బహుభార్యత్వం గురించి ఆదికాండము 30:1 నోట్స్ చూడండి. హెబ్రోనులో దావీదుకు పుట్టిన ఆరుగురి కొడుకుల్లో ఒక్కడికీ కూడా తనకున్న సామర్థ్యం, సుగుణాలు లేవు. వీరిలో కనీసం ముగ్గురు – అమ్నోను, అబ్‌షాలోం, అదోనీయా – స్వార్థపరులు, కుట్రలు పన్నేవాళ్ళు (13–18 అధ్యాయాలు; 1 రాజులు 1,2 అధ్యాయాలు).