ఇప్పుడు ఆదాము పతనమైన పాపి. అతడి స్వభావం అతడి సంతానానికి, ఆ విధంగా మనకూ సంక్రమించింది (యోబు 14:4 కీర్తనల గ్రంథము 51:5). మనమంతా పుట్టుకతోనే పాపులం. అనేక శతాబ్దాలుగా హిందువులు చేస్తున్న ఒక ప్రార్థన ఇందుకు అనుగుణంగా ఉంది. ఈ శ్లోకం అందరూ ఎరిగినదే. “పాపోహం, పాపకర్మాణాం, పాపాత్మా, పాప సంభవాం. పాహిమాం, కృపయా దేవా, శరణాగత వత్సలా!” (నేను నా పుట్టుకను బట్టీ, చేసిన క్రియలను బట్టీ పాపాత్ముణ్ణి. నా ఆత్మ పాపంతో భ్రష్టంగా ఉంది. పాపంలోనే నేను పుట్టాను. ప్రభూ, పాపినైన నన్ను కరుణించి రక్షించు). దైవభక్తి కలిగిన షేతు సంతానం కూడా పాపాత్ములే.