విజయం సాధించిన తన సైన్యానికి ముందుగా దావీదు జెరుసలంకు వెంటనే వెళ్ళిపోలేదు. అబ్షాలోం తిరుగుబాటు ఇస్రాయేల్వారిలో చీలికలకు కారణమైంది. దావీదు తాను తిరిగి రాకముందు ప్రజల ఆమోదం, రాజభక్తిని, నమ్మకాలను పొందాలని కోరుతున్నాడు. తిరుగుబాటు ఆరంభమైంది యూదా జాతిలో, గనుక ముందు వారికే కబురు పంపాడు. దావీదు తమకు చేసినదంతా ప్రజలు జ్ఞాపకం చేసుకున్నారు. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. కీడు జరిగిపోయింది.