Chronicles I - 1 దినవృత్తాంతములు 15 | View All

1. దావీదు తనకొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను; దేవుని మందస మునకు ఒక స్థలమును సిద్ధపరచి, దానిమీద గుడారమొకటి వేయించెను.

1. daaveedu thanakoraku daaveedupuramandu iṇḍlu kaṭṭin̄chenu; dhevuni mandasa munaku oka sthalamunu siddhaparachi, daanimeeda guḍaaramokaṭi vēyin̄chenu.

2. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పివారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను.

2. mandasamunu etthuṭakunu nityamu thanaku sēva cheyuṭakunu yehōvaa lēveeyulanu ērparachukonenani cheppivaaru thappa mari evarunu dhevuni mandasamunu etthakooḍadani daaveedu aagna icchenu.

3. అంతట దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తీసికొనివచ్చుటకై ఇశ్రాయేలీయులనందరిని యెరూషలేమునకు సమాజముగా కూర్చెను.

3. anthaṭa daaveedu thaanu yehōvaa mandasamunaku siddhaparachina sthalamunaku daani theesikonivachuṭakai ishraayēleeyulanandarini yerooshalēmunaku samaajamugaa koorchenu.

4. అహరోను సంతతివారిని

4. aharōnu santhathivaarini

5. లేవీయులైన కహాతు సంతతివారి అధిపతియగు ఊరీయేలును వాని బంధువులలో నూట ఇరువదిమందిని,

5. lēveeyulaina kahaathu santhathivaari adhipathiyagu ooreeyēlunu vaani bandhuvulalō nooṭa iruvadhimandhini,

6. మెరారీయులలో అధిపతియైన అశాయాను వాని బంధువులలో రెండువందల ఇరువది మందిని,

6. meraareeyulalō adhipathiyaina ashaayaanu vaani bandhuvulalō reṇḍuvandala iruvadhi mandhini,

7. గెర్షోను సంతతివారికధిపతియగు యోవే లును వాని బంధువులలో నూట ముప్పదిమందిని,

7. gershonu santhathivaarikadhipathiyagu yōvē lunu vaani bandhuvulalō nooṭa muppadhimandhini,

8. ఎలీషాపాను సంతతివారికధిపతియగు షెమయాను వాని బంధు వులలో రెండువందలమందిని,

8. eleeshaapaanu santhathivaarikadhipathiyagu shemayaanu vaani bandhu vulalō reṇḍuvandalamandhini,

9. హెబ్రోను సంతతివారి కధిపతియగు ఎలీయేలును వాని బంధువులలో ఎనుబది మందిని

9. hebrōnu santhathivaari kadhipathiyagu eleeyēlunu vaani bandhuvulalō enubadhi mandhini

10. ఉజ్జీయేలు సంతతివారికధిపతియగు అమ్మినా దాబును వాని బంధువులలో నూట పండ్రెండుగురిని దావీదు సమకూర్చెను.

10. ujjeeyēlu santhathivaarikadhipathiyagu amminaa daabunu vaani bandhuvulalō nooṭa paṇḍreṇḍugurini daaveedu samakoorchenu.

11. అంతట దావీదు యాజకులైన సాదోకును అబ్యాతారును లేవీయులైన ఊరియేలు అశాయా యోవేలు షెమయా ఎలీయేలు అమీ్మనాదాబు అనువారిని పిలిపించి వారితో ఇట్లనెను.

11. anthaṭa daaveedu yaajakulaina saadōkunu abyaathaarunu lēveeyulaina ooriyēlu ashaayaa yōvēlu shemayaa eleeyēlu ameemanaadaabu anuvaarini pilipin̄chi vaarithoo iṭlanenu.

12. లేవీయుల పితరుల సంతతులకుమీరు పెద్దలై యున్నారు.

12. lēveeyula pitharula santhathulakumeeru peddalai yunnaaru.

13. ఇంతకుముందు మీరు ఇశ్రా యేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక యుండుటచేతను, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధినిబట్టి విచారణచేయకుండుటచేతను, ఆయన మనలో నాశనము కలుగజేసెను; కావున ఇప్పుడు మీరును మీవారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, నేను ఆ మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తేవలెను.

13. inthakumundu meeru ishraayēleeyula dhevuḍaina yehōvaa mandasamunu mōyaka yuṇḍuṭachethanu, manamu mana dhevuḍaina yehōvaa yoddha vidhinibaṭṭi vichaaraṇacheyakuṇḍuṭachethanu, aayana manalō naashanamu kalugajēsenu; kaavuna ippuḍu meerunu meevaarunu mimmunu meeru prathishṭhin̄chukoni, nēnu aa mandasamunaku siddhaparachina sthalamunaku daani thēvalenu.

14. అప్పుడు యాజకులును లేవీయులును ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి.

14. appuḍu yaajakulunu lēveeyulunu ishraayēleeyula dhevuḍaina yehōvaa mandasamunu techuṭakai thammunu thaamu prathishṭhin̄chukoniri.

15. తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటనుబట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీదికి ఎత్తికొనిరి.

15. tharuvaatha lēveeyulu yehōvaa selavichina maaṭanubaṭṭi mōshē aagnaapin̄chinaṭlu dhevuni mandasamunu daani daṇḍelathoo thama bhujamula meediki etthikoniri.

16. అంతట దావీదుమీరు మీ బంధువులగు పాటకులను పిలిచి, స్వరమండలములు సితారాలు తాళములు లోనగు వాద్యవిశేషములతో గంభీర ధ్వని చేయుచు, సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటుచేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను.

16. anthaṭa daaveedumeeru mee bandhuvulagu paaṭakulanu pilichi, svaramaṇḍalamulu sithaaraalu thaaḷamulu lōnagu vaadyavishēshamulathoo gambheera dhvani cheyuchu, santhooshamuthoo svaramuletthi paaḍunaṭlu ērpaaṭucheyuḍani lēveeyula adhipathulaku aagna icchenu.

17. కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును, వాని బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులగు మెరారీయులలో కూషాయాహు కుమారుడైన ఏతానును,

17. kaavuna lēveeyulu yōvēlu kumaaruḍaina hēmaanunu, vaani bandhuvulalō berekyaa kumaaruḍaina aasaapunu, thama bandhuvulagu meraareeyulalō kooshaayaahu kumaaruḍaina ēthaanunu,

18. వీరితోకూడ రెండవ వరుసగానున్న తమ బంధువులైన జెకర్యా బేను యహజీయేలు షెమీరా మోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు బెనాయా మయ శేయా మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహులనువారిని ద్వారపాలకులగు ఓబేదెదోమును యెహీయేలును పాటకు లనుగా నియమించిరి.

18. veerithookooḍa reṇḍava varusagaanunna thama bandhuvulaina jekaryaa bēnu yahajeeyēlu shemeeraa mōthu yeheeyēlu unnee ēleeyaabu benaayaa maya shēyaa matthityaa eleeplēhu miknēyaahulanuvaarini dvaarapaalakulagu ōbēdedōmunu yeheeyēlunu paaṭaku lanugaa niyamin̄chiri.

19. పాటకులైన హేమానును ఆసాపును ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి.

19. paaṭakulaina hēmaanunu aasaapunu ēthaanunu pan̄chalōhamula thaaḷamulu vaayin̄chuṭaku nirṇayimpabaḍiri.

20. జెకర్యా అజీయేలు షెమరామోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు మయశేయా బెనాయా అనువారు హెచ్చు స్వరముగల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి.

20. jekaryaa ajeeyēlu shemeeraamōthu yeheeyēlu unnee ēleeyaabu mayashēyaa benaayaa anuvaaru hechu svaramugala svaramaṇḍalamulanu vaayin̄chuṭaku nirṇayimpabaḍiri.

21. మరియు మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహు ఓబేదెదోము యెహీయేలు అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడిరి.

21. mariyu matthityaa eleeplēhu miknēyaahu ōbēdedōmu yeheeyēlu ajajyaahu anuvaaru raagametthuṭakunu sithaaraalu vaayin̄chuṭakunu nirṇayimpabaḍiri.

22. లేవీయుల కధిపతియైన కెనన్యా మందసమును మోయుటయందు గట్టివాడై నందున అతడు మోతక్రమము నేర్పుటకై నియమింపబడెను.

22. lēveeyula kadhipathiyaina kenanyaa mandasamunu mōyuṭayandu gaṭṭivaaḍai nanduna athaḍu mōthakramamu nērpuṭakai niyamimpabaḍenu.

23. బెరెక్యాయును ఎల్కానాయును మందస మునకు ముందునడుచు కావలివారుగాను

23. berekyaayunu elkaanaayunu mandasa munaku mundunaḍuchu kaavalivaarugaanu

24. షెబన్యా యెహోషాపాతు నెతనేలు అమాశై జెకర్యా బెనాయా ఎలీయెజెరు అను యాజకులు దేవుని మందసమునకు ముందు బూరలు ఊదువారుగాను, ఓబేదెదోమును యెహీయాయును వెనుకతట్టు కనిపెట్టువారుగాను నియమింపబడిరి.

24. shebanyaa yehōshaapaathu nethanēlu amaashai jekaryaa benaayaa eleeyejeru anu yaajakulu dhevuni mandasamunaku mundu booralu ooduvaarugaanu, ōbēdedōmunu yeheeyaayunu venukathaṭṭu kanipeṭṭuvaarugaanu niyamimpabaḍiri.

25. దావీదును ఇశ్రాయేలీయుల పెద్దలును సహస్రాధిపతులును యెహోవా నిబంధన మందసమును ఓబేదెదోము ఇంటిలోనుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి.

25. daaveedunu ishraayēleeyula peddalunu sahasraadhipathulunu yehōvaa nibandhana mandasamunu ōbēdedōmu iṇṭilōnuṇḍi techuṭakai utsaahamuthoo pōyiri.

26. యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయముచేయగా వారు ఏడు కోడె లను ఏడు గొఱ్ఱపొట్టేళ్లను బలులుగా అర్పించిరి.

26. yehōvaa nibandhana mandasamunu mōyu lēveeyulaku dhevuḍu sahaayamucheyagaa vaaru ēḍu kōḍe lanu ēḍu gorrapoṭṭēḷlanu balulugaa arpin̄chiri.

27. దావీదును మందసమును మోయు లేవీయులందరును పాటకులును పాటకుల పనికి విచారణకర్తయగు కెనన్యాయును సన్నపునారతో నేయబడిన వస్త్రములు ధరించుకొని యుండిరి, దావీదును సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించియుండెను.

27. daaveedunu mandasamunu mōyu lēveeyulandarunu paaṭakulunu paaṭakula paniki vichaaraṇakarthayagu kenanyaayunu sannapunaarathoo nēyabaḍina vastramulu dharin̄chukoni yuṇḍiri, daaveedunu sannapu naarathoo nēyabaḍina ēphōdunu dharin̄chiyuṇḍenu.

28. ఇశ్రాయేలీయులందరును ఆర్బా éటము చేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసికొనివచ్చిరి.

28. ishraayēleeyulandarunu aarbaa éṭamu cheyuchu, kommulu booralu ooduchu, thaaḷamulu koṭṭuchu, svaramaṇḍalamulu sithaaraalu vaayin̄chuchu yehōvaa nibandhana mandasamunu theesikonivachiri.

29. యెహోవా నిబంధన మందసము దావీదుపురములోనికి రాగా సౌలు కుమార్తెయైన మీకాలు కిటికీలోనుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను.

29. yehōvaa nibandhana mandasamu daaveedupuramulōniki raagaa saulu kumaartheyaina meekaalu kiṭikeelōnuṇḍi chuchi raajaina daaveedu naaṭyamaaḍuṭayu vaayin̄chuṭayu kanugoni thana manassulō athani heenaparachenu.Shortcut Links
1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |