Kings I - 1 రాజులు 7 | View All

1. సొలొమోను పదుమూడు సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానినంతటిని ముగించెను.

1. solomonu padumoodu samvatsaramulu thana nagarunu kattinchuchundi daaninanthatini muginchenu.

2. మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను; దీని పొడుగు నూరు మూరలు, వెడల్పు ఏబది మూరలు, ఎత్తు ముప్పది మూరలు; నాలుగు వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడెను.

2. mariyu athadu lebaanonu aranyapu nagarunu kattinchenu; deeni podugu nooru mooralu, vedalpu ebadhi mooralu, etthu muppadhi mooralu; naalugu varusala dhevadaaru sthambhamula meeda dhevadaaru doolamulu veyabadenu.

3. మరియు నలు వదియైదు స్తంభములమీద ప్రక్కగదులపైన దేవదారు కఱ్ఱలతో అది కప్పబడెను; ఆ స్తంభములు వరుస వరుసకు పైగా పదునైదేసి చొప్పున మూడు వరుసలు ఉండెను.

3. mariyu nalu vadhiyaidu sthambhamulameeda prakkagadulapaina dhevadaaru karralathoo adhi kappabadenu; aa sthambhamulu varusa varusaku paigaa padunaidhesi choppuna moodu varusalu undenu.

4. మూడు వరుసల కిటికీలు ఉండెను; మూడు వరుసలలో కిటికీలు ఒక దాని కొకటి యెదురుగా ఉండెను.

4. moodu varusala kitikeelu undenu; moodu varusalalo kitikeelu oka daani kokati yedurugaa undenu.

5. తలు పులయొక్కయు కిటికీలయొక్కయు స్తంభములు చచ్చౌక ముగా ఉండెను; మూడు వరుసలలోను కిటికీలు ఒకదాని కొకటి యెదురుగా ఉండెను.

5. thalu pulayokkayu kitikeelayokkayu sthambhamulu chacchauka mugaa undenu; moodu varusalalonu kitikeelu okadaani kokati yedurugaa undenu.

6. మరియు అతడు స్తంభ ములుగల యొక మంటపమును కట్టించెను; దాని పొడుగు ఏబది మూరలు, వెడల్పు ముప్పది మూరలు; ఒక మంటప మును వాటి యెదుట ఉండెను; స్తంభములును లావుగల దూలములును వాటి యెదుట నుండెను.

6. mariyu athadu sthambha mulugala yoka mantapamunu kattinchenu; daani podugu ebadhi mooralu, vedalpu muppadhi mooralu; oka mantapa munu vaati yeduta undenu; sthambhamulunu laavugala doolamulunu vaati yeduta nundenu.

7. తరువాత తాను తీర్పుతీర్చ కూర్చుండుటకై యొక అధికార మంటపమును కట్టించెను; దాని నట్టిల్లు కొనమొదలు దేవదారు కఱ్ఱతో కప్పబడెను.

7. tharuvaatha thaanu theerputheercha koorchundutakai yoka adhikaara mantapamunu kattinchenu; daani nattillu konamodalu dhevadaaru karrathoo kappabadenu.

8. లోపలి ఆవరణములో తన నివాసపు ఇంటిని ఆ విధముగానే కట్టించెను. మరియసొలొమోను తాను వివాహమైన ఫరో కుమార్తెకు ఈ మంటపమువంటి యొక నగరును కట్టించెను.

8. lopali aavaranamulo thana nivaasapu intini aa vidhamugaane kattinchenu. Mariyu solomonu thaanu vivaahamaina pharo kumaartheku ee mantapamuvanti yoka nagarunu kattinchenu.

9. ఈ కట్టడములన్నియు పునాది మొదలుకొని గోడ చూరువరకు లోపలను వెలుపలను వాటి పరిమాణప్రకారముగా తొలవబడినట్టివియు, రంప ములచేత కోయబడినట్టివియు, మిక్కిలి వెలగలరాళ్లతో కట్టబడెను; ఈ ప్రకారమే గొప్ప ఆవరణపు వైపుననున్న వెలుపలి భాగమును ఉండెను.

9. ee kattadamulanniyu punaadhi modalukoni goda chooruvaraku lopalanu velupalanu vaati parimaanaprakaaramugaa tolavabadinattiviyu, rampa mulachetha koyabadinattiviyu, mikkili velagalaraallathoo kattabadenu; ee prakaarame goppa aavaranapu vaipunanunna velupali bhaagamunu undenu.

10. దాని పునాది పదేసి యెనిమిదేసి మూరలుగల మిక్కిలి వెలగల పెద్ద రాళ్లతో కట్ట బడెను.

10. daani punaadhi padhesi yenimidhesi mooralugala mikkili velagala pedda raallathoo katta badenu.

11. పైతట్టున పరిమాణప్రకారముగా చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్లును దేవదారు కఱ్ఱలును కలవు.

11. paithattuna parimaanaprakaaramugaa chekkabadina mikkili velagala raallunu dhevadaaru karralunu kalavu.

12. గొప్ప ఆవరణమునకు చుట్టును మూడు వరుసల చెక్కిన రాళ్లును, ఒక వరుస దేవదారు దూలములును కలవు; యెహోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతినే ఆ మందిరపు మంటపమును కట్టబడెను.

12. goppa aavaranamunaku chuttunu moodu varusala chekkina raallunu, oka varusa dhevadaaru doolamulunu kalavu; yehovaa mandiramuloni aavaranamu kattabadina reethine aa mandirapu mantapamunu kattabadenu.

13. రాజైన సొలొమోను తూరు పట్టణములోనుండి హీరామును పిలువనంపించెను.

13. raajaina solomonu thooru pattanamulonundi heeraamunu piluvanampinchenu.

14. ఇతడు నఫ్తాలిగోత్రపు విధవరాలి కుమారుడై యుండెను; ఇతని తండ్రి తూరు పట్టణపువాడగు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడును ఇత్తడితో చేయు సమస్తమైన పనులలోను బహు చమత్కారపు పనివాడునై యుండెను; అతడు సొలొమోనునొద్దకు వచ్చి అతని పని అంతయు చేసెను.

14. ithadu naphthaaligotrapu vidhavaraali kumaarudai yundenu; ithani thandri thooru pattanapuvaadagu itthadi panivaadu. ee heeraamu poorna pragnagala buddhimanthudunu itthadithoo cheyu samasthamaina panulalonu bahu chamatkaarapu panivaadunai yundenu; athadu solomonunoddhaku vachi athani pani anthayu chesenu.

15. ఏమనగా అతడు రెండు ఇత్తడి స్తంభములు పోతపోసెను; ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల నిడివిగలది, ఒక్కొక్కటి పండ్రెండు మూరల కైవారము గలది.

15. emanagaa athadu rendu itthadi sthambhamulu pothaposenu; okkokka sthambhamu padunenimidi moorala nidivigaladhi, okkokkati pandrendu moorala kaivaaramu galadhi.

16. మరియు స్తంభములమీద ఉంచుటకై యిత్తడితో రెండు పీటలు పోతపోసెను; ఒకపీటయొక్క యెత్తు అయిదు మూరలు, రెండవ పీటయొక్క యెత్తు అయిదు మూరలు.

16. mariyu sthambhamulameeda unchutakai yitthadithoo rendu peetalu pothaposenu; okapeetayokka yetthu ayidu mooralu, rendava peetayokka yetthu ayidu mooralu.

17. మరియు స్తంభములమీదనున్న పీటలకు అల్లిక పనివంటి పనియు, గొలుసు పని దండలును చేయబడెను; అవి పీటకు ఏడేసి కలిగి యుండెను.

17. mariyu sthambhamulameedanunna peetalaku allika panivanti paniyu, golusu pani dandalunu cheyabadenu; avi peetaku edesi kaligi yundenu.

18. ఈలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టును అల్లికపని రెండు వరుసలు దానిమ్మపండ్లతో చేసెను; ఈ ప్రకారముగా అతడు రెండవ పీటకును చేసెను.

18. eelaaguna athadu sthambhamulanu chesi meedi peetalanu kapputaku chuttunu allikapani rendu varusalu daanimmapandlathoo chesenu; ee prakaaramugaa athadu rendava peetakunu chesenu.

19. మరియు స్తంభములమీది పీటలు నాలుగు మూరల మట్టుకు తామర పుష్పమువంటి పనిగలవై యుండెను.

19. mariyu sthambhamulameedi peetalu naalugu moorala mattuku thaamara pushpamuvanti panigalavai yundenu.

20. మరియు రెండు స్తంభములమీదనున్న పీటలమీది అల్లికపని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను; రెండువందల దానిమ్మ పండ్లు ఆ పీటమీద వరుస వరుసలుగా చుట్టు నుండెను.

20. mariyu rendu sthambhamulameedanunna peetalameedi allikapani daggaranunna ubbetthuku paigaa daanimma pandlundenu; renduvandala daanimma pandlu aa peetameeda varusa varusalugaa chuttu nundenu.

21. ఈ స్తంభములను అతడు పరిశుద్ధస్థలపు మంటపములో ఎత్తించెను; కుడిపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరుపెట్టెను, ఎడమపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అను పేరు పెట్టెను.

21. ee sthambhamulanu athadu parishuddhasthalapu mantapamulo etthinchenu; kudipaarshvapu sthambhamunu etthi daaniki yaakeenu anu perupettenu, edamapaarshvapu sthambhamunu etthi daaniki boyaju anu peru pettenu.

22. ఈ స్తంభములమీద తామరపుష్పములవంటి పని యుండెను; ఈలాగున స్తంభములయొక్క పని సమాప్తమాయెను.

22. ee sthambhamulameeda thaamarapushpamulavanti pani yundenu; eelaaguna sthambhamulayokka pani samaapthamaayenu.

23. మరియు అతడు పోతపనితో ఒక సముద్రమును చేసెను; అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచువరకు పది మూరలు, అది అయిదుమూరల యెత్తుగలదై గుండ్ర ముగా ఉండెను; దాని కైవారము ముప్పది మూరలు.

23. mariyu athadu pothapanithoo oka samudramunu chesenu; adhi ee thattu pai anchu modalukoni aa thattu pai anchuvaraku padhi mooralu, adhi ayidumoorala yetthugaladai gundra mugaa undenu; daani kaivaaramu muppadhi mooralu.

24. దాని పై అంచునకు క్రింద చుట్టును గుబ్బలుండెను; మూరకు పది గుబ్బలచొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టును ఆవరించియుండెను; అది పోత పోయబడినప్పుడు ఆ గుబ్బలు రెండు వరుసలుగా పోత పోయబడెను.

24. daani pai anchunaku krinda chuttunu gubbalundenu; mooraku padhi gubbalachoppuna aa gubbalu samudramu chuttunu aavarinchiyundenu; adhi potha poyabadinappudu aa gubbalu rendu varusalugaa potha poyabadenu.

25. అది పండ్రెండు ఎడ్లమీద నిలువబడియుండెను; వీటిలో మూడు ఉత్తరదిక్కును మూడు పడమర దిక్కును మూడు దక్షిణదిక్కును మూడు తూర్పుదిక్కును చూచుచుండెను. వీటిమీద ఆ సముద్రము ఎత్తబడి యుండెను. వాటి వెనుకటి భాగములన్నియు లోపలితట్టు త్రిప్పబడి యుండెను.

25. adhi pandrendu edlameeda niluvabadiyundenu; veetilo moodu uttharadhikkunu moodu padamara dikkunu moodu dakshinadhikkunu moodu thoorpudikkunu choochuchundenu. Veetimeeda aa samudramu etthabadi yundenu. Vaati venukati bhaagamulanniyu lopalithattu trippabadi yundenu.

26. అది బెత్తెడు దళసరిగలదై యుండెను; దాని పై అంచు పాత్రకు పై అంచువలె తామర పుష్ప éములవంటి పని కలిగి యుండెను; అది తొమ్మిది గరిసెలు పట్టును.

26. adhi bettedu dalasarigaladai yundenu; daani pai anchu paatraku pai anchuvale thaamara pushpa émulavanti pani kaligi yundenu; adhi tommidi gariselu pattunu.

27. మరియు అతడు పది యిత్తడి స్తంభములు చేసెను; ఒక్కొక్క స్తంభము నాలుగు మూరల పొడుగు, నాలుగు మూరల వెడల్పు, మూడు మూరల యెత్తు కలిగి యుండెను.

27. mariyu athadu padhi yitthadi sthambhamulu chesenu; okkokka sthambhamu naalugu moorala podugu, naalugu moorala vedalpu, moodu moorala yetthu kaligi yundenu.

28. ఈ స్తంభముల పని రీతి యేదనగా, వాటికి ప్రక్క పలకలు కలవు, ఆ ప్రక్కపలకలు జవలమధ్య ఉండెను.

28. ee sthambhamula pani reethi yedhanagaa, vaatiki prakka palakalu kalavu, aa prakkapalakalu javalamadhya undenu.

29. జవలమధ్యనున్న ప్రక్కపలకలమీద సింహ ములును ఎడ్లును కెరూబులును ఉండెను; మరియు జవలమీద ఆలాగుండెను; సింహములక్రిందను ఎడ్ల క్రిందను వ్రేలాడు దండలవంటి పని కలిగి యుండెను.

29. javalamadhyanunna prakkapalakalameeda sinha mulunu edlunu keroobulunu undenu; mariyu javalameeda aalaagundenu; simhamulakrindanu edla krindanu vrelaadu dandalavanti pani kaligi yundenu.

30. మరియు ప్రతి స్తంభమునకు నాలుగేసి యిత్తడి చక్రములు ఇత్తడి యిరుసులును కలిగి యుండెను; దాని నాలుగు మూలలను దిమ్మలు కలవు; ఈ దిమ్మలు తొట్టిక్రింద అతికిన ప్రతిస్థలము దగ్గర పోత పోయబడెను.

30. mariyu prathi sthambhamunaku naalugesi yitthadi chakramulu itthadi yirusulunu kaligi yundenu; daani naalugu moolalanu dimmalu kalavu; ee dimmalu tottikrinda athikina prathisthalamu daggara potha poyabadenu.

31. మరియు దాని మూతి పైపీటయందును మీదను మూరెడు నిడివి; అయితే మూతి క్రింద స్తంభము పనిచొప్పున గుండ్రముగా ఉండి మూరన్నర నిడివి. మరియు ఆ మూతిమీద ప్రక్కలుగల చెక్కిన పనులు గలవు; ఇవి గుండ్రనివిగాక చచ్చౌకముగా ఉండెను.

31. mariyu daani moothi paipeetayandunu meedanu mooredu nidivi; ayithe moothi krinda sthambhamu panichoppuna gundramugaa undi moorannara nidivi. Mariyu aa moothimeeda prakkalugala chekkina panulu galavu; ivi gundranivigaaka chacchaukamugaa undenu.

32. మరియు ప్రక్కపలకల క్రింద నాలుగు చక్రములు కలవు; చక్రముల యిరుసులు స్తంభములతో అతకబడి యుండెను; ఒక్కొక్క చక్రము మూరెడునర నిడివి గలదై యుండెను.

32. mariyu prakkapalakala krinda naalugu chakramulu kalavu; chakramula yirusulu sthambhamulathoo athakabadi yundenu; okkokka chakramu mooredunara nidivi galadai yundenu.

33. ఈ చక్రముల పని రథ చక్రముల పనివలె ఉండెను, వాటి యిరుసులును అడ్డలును పూటీలును ఆకులును పోతపనివై యుండెను.

33. ee chakramula pani ratha chakramula panivale undenu, vaati yirusulunu addalunu pooteelunu aakulunu pothapanivai yundenu.

34. ఒక్కొక్క స్తంభపు నాలుగు మూలలను నాలుగు దిమ్మలు కలవు; ఈ దిమ్మలును స్తంభమును ఏకాండముగా ఉండెను.

34. okkokka sthambhapu naalugu moolalanu naalugu dimmalu kalavu; ee dimmalunu sthambhamunu ekaandamugaa undenu.

35. మరియు స్తంభమును పైని చుట్టును జేనెడు ఎత్తుగల గుండ్రని బొద్దు కలిగి యుండెను; మరియు స్తంభమును పైనున్న జవలును ప్రక్క పలకలును దానితో ఏకాండముగా ఉండెను.

35. mariyu sthambhamunu paini chuttunu jenedu etthugala gundrani boddu kaligi yundenu; mariyu sthambhamunu painunna javalunu prakka palakalunu daanithoo ekaandamugaa undenu.

36. దాని జవల పలకలమీదను, దాని ప్రక్క పలకలమీదను, అతడు కెరూబులను సింహములను తమాల వృక్షములను ఒక్కొక్కదాని చోటును బట్టి చుట్టును దండలతో వాటిని చెక్కెను.

36. daani javala palakalameedanu, daani prakka palakalameedanu, athadu keroobulanu simhamulanu thamaala vrukshamulanu okkokkadaani chootunu batti chuttunu dandalathoo vaatini chekkenu.

37. ఈ ప్రకారము అతడు పది స్తంభములను చేసెను; అన్నిటి పోతయును పరిమాణ మును రూపమును ఏకరీతిగా ఉండెను.

37. ee prakaaramu athadu padhi sthambhamulanu chesenu; anniti pothayunu parimaana munu roopamunu ekareethigaa undenu.

38. తరువాత అతడు పది యిత్తడి తొట్లను చేసెను; ప్రతి తొట్టి యేడువందల ఇరువది తూములు పట్టునది; ఒక్కొక్క తొట్టి నాలుగు మూరలు; ఒక్కొక్క స్తంభముమీద ఒక్కొక్క తొట్టి పెట్టబడెను.

38. tharuvaatha athadu padhi yitthadi totlanu chesenu; prathi totti yeduvandala iruvadhi thoomulu pattunadhi; okkokka totti naalugu mooralu; okkokka sthambhamumeeda okkokka totti pettabadenu.

39. మందిరపు కుడిపార్శ్వమున అయిదు స్తంభ ములను మందిరముయొక్క యెడమ పార్శ్వమున అయిదు మట్లను అతడు ఉంచెను;సముద్రమును దక్షిణమునకు ఎదు రుగా తూర్పుతట్టున మందిరముయొక్క కుడిపార్శ్వమున ఉంచెను.

39. mandirapu kudipaarshvamuna ayidu sthambha mulanu mandiramuyokka yedama paarshvamuna ayidu matlanu athadu unchenu;samudramunu dakshinamunaku edu rugaa thoorputhattuna mandiramuyokka kudipaarshvamuna unchenu.

40. మరియహీరాము తొట్లను చేటలను గిన్నెలను చేసెను. ఈ ప్రకారము హీరాము రాజైన సొలొమోను ఆజ్ఞనుబట్టి యెహోవా మందిరపు పనియంతయు ముగించెను.

40. mariyu heeraamu totlanu chetalanu ginnelanu chesenu. ee prakaaramu heeraamu raajaina solomonu aagnanubatti yehovaa mandirapu paniyanthayu muginchenu.

41. రెండు స్తంభములను, ఆ రెండు స్తంభముల మీదనున్న పైపీటల పళ్లెములను ఆ స్తంభములను పై పీటల పళ్లెములను కప్పిన రెండు అల్లికలను,

41. rendu sthambhamulanu, aa rendu sthambhamula meedanunna paipeetala pallemulanu aa sthambhamulanu pai peetala pallemulanu kappina rendu allikalanu,

42. ఆ స్తంభముల మీదనున్న పైపీటల రెండు పళ్లెములను కప్పిన అల్లిక యొక్కటింటికి రెండు వరుసలచొప్పున రెండు అల్లికలకును నాలుగు వందల దానిమ్మపండ్లను,

42. aa sthambhamula meedanunna paipeetala rendu pallemulanu kappina allika yokkatintiki rendu varusalachoppuna rendu allikalakunu naalugu vandala daanimmapandlanu,

43. పది స్తంభ ములను, స్తంభములమీద పది తొట్లను,

43. padhi sthambha mulanu, sthambhamulameeda padhi totlanu,

44. ఒక సముద్ర మును, సముద్రముక్రింద పండ్రెండు ఎడ్లను,

44. oka samudra munu, samudramukrinda pandrendu edlanu,

45. బిందెలను, చేటలను, గిన్నెలను వీటినన్నిటిని రాజైనసొలొమోను ఆజ్ఞనుబట్టి హీరాము యెహోవా మందిరమునకు చేసెను. ఈ వస్తువులన్నియు మెరుగుపెట్టిన యిత్తడివై యుండెను.

45. bindelanu, chetalanu, ginnelanu veetinannitini raajainasolomonu aagnanubatti heeraamu yehovaa mandiramunaku chesenu. ee vasthuvulanniyu merugupettina yitthadivai yundenu.

46. యొర్దాను మైదానమందు సుక్కోతునకును సారెతాను నకును మధ్య జిగట భూమియందు రాజు వాటిని పోత పోయించెను.

46. yordaanu maidaanamandu sukkothunakunu saarethaanu nakunu madhya jigata bhoomiyandu raaju vaatini potha poyinchenu.

47. అయితే ఈ ఉపకరణములు అతివిస్తారము లైనందున సొలొమోను ఎత్తు చూచుట మానివేసెను;ఇత్తడియొక్క యెత్తు ఎంతైనది తెలియబడకపోయెను.

47. ayithe ee upakaranamulu athivisthaaramu lainanduna solomonu etthu choochuta maanivesenu;itthadiyokka yetthu enthainadhi teliyabadakapoyenu.

48. మరియసొలొమోను యెహోవా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటిని చేయించెను, అనగా బంగారపు బలిపీఠమును సముఖపు రొట్టెలనుంచు బంగారపు బల్లలను,

48. mariyu solomonu yehovaa mandira sambandhamaina thakkina upakaranamulannitini cheyinchenu, anagaa bangaarapu balipeetamunu samukhapu rottelanunchu bangaarapu ballalanu,

49. గర్భాలయము ముందర కుడిపార్శ్వమున అయి దును, ఎడమ పార్శ్వమున అయిదును, పది బంగారపు దీపస్తంభములను, బంగారపు పుష్పములను, ప్రమిదెలను, కారులను,

49. garbhaalayamu mundhara kudipaarshvamuna ayi dunu, edama paarshvamuna ayidunu, padhi bangaarapu deepasthambhamulanu, bangaarapu pushpamulanu, pramidelanu, kaarulanu,

50. మేలిమి బంగారపు పాత్రలను, కత్తెరలను, గిన్నెలను, ధూపకలశములను, అంతర్మందిరమను అతి పరి శుద్ధమైన స్థలముయొక్క తలుపులకును మందిరమను ఆల యపు తలుపులకును కలిగిన బంగారపు బందులను, వీటన్ని టిని చేయించెను,

50. melimi bangaarapu paatralanu, katteralanu, ginnelanu, dhoopakalashamulanu, antharmandiramanu athi pari shuddhamaina sthalamuyokka thalupulakunu mandiramanu aala yapu thalupulakunu kaligina bangaarapu bandulanu, veetanni tini cheyinchenu,

51. ఈ ప్రకారము రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్త మాయెను. మరియసొలొమోను తన తండ్రియైన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములను తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచెను.

51. ee prakaaramu raajaina solomonu yehovaa mandiramunaku chesina pani anthayu samaaptha maayenu. Mariyu solomonu thana thandriyaina daaveedu prathishthinchina vendini bangaaramunu upakaranamulanu teppinchi yehovaa mandirapu khajaanaalo unchenu.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Kings I - 1 రాజులు 7 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

సోలమన్ నిర్మాణం (1-12). 
సోలమన్ నిర్మాణాలు అందాన్ని కలిగి ఉన్నప్పటికీ, వాటి ప్రాథమిక ప్రయోజనం కార్యాచరణ. అతని ప్రారంభ ప్రయత్నం ఆలయ నిర్మాణం, ఇది ఇతర నిర్మాణ ప్రాజెక్టుల కంటే ముందు దేవుడిని సేవించడమే తన ప్రాధాన్యతను సూచిస్తుంది. శాశ్వత విజయానికి బలమైన ఆధారం ప్రారంభ భక్తి ద్వారా స్థాపించబడింది. తన సొంత నివాసాన్ని పూర్తి చేయడానికి అతనికి పదమూడు సంవత్సరాలు పట్టగా, ఆలయ నిర్మాణానికి కేవలం ఏడు సంవత్సరాలు పట్టింది. ఈ అసమానత పెరిగిన శ్రద్ద కారణంగా కాదు, కానీ సోలమన్ తన నివాసంతో పోలిస్తే దేవుని నివాసాన్ని నిర్మించడంలో ఎక్కువ ఉత్సాహం చూపాడు. వ్యక్తిగత సౌఖ్యం మరియు సంతృప్తి కంటే దేవుని గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వడం మన మార్గదర్శక సూత్రం.

ఆలయం లోపల గృహోపకరణాలు (13-47). 
ఆలయ ప్రవేశ ద్వారంలో అలంకరించబడిన రెండు ఆకట్టుకునే కాంస్య స్తంభాలు అన్ని మతపరమైన ఆచారాల సమయంలో దేవుని బలం మరియు స్థాపనపై తప్పనిసరిగా ఆధారపడడాన్ని సూచిస్తాయని కొందరు నమ్ముతారు. "జాచిన్" అనేది మన సంచరించే ఆలోచనల యాంకరింగ్‌ను సూచిస్తుంది, దయతో నిండిన దృఢమైన హృదయం యొక్క ప్రాముఖ్యతను ప్రోత్సహిస్తుంది. "బోయాజు" అనేది మన ఉద్దేశాలను మరియు చర్యలను శక్తివంతం చేసే దేవునిలో మన నిజమైన బలం ఉందని సూచిస్తుంది. ఈ ఆధ్యాత్మిక బలం మరియు స్థిరత్వం దేవుని అభయారణ్యం యొక్క ప్రవేశద్వారం వద్ద మనకు వేచి ఉన్నాయి, ఇక్కడ మనం దైవిక మార్గాలను ఉపయోగించడం ద్వారా కృప యొక్క ప్రసాదాన్ని అంచనా వేయాలి.
ఆత్మీయ యాజకులుగా ఆత్మీయ యాజకులుగా, క్రీస్తు యొక్క విమోచన రక్తాన్ని శుద్ధి చేయడం మరియు పునర్జన్మ యొక్క పరివర్తన ప్రక్రియను మనం తప్పక చేయాలి. ఈ శుద్దీకరణ తప్పనిసరిగా పునరావృతమయ్యే అభ్యాసంగా ఉండాలి, రోజువారీ మలినాలను చేరడం వలన. మా శుద్దీకరణ కోసం వనరులు పూర్తిగా అందించబడ్డాయి, తద్వారా మనం అశుద్ధ స్థితిలో కొనసాగితే, అది మన స్వంత ఎంపికల పర్యవసానంగా ఉంటుంది. కృతజ్ఞతతో, పాపం మరియు అపవిత్రత నుండి మనలను శుద్ధి చేస్తూ, క్రీస్తు యొక్క బలి అర్పణ నుండి ప్రవహించే దైవిక బావిని మనం గుర్తిద్దాం.

బంగారు పాత్రలు (48-51).
క్రీస్తు ఇప్పుడు ఆలయం మరియు దాని నిర్మాణకర్త రెండింటినీ కలిగి ఉన్నాడు; బలిపీఠం మరియు సమర్పణ; మన అంతర్గత జీవి యొక్క ప్రకాశకుడు మరియు మన ఆధ్యాత్మిక ఉనికికి పోషణ. తన వైపు తిరిగిన లేదా తిరిగి వచ్చే వారందరి అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని అతను కలిగి ఉన్నాడు. బాహ్య చిహ్నాలు సంగ్రహించడంలో తక్కువగా ఉంటాయి, పదాలు తెలియజేయడానికి కష్టపడతాయి మరియు మానవ హృదయం కూడా అతని అపరిమితమైన విలువను మరియు అనంతమైన ప్రేమను పూర్తిగా గ్రహించలేవు. ఆయన రక్తాన్ని శుద్ధి చేసే శక్తిలో మనల్ని మనం లీనం చేసుకుంటూ ఆయనకు దగ్గరవుదాం; ఆయన ఆత్మ యొక్క శుద్ధి కృపను మనము శ్రద్ధగా కోరుకుందాం. ఆయన మధ్యవర్తిత్వం ద్వారా, మనం తండ్రితో నిరంతర సంబంధాన్ని పెంపొందించుకుందాం మరియు మనకున్న సమస్తంతో పాటుగా, ఆయనకు సేవలో సమర్పిద్దాం. ఈ అనుసంధానం ద్వారా బలపడినప్పుడు, మనం అంగీకారం, ఉత్పాదకత మరియు గాఢమైన ఆనందాన్ని పొందుతాము.



Shortcut Links
1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |