Chronicles I - 1 దినవృత్తాంతములు 12 | View All

1. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడియింకను దాగియుండగా సౌలు బంధువులగు బెన్యామీనీ యులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతనియొద్దకు సిక్లగునకు వచ్చిరి.

1. These also came to Dauid vnto Siclag whan he was yet kepte a syde because of Saul the sonne of Cis: And they were like wyse amouge the worthies yt helped in the battayll,

2. వీరు విలుకాండ్రయి కుడి యెడమ చేతులతో వడిసెలచేత రాళ్లు రువ్వుటకును వింటిచేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు.

2. and coulde handle bowes with both their handes, & coulde cast stones, and shute arowes with the bowe. Of Sauls brethren which were of Ben Iamin:

3. వారెవరనగా గిబియావాడైన షెమాయా కుమారులైన అహీయెజెరు, ఇతడు అధిపతి; ఇతని తరువాతివాడగు యోవాషు, అజ్మావెతు కుమారులైన యెజీయేలు, పెలెటు, బెరాకా, అనెతోతీయుడైన యెహూ,

3. The chefest Ahieser and Ioas ye children of Samaa the Gibeathite. Iesiel and Pelet the children of Asmaueth. Baracha & and Iehu the Anthothite.

4. ముప్పదిమందిలో పరాక్రమశాలియు ముప్పది మందికి పెద్దయునైన ఇష్మయా అను గిబియోనీయుడు, యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీ యుడైన యోజాబాదు,

4. Iesmaia the Gibeonite, valeaunt amonge thirtie and ouer thirtie. Ieremia, Iahasiel, Iohanan, Iosabad the Gederathite.

5. ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెఫటయా,

5. Eleusai, Ierimoth, Bealia, Samaria, Saphatia the Harophite,

6. కోరహీయులగు ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజెరు, యాషాబాము,

6. Elkana, Iesiia, Asareel, Iasabeam ye Korahyte,

7. గెదోరు ఊరివాడైన యెరోహాము కుమారులగు యోహేలా, జెబద్యా అనువారును.

7. Ioela and Sabadia the children of Ieroham of Gedor.

8. మరియగాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదునొద్ద చేరిరి; వీరు డాలును ఈటెను వాడుకచేయగల యుద్ధప్రవీణులు, సింహముఖమువంటి ముఖములు గలవారు, కొండలలోనుండు జింకలంత పాద వేగము గలవారు.

8. Of the Gaddites resorted there vnto Dauid to the castell in the wyldernesse, mightie Worthies and men of armes, which hadled speares and swerdes, and had faces like lios, & were as swifte as the Roes vpon ye mountaynes.

9. వారెవరనగా మొదటివాడు ఏజెరు, రెండవవాడు ఓబద్యా, మూడవవాడు ఏలీయాబు,

9. The fyrst Eser, the seconde Obadia, the thyrde Eliab,

10. నాల్గవవాడు దుష్మన్నా, అయిదవవాడు యిర్మీయా,

10. the fourth Masmanna, ye fyfth Ieremia,

11. ఆరవవాడు అత్తయి, యేడవవాడు ఎలీయేలు,

11. the sixte Athai, the seueth Eliel,

12. ఎనిమిదవ వాడు యోహానాను, తొమ్మిదవవాడు ఎల్జాబాదు,

12. the eight Iohanna, the nyenth Elsabad

13. పదియవవాడు యిర్మీయా, పదకొండవవాడు మక్బన్నయి.

13. the tenth Ieremia, ye eleuenth Machbanai.

14. గాదీయులగు వీరు సైన్యమునకు అధిపతులై యుండిరి; వారిలో అత్యల్పుడైనవాడు నూరుమందికి అధిపతి, అత్య ధికుడైనవాడు వెయ్యిమందికి అధిపతి,

14. These were of the children of Gad, heades in the hoost, the leest ouer an hundreth, and ye greatest ouer a thousande

15. యొర్దాను గట్టులమీదుగా పొర్లి పారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పులోయలలోను పడమటిలోయలలోను ఉన్న వారినందరిని తరిమివేసినవారు వీరే.

15. These are they which in the fyrst moneth wente ouer Iordane, whan it was full on both the shores, so that all the valleys were eauen both towarde the East and towarde the West.

16. మరియు బెన్యామీనీయులలో కొందరును యూదావారిలో కొందరును దావీదు దాగియున్న స్థలమునకు వచ్చిరి.

16. There came of the children of BenIamin also and of Iuda vnto the castell of Dauid.

17. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెనుమీరు సమాధానము కలిగి నాకు సహాయముచేయుటకై నాయొద్దకు వచ్చియున్నయెడల నా హృదయము మీతో అతికియుండును; అట్లుగాక నా వలన మీకు అపకారమేదియు కలుగలేదని యెరిగి యుండియు, నన్ను నా శత్రువులచేతికి అప్పగింపవలెనని మీరు వచ్చియున్నయెడల మన పితరులయొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించును గాక.

17. But Dauid wente forth vnto them, and answered and sayde vnto them: Yf ye come to me in peace, and to helpe me, my hert shal be with you. But yf ye come vpo disceate, and to be mine aduersaries (where as there is yet no vnrighte in me) the God of oure fathers loke vpon it, and rebuke it.

18. అప్పుడు ముప్పదిమందికి అధిపతియైన అమాశై ఆత్మవశుడైదావీదూ, మేము నీవారము; యెష్షయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము; నీకు సమాధానము కలుగునుగాక, సమా ధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలు కగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను.

18. Neuertheles the sprete endued Amasai the captayne amonge thirtie, and he sayde: We are thine O Dauid, and holde with the thou sonne of Isai. Peace, peace be with the, peace be with thy helpers, for thy God helpeth the. Then Dauid receaued them, and made them captaynes ouer the men of warre.

19. సౌలుమీద యుద్ధముచేయబోయిన ఫిలిష్తీయులతో కూడ దావీదు వచ్చినప్పుడు మనష్షే సంబం ధులలో కొందరును అతని పక్షముచేరిరి; దావీదు ఫిలిష్తీ యులకు సహాయము చేయకపోయెను, ఏలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తమకు ప్రాణ హాని చేయునని యెంచి ఫిలిష్తీయుల అధికారులు అతని పంపివేసిరి.

19. And of Manasses there fell certaine vnto Dauid, whan he came to the battayll with the Philistynes agaynst Saul, and helped them not, for the prynces of ye Philistynes counceled to let him go from them, and sayde: Yf he fell vnto his lorde Saul, it mighte cost vs oure neckes.

20. అంతట అతడు సిక్లగునకు తిరిగి పోవుచుండగా మనష్షే సంబంధులైన అద్నా యోజాబాదు, యెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై అను మనష్షే గోత్రపువారికి అధిపతులు అతని పక్షముచేరిరి.

20. Now wha he departed vnto Siclag, there fell vnto him of Manasses, Adna, Iosabad, Iediael, Michael, Iosabad, Elihu, Zilthai, heades ouer thousandes in Manasses.

21. వారందరును పరాక్రమ శాలులును సైన్యాధిపతులునై యుండిరి; ఆ దండును హతముచేయుటకు వారు దావీదునకు సహాయముచేసిరి.

21. And they helped Dauid against the men of warre: for they were all valeaunt Worthies, and were captaynes ouer the hoost.

22. దావీదు దండు దేవుని సైన్యమువలె మహాసైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయము చేయువారు అతనియొద్దకు వచ్చు చుండిరి.

22. And euery daye came there some to Dauid, to helpe him, till there was a greate hoost as an hoost of God.

23. యెహోవా నోటిమాట ప్రకారము సౌలుయొక్క రాజ్యమును దావీదుతట్టు త్రిప్పవలెనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతనియొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క యెంతయనగా

23. And this is the nombre of the heades harnessed vnto the warre, which came to Dauid vnto Hebron, for to turne the kyngdome of Saul vnto him, acordynge to the worde of the LORDE.

24. యూదావారిలో డాలును ఈటెను పట్టుకొని యుద్ధసన్నద్ధులై యున్నవారు ఆరువేల ఎనిమిదివందలమంది.

24. The childre of Iuda, which handled speares and swerdes, were sixe thousande, & eight hundreth ready harnessed vnto ye warre.

25. షిమ్యోనీయులలో యుద్ధ మునకు తగినశూరులు ఏడువేల నూరుమంది.

25. Of the children of Simeon noble men of armes for the battayll, seuen thousande and an hudreth.

26. లేవీయులలో అట్టివారు నాలుగువేల ఆరువందలమంది.

26. Of the children of Leui foure thousande and sixe hundreth.

27. అహరోను సంతతివారికి యెహోయాదా అధిపతి, అతనితోకూడ ఉన్నవారు మూడువేల ఏడు వందలమంది.

27. And Ioiada the prynce amonge them of Aaron with thre thousande and seuen hundreth.

28. పరాక్రమశాలియైన సాదోకు అను ¸యౌవనునితో కూడ అతని తండ్రి యింటివారైన అధిపతులు ఇరువదియిద్దరు.

28. Sadoc the yonge valeaunt man of armes with his fathers house, two and twentye rulers.

29. సౌలు సంబంధులగు బెన్యా మీనీయులు మూడువేలమంది; అప్పటివరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు గాపాడుచుండిరి.

29. Of the children of BenIamin Sauls brother, thre thousande: for vnto that time helde many of the yet with the house of Saul.

30. తమపితరుల యింటివారిలో పేరుపొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిమీయులలో ఇరువదివేల ఎనిమిది వందలమంది.

30. Of ye children of Ephraim, twentie thousande and eighte hundreth valeaunt men of armes, and famous in the house of their fathers.

31. మనష్షే యొక్క అర్ధగోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటకై రావలెనని పేరు పేరుగా నియమింపబడినవారు పదునెనిమిదివేలమంది.

31. Of the halfe trybe of Manasses, eightene thousande, named by name, to come and make Dauid kynge.

32. ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానముకలిగి ఇశ్రాయేలీయులు చేయతగినదేదో దాని నెరిగియున్న అధిపతులు రెండువందలు; వీరి గోత్రపు వారందరును వీరి యాజ్ఞకు బద్ధులైయుండిరి.

32. Of the children of Isachar (which were men of vnderstondynge, whan nede requyred to knowe what Israel shulde do) two hundreth captaynes, and all their brethren folowed their worde.

33. జెబూలూ నీయులలో సకలవిధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగినవారును యుద్ధపు నేర్పుగలవారును మనస్సునందు పొరపులేకుండ యుద్ధము చేయగలవారును ఏబదివేలమంది.

33. Of Sabulon, soch as wente forth in the hoost to ye warre, ready with all maner of weapens for the battayll, fyftye thousande, beynge of one mynde to kepe them selues in ordre.

34. నఫ్తాలీయులలో వెయ్యిమంది అధిపతులు, వారితోకూడ డాలును ఈటెను పట్టుకొనిన వారు ముప్పది యేడువేలమంది.

34. Of Nephtali, a thousande captaynes, & with them soch as handled shylde and speare, seuen and thyrtie thousande.

35. దానీయులలో యుద్ధ సన్నద్ధులైన వారు ఇరువది యెనిమిదివేల ఆరు వందల మంది.

35. Of Dan, ready harnessed to the battayll, eight and twentye thousande, and sixe hundreth.

36. ఆషేరీయులలో యుద్ధపు నేర్పుగల యుద్ధ సన్నద్ధులు నలువది వేలమంది.

36. Of Asser, soch as wente forth in ye hoost, ready harnessed to the battayll, fortye thousande

37. మరియయొర్దాను నది అవతలనుండు రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రపు వారిలోను సకలవిధమైన యుద్ధాయుధములను ధరించు యుద్ధశూరులైన యీ యోధులందరు దావీదును ఇశ్రాయేలుమీద రాజుగా నియమించవలెనన్న కోరిక హృదయమందు కలిగినవారై ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి.

37. From beyonde Iordane, of the Rubenites, Gaddites and the halfe trybe of Manasses, with all maner of weapens to the battayll, an hudreth and twentye thousande.

38. ఇశ్రాయేలులో కడమ వారందరును ఏకమనస్కులై దావీదును రాజుగా నియ మింపవలెనని కోరియుండిరి.

38. All these men of warre, ready harnessed to the battayll, came with a whole hert vnto Hebron, to make Dauid kynge ouer all Israel. And all Israel besyde were of one hert, that Dauid shulde be made kynge.

39. వారి సహోదరులు వారికొరకు భోజనపదార్థములను సిద్ధము చేసియుండగా వారు దావీదుతోకూడ అచ్చట మూడు దినములుండి అన్న పానములు పుచ్చుకొనిరి.

39. And there were they with Dauid thre dayes, eatynge and drynkynge: for their brethren had prepared for them.

40. ఇశ్రాయేలీయులకు సంతోషము కలిగియుండెను గనుక ఇశ్శాఖారు జెబూలూను నఫ్తాలి అనువారి పొలిమేరలవరకు వారికి సమీపమైనవారు గాడిదలమీదను ఒంటెలమీదను కంచరగాడిదల మీదను ఎద్దుల మీదను ఆహారవస్తువులైన పిండివంటకములను అంజూరపు అడలను ఎండిన ద్రాక్షపండ్ల గెలలను ద్రాక్షారసమును నూనెను గొఱ్ఱెలను పశువులను విస్తార ముగా తీసికొనివచ్చిరి.

40. And soch neghbours as were aboute them vntyll Isachar, Zabulon and Nephtali, brought bred vpon Asses, Camels, Mules and oxen to eate: meel, fyges, rasens, wyne, oyle, oxen, shepe, very many: for there was ioye in Israel.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles I - 1 దినవృత్తాంతములు 12 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

జిక్లాగ్ వద్ద దావీదు వద్దకు వచ్చిన వారు. (1-22) 
డేవిడ్ హింసించబడిన సమయాల్లో అతనికి స్నేహితులుగా ఉండి అతనికి మద్దతుగా నిలిచిన వారి రికార్డు ఇక్కడ ఉంది. ఒక పాపిని రక్షకుని వెదకకుండా ఎటువంటి సవాళ్లు లేదా ప్రమాదాలు నిరోధించకూడదు, అలాగే విశ్వాసిని వారి విధులను నెరవేర్చకుండా ఎటువంటి ఇబ్బందులు అడ్డుకోకూడదు. ఈ ప్రయత్నాలలో పట్టుదలతో మరియు విజయం సాధించిన వారికి సమృద్ధిగా ప్రతిఫలం లభిస్తుంది. అమాసాయి మాటలు ప్రభువైన యేసు పట్ల మన ప్రేమను మరియు విధేయతను ఎలా వ్యక్తపరచాలో నేర్పుతాయి. మన చర్యల ద్వారా మన విధేయతను చూపించడానికి ఆత్రంగా ముందుకు వస్తూ, మనల్ని మనం పూర్తిగా ఆయనతో సమం చేసుకోవాలి. ఆత్మ మనకు మార్గనిర్దేశం చేస్తే, మన వైఖరిని బహిరంగంగా ప్రకటిస్తూ, వారి మధ్య లెక్కించబడాలని మనం కోరుకుంటాము. మనము విశ్వాసము మరియు ప్రేమతో క్రీస్తు యొక్క కారణాన్ని హృదయపూర్వకంగా స్వీకరించినప్పుడు, ఆయన మనలను స్వాగతిస్తాడు, మనలను ఉపయోగించుకుంటాడు మరియు మనలను ఉన్నతపరుస్తాడు.

హెబ్రోనుకు వచ్చిన వారు. (23-40)
క్రీస్తు సింహాసనం ఒక వ్యక్తి యొక్క ఆత్మలో స్థాపించబడినప్పుడు, ఆ ఆత్మను నింపే అపారమైన ఆనందం ఉండాలి. ఏర్పాటు చేసిన నిబంధనలు భూమిపై ఉన్నటువంటివి, తాత్కాలికమైనవి మరియు క్షణికమైనవి కావు, కానీ అవి జీవితాంతం విస్తరించి శాశ్వతత్వం వరకు విస్తరించి ఉంటాయి. దావీదు కుమారుడైన యేసుక్రీస్తుకు లొంగిపోవడాన్ని తమ బాధ్యతగా మరియు ప్రయోజనంగా తెలివిగా గుర్తించిన వారు అదృష్టవంతులు. ఈ విధేయతకు విరుద్ధమైన దేనినైనా వారు ఇష్టపూర్వకంగా వదులుకుంటారు. మంచితనాన్ని పెంపొందించడానికి వారి హృదయపూర్వక ప్రయత్నాలు, ఆయన బోధనలు, వ్యక్తిగత అనుభవాలు మరియు జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా దేవుడు ప్రసాదించిన జ్ఞానం ద్వారా మార్గనిర్దేశం చేయబడతాయి. ఎవరికైనా ఈ జ్ఞానం లోపిస్తే, వారు నింద లేకుండా అందరికీ దాతృత్వముగా ప్రసాదించే దేవుడిని వేడుకుంటే చాలు, అది వారికి ఖచ్చితంగా ప్రసాదించబడుతుంది.



Shortcut Links
1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |