Kings I - 1 రాజులు 15 | View All

1. నెబాతు కుమారుడును రాజునైన యరొబాము ఏలు బడిలో పదునెనిమిదవ సంవత్సరమున అబీయాము యూదా వారిని ఏలనారంభించెను.

“మూడేళ్ళు”– ఇస్రాయేల్, యూదాలను పరిపాలించిన రాజుల్లో చాలామంది చరిత్రపై ఎలాంటి ప్రభావమూ చూపలేదు. వారి పరిపాలనా కాలాలు కూడా స్వల్పమే.

2. అతడు మూడు సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను; అతని తల్లి పేరు మయకా; ఆమె అబీషాలోము కుమార్తె.

3. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాపమార్గములన్నిటిలో నడిచెను; తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవాయెడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు.

“తండ్రి”– 1 రాజులు 14:21-24; 2 దినవృత్తాంతములు 12:1. “అనుసరించేవాడు కాడు”– అతని అనేక పాపాలకు మూల కారణం ఇదే.

4. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నియు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచు కొనుచు, యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయ మందును తప్పిపోకుండెను గనుక

“హిత్తీవాడైన”– 2 సమూయేలు 11:2-4 2 సమూయేలు 11:14-17; 2 సమూయేలు 12:9-10; 1 రాజులు 9:4; 2 సమూయేలు 14:8. అంటే దావీదు బత్‌షెబతో వ్యభిచారం, ఊరియా హత్య తప్పించి మరేమీ పాపాలు చెయ్యలేదనా? ఎంతమాత్రం కాదు. ఉదాహరణకు ఇస్రాయేల్ జనసంఖ్య చూడడం పాపం. అది శిక్షను తెచ్చి పెట్టింది గదా (2 సమూయేలు 24:1 2 సమూయేలు 24:10). అయితే దావీదు దేవుని హృదయానికి అనుగుణమైన వ్యక్తి (1 సమూయేలు 13:14). దేవుణ్ణి మనస్ఫూర్తిగా వెదికి జీవిత కాలమంతా ఆయన సంకల్పాన్ని జరిగించాలని ప్రయత్నించాడు. అందులో తప్పిపోయినప్పుడు అతడు పశ్చాత్తాపపడి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఊరియా, బత్‌షెబల విషయంలో మాత్రమే అలా చెయ్యలేదు. పశ్చాత్తాపం లేకుండా అనేక నెలలు గడిచిపోయాయి. దేవుడు అతణ్ణి గద్దించడానికి నాతానును పంపించవలసి వచ్చింది (2 సమూయేలు 12:1 2 సమూయేలు 12:7).

5. దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును, యెరూష లేమును స్థిరపరచుటకును, అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండ నిచ్చెను.

“దీపం”– 1 రాజులు 11:36.

6. రెహబాము బ్రదికిన దినములన్నియు అతనికిని యరొబామునకును యుద్ధము జరుగుచుండెను.

1 రాజులు 14:30.

7. అబీ యాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది. అబీయామునకును యరొబామునకును యుద్ధము కలిగి యుండెను.

“చరిత్ర గ్రంథంలో”– 1 రాజులు 14:19 నోట్ చూడండి. అబీయా గురించి మరింత సమాచారం 2 దినవృత్తాంతములు 13:2-22 లో ఉంది.

8. అబీయాము తన పితరులతో కూడ నిద్రించగా వారు దావీదు పురమందు అతనిని సమాధిచేసిరి; అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజాయెను.

“కన్ను మూసి”– 1 రాజులు 2:10 నోట్.

9. ఇశ్రాయేలువారికి రాజైన యరొబాము ఏలుబడియందు ఇరువదియవ సంవత్సరమున ఆసా యూదావారిని ఏల నారంభించెను.

10. అతడు నలువదియొక సంవత్సరములుయెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వపేరు మయకా, యీమె అబీషాలోము కుమార్తె.

11. ఆసా తన పితరుడైన దావీదువలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని

“ఆసా”– ఇతడు మంచి రాజు. దుర్మార్గులకు ఒక్కోసారి మంచి కొడుకులు పుట్టడం ఆశ్చర్యమే. ఆసా గురించి మరింత సమాచారం 2 దిన 15,16 అధ్యాయాల్లో ఉంది.

12. పురుషగాములను దేశములోనుండి వెళ్ల గొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటిని పడ గొట్టెను.

తన ఇంటి వారిలోని పాపం గురించి కూడా ఆసా చర్య తీసుకున్నాడు. దేవుని పట్ల విధేయత, మన సాక్ష్యం మొదలు కావలసింది ఇక్కడే. న్యాయాధిపతులు 6:24-27; యెహోషువ 24:15; ఆదికాండము 35:1-4 పోల్చి చూడండి. తరచుగా మన విఫలత కొట్టొచ్చినట్టు కనిపించేది కూడా ఈ విషయంలోనే – 1 సమూయేలు 8:1-5; 2 సమూయేలు 13:21 2 సమూయేలు 13:39; 1 రాజులు 1:6.

13. మరియు తన అవ్వ యైన మయకా అసహ్యమైన యొకదాని చేయించి, దేవతాస్తంభము ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును ఛిన్నాభిన్నములుగా కొట్టించి, కిద్రోను ఓరను దాని కాల్చివేసి ఆమె పట్టపుదేవికాకుండ ఆమెను తొలగించెను.

“స్థంభాన్ని”– అషేరా దేవిని సూచించే చెక్క ప్రతిమ కావచ్చు.

14. ఆసా తన దినములన్నియు హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను.

15. మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను, వెండియు బంగారమును ఉపకరణములను యెహోవా మందిరములోనికి తెప్పించెను.

16. వారు బ్రదికిన దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయె షాకును యుద్ధము జరుగుచుండెను.

ఇస్రాయేల్ రెండు భాగాలు కావడం ఆ రెండు రాజ్యాలకు కూడా అస్తమానం పెద్ద ఇబ్బందికి మూలకారణం అయింది.

17. ఇశ్రాయేలు రాజైన బయెషా యూదావారికి విరోధియై యుండి, యూదా రాజైన ఆసాయొద్దనుండి యెవరును రాకుండను అతని యొద్దకు ఎవరును పోకుండను, రామాపట్టణమును కట్టిం చెను.

“రమా”– జెరుసలంకు ఉత్తరంగా కేవలం 8 కి.మీ. దూరాన ఉన్న ఊరు.

18. కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగరుయొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకులచేతి కప్ప గించి, హెజ్యోనునకు పుట్టిన టబ్రిమ్మోను కుమారుడును దమస్కులో నివాసము చేయుచు అరామునకు రాజునైయున్న బెన్హదదుకు పంపి మనవి చేసినదేమనగా

19. నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగియున్నట్లు నీకును నాకును సంధి కలిగి యుండవలెను గనుక వెండి బంగార ములను నీకు కానుకగా పంపించుచున్నాను; నీవు వచ్చి ఇశ్రా యేలు రాజైన బయెషా నాయొద్దనుండి తిరిగిపోవునట్లు నీకును అతనికిని కలిగిన నిబంధనను తప్పింపవలెను.

“ఒడంబడిక”– తన శత్రువులనుండి భద్రత కోసం విగ్రహపూజ చేసే జనాన్ని ఆశ్రయించడం నిస్సందేహంగా ఆసా చేసిన పొరపాటే. అతని నమ్మకంలోని ఒక బలహీనతను ఇది బయట పెడుతున్నది. 2 దినవృత్తాంతములు 16:7 చూడండి. యెషయా 31:1 నోట్ కూడా చూడండి.

20. కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు పట్టణముల మీదికి పంపి ఈయోనును దానును ఆబేల్బేత్మయకాను కిన్నెరెతును నఫ్తాలీ దేశమును పట్టుకొని కొల్లపెట్టెను.

21. అది బయెషాకు వర్తమానము కాగా రామాపట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసము చేసెను.

“తిర్సా”– 1 రాజులు 15:17.

22. అప్పుడు రాజైన ఆసా యెవరును నిలిచిపోకుండ యూదాదేశపు వారందరు రావలెనని ప్రకటన చేయగా జనులు సమకూడి బయెషా కట్టించుచుండిన రామాపట్టణపు రాళ్లను కఱ్ఱలను ఎత్తికొని వచ్చిరి. రాజైన ఆసా వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించెను.

23. ఆసా చేసిన యితర కార్యములను గూర్చియు, అతని బలమంతటిని గూర్చియు, అతడు చేసిన సమస్తమునుగూర్చియు, అతడు కట్టించిన పట్టణములనుగూర్చియు యూదారాజుల వృత్తాం తముల గ్రంథమందు వ్రాయబడియున్నది. అతడు వృద్ధుడైన తరువాత అతని పాదములయందు రోగముపుట్టెను.

“చరిత్ర గ్రంథం”– 1 రాజులు 14:19. “జబ్బు పుట్టింది”– 2 దినవృత్తాంతములు 16:12-14.

24. అంతట ఆసా తన పితరులతోకూడ నిద్రించి, తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజాయెను.

“కన్ను మూసి”– 1 రాజులు 2:10 దగ్గర నోట్.

25. యరొబాము కుమారుడైన నాదాబు యూదారాజైన ఆసా యేలుబడిలో రెండవ సంవత్సరమందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలువారిని రెండు సంవత్సర ములు ఏలెను.

26. అతడు యెహోవా దృష్టికి కీడుచేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి, అతడు దేనిచేత ఇశ్రాయేలువారు పాపము చేయుటకై కారకుడాయెనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను.

1 రాజులు 12:28-33; 1 రాజులు 13:33-34.

27. ఇశ్శాఖారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడునైన బయెషా అతనిమీద కుట్రచేసెను. నాదాబును ఇశ్రాయేలు వారందరును ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయెషా అతని చంపెను.

1 రాజులు 14:9-10.

28. రాజైన ఆసాయేలుబడిలో మూడవ సంవత్సరమందు బయెషా అతని చంపి అతనికి మారుగా రాజాయెను.

29. తాను రాజు కాగానే ఇతడు యరొబాము సంతతి వారి నందరిని హతముచేసెను; ఎవనినైన యరొబామునకు సజీవు నిగా ఉండనియ్యక అందరిని నశింపజేసెను. తన సేవకుడైన షిలోనీయుడైన అహీయాద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగెను.

30. తాను చేసిన పాప ములచేత ఇశ్రాయేలువారు పాపముచేయుటకు కారకుడై యరొబాము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టింపగా ఈలాగున జరిగెను.

1 రాజులు 12:28-33.

31. నాదాబు చేసిన ఇతర కార్యములనుగూర్చియు, అతడు చేసినదాని నంతటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

32. వారి దినములన్నిటను ఆసా కును ఇశ్రాయేలు రాజైన బయెషాకును యుద్ధము జరుగు చుండెను.

33. యూదారాజైన ఆసా యేలుబడిలో మూడవ సంవ త్సరమందు అహీయా కుమారుడైన బయెషా తిర్సాయందు ఇశ్రాయేలువారినందరిని ఏలనారంభించి యిరువది నాలుగు సంవత్సరములు ఏలెను.

34. ఇతడు యెహోవా దృష్టికి కీడుచేసి యరొబాము దేనిచేత ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడాయెనో దానినంతటిని అనుసరించి ప్రవర్తించెను.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Kings I - 1 రాజులు 15 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యూదా రాజు అబీయాము దుష్ట పాలన. (1-8) 
అబీయాము హృదయం తన దేవుడైన యెహోవా ఎదుట స్థిరంగా ఉండలేదు. అతను మొదట్లో చిత్తశుద్ధిని అనుసరించాడు మరియు బాగా ప్రారంభించాడు, కానీ చివరికి దిగజారాడు మరియు భయంకరమైన పరిణామాలను చూసినప్పటికీ, అతని తండ్రి చేసిన పాపాలను స్వీకరించాడు. దీనికి విరుద్ధంగా, డేవిడ్ యొక్క వంశం జెరూసలేంలో ఆధ్యాత్మిక ప్రకాశానికి స్థిరమైన మూలంగా పనిచేసింది, ఇతర ప్రాంతాలలో దైవిక సత్యం మసకబారినప్పటికీ నిజమైన ఆరాధనను సమర్థించింది. దోహదపడాల్సిన వారు తమ అతిక్రమణలకు లొంగిపోయినట్లే, ప్రభువు తన ఉద్దేశ్యాన్ని నిలకడగా కాపాడుకున్నాడు.
దావీదు కుమారుడు తన చర్చికి ఒక వెలుగుగా ప్రకాశిస్తాడు, శాశ్వతత్వం అంతటా సత్యం మరియు నీతిలో దాని స్థాపనను నిర్ధారిస్తాడు. చట్టాన్ని నెరవేర్చడానికి రెండు విభిన్న రీతులు ఉన్నాయి: చట్టపరమైన విధానం అనేది వ్యక్తులు స్వతంత్రంగా చట్టంలోని అన్ని నిబంధనలను నెరవేర్చడం, ఇది క్రీస్తు ద్వారా మరియు పతనం ముందు ఆడమ్ ద్వారా మాత్రమే సాధించబడింది. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే సువార్త పద్ధతి, మన తరపున ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన క్రీస్తుపై విశ్వాసం ఉంచడం, అదే సమయంలో జీవితంలోని అన్ని అంశాలలో దేవుని ఆజ్ఞలకు కట్టుబడి ఉండేందుకు తీవ్రంగా కృషి చేయడం. ఈ భక్తిని దేవుడు బాగా గౌరవిస్తాడు, ముఖ్యంగా క్రీస్తుతో ఐక్యమైన వారిలో. ఈ విధంగా, డేవిడ్ మరియు ఇతరులు ఈ సువార్త దృక్పథం ద్వారా చట్టాన్ని నెరవేర్చిన ఘనత పొందారు.

యూదా రాజు ఆసా మంచి పాలన. (9-24) 
ఆసా ప్రభువు దృష్టిలో నీతిని సమర్థించాడు, అది దేవుని దృక్కోణంతో సరితూగేది, ఇది నిజంగా ప్రశంసనీయమైన వైఖరి. ఆసా కాలంలో, సంస్కరణల కాలం ఉద్భవించింది. అతను సంస్కరణ ప్రక్రియను ప్రారంభించి, చెడు ఉనికిని శ్రద్ధగా ప్రక్షాళన చేశాడు. ఈ విషయంలో అతను గణనీయమైన పనిని ఎదుర్కొన్నాడు. ఆసా తన ఆస్థానంలో విగ్రహారాధనను ఎదుర్కొన్నప్పుడు, తన స్వంత డొమైన్‌లో సంస్కరణలు ప్రారంభించాలని గుర్తించి, అతను దానిని అక్కడ నుండి శ్రద్ధగా నిర్మూలించాడు.
ఆసా తన తల్లి పట్ల గౌరవం మరియు గౌరవాన్ని ప్రదర్శించాడు, ఇది బలమైన ఆప్యాయతను సూచిస్తుంది, అయినప్పటికీ దేవుని పట్ల అతని ప్రేమ అందరినీ అధిగమించింది. అధికారం అప్పగించబడినవారు తమ అధికారాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు నెరవేర్పును పొందుతారు. తప్పులో నిమగ్నమై ఉండటమే కాకుండా సద్గుణాలను పెంపొందించుకోవడం కూడా చాలా అవసరం. అతిక్రమణ విగ్రహాలను విస్మరించడమే కాకుండా, దేవుని గౌరవం మరియు మహిమ కోసం మనల్ని మరియు మనకున్న సమస్తాన్ని పవిత్రం చేయడానికి మన అంకితభావం విస్తరించాలి.
దేవుని సేవ పట్ల ఆసా యొక్క భక్తి నిజమైనది మరియు అతని పాపాలు అహంకారం వల్ల సంభవించలేదు. ఏది ఏమైనప్పటికీ, బెన్హదాద్‌తో అతని పొత్తు విశ్వాసం లేకపోవడం వల్ల వచ్చింది. నిజాయితీగల విశ్వాసులు కూడా కొన్నిసార్లు ఆసన్నమైన ఆపద సమయంలో హృదయపూర్వకంగా ప్రభువుపై ఆధారపడటానికి కష్టపడతారు. ఈ విశ్వాసం లేకపోవడం ప్రాపంచిక వ్యూహాలకు మార్గం సుగమం చేస్తుంది, తదనంతరం అతిక్రమణల పరంపరకు దారి తీస్తుంది. అవిశ్వాసం తరచుగా క్రైస్తవులను తోటి విశ్వాసులతో వివాదాలలో ప్రభువు యొక్క విరోధుల నుండి సహాయం పొందేలా చేస్తుంది. దురదృష్టవశాత్తూ, ఒకప్పుడు ప్రకాశవంతంగా ప్రసరించిన కొంతమంది వ్యక్తులు తమ రోజులు ముగుస్తున్న కొద్దీ తమను తాము నిశ్చలమైన మేఘం కప్పివేసారు.

ఇజ్రాయెల్‌లో నాదాబ్ మరియు బాషాల దుష్ట పాలనలు. (25-34)
యూదాపై ఆసా యొక్క ఏకైక పాలన అంతటా, ఇజ్రాయెల్ నాయకత్వం ఆరు లేదా ఏడు వేర్వేరు వ్యక్తుల మధ్య మారింది. యరొబాము వంశం యొక్క పతనం దేవుని మాటలు ఎన్నటికీ వ్యర్థం కాదనే విషయాన్ని పూర్తిగా గుర్తుచేస్తుంది. దైవిక హెచ్చరికలు బెదిరింపులకు మించిన ప్రయోజనాన్ని అందిస్తాయి, ఎందుకంటే అనీతిమంతులు తరచుగా ఒకరిపై ఒకరు దేవుని న్యాయమైన తీర్పుల సాధనంగా మారతారు. ఘోరమైన అతిక్రమణల నేపథ్యం మరియు అస్తవ్యస్తమైన పరిస్థితుల మధ్య, ప్రభువు తన గొప్ప రూపకల్పనను ఆర్కెస్ట్రేట్ చేస్తూనే ఉన్నాడు. ఇది చివరికి పూర్తయిన తర్వాత, ఈ ప్రణాళికలో న్యాయం, జ్ఞానం, సత్యం మరియు దయ యొక్క అద్భుతమైన ప్రదర్శన శాశ్వతత్వం అంతటా ప్రశంసలు మరియు గౌరవాన్ని రేకెత్తిస్తుంది.



Shortcut Links
1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |