చెయ్యి నాతొడక్రింద ఉంచి నా యెడల దయను నమ్మకమును కనుపరచుము; ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము.

29. ishraayēlu chaavavalasina dinamulu sameepin̄chinappuḍu athaḍu thana kumaaruḍaina yōsēpunu pilipin̄chi-naa yeḍala neeku kaṭaakshamunnayeḍala dayachesi nee cheyyi naathoḍakrinda un̄chi naa yeḍala dayanu nammakamunu kanuparachumu; eṭlanagaa nannu aigupthulō paathipeṭṭakumu.

30. నా పితరులతో కూడ నేను పండుకొనునట్లు ఐగుప్తులోనుండి నన్ను తీసికొనిపోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పెను.

30. naa pitharulathoo kooḍa nēnu paṇḍukonunaṭlu aigupthulōnuṇḍi nannu theesikonipōyi vaari samaadhilō nannu paathipeṭṭumani athanithoo cheppenu.

31. అందుకతడు-నేను నీ మాట చొప్పున చేసెదననెను. మరియు అతడు-నాతో ప్రమాణము చేయుమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపిమీద వంగి దేవునికి నమస్కారము చేసెను.
హెబ్రీయులకు 11:21

31. andukathaḍu-nēnu nee maaṭa choppuna chesedhananenu. Mariyu athaḍu-naathoo pramaaṇamu cheyumannappuḍu yōsēpu athanithoo pramaaṇamu chesenu. Appuḍu ishraayēlu thana man̄chapu thalaapimeeda vaṅgi dhevuniki namaskaaramu chesenu.Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |