Kings I - 1 రాజులు 1 | View All

1. రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్నిబట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగక యుండెను.

1. And wha kinge Dauid was olde & well strycke in age, he coulde not be warme, though he was couered with clothes.

2. కాబట్టి వారుమా యేలినవాడవును రాజవునగు నీకొరకు తగిన చిన్నదాని వెదకుట మంచిది; ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనునని చెప్పి

2. Then sayde his seruauntes vnto him: Let vs seke a yonge damsell a virgin for oure lorde the kynge, to stonde before the kynge, and to norish him, & to slepe in his armes, and to warme oure lorde the kynge.

3. ఇశ్రా యేలీయుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెదకి, అబీషగు అను షూనేమీయురాలిని చూచి రాజునొద్దకు తీసికొని వచ్చిరి.

3. And they sought a fayre dasell, in all the coastes of Israel, and founde Abisag of Sunem, and brought her vnto ye kynge.

4. ఈ చిన్నది బహు చక్కనిదై యుండి రాజును ఆదరించి ఉపచారము చేయు చుండెను గాని రాజు దానిని కూడలేదు.

4. And she was a very fayre damsell, and noryshed ye kynge, and serued him. Howbeit the kynge knewe her not.

5. హగ్గీతు కుమారుడైన అదోనీయా గర్వించిన వాడైనేనే రాజు నగుదునని అనుకొని, రథములను గుఱ్ఱపు రౌతులను తనకు ముందుగా పరుగెత్తుటకు ఏబదిమంది మనుష్యులను ఏర్ప రచుకొనెను.

5. Adonias ye sonne of Hagith lifte vp him selfe and sayde: I wyl be kynge. And he prepared him charettes and horsmen, and fyftie men to be renners on fote before him.

6. అతని తండ్రినీవు ఈలాగున ఏల చేయు చున్నావని అతనిచేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌంద ర్యము గలవాడు, అబ్షాలోము తరువాత పుట్టినవాడు.

6. And his father reproued hi not therfore, so moch as to saye: Wherfore doest thou so? And he was a man of a very fayre bewtye and he had begotten him nexte after Absalo.

7. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోను యాజకుడైన అబ్యాతారుతోను ఆలోచన చేయగా వారు అదోనీయా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి గాని

7. And his matter stode by Ioab ye sonne of Zeru Ia and by Abiathar the prest, which helped Adonias.

8. యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాయును ప్రవక్తయైన నాతానును షిమీయును రేయీయును దావీదుయొక్క శూరులును అదోనీయాతో కలిసికొనక యుండిరి.

8. But Sadoc the prest, and Benaia the sonne of Ioiada, and Nathan the prest and Semei and Rei, and Dauids Worthies were not with Adonias.

9. అదోనీయా ఏన్‌రోగేలు సమీప మందుండు జోహెలేతు అను బండదగ్గర గొఱ్ఱెలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి, రాజకుమారు లగు తన సహోదరులనందరిని యూదావారగు రాజు యొక్క సేవకులనందరిని పిలిపించెను గాని

9. And wha Adonias offred shepe and oxe, and fat catell besyde the stone of Soheleth, which lyeth by the well of Rogel, he called all his brethre the kynges sonnes, and all the men of Iuda the kynges seruautes.

10. ప్రవక్తయగు నాతానును బెనాయనును దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలువలేదు.

10. But the prophet Nathan and Benaia, and the Worthies, and his brother Salomon called he not.

11. అప్పుడు నాతాను సొలొమోను తల్లియైన బత్షెబతో చెప్పిన దేమనగాహగ్గీతు కుమారుడైన అదోనీయా యేలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మనయేలినవాడైన దావీదునకు తెలియకయే యున్నది.

11. Then sayde Nathan vnto Bethseba Salomons mother: Hast thou not herde yt Adonias is kynge, and oure lorde Dauid knoweth not therof?

12. కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకొక ఆలోచన చెప్పెదను వినుము.

12. Come now therfore, I wyll geue the councell, that thou mayest delyuer thy soule and the soule of thy sonne Salomon.

13. నీవు రాజైన దావీదునొద్దకు పోయినా యేలినవాడా, రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చితివే; అదోనీయా యేలుచుండుట యేమని అడుగవలెను.

13. Come now and go in to kinge Dauid and saye vnto him: Hast not thou my lorde the kynge sworne and sayde vnto thy handmayden: Salomon thy sonne shall be kynge after me, and he shall sytt vpon my seate? Why is then Adonias made kynge?

14. రాజుతో నీవు మాటలాడుచుండగా నేను నీవెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరచుదునని చెప్పెను.

14. Beholde, while thou art yet there, and talkest with the kynge, I wyll come in after the, and tell forth thy tayle.

15. కాబట్టి బత్షెబ గదిలోనున్న రాజునొద్దకు వచ్చెను. రాజు బహు వృద్ధుడైనందున షూనేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టు చుండెను.

15. And Bethseba wente in to the kynge to ye chamber. And the kynge was very olde. And Abisag of Sunem serued the kynge.

16. బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజునీ కోరిక ఏమని అడిగి నందుకు ఆమె యీలాగు మనవి చేసెను

16. And Bethseba bowed hirselfe, and worshipped the kynge.The kynge sayde: What wilt thou?

17. నా యేలిన వాడా, నీవు నీ దేవుడైన యెహోవాతోడని నీ సేవకు రాలనైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారు డైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే,

17. She sayde vnto him: My lorde, Thou hast sworne vnto thy handmayde by the LORDE thy God: Thy sonne Salomon shall be kynge after me and syt vpon my seate.

18. ఇప్పుడైతే అదోనీయా యేలుచున్నాడు. ఈ సంగతి నా యేలినవాడవును రాజవునగు నీకు తెలియకయే యున్నది.

18. But now lo, Adonias is kynge, and my lorde the kynge knoweth it not.

19. అతడు ఎడ్లను క్రొవ్విన దూడలను గొఱ్ఱెలను బలిగా అర్పించి రాజ కుమారులనందరిని యాజకుడైన అబ్యాతారును సైన్యాధి పతియైన యోవాబును పిలిపించెను గాని నీ సేవకుడైన సొలొమోనును పిలువలేదు.

19. He hath offred oxen and fat catell, and many shepe, and hath called all the kynges sonnes, and Abiathar the prest, and Ioab the chefe captayne. But thy seruaunt Salomon hath he not bydden.

20. నా యేలినవాడవైన రాజా, నా యేలినవాడవైన రాజవగు నీ తరువాత సింహాసనము మీద ఎవడు ఆసీనుడగునో అందునుగూర్చి ఇశ్రాయేలీయు లందరును కనిపెట్టియున్నారు.

20. Neuertheles thou my lorde art kynge, the eyes of all Israel loke vnto the., that thou shuldest shewe them who shall syt vpon the seate of my lorde the kynge after the.

21. ఇదిగాక నా యేలినవాడ వైన రాజవగు నీవు నీ పితరులతోకూడ నిద్రపొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలొమోనును అప రాధులముగా ఎంచబడుదుము.

21. And wha my lorde the kynge slepeth with his fathers then shal I and my sonne Salomon be fayne to be synners.

22. ఆమె రాజుతో మాట లాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతానును లోపలికిరాగాప్రవక్తయగు నాతాను వచ్చి యున్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి.

22. But whyle she yet spake to the kynge, the prophet Nathan came,

23. అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి

23. and she tolde ye kinge: beholde, there is the prophet Nathan. And whan he came in before the kynge, he worshipped the kynge vpon his face to the grounde,

24. నా యేలినవాడవైన రాజా, అదోనీయా నీ తరువాత ఏలువాడై నీ సింహాసనముమీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా?

24. and sayde My lorde O kynge, hast thou saide: Adonias shal be kinge after me, & syt vpo my seate?

25. ఏలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన యెడ్లను క్రొవ్విన దూడలను గొఱ్ఱెలను బలిగా అర్పించి రాజకుమారులనందరిని సైన్యాధిపతులను యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా వారు వాని సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచురాజైన అదోనీయా చిరంజీవి యగునుగాక అని పలుకుచున్నారు.

25. For he is gone downe this daye, and hath offred oxen, and fat catell, & hath called all the kynges sonnes, and the captaynes, and the prest Abiathar. And beholde, they eate and drynke before him, and saye: God saue the kynge Adonias.

26. అయితే నీ సేవకుడనైన నన్నును యాజకుడైన సాదోకును యెహో యాదా కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలొమోనును అతడు పిలిచినవాడు కాడు.

26. But me thy seruaunt, and Sadoc the prest, and Benaia the sonne of Ioiada, and thy seruaunt Salomon hath he not called.

27. నా యేలినవాడ వును రాజవునగు నీ తరువాత నీ సింహాసనముమీద ఎవడు ఆసీనుడై యుండునో అది నీ సేవకుడనైన నాతో చెప్పక యుందువా? ఈ కార్యము నా యేలినవాడవును రాజవు నగు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా? అని యడిగెను.

27. Hath my lorde the kynge commaunded this, and not certifyed his seruauntes who shall sytt vpon the seate of my lorde the kynge after him?

28. దావీదు బత్షెబను పిలువుమని సెలవియ్యగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడెను.

28. The kinge answered and saide: Call Bethseba vnto me. And she came in before the kinge. And whan she stode before the kynge,

29. అప్పుడు రాజు ప్రమాణ పూర్వకముగా చెప్పినదేమనగాసకలమైన ఉపద్రవములలోనుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు

29. the kynge sware and sayde: As truly as the LORDE lyueth (which hath delyuered my soule out of trouble,)

30. అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడగునని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసినదానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా

30. I wyl do vnto the this daye, euen as I sware vnto the by the LORDE the God of Israel, so that Salomon thy sonne shalbe kynge after me, and he shal sit pon my seate in my steade.

31. బత్షెబ సాగిల పడి రాజునకు నమస్కారము చేసినా యేలినవాడైన రాజగు దావీదు సదాకాలము బ్రదుకును గాక అనెను.

31. Then Bethseba bowed hir selfe with hir face to the grounde, and thanked the kynge and sayde: God saue my lorde kynge Dauid for euermore.

32. అప్పుడు రాజైన దావీదుయాజకుడైన సాదోకును ప్రవక్త యైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనా యాను నాయొద్దకు పిలువుమని సెలవియ్యగా వారు రాజు సన్నిధికి వచ్చిరి.

32. And the kynge sayde: Call me the prest Sadoc & the prophet Nathan, and Benaia the sonne of Ioiada.And whan they came in before the kynge,

33. అంతట రాజుమీరు మీ యేలిన వాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారు డైన సొలొమోనును నా కంచర గాడిదమీద ఎక్కించి గిహోనునకు తీసికొనిపోయి

33. the kynge sayde vnto them: Take youre lordes seruauntes with you, and set my sonne Salomon vpon my Mule, and cary him downe to Gihon:

34. యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును అక్కడ ఇశ్రాయేలీయులమీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసిరాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని ప్రకటన చేయవలెను.

34. and let Sadoc ye prest and the prophet Nathan, anoynte him there to be kynge ouer Israel, and blowe the trompe, and saye: God saue kynge Salomon,

35. ఇశ్రాయేలు వారిమీదను యూదావారిమీదను నేనతనిని అధికారిగా నియమించి యున్నాను గనుక పిమ్మట మీరు యెరూష లేమునకు అతని వెంటరాగా అతడు నా సింహాసనముమీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చెను.

35. and go ye vp after him: and whan he commeth, he shal syt vpo my seate, and be kynge in my steade: for I haue ordeyned him to be prynce ouer Israel and Iuda.

36. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజు నకు ప్రత్యుత్తరముగా ఇట్లనెనుఆలాగు జరుగును గాక, నా యేలినవాడవును రాజవునగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచును గాక.

36. Then answered Benaia the sonne of Ioiada vnto the kynge, & sayde: Amen. The LORDE God of my lorde the kynge saye thus also.

37. యెహోవా నా యేలిన వాడవును రాజవునగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలొమోనునకు తోడుగానుండి, నా యేలినవాడైన రాజగు దావీదుయొక్క రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను;

37. As the LORDE hath bene with my lorde the kynge, so be he with Salomon also, that his seate maye be greater then the seate of my lorde kynge Dauid.

38. కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయును కెరేతీయులును పెలేతీయు లును రాజైన దావీదు కంచరగాడిదమీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసికొని రాగా

38. Then wente they downe, the prest Sadoc and the prophet Nathan, and Benaia the sonne of Ioiada, and the Chrethians, & Plethians, & set Salomon vpon kynge Dauids Mule, & broughte him to Gihon.

39. యాజకుడైన సాదోకు గుడారములోనుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరునురాజైన సొలొమోను చిరంజీవియగునుగాక అని కేకలువేసిరి

39. And Sadoc the prest toke the oyle horne out of the Tabernacle, and anoynted Salomon. And they blewe the trompe: And all ye people sayde: God saue kynge Salomon.

40. మరియు ఆ జనులందరును అతని వెంబడివచ్చి పిల్లనగ్రోవులను ఊదుచు, వాటి నాదముచేత నేల బద్దలగునట్లు అత్యధిక ముగా సంతోషించిరి.

40. And all the people wente vp after him, and the people pyped with pypes, and was very ioyfull, so that the earth range at the noyse of them.

41. అదోనీయాయును అతడు పిలిచిన వారందరును విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను. యోవాబు బాకానాదము వినిపట్టణమునందు ఈ అల్లరి యేమని యడుగగా

41. And Adonias herde it, and all they whom he had called, which were wt him, and they had new eaten. And whan Ioab herde the noyse of the trompe, he sayde: What meaneth this noyse of the cite and this busynes?

42. యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనీయాలోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా

42. But whyle he yet spake, beholde, Ionathas the sonne of Abiathar ye prest came.And Adonias sayde: Come in, for thou art a valeaunt man, and bryngest good tydinges.

43. యోనాతాను అదోనీయాతో ఇట్లనెనునిజముగా మన యేలినవాడును రాజునగు దావీదు సొలొమోనును రాజుగా నియమించియున్నాడు.

43. Ionathas answered and sayde vnto Adonias: Alas, or lorde kynge Dauid hath made Salomon kynge,

44. రాజు యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనా యానును కెరేతీయులను పెలేతీయులను అతనితోకూడ పంపగా వారు రాజు కంచరగాడిదమీద అతని నూరే గించిరి;

44. and hath sent with him Sadoc the prest, and the propheth Nathan, and Benaia the sonne of Ioiada, and the Chrethians and Plethians, and they haue set him vpon the kynges Mule:

45. యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును గిహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి; అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చియున్నారు; అందువలన పట్టణము అల్లరి ఆయెను; మీకు వినబడిన ధ్వని యిదే.

45. and Sadoc ye prest with the prophet Nathan hath anoynted him kynge at Gihon, and from thece are they gone vp with ioye, that the cite range with all: that is the noyse that ye haue herde.

46. మరియసొలొమోను రాజ్యాసనముమీద ఆసీనుడై యున్నాడు;

46. Salomon also sytteth vpo the kynges seate,

47. అందుకై రాజు సేవకులు మన యేలినవాడును రాజునగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింప వచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటె సొలొమోనునకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును, నీ రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయును గాక అని చెప్పగా రాజు మంచముమీద సాగిలపడి నమ స్కారము చేసి యిట్లనెను

47. and the kynges seruauntes are gone in to wysh good lucke vnto ouer lorde kynge Dauid, and haue sayde: Thy God make Salomon a better name then thy name is, and make his seate greater then thy seate. And they haue wy?shed the kynge good lucke vpon the bed.

48. నేను సజీవినై యుండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనముమీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక అనెను.

48. Morouer ye kynge hath sayde thus: Praysed be ye LORDE God of Israel, which this daye hath made one to syt vpon my seate, that myne eyes haue sene it.

49. అందుకు అదోనీయా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ యిండ్లకు వెళ్లిపోయిరి.

49. Then were they afrayed, and gatt them vp all that were called by Adonias, and so they departed euery man his waye.

50. అదోనీయా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను.

50. But Adonias was afrayed of Salomon, and gat him vp, and wete his waye, & toke holde of ye hornes of ye altare.

51. అదోనీయా రాజైన సొలొ మోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనిరాజైన సొలొమోను తన సేవకుడనైన నన్ను కత్తిచేత చంపకుండ ఈ దినమున నాకు ప్రమాణము చేయవలెనని మనవి చేయుచున్నట్లు సొలొమోనునకు సమాచారము రాగా

51. And it was tolde Salomon: beholde, Adonias feareth kynge Salomo, & beholde, he taketh holde of the hornes of ye altare, & sayeth: Let kige Salomo sweare vnto me this daye, that he shall not slaye his seruaunt with the swerde.

52. సొలొమోను ఈలాగు సెలవిచ్చెను అతడు తన్ను యోగ్యునిగా అగుపరచుకొనిన యెడల అతని తల వెండ్రుకలలో ఒకటైనను క్రిందపడదు గాని అతనియందు దౌష్ట్యము కనబడిన యెడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి

52. Salomon sayde: Yf he wil be an honest man, there shall not one heer fall from him vpon the earth: but yf there be euell founde in him, he shall dye.

53. బలిపీఠమునొద్దనుండి అతని పిలువనంపించెను; అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా సొలొమోను అతనితోనీ యింటికి పొమ్మని సెలవిచ్చెను.

53. And kinge Salomo sent, and caused him to be fetched from the altare. And whan he came, he fell downe before kynge Salomon. But Salomon sayde vnto him: Go yi waye in to thy house.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Kings I - 1 రాజులు 1 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
దావీదు వయస్సు తగ్గుతోంది. (1-4) 
దావీదు అనారోగ్యంతో బాధపడుతుంటాడు. అతను ఇటీవలి తప్పుల కోసం మందలించబడ్డాడు మరియు అతని గత పోరాటాలు మరియు కష్టాల పరిణామాలను అనుభవిస్తున్నాడు.

అదోనీయా సింహాసనాన్ని ఆశించాడు. (5-10) 
శ్రద్ధ వహించే తల్లిదండ్రులు తమ సంపదను వారసత్వంగా పొందాలనే ఆసక్తితో వారి వికృత సంతానం కారణంగా తరచుగా విమర్శలను ఎదుర్కొంటారు. స్వయంకృషితో నడిచే వారు తమ మునుపటి మార్గంలోనే ఉంటారని ఎలాంటి ప్రాపంచిక జ్ఞానం, జీవిత అనుభవం లేదా నైతిక సమగ్రత హామీ ఇవ్వలేవు. అయితే, యోవాబు మరియు అబియాతార్‌లను తప్పుదారి పట్టించిన పద్ధతుల గురించి ఆలోచించడం నిజంగా కలవరపెడుతుంది.

దావీదు సొలొమోను రాజుగా చేస్తాడు. (11-31) 
బత్షెబాకు నాథన్ ఇచ్చిన సలహాను పరిశీలించండి. మీ స్వంత జీవితాన్ని మరియు మీ కొడుకు జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో మీకు మార్గదర్శకత్వం అందించడానికి నన్ను అనుమతించండి. ఈ రకమైన సలహా క్రీస్తు నామంలో క్రీస్తు పరిచారకులు అందించిన మార్గనిర్దేశంతో సమానంగా ఉంటుంది. మన కిరీటం ప్రకటన గ్రంథం 3:11ఎవరూ తీసుకోకుండా నిరోధించడానికి మాత్రమే కాకుండా, మన ఆత్మల మోక్షాన్ని నిర్ధారించడానికి కూడా ప్రతి ప్రయత్నం చేయమని వారు మనల్ని ప్రోత్సహిస్తున్నారు. సొలొమోను తన వారసుడిగా ఉండాలనే తన మునుపటి నిర్ణయానికి దావీదు తన అచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటించాడు. వృద్ధాప్యం మరియు మరణం యొక్క సామీప్యత యొక్క ప్రభావాలను ఎదుర్కొన్నప్పటికీ, ప్రభువు అతనిని రక్షించిన పరీక్షల గురించి ఆలోచిస్తూ, అతని ఓదార్పును తీవ్రతరం చేశాడు, అతని ఆశలను పెంపొందించాడు మరియు అతని కర్తవ్య భావాన్ని ఉత్తేజపరిచాడు.

సొలొమోను రాజుగా అభిషేకించబడ్డాడు మరియు అదోనీయా స్వాధీనం ఆగిపోయింది. (32-53)
సొలొమోను యొక్క ఔన్నత్యంలో ప్రజలు అపారమైన ఆనందం మరియు సంతృప్తిని ప్రదర్శించారు. ప్రతి భక్తుడైన ఇశ్రాయేలీయుడూ దావీదు కుమారుని ఆరోహణలో ఆనందాన్ని పొందుతాడు. దుష్ట సూత్రాలపై నిర్మించబడిన సంకీర్ణాలు స్వార్థం వారిని వేరే చోటికి నడిపించినప్పుడు వేగంగా విచ్ఛిన్నమవుతాయి. తప్పిదస్థులు శుభవార్త అందుకోవాలని ఎలా ఎదురుచూడగలరు? అదోనీయా సొలొమోనును పట్టించుకోలేదు కానీ త్వరలోనే అతనికి భయపడటం ప్రారంభించాడు. మేము ఇక్కడ సాక్ష్యమిస్తున్నాము, ప్రతిబింబం వలె, దావీదు కుమారుడు మరియు దేవుని కుమారుడైన యేసు, ఎన్ని వ్యతిరేకతలను ఎదుర్కొన్నప్పటికీ కీర్తి సింహాసనానికి ఎత్తబడ్డాడు. అతని రాజ్యం అతని తండ్రి దావీదు‌ను అధిగమిస్తుంది, దేవుని నిజమైన అనుచరుల మధ్య నిజమైన ఆనందాన్ని ప్రేరేపిస్తుంది. అతని మిషన్ యొక్క పురోగతి అతని శత్రువులను బాధిస్తుంది మరియు భయపెడుతుంది. బలిపీఠాల మూలలు, దైవభక్తి యొక్క బాహ్య ప్రదర్శనలు లేదా మతపరమైన భక్తికి సంబంధించిన వాదనలు అతని ఆధిపత్యాన్ని అంగీకరించడానికి మరియు అతని మోక్షాన్ని స్వీకరించడానికి నిరాకరించే వారికి ప్రయోజనం కలిగించవు. వారి సమర్పణ చిత్తశుద్ధి లేనిదే అయినా, వారు తిరుగులేని పరిణామాలను ఎదుర్కొంటారు.


Shortcut Links
1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |