Kings II - 2 రాజులు 8 | View All

1. ఒకనాడు ఎలీషా తాను బ్రదికించిన బిడ్డకు తల్లియైన ఆమెను పిలిచియెహోవా క్షామకాలము రప్పింప బోవు చున్నాడు; ఏడు సంవత్సరములు దేశ ములో క్షామము కలుగునని చెప్పినీవు లేచి, నీవును నీ యింటివారును ఎచ్చటనుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా

1. Elisha once said to the woman whose son he had restored to life: 'Get ready! Leave with your family and settle wherever you can, because the LORD has decreed a seven-year famine which is coming upon the land.'

2. ఆ స్త్రీ లేచి దైవజనుని మాటచొప్పున చేసి, తన యింటివారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి యేడు సంవత్సరములు అక్కడ వాసముచేసెను.

2. The woman got ready and did as the man of God said, setting out with her family and settling in the land of the Philistines for seven years.

3. అయితే ఆ యేడు సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిష్తీ యుల దేశములోనుండి వచ్చి తన యింటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను.

3. At the end of the seven years, the woman returned from the land of the Philistines and went out to the king to claim her house and her field.

4. రాజు దైవజనుని పనివాడగు గేహజీతో మాట లాడిఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటిని నాకు తెలియజెప్పుమని ఆజ్ఞనిచ్చి యుండెను.

4. The king was talking with Gehazi, the servant of the man of God. 'Tell me,' he said, 'all the great things that Elisha has done.'

5. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రదికించిన బిడ్డ తల్లి తన యింటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవిచేయ వచ్చెను. అంతట గేహజీనా యేలినవాడవైన రాజా ఆ స్త్రీ యిదే; మరియఎలీషా తిరిగి బ్రదికించిన యీమెబిడ్డ వీడే అని చెప్పగా

5. Just as he was relating to the king how his master had restored a dead person to life, the very woman whose son Elisha had restored to life came to the king to claim her house and field. 'My lord king,' Gehazi said, 'this is the woman, and this is that son of hers whom Elisha restored to life.'

6. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి, ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటినుండి నేటివరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరల ఇమ్మని సెలవిచ్చెను.

6. The king questioned the woman, and she told him her story. With that the king placed an official at her disposal, saying, 'Restore all her property to her, with all that the field produced from the day she left the land until now.'

7. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగియై యుండి, దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చియున్నాడని తెలిసికొని

7. Elisha came to Damascus at a time when Ben-hadad, king of Aram, lay sick. When he was told that the man of God had come there,

8. హజాయేలును పిలిచినీవు ఒక కానుకను చేత పట్టుకొని దైవజనుడైన అతనిని ఎదుర్కొన బోయిఈ రోగముపోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవాయొద్ద విచారణ చేయుమని ఆజ్ఞ ఇచ్చిపంపెను.

8. the king said to Hazael, 'Take a gift with you and go call on the man of God. Have him consult the LORD as to whether I shall recover from this sickness.'

9. కాబట్టి హజా యేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో నలువది ఒంటెల మోతంత కానుకగా తీసికొని అతనిని ఎదుర్కొన బోయి అతని ముందర నిలిచినీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదునాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపెనని చెప్పెను.

9. Hazael went to visit him, carrying a present, and with forty camel loads of the best goods of Damascus. On his arrival, he stood before the prophet and said, 'Your son Ben-hadad, king of Aram, has sent me to ask you whether he will recover from his sickness.'

10. అప్పుడు ఎలీషానీవు అతని యొద్దకు పోయినిశ్చయముగా నీకు స్వస్థతకలుగవచ్చుననిచెప్పుము. అయినప్పటికిని అతనికి అవశ్యముగ మరణము సంభవించు నని యెహోవా నాకు తెలియజేసెనని పలికి

10. 'Go and tell him,' Elisha answered, 'that he will surely recover. However, the LORD has showed me that he will in fact die.'

11. హజాయేలు ముఖము చిన్నబోవునంతవరకు ఆ దైవజనుడు అతని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెను.

11. Then he stared him down until Hazael became ill at ease. The man of God wept,

12. హజాయేలునా యేలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతని నడుగగా ఎలీషా యీలాగు ప్రత్యుత్తరమిచ్చెనుఇశ్రాయేలువారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు; వారి ¸యౌవనస్థు లను కత్తిచేత హతము చేయుదువు; వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు; వారి గర్భిణుల కడుపులను చింపి వేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నే నెరిగియుండుటచేత కన్నీళ్లు రాల్చుచున్నాను.

12. and Hazael asked, 'Why are you weeping, my lord?' Elisha replied, 'Because I know the evil that you will inflict upon the Israelites. You will burn their fortresses, you will slay their youth with the sword, you will dash their little children to pieces, you will rip open their pregnant women.'

13. అందుకు హజాయేలుకుక్కవంటివాడనగు నీ దాసుడనైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా, ఎలీషానీవు సిరియామీద రాజవగుదువని యెహోవా నాకు బయలుపరచి యున్నాడనెను.

13. Hazael exclaimed, 'How can a dog like me, your servant, do anything so important?' 'The LORD has showed you to me as king over Aram,' replied Elisha.

14. అతడు ఎలీషాను విడిచి వెళ్లి తన యజమానుని యొద్దకు రాగా అతడుఎలీషా నీతో చెప్పినదేమని అడుగగా అతడునిజముగా నీవు బాగుపడుదువని అతడు చెప్పెననెను.

14. Hazael left Elisha and returned to his master. 'What did Elisha tell you?' asked Ben-hadad. 'He told me that you would surely recover,' replied Hazael.

15. అయితే మరునాడు హజాయేలు ముదుగు బట్ట తీసికొని నీటిలో ముంచి రాజు ముఖముమీద పరచగా అతడు చచ్చెను; అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజా యెను.

15. The next day, however, Hazael took a cloth, dipped it in water, and spread it over the king's face, so that he died. And Hazael reigned in his stead.

16. అహాబు కుమారుడును ఇశ్రాయేలువారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో అయిదవ సంవత్సరమందు యెహోషాపాతు యూదారాజై యుండగా యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏల నారంభించెను.

16. In the fifth year of Joram, son of Ahab, king of Israel, Jehoram, son of Jehoshaphat, king of Judah, became king.

17. అతడు ఏల నారంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడై యుండి యెరూషలేమందు ఎనిమిది సంవ త్సరములు ఏలెను.

17. He was thirty-two years old when he began to reign, and he reigned eight years in Jerusalem.

18. ఇతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసికొని యుండెను గనుక అహాబు కుటుంబికులవలెనే ఇతడును ఇశ్రాయేలురాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.

18. He conducted himself like the kings of Israel of the line of Ahab, since the sister of Ahab was his wife; and he did evil in the LORD'S sight.

19. అయినను యెహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట యిచ్చి యుండెను గనుక అతని జ్ఞాపకముచేత యూదాను నశింప జేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెను.

19. Even so, the LORD was unwilling to destroy Judah, because of his servant David. For he had promised David that he would leave him a lamp in the LORD'S presence for all time.

20. ఇతని దిన ములలో ఎదోమీయులు యూదారాజునకు ఇక లోబడుట మాని అతనిమీద తిరుగుబాటు చేసి, తమమీద నొకని రాజుగా నియమించుకొనినందున

20. During Jehoram's reign, Edom revolted against the sovereignty of Judah and chose a king of its own.

21. యెహోరాము తన రథములన్నిటిని తీసికొని పోయి జాయీరు అను స్థల మునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టునున్న ఎదోమీయులను రథములమీది అధిపతులను హతముచేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయిరి.

21. Thereupon Jehoram with all his chariots crossed over to Zair. He arose by night and broke through the Edomites when they had surrounded him and the commanders of his chariots. Then his army fled homeward.

22. అయితే నేటివరకును ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదా వారికి లోబడకయే యున్నారు. మరియు ఆ సమయ మందు లిబ్నా పట్టణమును తిరుగబడెను.

22. To this day Edom has been in revolt against the rule of Judah. Libnah also revolted at that time.

23. యెహోరాము చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన దాని నంతటినిగూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.

23. The rest of the acts of Jehoram, with all that he did, are recorded in the book of the chronicles of the kings of Judah.

24. యెహోరాము తన పితరులతో కూడ నిద్రించి తన పితరుల సమాధిలో దావీదుపురమునందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను.

24. Jehoram rested with his ancestors and was buried with them in the City of David. His son Ahaziah succeeded him as king.

25. అహాబు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన యెహోరాము ఏలు బడిలో పండ్రెండవ సంవత్సరమందు యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా యేల నారంభించెను.

25. Ahaziah, son of Jehoram, king of Judah, became king in the twelfth year of Joram, son of Ahab, king of Israel.

26. అహజ్యా యేలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడై యుండి యెరూషలేములో ఒక సంవత్సరము ఏలెను. అతని తల్లిపేరు అతల్యా; ఈమె ఇశ్రాయేలు రాజైన ఒమీ కుమార్తె.

26. He was twenty-two years old when he began his reign, and he reigned one year in Jerusalem. His mother's name was Athaliah; she was daughter of Omri, king of Israel.

27. అతడు అహాబు కుటుంబికుల ప్రవర్తనను అనుసరించుచు, వారివలెనే యెహోవా దృష్టికి చెడు తనము జరిగించెను; అతడు అహాబు ఇంటివారికి అల్లుడు.

27. He conducted himself like the house of Ahab, doing evil in the LORD'S sight as they did, since he was related to them by marriage.

28. అతడు అహాబు కుమారుడైన యెహోరాముతోకూడ రామోత్గిలాదునందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధముచేయ బయలుదేరగా సిరియనులు యెహోరా మును గాయపరచిరి.

28. He joined Joram, son of Ahab, in battle against Hazael, king of Aram, at Ramoth-gilead, where the Arameans wounded Joram.

29. రాజైన యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియనులవలన తాను పొందిన గాయములను బాగుచేసి కొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి రాగా యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము రోగి యాయెనని తెలిసికొని అతని దర్శించుటకై యెజ్రెయేలు ఊరికి వచ్చెను.

29. King Joram returned to Jezreel to be healed of the wounds which the Arameans had inflicted on him at Ramah in his battle against Hazael, king of Aram. Then Ahaziah, son of Jehoram, king of Judah, went down to Jezreel to visit him there in his illness.