“అతడి పైబడు”– యోవాబు తిరుగుబాటు, హత్యల విషయంలో దోషి. ధర్మశాస్త్రం ప్రకారం ఇవి మరణానికి తగిన నేరాలు. దేవుని ఆరాధనా స్థలంలో ఆశ్రయం పొందేహక్కు అతనికి లేదు. ఎవరినైనా బుద్ధిపూర్వకంగా కాక ప్రమాదవశాత్తూ చంపినవారికే ఇలాంటి శరణు స్థలాలు. నిర్గమకాండము 21:12-17 చూడండి. దోషులైనవారు ఎప్పుడైనా సరే మతం ముసుగులో ఆశ్రయాన్నీ, క్షేమాన్ని పొందాలని ప్రయత్నిస్తే దానిలో ప్రయోజనం లేదు. దేవుడు అలాంటివారిని శిక్షించక మానడు. యెహెఙ్కేలు 9:1-6 చూడండి. నిజంగా పశ్చాత్తాప పడి నమ్మకం ఉంచినవారికే దేవునిలో అభయం ఉంది.