Samuel II - 2 సమూయేలు 11 | View All

1. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతనివారిని ఇశ్రా యేలీయులనందరిని పంపగా వారు అమ్మోనీయులను సంహ రించి రబ్బా పట్టణమును ముట్టడివేసిరి; అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను.

“జెరుసలం”– సైన్యంతో కూడా వెళ్ళనందువల్ల దావీదు పరీక్షలో, ఘోర పాపంలో పడ్డాడు. బైబిలు దేవుని ప్రజల పాపాలనూ పతనాలనూ దాచిపెట్టక ఉన్నవి ఉన్నట్టుగా చెప్తుందన్న సత్యాన్ని ఈ అధ్యాయంలో మళ్ళీ చూస్తాం. ఆదికాండము 9:21; ఆదికాండము 12:13; ఆదికాండము 27:18-26; నిర్గమకాండము 32:2-4; సంఖ్యాకాండము 20:12; మత్తయి 26:69-75 పోల్చి చూడండి. దావీదు చేసిన ఈ పాపం నుంచి మనం ఇది నేర్చుకోవచ్చు – గొప్ప విశ్వాస వీరులు కూడా అతి హీనమైన స్థితికి దిగజారే అవకాశం ఉంది. యథార్థమైన పశ్చాత్తాపం ఉంటే ఎంత నీచ పాపాన్నైనా దేవుడు క్షమిస్తాడని తరువాతి అధ్యాయం తెలుపుతున్నది. దేవుని భక్తులు చేసిన చెడ్డ క్రియలు మనం వాటిని అనుసరించాలని గాక, వాటికి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే బైబిల్లో రాయబడ్డాయని మనం గుర్తుంచుకోవాలి. 1 కోరింథీయులకు 10:1-13 చూడండి.

2. ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకువేళ దావీదు పడకమీదనుండి లేచి రాజనగరి మిద్దెమీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానముచేయు ఒక స్త్రీ కనబడెను.

“చూస్తూవుంటే”– యోబు 31:1 చూడండి. యోసేపు ప్రవర్తనతో దావీదు ప్రవర్తనను పోల్చి చూడండి. (ఆదికాండము 39:7-12). ఈ అధ్యాయంలో రాసి వున్న పాపాన్ని తరువాతి కాలంలో దావీదు ఆ దోషం తనదేనని సరైన విధంగా ఒప్పుకున్నాడు (కీర్తన 51 చూడండి). అయితే ఇందులో బత్‌షెబ ఎలాంటి సాకూ చెప్పడానికి వీలులేదు. ఆమె ఇంటి పెరడు దావీదు భవనం పైనుండి పూర్తిగా కనిపిస్తూ ఉన్నదన్న సంగతి ఆమెకు తెలిసే ఉండాలి. దావీదును ఈ విధంగా ఆమె కవ్వించిందని ఖచ్చితంగా ఎక్కడా రాసిలేదు గాని అతనితో వ్యభిచారం చేయకుండేలా ఎలాంటి ప్రయత్నమేమీ ఆమె చెయ్యలేదు (వ 4). పైగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అతణ్ణి పెళ్ళి చేసుకొంది (వ 27). దీనంతటిలో ఆమె దోషి కాకపోదు.

3. ఆమె బహు సౌందర్యవతియై యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలిసికొనుటకై యొక దూతను పంపెను, అతడు వచ్చిఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా

“ఊరియా”– ఇతడు ఎవరో అనామకుడైన సైనికుడు కాదు. దావీదు సైన్యంలోని 37 మంది గొప్ప యుద్ధవీరుల్లో ఒకడు (2 సమూయేలు 23:39). ఆ సమయంలోనే అమ్మోను వాళ్ళతో యుద్ధంలో ఉన్నాడు (వ 6,7) “భార్య”– బత్‌షెబ వేరొకరి భార్య అని తెలియగానే దావీదుకు ఆమెను మర్చిపోవడం ఒక్కటే మార్గం కావాలి. ఆమెపట్ల అతనికి కలిగిన కామ వికారం కూడా పాపమే (నిర్గమకాండము 20:17).

4. దావీదు దూతలచేత ఆమెనుపిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను; కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన యింటికి మరల వచ్చెను.

పురాతన కాలంలో దేవుణ్ణెరుగని రాజులకు పెద్ద పెద్ద రాణివాసాలుండేవి. తమకు నచ్చిన స్త్రీలను తెచ్చి ఉంచుకునే వారు. అయితే తన ప్రజల విషయంలో దేవుని ప్రమాణాలు, నియమాలు వేరుగా ఉన్నాయి (లేవీయకాండము 18:1-4). దావీదుకు ఇది తెలుసు. దేవుని ధర్మశాస్త్రం ప్రకారం దావీదు బత్‌షెబల పాపం చావుకు తగినది (లేవీయకాండము 20:10). కొత్త ఒడంబడికలో అలాంటి పాపాలు శాశ్వత నరకానికి తగినవని కనిపిస్తుంది – 1 కోరింథీయులకు 6:9-10; ప్రకటన గ్రంథం 21:8. “అశుద్ధత”– లేవీయకాండము 15:19-30.

5. ఆ స్త్రీ గర్భవతియైనేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా

త్వరలోనే ఊరియాకు ఆమె చేసిన పాపం తెలిసిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారాన్ని బత్‌షెబ దావీదుకే వదిలివేసింది.

6. దావీదు హిత్తీయుడగు ఊరియాను నాయొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను.

7. ఊరియా దావీదు నొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమ మును జనుల యోగక్షేమమును యుద్ధసమాచారమును అడి గెను.

8. తరువాత దావీదుఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవియ్యగా, ఊరియా రాజ నగరిలోనుండి బయలువెళ్లెను.

9. అతనివెనుక రాజు ఫలా హారము అతనియొద్దకు పంపించెను గాని ఊరియా తన యింటికి వెళ్లక తన యేలినవాని సేవకులతో కూడ రాజ నగరిద్వారమున పండుకొనెను.

10. ఊరియా తన యింటికి పోలేదను మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరి యాను పిలిపించినీవు ప్రయాణముచేసి వచ్చితివి గదా; యింటికి వెళ్లకపోతివేమని యడుగగా

11. ఊరియామందస మును ఇశ్రాయేలు వారును యూదావారును గుడారములలో నివసించుచుండగను, నా యధిపతియగు యోవా బును నా యేలినవాడవగు నీ సేవకులును బయట దండులో నుండగను, భోజనపానములు చేయుటకును నా భార్యయొద్ద పరుండుటకును నేను ఇంటికిపోదునా? నీ తోడు నీ ప్రాణముతోడు నేనాలాగు చేయువాడను కానని దావీదుతో అనెను.

ఊరియాకు తన కర్తవ్యం పట్ల ఉన్న శ్రద్ధ చూడండి. దావీదు ప్రవర్తనకు ఇది పూర్తిగా వేరుగా ఉంది. తన సాటి సైనికులు ప్రమాదకరమైన స్థితిలో సుఖానికి దూరమై ఉండగా తాను సుఖపడడం ఊరియాకు ఇష్టం లేదు.

12. దావీదునేడును నీ విక్కడ నుండుము, రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా ఊరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను.

13. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను; అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతని మత్తునిగా చేసెను; సాయంత్రమున అతడు బయలు వెళ్లి తన యింటికి పోక తన యేలినవాని సేవకుల మధ్య పడకమీద పండుకొనెను.

మద్యపానం వల్ల కలిగే మత్తు ఊరియాలోని బాధ్యతాభావాన్నీ తన సాటి సైనికులపట్ల ఉన్న సానుభూతినీ పలుచన చేస్తుందని దావీదు అనుకున్నాడు గాని అలా జరగలేదు.

14. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్నచోట ఊరియాను ముందుపెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్దనుండి వెళ్లి పొమ్మని

ఊరియా హత్యకు సంబంధించిన ఆజ్ఞలు ఊరియా చేతిమీదుగానే పంపాడు దావీదు. అది నిస్సందేహంగా హత్యే (2 సమూయేలు 12:9). యోవాబు స్వభావం మరి కొంత ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తున్నది. మరో హత్యకు పూనుకోవడానికి యోవాబుకు ఎలాంటి సంకోచమూ, అయిష్టత ఉండదని దావీదుకు నమ్మకమున్నట్టుంది. ఒక పాపం మరో పాపానికి ఎలా దారి తీస్తుందో, అది ఇతరులను కూడా ఏ విధంగా భాగస్థులుగా చేస్తుందో ఇక్కడ చూడవచ్చు. ఒక పాపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం సాధారణంగా అబద్ధాలకూ మోసానికీ, కొన్ని సార్లు మరింత హింసాత్మకమైన పాపానికీ దారి తీస్తుంది. దావీదు మొత్తంగా దేవుని మూడు ప్రాముఖ్యమైన ఆజ్ఞలను మీరాడు (నిర్గమకాండము 20:13-14 నిర్గమకాండము 20:17).

15. యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియాచేత పంపించెను.

16. యోవాబు పట్ట ణమును ముట్టడివేయు చుండగా, ధైర్యవంతులుండు స్థల మును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను.

17. ఆ పట్టణపువారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి, హిత్తీయుడగు ఊరియాయును హతమాయెను.

ఊరియాను వదిలించుకునేందుకు దావీదు అవలంబించిన విధానం అతడు తన సైన్యంలో ఇతరులనే చంపు కోవడానికి దారి తీసింది. పాపం ఒకసారి మొలకెత్తిందంటే దానికి అంతం ఎక్కడ!

18. కాబట్టి యోవాబు యుద్ధ సమాచార మంతయు దావీదునొద్దకు పంపి దూతతో ఇట్లనెను

19. యుద్ధసమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు కోపము తెచ్చుకొనియుద్ధము చేయునప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి?

20. గోడమీదనుండి వారు అంబులు వేయుదురని మీకు తెలి యక పోయెనా?

21. ఎరుబ్బెషెతు కుమారుడైన అబీమెలెకు ఏలాగు హతమాయెను? ఒక స్త్రీ తిరుగటిరాతి తునకఎత్తి గోడమీదనుండి అతని మీద వేసినందున అతడు తేబేసుదగ్గర హతమాయెను గదా? ప్రాకారముదగ్గరకు మీరెందుకు పోతిరని నిన్నడిగినయెడల నీవుతమరి సేవకు డగు ఊరియాయు హతమాయెనని చెప్పుమని బోధించి దూతను పంపెను.

“యెరుబెషెతు”– గిద్యోను. “తేబేసు”– న్యాయాధిపతులు 9:50-54. “ఊరియా”– తన సైనికుల మరణం వల్ల దావీదుకు కలిగే కోపమేదైనా ఊరియా మరణం గురించిన వార్తవల్ల ఆవిరై పోతుందని యోవాబుకు తెలుసు. అతడు ఇలా అనుకోవడం సరైనదేనని వ 25 చూపిస్తున్నది.

22. దూత పోయి యోవాబు పంపిన వర్తమానమంతయు దావీదునకు తెలియజేసెను.

23. ఎట్లనగా ఆ మనుష్యులు మమ్మును ఓడించుచు పొలములోనికి మాకెదురు రాగా మేము వారిని గుమ్మమువరకు వెంటాడి గెలిచితివిు.

24. అప్పుడు ప్రాకారముమీదనుండి విలుకాండ్రు తమ సేవకులమీద అంబులువేయగా రాజు సేవ కులలో కొందరు హతమైరి, తమరి సేవకుడైన హిత్తీయుడగు ఊరియాకూడ హతమాయెను.

25. అందుకు దావీదునీవు యోవాబుతో ఈ మాట చెప్పుముఆ సంగతినిబట్టి నీవు చింతపడకుము; ఖడ్గము ఒకప్పుడు ఒకనిమీదను ఒకప్పుడు మరియొకనిమీదను పడుట కద్దు; పట్టణముమీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టుమని చెప్పి, నీవు యోవాబును ధైర్యపరచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను.

26. ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హత మైన సంగతి విని తన భర్తకొరకు అంగలార్చెను.

27. అంగ లార్పుకాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య యయి అతనికొక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను.

ఎంత హడావుడీగా పెళ్ళి జరిగింది! బత్‌షెబ తన భర్త కోసం విలపించినది కేవలం ఇతరులు ఏమనుకుంటారో అని నటించడం కాకపోతే మరింకేం? వ 2 చూడండి. “అయితే” - ఒక మనిషి తనకిష్టం వచ్చినట్టు చేస్తే అది దేవునికి ఇష్టంగా ఉండదనీ, చివరికి విచారకరమైన ఫలితాలు కలుగుతాయని నిస్సందేహంగా నమ్మవచ్చు. దేవుడు దావీదును నియమించినది తన ప్రజలకు కాపరిగా ఉండాలనే (2 సమూయేలు 5:2; 2 సమూయేలు 7:8) గాని వారిని హత్య చేసి వారి భార్యల్ని దొంగిలించాలని కాదు.Shortcut Links
2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |