Kings I - 1 రాజులు 12 | View All

1. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రా యేలీయులందరును షెకెమునకు రాగా రెహబాము షెకె మునకు పోయెను.

1. And Rehoboam went to Sichem: for all Israel were come to Sichem to make him king.

2. నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నొద్దనుండి పారి పోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను; యరొబాము ఇంక ఐగుప్తు లోనేయుండి ఆ సమాచారము వినెను.

2. And when Rehoboam the son of Nabat heard of it being yet in Egypt: for he fled to Egypt for fear of Salomon, and dwelt in Egypt.

3. జనులు అతని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలీయుల సమాజ మంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి.

3. And they sent and called him: and so Jeroboam and all the congregation of Israel came and spake unto Rehoboam saying:

4. నీ తండ్రి బరువైన కాడిని మామీద ఉంచెను; నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మామీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసినయెడల మేము నీకు సేవచేయుదుము.

4. thy father made our yoke grievous, but now make thou the grievous service of thy father and his sore yoke which he put upon us, lighter, and so we will serve thee.

5. అందుకు రాజుమీరు వెళ్లి మూడు దినములైన తరువాత నాయొద్దకు తిరిగి రండని సెలవియ్యగా జనులు వెళ్లిపోయిరి.

5. And he said unto them: depart yet for the space of three days, and then come again to me. And the people departed.

6. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రియైన సొలొమోను బ్రదికియున్నప్పుడు అతని సముఖమందు సేవచేసిన పెద్దలతో ఆలోచన చేసిఈ జనులకు ఏమి ప్రత్యుత్తరమిచ్చెదనని వారి నడుగగా

6. And king Rehoboam took counsel with the old men that stood before Salomon his father, while he yet lived, and said: what counsel give ye to answer this people withal?

7. వారుఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవచేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తర మిచ్చినయెడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి.

7. And they said unto him: If thou shalt be a servant unto this people this day and serve them and answer them and speak kind words to them: they will be thy servants for ever.

8. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి, తనతో కూడ పెరిగిన ¸యౌవనులను పిలిచి ఆలోచన నడిగి, వారికీలాగు ప్రశ్నవేసెను

8. But he left the counsel that the old men had given him, and counselled with the young men that were nourished up with him and had waited on him.

9. మామీద నీ తండ్రి యుంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన యీ జనులకు ప్రత్యుత్తరమిచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు?

9. And he said unto them: what counsel give ye, to answer this people withal which have communed with me saying: make the yoke which thy father did put upon us, lighter?

10. అప్పుడు అతనితో కూడ ఎదిగిన ఆ ¸యౌవనస్థులు ఈ ఆలోచన చెప్పిరినీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దానిని చులకనగా చేయవలెనని నీతో చెప్పుకొనిన యీ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇమ్మునా తండ్రి నడుముకంటె నా చిటికెన వ్రేలు పెద్దదిగా ఉండును.

10. And the young men that were brought up with him, answered him saying, this people that have said unto thee: thy father made our yoke heavy, make thou it us lighter: thus answer them. My little finger shall be weightier than my father's loins.

11. నా తండ్రి మీమీద బరువైన కాడిని పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంక బరువుగా చేయుదును; నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెనుసరే, నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును.

11. And now where my father put a grievous yoke upon you, I will make it heavier. For where my father corrected you with scourges, I will chastise you with scorpions.

12. మూడవ దినమందు నాయొద్దకు రండని రాజు నిర్ణయము చేసియున్నట్లు యరొబామును జనులందరును మూడవ దినమున రెహబాము నొద్దకు వచ్చిరి.

12. And when Jeroboam: and all the people were come to Rehoboam the third day, as the king appointed them, saying, come to me again this day three days:

13. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి ¸యౌవనులు చెప్పిన ఆలోచనచొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి యిట్లు ఆజ్ఞాపించెను

13. the king answered the people churlishly and left the advice that old men gave him:

14. నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును, నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను గాని నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును.

14. and spake to them after the counsel of the young men saying: My father made your yoke grievous, but I will make it grievouser. For where my father chastised you with whips, I will chastise you with scorpions.

15. జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపక పోయెను. షిలోనీయుడైన అహీయాద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలెనని యెహోవా ఈలాగున జరిగించెను.

15. And so the king hearkened not unto the people: for the turning away was of the LORD, to perform his saying, which the LORD said by Ahiah the Silonite unto Jeroboam the son of Nabat.

16. కాబట్టి ఇశ్రాయేలువారందరును రాజు తమ విన్నపమును వినలేదని తెలిసికొని రాజుకీలాగు ప్రత్యుత్తరమిచ్చిరిదావీదులో మాకు భాగమేది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు; ఇశ్రాయేలువారలారా, మీమీ గుడారములకు పోవుడి; దావీదు సంతతివారలారా, మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారములకు వెళ్లిపోయిరి.

16. And when all Israel saw that the king regarded them not, the people answered the king again saying: we have no part in David, nor inheritance in the son of Isai. To your tents therefore Israel, and now see to thine own house David. And so Israel departed unto their tents.

17. అయితే యూదా పట్ణణములలోనున్న ఇశ్రాయేలువారిని రెహబాము ఏలెను.

17. How be it over the children of Israel which dwelt in the city of Juda, did Rehoboam reign still.

18. తరువాత రాజైన రెహబాము వెట్టిపని వారిమీద అధికారి యైన అదోరామును పంపగా ఇశ్రాయేలువారందరును రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయెను, కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలెనని తన రథముమీద త్వరగా ఎక్కెను.

18. Then king Rehoboam sent Aduram the receiver of the tribute. And all Israel stoned him to death with stones. But king Rehoboam made speed and gat him up to his chariot and fled to Jerusalem.

19. ఈ ప్రకారము ఇశ్రాయేలువారు నేటివరకు జరుగుచున్నట్లు దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసిరి.

19. And so Israel departed from the house of David unto this day.

20. మరియు యరొబాము తిరిగి వచ్చెనని ఇశ్రాయేలు వారందరు విని, సమా జముగా కూడి, అతని పిలువనంపించి ఇశ్రాయేలువారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి; యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతివారిని వెంబడించినవా రెవరును లేకపోయిరి.

20. And when all Israel heard that Jeroboam was come again, they sent and called him unto the congregation and made him king over Israel: so there followed the house of David, but the tribe of Juda onely.

21. రెహబాము యెరూషలేమునకు వచ్చిన తరువాత ఇశ్రా యేలువారితో యుద్ధముచేసి, రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరల వచ్చునట్లు చేయుటకై యూదావారందరిలో నుండియు బెన్యామీను గోత్రీయులలోనుండియు యుద్ధ ప్రవీణులైన లక్షయెనుబది వేలమందిని పోగు చేసెను.

21. And when Rehoboam was come to Jerusalem, he gathered all the house of Juda and the tribe of Ben Jamin an hundredth and four score thousands of chosen men and good warriors, to fight against the house of Israel, and to bring the kingdom again to Rehoboam the son of Salomon.

22. అంతట దేవుని వాక్కు దైవజనుడగు షెమయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

22. Then came the word of the Lord(God) unto Semeiah the man of God saying:

23. నీవు సొలొమోను కుమారుడును యూదా రాజునైన రెహబాముతోను యూదావారందరితోను బెన్యామీనీయులందరితోను శేషించినవారందరితోను ఇట్లనుము

23. speak unto Rehoboam the son of Salomon king of Juda, and unto all the house of Juda and Benjamin, and the remnant of the people and say.

24. యెహోవా సెలవిచ్చునదేమనగాజరిగినది నావలననే జరిగెను; మీరు ఇశ్రాయేలువారగు మీ సహో దరులతో యుద్ధము చేయుటకు వెళ్లక, అందరును మీ యిండ్లకు తిరిగి పోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానినిబట్టి యుద్ధమునకు పోక నిలిచిరి.

24. Thus sayeth the LORD: go not nor yet fight against your brethren the children of Israel, but return every man to his house, for this doing is of the LORD. And they obeyed the word of the LORD and returned and departed according to the word of the LORD.

25. తరువాత యరొబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమను పట్టణము కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను.

25. Then Jeroboam built Sichem in mount Ephraim, and dwelt therein. And went from thence and built Phanuel.

26. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కి పోవుచుండినయెడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును; అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్ద మరల చేరుదురు; రాజ్యము మరల దావీదు సంతతివారిదగును అని

26. And Jeroboam thought in his heart: now might the kingdom return to the house of David again.

27. యరొ బాము తన హృదయమందు తలంచి

27. For if this people shall go up and do sacrifice in the house of the LORD at Jerusalem, then shall their hearts turn again unto their lord Rehoboam king of Juda. And so shall they kill me and go again to Rehoboam king of Juda.

28. ఆలోచనచేసి రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచియెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము;

28. Whereupon the king took counsel and made two calves of gold and said unto the people: ye shall not need to go any more to Jerusalem. Behold your gods(goddes) Israel which brought you out of the land of Egypt.

29. ఇశ్రా యేలువారలారా, ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పిం చిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఉంచెను.

29. And he put the one in Bethel and the other in Dan.

30. దానువరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుటవలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను.

30. And that doing was a cause of sin. And the people went before the one as far as Dan.

31. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి, లేవీయులు కాని సాధారణమైనవారిలో కొందరిని యాజకులుగా నియ మించెను.

31. And he made houses of hill altars, and made of the lowest of the people priests which were not of the sons of Levi.

32. మరియు యరొబాము యూదాదేశమందు జరుగు ఉత్సవమువంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు జరుప నిర్ణయించి, బలిపీఠముమీద బలులు అర్పించుచు వచ్చెను. ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించు చుండెను. మరియు తాను చేయించిన యున్నతమైన స్థలమునకు యాజకులను బేతేలునందుంచెను.

32. And Jeroboam made a feast the fifteenth day of the eighth month, like unto the feast that was in Juda, and offered on the altar. And so did he in Bethel, to offer unto the calves that he had made. And he put in Bethel the priests of the hillaltars, which he had made.

33. ఈ ప్రకా రము అతడు యోచించినదానినిబట్టి యెనిమిదవ మాసము పదునైదవ దినమందు బేతేలులో తాను చేయించిన బలి పీఠముమీద బలులు అర్పించుచు వచ్చెను; మరియు ఇశ్రా యేలువారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయు టకై తానే బలిపీఠము ఎక్కెను.

33. And he offered upon the altar which he had made in Bethel, the fifteenth day of the eighth month, which he had imagined of his own heart: and made a solempne feast unto the children of Israel, and went up to the altar to burn sacrifice.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Kings I - 1 రాజులు 12 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

రెహబాము చేరిక, ప్రజల విన్నపం, అతని కఠినమైన సమాధానం. (1-15) 
అతని తండ్రి విగ్రహారాధన మరియు దేవుని నుండి రెహబాముకు దూరమైనందుకు తెగలు తమ మనోవేదనలను తీసుకురాలేదు. ఆశ్చర్యకరంగా, వారిని ఎక్కువగా బాధపెట్టేది ఈ ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినది కాదు. పన్నుల భారం లేని సౌకర్యవంతమైన జీవితం పట్ల వారు ఎక్కువ ఆసక్తి చూపుతున్నందున మతపరమైన ఆందోళనల పట్ల వారి ఉదాసీనత స్పష్టంగా కనిపించింది. భిన్నాభిప్రాయాలను కలిగించే ధోరణి ఉన్నవారు ఎల్లప్పుడూ గుసగుసలాడుకోవడానికి ఏదైనా కనుగొంటారు.
ఇజ్రాయెల్ శాంతి, శ్రేయస్సు మరియు సంపదను అనుభవించిన లేఖనాలలో సొలొమోను పాలన యొక్క వృత్తాంతాన్ని పరిశీలిస్తే, అతనిపై వచ్చిన ఆరోపణలను నమ్మడం కష్టమవుతుంది. వారు ఎటువంటి సత్యాన్ని కలిగి ఉండరు లేదా చాలా అతిశయోక్తిగా ఉన్నారు. ప్రజల పట్ల రెహబాము స్పందించిన తీరు తన యవ్వన సహచరుల సలహాతో ప్రభావితమైంది. రెహబాము వినాశకరమైన పర్యవసానాలకు దారితీసే మనస్తత్వం వలె అహంకారం మరియు అణచివేయబడని అధికారం కోసం దాహంతో అంధులుగా ఉన్నారు. ఈ పరిస్థితి ద్వారా దేవుని ప్రణాళిక ఆవిష్కృతమైంది. అతను రెహబామును తన స్వంత మూర్ఖత్వానికి లొంగిపోయేలా అనుమతించాడు మరియు అతని రాజ్యం యొక్క ప్రశాంతతను కాపాడగలిగే అంతర్దృష్టులను నిరోధించాడు, చివరికి రాజ్య విభజనకు దారితీసింది. వ్యక్తుల యొక్క వివేకం లేని చర్యలు మరియు అతిక్రమణలను ఉపయోగించడంలో, దేవుడు తన తెలివైన మరియు న్యాయమైన ఉద్దేశాలను ముందుకు తీసుకువెళతాడు. రెహబాము వంటి తమ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునేవారు, మొండితనం మరియు వివేచన లేకపోవడం వల్ల తరచూ అలా చేస్తారు.

పది తెగల తిరుగుబాటు. (16-24) 
దావీదు గురించి అగౌరవమైన మాటలు ప్రజల పెదవుల నుండి తప్పించుకుంటాయి. సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులు మరియు సమాజానికి వారి విలువైన సహకారం ఎంత త్వరగా మరుగున పడిపోవడం విశేషం. దీని గురించి ఆలోచించడం వల్ల ఎదురుదెబ్బలు మరియు ఇబ్బందులు ఎదురైనప్పుడు అంగీకారాన్ని కనుగొనడంలో సహాయపడాలి, ఇవి దేవునిచే నిర్దేశించబడినవి మరియు మన తోటి మానవుల ద్వారా అమలు చేయబడతాయని గుర్తించడం. ప్రతీకారం మన ఆలోచనలను ఆక్రమించకూడదు.
రెహబాము మరియు అతని ప్రజలు దైవిక సందేశాన్ని వినడానికి ఎంచుకున్నారు. మనం దేవుని ఉద్దేశాలను అర్థం చేసుకున్నప్పుడు, అది మన స్వంత కోరికల నుండి ఎంతగా విభేదిస్తున్నప్పటికీ, సమర్పించడం చాలా ముఖ్యమైనది. దేవుని అనుగ్రహాన్ని కాపాడుకోవడం వల్ల విశ్వం మొత్తం నుండి మనకు హాని కలుగదు.

యరొబాము విగ్రహారాధన. (25-33)
యరొబాము దేవుని ప్రొవిడెన్స్‌లో విశ్వాసం లేకపోవడాన్ని ప్రదర్శించాడు; అతను తన స్వంత భద్రతను నిర్ధారించుకోవడానికి పాపాత్మకమైన పద్ధతులను కూడా రూపొందించాడు. దేవుని నుండి మన వ్యత్యాసాలన్నింటిలో ప్రధానమైనది అతని అనంతమైన సమృద్ధిపై ఆచరణాత్మక అవిశ్వాసం. అతను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా కోసం తన ఆరాధనను ఉద్దేశించి ఉండవచ్చు, అది దైవిక చట్టానికి విరుద్ధంగా ఉంది మరియు అతనిని ఆ విధంగా చిత్రీకరించడం దైవిక మహిమను కించపరిచింది. బాల్‌ను ఆరాధించమని నేరుగా అడగడం కంటే ప్రతిమ ద్వారా ఇశ్రాయేలు దేవుడిని ఆరాధించడం తక్కువ అభ్యంతరకరమని ప్రజలు భావించి ఉండవచ్చు, అయినప్పటికీ అది చివరికి విగ్రహారాధనకు మార్గం సుగమం చేసింది. దయగల ప్రభూ, నీ ఆలయాన్ని, శాసనాలను, ప్రార్థనా మందిరాన్ని మరియు విశ్రాంతి దినాలను భక్తిపూర్వకంగా నిర్వహించడానికి మాకు దయను ఇవ్వండి. యరోబాములాగా మనం ఇంకెప్పుడూ అసహ్యకరమైన విగ్రహాన్ని మన హృదయాల్లో నాటుకోనివ్వకూడదు. నీవు మా అత్యంత నిధివి; కీర్తి నిరీక్షణగా మన హృదయాలలో పాలన మరియు పాలన.



Shortcut Links
1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |