Chronicles I - 1 దినవృత్తాంతములు 10 | View All

1. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులయెదుట నిలువలేక పారిపోయి హతులై గిల్బోవ పర్వతమందు పడిరి.

1. The Philistynes foughte agaynst Israel. And they of Israel fled before the Philistynes, and ye wounded fell vpon mount Gilboa.

2. ఫిలిష్తీ యులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును, అబీనాదాబును మల్కీషూవను హతముచేసిరి.

2. And the Philistynes folowed vpon Saul and his sonnes, and smote Ionathas, Abinadab and Malchisua ye sonnes of Saul.

3. యుద్ధములో సౌలు ఓడిపోవుచుండెను. అతడు అంబులు వేయువారి కంటబడి వారిచేత బహు గాయముల నొందెను.

3. And the battayll was sore agaynst Saul. And the archers came vpon him, so that he was wounded of the archers

4. అప్పుడు సౌలుఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండ నీవు నీ కత్తిదూసి నన్ను పొడిచివేయుమని తన ఆయుధములను మోయువానితోననగా, వాడు బహుగా భయపడి ఆలాగు చేయుటకు ఒప్పలేదు గనుక సౌలు తన కత్తిమీదపడెను.

4. Then sayde Saul vnto his weapenbearer: Drawe out thy swerde, and thrust it thorow me, that these vncircumcysed come not, and deale shamefully with me. Neuertheles his weapenbearer wolde not, for he was sore afrayed. Then toke Saul his swerde, and fell therin.

5. సౌలు చనిపోయెనని ఆయుధములను మోయువాడు తెలిసి కొని తానును కత్తిని పట్టుకొని దానిమీదపడి చచ్చెను.

5. Whan his weapenbearer sawe that Saul was deed, he fell vpon his swerde also, and dyed.

6. ఆ ప్రకారమే సౌలును అతని ముగ్గురు కుమారులును చచ్చిరి. మరియు అతని యింటి వారందరును చచ్చిరి.

6. Thus died Saul and his thre sonnes, and all his housholde together.

7. జనులు పారిపోయిరనియు, సౌలును అతని కుమారులును చనిపోయిరనియు, లోయలోని ఇశ్రాయేలీయులందరు తెలిసికొని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి.

7. And whan the men of Israel which were in ye valley, sawe, that Saul and his sonnes were deed, they lefte their cities and fled: and the Philistynes came and dwelt therin.

8. హతులైనవారిని దోచుకొనుటకై ఫిలిష్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులును గిల్బోవ పర్వతమందు చచ్చి పడియుండుట చూచి

8. On the morowe came the Philistynes to spoyle the slayne, and founde Saul, and his sonnes lyenge vpon mount Gelboa,

9. అతని కవచమును దోచుకొని, అతని తలను అతని ఆయుధ ములను తీసికొని పోయి ఫిలిష్తీయుల దేశమంతట వాటిని త్రిప్పి, జరిగినదానిని విగ్రహములకును జనులకును చాటించిరి.

9. and stryped him out, and toke his heade, and his harnesse, and sent it aboute in to ye londe of the Philistynes, and caused it to be shewed before their Idoles and the people.

10. వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి.

10. And his weapens layed they in the house of their god, and styckte vp his heade vpon the house of Dagon.

11. ఫిలిష్తీయులు సౌలునకు చేసినదంతయు యాబేష్గిలాదువారు విని నప్పుడు పరాక్రమశాలులైనవారందరును లేచిపోయి,

11. But whan all they of Iabes in Gilead herde of euery thinge, that the Philistynes had done vnto Saul,

12. సౌలు శవమును అతని కుమారుల శవములను తీసికొని యాబేషునకువచ్చి వారి యెముకలను యాబేషునందలి సిందూరవృక్షము క్రింద పాతిపెట్టి యేడుదినములు ఉప వాసముండిరి.

12. they gat them vp (as many as were men of armes) and toke the body of Saul and of his sonnes, and broughte them vnto Iabes, and buryed their bones vnder the Oke at Iabes, and fasted seuen dayes.

13. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞగైకొనక ఆయన దృష్టి యెదుట ద్రోహము చేసినందుకును, యెహోవాయొద్ద విచారణచేయక కర్ణపిశాచముల యొద్ద విచారణచేయుదానిని వెదకినందుకును సౌలు హతమాయెను.

13. Thus dyed Saul in his trespace which he commytted agaynst the LORDE, because he kepte not the worde of the LORDE: & because he axed councell at the soythsayer,

14. అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను.

14. and axed not at the LORDE, therfore slewe he him, & turned the kyngdome vnto Dauid.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles I - 1 దినవృత్తాంతములు 10 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

సౌలు మరణం.

క్రానికల్స్ పుస్తకాలలో కనిపించే ప్రాథమిక ఉద్దేశ్యం డేవిడ్ ఇంటి వంశానికి సంబంధించిన రికార్డులను భద్రపరచడం. తత్ఫలితంగా, రచయిత సౌలు పాలనను విస్తృతంగా వివరించడం మానేశాడు, బదులుగా అతని మరణంపై దృష్టి సారించాడు, ఇది డేవిడ్ సింహాసనం అధిరోహించడానికి మార్గం సుగమం చేసింది. సౌలు పతనం అనేక పాఠాలను బోధిస్తుంది: మొదటిగా, ఒకరి అతిక్రమణల పర్యవసానాలు అనివార్యంగా వాటిని ఎదుర్కొంటాయి, ముందుగానే లేదా తరువాత-సౌలు మరణం అతని తప్పు నుండి ఉద్భవించింది. రెండవది, ఏ వ్యక్తి యొక్క ప్రాముఖ్యత దైవిక తీర్పుల నుండి వారిని రక్షించదు. చివరగా, అవిధేయత ఆధ్యాత్మికంగా విధ్వంసం చేసే శక్తిని కలిగి ఉంది-సౌలు మరణం ప్రభువు ఆజ్ఞను సమర్థించడంలో వైఫల్యం కారణంగా సంభవించింది. అవిశ్వాసం, అసహనం మరియు నిరుత్సాహం నుండి విముక్తి పొందడం ద్వారా, మనం మోక్షానికి ఒక మార్గాన్ని కనుగొనవచ్చు. సహనం మరియు ప్రభువుపై ఆధారపడడం చివరికి మనకు శాశ్వతమైన రాజ్యాన్ని ప్రసాదిస్తుంది.


Shortcut Links
1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |