Samuel II - 2 సమూయేలు 1 | View All

1. దావీదు అమాలేకీయులను హతముచేసి తిరిగి వచ్చెను. సౌలు మృతినొందిన తరువాత అతడు సిక్లగులో రెండు దినములుండెను.

1. After ye death of Saul whan Dauid was come agayne from the slaughter of ye Amalechites, and had remayned two dayes at Siclag,

2. మూడవ దినమున బట్టలు చింపుకొని తలమీద బుగ్గిపోసికొనిన యొకడు సౌలునొద్దనున్న దండులోనుండి వచ్చెను.

2. beholde, on the thirde daye there came a man out of Sauls hoost, with his clothes rente, and earth vpon his heade. And whan he came vnto Dauid, he fell downe to the grounde, and worshipped.

3. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా దావీదునీ వెక్కడనుండి వచ్చితివని యడి గెను. అందుకు వాడుఇశ్రాయేలీయుల సైన్యములోనుండి నేను తప్పించుకొని వచ్చితిననెను.

3. Dauid sayde vnto him: Whence commest thou? He sayde vnto him: Out of the hoost of Israel am I fled.

4. జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవియ్యగా వాడుజనులు యుద్ధమందు నిలువ లేక పారిపోయిరి. అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను.

4. Dauid sayde vnto him: Tell me, what is the matter? He sayde: the people is fled from the battayll, and many of the people are fallen: Yee and Saul also is deed and his sonne Ionathas.

5. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీ కేలాగు తెలిసినది అని దావీదు వాని నడుగగా వాడిట్లనెను

5. Dauid sayde vnto the yonge ma that brought him this worde: How knowest thou that Saul and Ionathas his sonne are deed?

6. గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన యీటెమీద ఆనుకొనియుండెను.

6. The yonge man yt tolde him this, sayde: I came by chaunce vnto mount Gelboa, and beholde, Saul leaned vpon his speare, & the charettes and horsme folowed harde after him:

7. అతడు రథములును రౌతులును తనను వెనువెంట తగులు చుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకుచిత్తము నా యేలినవాడా అని నేనంటిని.

7. and he turned him aboute, and sawe me, and called me. And I sayde: Here, am I.

8. నీవెవడవని అతడు నన్నడుగగానేను అమాలేకీయుడనని చెప్పితిని.

8. And he sayde vnto me: What art thou? I sayde vnto him: I am an Amalechite.

9. అతడునా ప్రాణము ఇంక నాలో ఉన్నదిగాని తల త్రిప్పుచేత నేను బహు బాధ పడుచున్నాను ; నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవియ్యగా,

9. And he saide vnto me: Come to me, and kyll me, for anguysh hath gotten holde of me: for my life is yet whole within me.

10. ఈలాగు పడినతరువాత అతడు బ్రదుకడని నేను నిశ్చయించుకొని అతనిదగ్గర నిలిచి అతని చంపితిని; తరువాత అతని తలమీదనున్న కిరీటమును హస్తకంకణము లను తీసికొని నా యేలినవాడవైన నీయొద్దకు వాటిని తెచ్చియున్నాను అనెను.

10. Then stepte I to him, and slewe him, for I knowe well that he coulde not lyue after his fall. And I toke the crowne from his heade, and the armelet fro his arme, and haue broughte it here vnto ye my lorde.

11. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతనియొద్ద నున్న వారందరును ఆలాగున చేసి

11. Then toke Dauid holde of his clothes, and rente them, and so dyd all the me that were with him,

12. సౌలును యోనాతానును యెహోవా జనులును ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రము వరకు ఉపవాసముండిరి.

12. & mourned, and wepte, and fasted vntyll the euen, ouer Saul & Ionathas his sonne, and ouer the people of the LORDE, and ouer the house of Israel, because they were fallen thorow the swerde.

13. తరువాత దావీదునీవెక్కడ నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చినవాని నడుగగా వాడునేను ఇశ్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడననెను.

13. And Dauid sayde to the yonge man that broughte him worde: What art thou? He sayde: I am ye sonne of a straunger an Amalechite.

14. అందుకు దావీదుభయపడక యెహోవా అభిషేకించినవానిని చంపుటకు నీవేల అతని మీద చెయ్యి ఎత్తితివి?

14. Dauid sayde: How happeneth it that thou wast not afrayed to laye thine hade vpon the LORDES anointed to destroye him?

15. యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే;

15. And Dauid sayde vnto one of his yonge men: Come hither, and slaye him. And he smote him that he dyed.

16. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తనవారిలో ఒకని పిలిచినీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను.

16. Then sayde Dauid vnto him: Thy bloude be vpon thyne owne heade. For thy mouth hath spoken against thyselfe and sayde: I haue slayne the anoynted of the LORDE.

17. యూదావారికి అభ్యాసము చేయవలెనని దావీదు సౌలునుగూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతమొకటి చేసి దానినిబట్టి విలాపము సలిపెను.

17. And Dauid mourned this lamentacion ouer Saul and Ionathas his sonne,

18. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి యున్నది. ఎట్లనగా

18. and commaunded to teach the childre of Iuda the bowe. Beholde, it is wrytten in the boke of the righteous.

19. ఇశ్రాయేలూ, నీకు భూషణమగువారునీ ఉన్నత స్థలములమీద హతులైరి అహహా బలాఢ్యులు పడిపోయిరి.

19. The Eldest in Israel are slayne vpon the heigth of the. How are the Worthies falle?

20. ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషింపకుండునట్లు సున్నతిలేనివారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లుఈ సమాచారము గాతులో తెలియజేయకుడి అష్కెలోను వీధులలో ప్రకటన చేయకుడి.

20. Tell it not at Gath: speake not of it in ye stretes at Ascalon: lest the doughters of ye Philistynes reioyse, lest the doughters of ye vncircumcysed tryumphe.

21. గిల్బోవ పర్వతములారా మీమీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైననులేకపోవును గాక. బలాఢ్యులడాళ్లు అవమానముగ పారవేయబడెను. తైలముచేత అభిషేకింపబడని వారిదైనట్టు1సౌలు డాలును పారవేయబడెను.

21. Ye mountaynes of Gelboa, nether dew ner rayne come vpo you, nether lode be wherof commeth Heueofferynges: for there is ye shylde of the Worthies smytten downe, the shylde of Saul, as though he had not bene anoynted with oyle.

22. హతుల రక్తము ఒలికింపకుండ బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండయోనాతాను విల్లు వెనుకతియ్యలేదుఎవరిని హతముచేయకుండ సౌలు కత్తి వెనుక తీసినది కాదు.

22. The bowe of Ionathas fayled not, and the swerde of Saul came not agayne voyde from the bloude of the slayne, and fro the fat of the giauntes.

23. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులు గాను నెనరుగల వారుగాను ఉండిరితమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసినవారు కారువారు పక్షిరాజులకంటె వడిగలవారుసింహములకంటె బలముగలవారు.

23. Saul and Ionathas louely and pleasaut in their lyfe, and in their deeth were not parted asunder: lighter then Aegles, and stronger then lyons.

24. ఇశ్రాయేలీయుల కుమార్తెలారా, సౌలునుగూర్చి యేడ్వుడి అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింప జేసినవాడుబంగారు నగలు మీకు పెట్టినవాడు.

24. Ye doughters of Israel wepe ouer Saul which clothed yow with purple in pleasures, and decked you with Iewels of golde on youre garmentes.

25. యుద్ధరంగమునందు బలాఢ్యులు పడియున్నారునీ ఉన్నతస్థలములలో యోనాతాను హతమాయెను.

25. How are the Worthies fallen so in the battayll? Ionathas is slayne vpon ye heigth of the.

26. నా సహోదరుడా, యోనాతానానీవు నాకు అతిమనోహరుడవై యుంటివినీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నానునాయందు నీకున్న ప్రేమ బహు వింతైనదిస్త్రీలు చూపు ప్రేమకంటెను అది అధికమైనది.

26. I am sory for the my brother Ionathas: thou hast bene very louely vnto me: Thy loue hath bene more speciall vnto me, then the loue of wemen.

27. అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరియుద్ధసన్నద్ధులు నశించిపోయిరి.

27. How are the Worthies fallen, and ye weapens destroyed?



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Samuel II - 2 సమూయేలు 1 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
సౌలు మరణ వార్త దావీదుకు అందింది. (1-10) 
సింహాసనానికి దావీదు మార్గాన్ని క్లియర్ చేసిన దెబ్బ అతనికి చాలా బాధగా ఉన్న సమయంలో వచ్చింది. తమ చింతలను ప్రభువుకు అప్పగించే వారు ఆయన చిత్తాన్ని శాంతియుతంగా అంగీకరించగలరు. దావీదు సౌలు మరణాన్ని కోరుకోలేదని మరియు అతను తొందరపడి సింహాసనాన్ని అధిష్టించడానికి ఆసక్తి చూపలేదని ఇది చూపిస్తుంది.

అమాలేకీయుడు చంపబడ్డాడు. (11-16) 
దావీదు సౌలు కోసం నిజంగా దుఃఖించాడు మరియు అతను మరియు అతని అనుచరులు దేవుని ముందు తమను తాము తగ్గించుకున్నారు, ఈ ఓటమి ఇజ్రాయెల్‌పై భారీ భారం అని గుర్తించింది. సౌలు మరణ వార్తను తెలియజేసిన వ్యక్తిపై డేవిడ్ నిర్ణయాత్మక చర్య తీసుకున్నాడు, అతన్ని రాజు హత్యగా భావించాడు. అమాలేకీయుడు నేరాన్ని అంగీకరించినందున ఈ తీర్పు అన్యాయం కాదు. వ్యక్తి యొక్క ఖాతా నిజం అయితే, అతను ఇప్పటికీ రాజద్రోహం మరియు మరణానికి అర్హుడు. అతని అబద్ధం, నిజంగా అది అబద్ధం అయితే, అబద్ధాలు త్వరగా లేదా తరువాత చేసే విధంగా తనను తాను ఖండించుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఈ సందర్భంలో, డేవిడ్ ప్రజా న్యాయం పట్ల తన నిబద్ధతను ప్రదర్శించాడు, తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే దానికి ప్రాధాన్యతనిచ్చాడు.

సౌలు మరియు జోనాథన్ కోసం దావీదు విలపించడం. (17-27)
"విల్లు" అని అర్ధం కాషెత్, ఈ దుఃఖకరమైన అంత్యక్రియల పాట యొక్క శీర్షిక కావచ్చు. ఈ పాటలో, దావీదు సౌలులో లేని లక్షణాల గురించి ప్రశంసించలేదు లేదా సౌలు యొక్క భక్తి లేదా మంచితనం గురించి ప్రస్తావించలేదు. బదులుగా, జోనాథన్ మరియు సౌలు మధ్య ఉన్న బలమైన బంధంపై దృష్టి కేంద్రీకరించబడింది, ఒక విధేయుడైన కొడుకు మరియు ఆప్యాయతగల తండ్రిగా ఒకరి పట్ల ఒకరికి ఉన్న లోతైన ఆప్యాయతను హైలైట్ చేస్తుంది. అతని పట్ల జోనాథన్ ప్రేమ అసాధారణమైనదని డేవిడ్ అంగీకరించాడు, ఇది క్రీస్తు మరియు అతని ప్రజల మధ్య ఉన్న విశేషమైన ప్రేమను పోలి ఉంటుంది, ఇది గాఢమైన స్నేహాలను ఏర్పరుస్తుంది.
నిజమైన విశ్వాసులు ఎల్లప్పుడూ ప్రభువు ప్రజలు ఎదుర్కొనే కష్టాలను మరియు ఆయన శత్రువుల విజయాలను బట్టి బాధపడతారు, ఆ పరిస్థితుల ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందినప్పటికీ. ఈ పాట బహుశా ఈ భావాన్ని ప్రతిబింబిస్తుంది, దేవుడిని అనుసరించే వారి యొక్క శాశ్వతమైన దుఃఖాన్ని మరియు ఆందోళనను నొక్కి చెబుతుంది.



Shortcut Links
2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |