Kings I - 1 రాజులు 5 | View All

1. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందెనని విని తన సేవకులను సొలొమోనునొద్దకు పంపెను; ఏలయనగా హీరాము ఎప్పటికి దావీదుతో స్నేహముగా నుండెను.

1. And Hiram king of Tyre sent his servants to Solomon, because he heard that they had anointed him king in place of his father, for Hiram had loved David all his days.

2. హీరామునొద్దకు సొలొమోను ఈ వర్తమానము పంపెను.

2. And Solomon sent to Hiram, saying:

3. యెహోవా నా తండ్రియైన దావీదు శత్రువులను అతని పాదములక్రింద అణచు వరకు అన్నివైపులను యుద్ధములు అతనికి కలిగియుండెను.

3. You know how my father David could not build a house unto the name of Jehovah his God because of the wars that were around him on every side, until Jehovah had put them under the soles of his feet.

4. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలులేక పోయెనన్న సంగతి నీ వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండను అపాయమేమియు కలుగకుండను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి యున్నాడు.

4. But now Jehovah my God has given me rest all around; there is neither adversary nor evil occurrence.

5. కాబట్టినీ సింహాసనముమీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి యైన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవు డైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై యున్నాను.

5. And behold, I am intending to build a house unto the name of Jehovah my God, as Jehovah has spoken to my father David, saying, Your son, whom I will set on your throne in your place, he shall build the house unto My name.

6. లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము; నా సేవకులును నీ సేవకులును కలిసి పని చేయుదురు; మ్రానులను నరుకుట యందు సీదోనీయులకు సాటియైనవారు మాలో ఎవరును లేరని నీకు తెలియును గనుక

6. Now therefore, command that they cut down cedars for me from Lebanon; and my servants will be with your servants, and I will pay you wages for your servants according to whatever you say. For you know that there is no one among us who knows how to cut timber like the Sidonians.

7. నీ యేర్పాటుచొప్పున నేను నీ సేవకుల జీతము నీకిచ్చెదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానముగల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి

7. And so it was, when Hiram heard the words of Solomon, that he rejoiced greatly and said, Blessed is Jehovah this day, for He has given David a wise son over this great people!

8. సొలొమోనునకు ఈ వర్తమానము పంపెనునీవు నాయొద్దకు పంపిన వర్త మానమును నేను అంగీకరించితిని; దేవదారు మ్రానులను గూర్చియు సరళపు మ్రానులనుగూర్చియు నీ కోరిక యంతటి ప్రకారము నేను చేయించెదను.

8. And Hiram sent to Solomon, saying: I have agreed to the things which you have sent me, and I will do all your desire concerning the cedar and cypress timber.

9. నా సేవకులు వాటిని లెబానోనునుండి సముద్రమునొద్దకు తెచ్చెదరు; అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రముమీద చేరునట్లు చేసి, అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును, నీవు వాటిని తీసికొందువు. ఇందునుగూర్చి నీవు నాకోరిక చొప్పున జరిగించి నా యింటివారి సంరక్షణకొరకు ఆహా రము ఇచ్చెదవు.

9. My servants shall bring them down from Lebanon to the sea; I will float them in rafts by sea to the place you direct me, and will have them broken apart there; then you can take them away. And you shall fulfill my desire by giving food for my household.

10. హీరాము సొలొమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రానులను సరళపు మ్రానులను పంపించగా

10. And Hiram gave Solomon cedar and cypress timber according to all his desire.

11. సొలొమోను హీరామునకును అతని యింటి వారి సంరక్షణకును ఆహారముగా రెండులక్షల తూముల గోధుమలను మూడు వేల ఎనిమిదివందల పళ్ల స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచువచ్చెను.
అపో. కార్యములు 12:20

11. And Solomon gave Hiram twenty thousand kors of wheat as food for his household, and twenty kors of beaten oil. Thus Solomon gave to Hiram year by year.

12. యెహోవా సొలొమోనునకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను; మరియహీరామును సొలొమోనును సంధిచేయగా వారిద్దరికి సమాధానము కలిగియుండెను.

12. Thus Jehovah gave Solomon wisdom, as He had promised him; and there was peace between Hiram and Solomon, and the two of them made an alliance together.

13. రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిచేతను వెట్టిపని చేయించెను; వారిలో ముప్పదివేలమంది వెట్టి పని చేయువారైరి,

13. And King Solomon raised up a labor force out of all Israel; and the labor force was thirty thousand men.

14. వీరిని అతడు వంతులచొప్పున నెలకు పది వేలమందిని లెబానోనునకు పంపించెను; ఒక నెల లెబా నోనులోను రెండు నెలలు ఇంటియొద్దను వారు ఉండిరి; ఆ వెట్టివారిమీద అదోనీరాము అధికారియై యుండెను.

14. And he sent them to Lebanon, ten thousand a month in shifts: they were one month in Lebanon and two months at home; and Adoniram was over the labor force.

15. మరియసొలొమోనునకు బరువులు మోయువారు డెబ్బది వేలమందియు పర్వతములందు మ్రానులు నరకువారు ఎను బది వేలమందియు నుండిరి.

15. And Solomon had seventy thousand carrying burdens, and eighty thousand hewing stone in the mountains,

16. వీరు కాక పనిమీదనున్న సొలొ మోను శిల్పకారులకు అధికారులు మూడువేల మూడువందలమంది; వీరు పనివారిమీద అధికారులై యుండిరి.

16. besides three thousand three hundred from the chiefs of Solomon's deputies, who ruled the people who did the work.

17. రాజు సెలవియ్యగా వారు మందిరముయొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి.

17. And the king commanded, and they quarried large stones, costly stones, and hewn stones, to lay the foundation of the house.

18. ఈలాగున సొలొమోను పంపినవారును గిబ్లీయులును, హీరాము శిల్పకారు లును మ్రానులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్లను సిద్ధపరచిరి.

18. Thus Solomon's builders, Hiram's builders, and the Giblites cut and prepared timber and stones to build the house.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Kings I - 1 రాజులు 5 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

హీరాముతో సొలొమోను ఒప్పందం. (1-9) 
ఆలయాన్ని నిర్మించడానికి సొలొమోను యొక్క నిర్మాణ ప్రణాళిక ఇక్కడ ఉంది. వ్యతిరేక శక్తి లేదు, సాతాను వంటి దుర్మార్గపు సంస్థ లేదు, దానిని అడ్డుకోవడం లేదా మళ్లించడం లక్ష్యంగా ఉంది. ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి సాతాను ప్రయత్నించినప్పటికీ, చెడు లేనప్పుడు మనం సద్గుణ ప్రయత్నాలను కొనసాగించడంలో సిద్ధంగా మరియు చురుకుగా ఉండాలి. దేవుని వాగ్దానాల హామీలు మన ప్రయత్నాలను ఉత్తేజపరుస్తాయి. అంతేకాకుండా, క్రీస్తు రాజ్యం యొక్క అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి మన బాహ్య ప్రతిభను మరియు ప్రయోజనాలను ఉపయోగించాలి. యెహెఙ్కేలు 27:17లో చూపినట్లుగా, టైరు ఇజ్రాయెల్‌కు చేతివృత్తులవారిని అందించినట్లే, ఇజ్రాయెల్ టైర్‌కు ధాన్యాన్ని సరఫరా చేయడం ద్వారా ప్రతిఫలంగా ఉంటుంది. ఈ పద్ధతిలో, ప్రావిడెన్స్ యొక్క చురుకైన ఏర్పాట్ల ద్వారా, దేశాలు పరస్పరం ఆధారపడతాయి మరియు పరస్పరం ప్రయోజనం పొందుతాయి, అన్నీ దేవుని మహిమ కోసం.

ఆలయానికి సొలొమోను పనివారు. (10-18)
ఆలయ నిర్మాణం ప్రధానంగా ఇజ్రాయెల్యేతరుల సంపద మరియు ప్రయత్నాలపై ఆధారపడింది, చర్చిలో వారి చేరికకు ప్రతీక. సొలొమోను ఆదేశాన్ని జారీ చేశాడు, పునాది నిర్మాణానికి విలువైన రాళ్ల సహకారం అందించడానికి దారితీసింది. అదేవిధంగా, క్రీస్తు, ఎంచుకున్న మరియు విలువైన మూలస్తంభం, పునాదిగా పనిచేస్తుంది. మన పునాదిని సురక్షితంగా స్థాపించడం మరియు ప్రజల దృష్టికి మించిన మన విశ్వాసం యొక్క అంశాలకు గణనీయమైన కృషిని అంకితం చేయడం చాలా కీలకం. అదృష్టవంతులు, సజీవ రాళ్లవలె, ఆత్మ ద్వారా దేవుని కోసం ఆధ్యాత్మిక నివాసంలోకి సమావేశమయ్యారు. మనలో, ప్రభువు మందిరాన్ని నిర్మించే పనిని ఎవరు చేపడతారు?



Shortcut Links
1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |