Samuel II - 2 సమూయేలు 13 | View All

1. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను నొక సుందరవతియగు సహోదరియుండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను.

1. And it came to pass after this, that Absalom the son of David had a beautiful sister, whose name was Tamar; and Amnon the son of David loved her.

2. తామారు కన్యయైనందున ఆమెకు ఏమి చేయవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారునుబట్టి చిక్కిపోయెను.

2. And Amnon was so vexed that he fell sick because of his sister Tamar; for she was a virgin; and it seemed hard to Amnon to do anything to her.

3. అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటముగలవాడు. అతడు

3. But Amnon had a companion, whose name was Jonadab, the son of Shimeah, David's brother; and Jonadab was a very subtle man.

4. రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా అమ్నోనునా తమ్ముడగు అబ్షాలోము సహోదరియైన తామారును నేను మోహించియున్నానని అతనితో అనెను.

4. And he said to him, Why, O son of the king, are you thus lean from day to day? Will you not tell me? And Amnon said to him, I love Tamar, my brother Absalom's sister.

5. యెహోనాదాబు­నీవు రోగివైనట్టువేషము వేసికొని నీ మంచముమీద పండుకొనియుండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు­నా చెల్లెలైన తామారుచేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడకమీద పండుకొనెను.

5. And Jonadab said to him, Lay down on your bed, and feign yourself sick: and when your father comes to see you, say to him, Let my sister Tamar come, I pray you, and give me bread to eat, and dress the food in my sight, that I may see it, and eat it from her hand.

6. అమ్నోను కాయిలాపడెనని రాజు అతని చూడ వచ్చినప్పుడు అమ్నోనునా చెల్లెలగు తామారు చేతి వంటకము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నాకొరకు రెండు అప్పములు చేయుటకు సెల విమ్మని రాజుతో మనవి చేయగా

6. So Amnon lay down, and feigned himself sick: and when the king came to see him, Amnon said to the king, Let my sister Tamar come, I pray you, and make me a couple of cakes in my sight, that I may eat from her hand.

7. దావీదునీ అన్నయగు అమ్నోను ఇంటికి పోయి అతనికొరకు భోజనము సిద్ధము చేయుమని తామారు ఇంటికి వర్తమానము పంపెను.

7. Then David sent home to Tamar, saying, Go now to your brother Amnon's house, and dress him food.

8. కాబట్టి తామారు తన అన్నయగు అమ్నోను ఇంటికి పోయెను.

8. So Tamar went to her brother Amnon's house; and he was laying down. And she took dough, and kneaded it, and made cakes in his sight, and baked the cakes.

9. అతడు పండుకొనియుండగా ఆమె పిండితీసికొని కలిపి అతని యెదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతడునాకు వద్దని చెప్పిఉన్నవారందరు నాయొద్ద నుండి అవతలకు పొండ నెను.

9. And she took the pan, and poured them out before him; but he refused to eat. And Amnon said, Send out all men from me. And they went out every man from him.

10. వారందరు బయటికి పోయిన తరువాత అమ్నోనునీచేతి వంటకము నేను భుజించునట్లు దానిని గదిలోనికి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పములను తీసికొని గదిలోపలనున్న తన అన్నయగు అమ్నోను నొద్దకు వచ్చెను.

10. And Amnon said to Tamar, Bring the food into the chamber, that I may eat from your hand. And Tamar took the cakes which she had made, and brought them into the chamber to Amnon her brother.

11. అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసికొనివచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొనినా చెల్లీ రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా

11. And when she had brought them near to him to eat, he took hold of her, and said to her, Come, lie with me, my sister.

12. ఆమెనా అన్నా, నన్ను అవమానపరచకుము; ఈలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు, ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు, నా యవమానము నేనెక్కడ దాచు కొందును?

12. And she answered him, No, my brother, do not force me; for no such thing ought to be done in Israel: don't do this folly.

13. నీవును ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడవగు దువు; అయితే ఇందునుగూర్చి రాజుతో మాటలాడుము;

13. And I, where shall I carry my shame? And as for you, you will be as one of the fools in Israel. Now therefore, I pray you, speak to the king; for he will not withhold me from you.

14. అతడు నన్ను నీకియ్యక పోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతముచేసి అవమానపరచి ఆమెతో శయనించెను.

14. Nevertheless he would not listen to her voice; but being stronger than she, he forced her, and lay with her.

15. అమ్నోను ఈలాగు చేసిన తరువాత ఆమెయెడల అత్యధికమైన ద్వేషము పుట్టి అదివరకు ఆమెను ప్రేమించినంతకంటె అతడు మరి యెక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా

15. Then Amnon hated her with exceedingly great hatred; for the hatred with which he hated her was greater than the love with which he had loved her. And Amnon said to her, Arise, go.

16. ఆమెనన్ను బయటకు తోసివేయుటవలన నాకు నీవిప్పుడు చేసిన కీడుకంటె మరి యెక్కువకీడు చేయకుమని చెప్పినను

16. And she said to him, Not so, because this great wrong in putting me forth is [worse] than the other that you did to me. But he would not listen to her.

17. అతడు ఆమె మాట వినక తన పని వారిలో ఒకని పిలిచిదీనిని నాయొద్దనుండి వెళ్లగొట్టి తలుపు గడియ వేయుమని చెప్పెను.

17. Then he called his servant that ministered to him, and said, Now put this woman out from me, and bolt the door after her.

18. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములుగల చీరలు ధరించువారు ఆమె యట్టి చీరయొకటి ధరించి యుండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్లగొట్టి మరల రాకుండునట్లు తలుపు గడియవేసెను.

18. And she had a garment of diverse colors on her; for with such robes were the king's daughters who were virgins appareled. Then his minister brought her out, and bolted the door after her.

19. అప్పుడు తామారు నెత్తిమీద బుగ్గిపోసికొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములుగల చీరను చింపి నెత్తి మీద చెయ్యిపెట్టుకొని యేడ్చుచు పోగా
మత్తయి 26:65

19. And Tamar put ashes on her head, and rent her garment of diverse colors that was on her; and she laid her hand on her head, and went her way, crying aloud as she went.

20. ఆమె అన్నయగు అబ్షాలోము ఆమెను చూచినీ అన్నయగు అమ్నోను నిన్ను కూడినాడు గదా? నా చెల్లీ నీవు ఊర కుండుము; అతడు నీ అన్నే గదా, యిందునుగూర్చి చింతపడవద్దనెను. కావున తామారు చెరుపబడినదై తన అన్నయగు అబ్షాలోము ఇంట నుండెను.

20. And Absalom her brother said to her, Has Amnon your brother been with you? But now hold your peace, my sister: he is your brother; don't take this thing to heart. So Tamar remained desolate in her brother Absalom's house.

21. ఈ సంగతి రాజగు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను.

21. But when King David heard of all these things, he was very angry, but he did not grieve the spirit of his son Amnon because he loved him, since he was his firstborn.

22. అబ్షాలోము తన అన్నయగు అమ్నోనుతో మంచి చెడ్డ లేమియు మాటలాడక ఊరకుండెను గాని, తన సహోదరియగు తామారును బలవంతము చేసి నందుకై అతనిమీద పగయుంచెను.

22. And Absalom spoke to Amnon neither good nor bad; for Absalom hated Amnon, because he had forced his sister Tamar.

23. రెండు సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొఱ్ఱెల బొచ్చు కత్తిరించుకాలము రాగా అబ్షాలోము రాజకుమారుల నందరిని విందునకు పిలిచెను.

23. And it came to pass after two full years, that Absalom had sheep-shearers in Baal-hazor, which is beside Ephraim: and Absalom invited all the king's sons.

24. అబ్షాలోము రాజునొద్దకు వచ్చిచిత్తగించుము, నీ దాసుడనైన నాకు గొఱ్ఱె బొచ్చు కత్తిరించు కాలము వచ్చెను; రాజవైన నీవును నీ సేవకులును విందునకు రావలెనని నీ దాసుడనైన నేను కోరుచున్నానని మనవి చేయగా

24. And Absalom came to the king, and said, Look now, your slave has sheep-shearers; let the king, I pray you, and his slaves go with your slave.

25. రాజునా కుమారుడా, మమ్మును పిలువవద్దు; మేము నీకు అధిక భారముగా ఉందుము; మేమందరము రాతగదని చెప్పినను అబ్షాలోము రాజును బలవంతము చేసెను.

25. And the king said to Absalom, No, my son, let's not all go, lest we be burdensome to you. And he pressed him: nevertheless he would not go, but blessed him.

26. అయితే దావీదు వెళ్ల నొల్లక అబ్షాలోమును దీవించి పంపగా అబ్షాలోమునీవు రాకపోయిన యెడల నా అన్నయగు అమ్నోను మాతోకూడ వచ్చునట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేసెను. అతడు నీయొద్దకు ఎందుకు రావలెనని రాజు అడుగగా

26. Then Absalom said, If not, I pray you, let my brother Amnon go with us. And the king said to him, Why should he go with you?

27. అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరును అతని యొద్దకు పోవచ్చు నని సెలవిచ్చెను.

27. But Absalom pressed him, and he sent with him Amnon and all the king's sons. And Absalom prepared a feast like a king's feast.

28. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసమువలన సంతోషియై యుండుట మీరు కనిపెట్టియుండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పు నప్పుడు భయపడక అతని చంపుడి, నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చి యున్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను.

28. And Absalom commanded his attendants, saying, Now watch+, when Amnon's heart is merry with wine; and when I say to you+, Strike Amnon, then kill him; don't be afraid; haven't I commanded you+? Be courageous, and be valiant.

29. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞచొప్పునవారు చేయగా రాజకుమారులందరును లేచి తమ కంచరగాడిదల నెక్కి పారిపోయిరి.

29. And the attendants of Absalom did to Amnon as Absalom had commanded. Then all the king's sons arose, and every man got up on his mule, and fled.

30. వారు మార్గములో ఉండగానే యొకడును లేకుండ రాజకుమారులను అందరిని అబ్షాలోము హతముచేసెనని దావీదునకు వార్త రాగా

30. And it came to pass, while they were in the way, that the news came to David, saying, Absalom has slain all the king's sons, and there is not one of them left.

31. అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడియుండెను; మరియు అతని సేవకులందరు వస్త్రములు చింపుకొని దగ్గర నిలువబడియుండిరి.

31. Then the king arose, and rent his garments, and lay on the earth; and all his slaves stood by with their clothes rent.

32. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచిరాజకుమారులైన ¸యవ నులనందరిని వారు చంపిరని నా యేలినవాడవగు నీవు తలంచవద్దు; అమ్నోను మాత్రమే మరణమాయెను; ఏల యనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిననాటనుండి అబ్షా లోము అతని చంపవలెనను తాత్పర్యముతో ఉండెనని అతని నోటి మాటనుబట్టి నిశ్చ యించుకొనవచ్చును.

32. And Jonadab, the son of Shimeah, David's brother, answered and said, Don't let my lord suppose that they have killed all the young men the king's sons; for Amnon only is dead; for by the appointment of Absalom this has been determined from the day that he forced his sister Tamar.

33. కాబట్టి నా యేలినవాడవగు నీవు రాజకుమారులందరును మరణమైరని తలచి విచారపడవద్దు; అమ్నోను మాత్రమే మరణమాయెననెను.

33. Now therefore don't let my lord the king take the thing to his heart, to think that all the king's sons are dead; for Amnon only is dead.

34. అబ్షాలోము ఇంతకు ముందు పారిపోయి యుండెను. కావలియున్న పని వాడు ఎదురుచూచుచున్నప్పుడు తన వెనుక కొండ ప్రక్కనున్న మార్గమున వచ్చుచున్న అనేక జనులు కనబడిరి.

34. But Absalom fled. And the young man who kept the watch lifted up his eyes, and looked, and saw that many people came upon the Horonaim road, from the mountain side on the slope, and the watchman came and informed the king; he said, I saw men from the Horonaim road, from the mountain side.

35. యెహోనాదాబు అదిగో రాజకుమారులు వచ్చియున్నారు; నీ దాసుడనైన నేను చెప్పిన ప్రకారము గానే ఆయెనని రాజుతో చెప్పెను.

35. And Jonadab said to the king, Look, the king's sons have come: as your slave said, so it is.

36. అతడు ఆమాటలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడ్వ సాగిరి, రాజును అతని సేవకులందరును దీనిని చూచి బహుగా ఏడ్చిరి.

36. And it came to pass, as soon as he had made an end of speaking, that, look, the king's sons came, and lifted up their voice, and wept: and the king also and all his slaves wept very intensely.

37. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గెషూరు రాజునొద్ద చేరెను. దావీదు అనుదినమును తన కుమారునికొరకు అంగలార్చుచుండెను.

37. But Absalom fled, and went to Talmai the son of Ammihur, king of Geshur. And [David] mourned for his son every day.

38. అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ మూడు సంవత్సరములున్న తరువాత

38. So Absalom fled, and went to Geshur, and was there three years.

39. రాజైన దావీదు అమ్నోను మరణమాయెననుకొని అతనినిగూర్చి యోదార్పు నొందినవాడై అబ్షాలోమును పట్టుకొనవలెనన్న ఆలోచన మానెను.

39. And the king's spirit longed to go forth to Absalom: for he was comforted concerning Amnon, seeing he was dead.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Samuel II - 2 సమూయేలు 13 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

తన సోదరికి అమ్నోను యొక్క హింస. (1-20) 
అప్పటి నుండి, దావీదు జీవితం కష్టాల పరంపరగా మారింది. వ్యభిచారం మరియు హత్య దావీదు యొక్క గతాన్ని మరక చేసాయి మరియు అదే పాపాలు అతని పిల్లలలో కనిపించాయి, అతని ప్రతీకారం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. బహుశా, తన పిల్లల పట్ల అతని మితిమీరిన తృప్తి ఈ శిక్షకు దోహదపడి ఉండవచ్చు. దావీదు తన సంతానం యొక్క పాపాలకు మరియు తన స్వంత దుష్ప్రవర్తనకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని చూడగలిగాడు, అతని శిక్ష యొక్క బాధను తీవ్రతరం చేశాడు. మనల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించే వారి నుండి దయను ఎప్పటికీ ఊహించకూడదని ఇది ఒక హెచ్చరిక పాఠంగా పనిచేస్తుంది. చిన్న పాపం చేయడం కంటే తీవ్రమైన అన్యాయాన్ని భరించడం ఎల్లప్పుడూ మంచిది.

అబ్షాలోము తన సోదరుడు అమ్మోనును చంపాడు. (21-29) 
అబ్షాలోము చేసిన పాపం యొక్క అధ్వాన్నమైన పరిణామాలను గమనించండి: అమ్మోనును చంపడానికి అతను పన్నాగం పన్నాడు, ఈ లోకం నుండి ఎవ్వరూ నిష్క్రమించడానికి తగని చర్య. అతను ఈ పాపపు పనిలో తన సేవకులను చేర్చుకున్నాడు. దేవుని ఆజ్ఞలను ధిక్కరిస్తూ దుష్ట యజమానులకు విధేయత చూపుతూ, అలాంటి సేవకులు పేలవంగా బోధించబడతారు. మితిమీరిన భోగములకు లోనైన పిల్లలు తరచూ తమ దైవభక్తిగల తల్లిదండ్రులకు భారంగా మారతారు, వారి తప్పుదారి పట్టించే ఆప్యాయత వారు దేవుని పట్ల తమ కర్తవ్యాన్ని విస్మరించేలా చేస్తుంది.

దావీదు యొక్క దుఃఖం, అబ్షాలోము గెషూరుకు పారిపోతాడు. (30-39)
జోనాదాబ్ అమ్నోను మరణానికి సమానమైన నేరాన్ని భరించాడు, అతని పాపపు చర్యలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ రకమైన తప్పుడు స్నేహితులు చెడు పనులలో నిమగ్నమవ్వమని మాకు సలహా ఇచ్చినప్పుడు వారి అసలు రంగును బహిర్గతం చేస్తారు. అబ్షాలోము దారుణంగా హత్య చేసినప్పటికీ, దావీదు యొక్క భావోద్వేగాలు కాలక్రమేణా మారిపోయాయి మరియు అతను అతన్ని చూడాలని ఆరాటపడటం ప్రారంభించాడు. దావీదు పాత్ర యొక్క ఈ అంశం ఒక బలహీనతను చూపింది: దేవుడు అతని హృదయంలో ఏదో ఒకటి గ్రహించాడు, అది అతనిని వేరు చేసింది, లేకుంటే, అతను ఎలీ వలె, దేవుని కంటే తన కుమారులకు ప్రాధాన్యత ఇచ్చాడని మనం భావించి ఉండవచ్చు.



Shortcut Links
2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |