Chronicles I - 1 దినవృత్తాంతములు 21 | View All

1. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి, ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా

1. tharuvaatha saathaanu ishraayēlunaku virōdhamugaa lēchi, ishraayēleeyulanu lekkin̄chuṭaku daaveedunu prērēpimpagaa

2. దావీదు యోవాబునకును జనులయొక్క అధి పతులకునుమీరు వెళ్లి బెయేరషెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి, వారి సంఖ్య నాకు తెలియుటకై నాయొద్దకు దాని తీసికొని రండని ఆజ్ఞ ఇచ్చెను.

2. daaveedu yōvaabunakunu janulayokka adhi pathulakunumeeru veḷli beyērshebaa modalukoni daanu varaku uṇḍu ishraayēleeyulanu en̄chi, vaari saṅkhya naaku teliyuṭakai naayoddhaku daani theesikoni raṇḍani aagna icchenu.

3. అందుకు యోవాబురాజా నా యేలిన వాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్నవారికంటె నూరంతలు ఎక్కువమందిని చేయునుగాక;వారందరు నా యేలినవాని దాసులుకారా? నా యేలినవానికి ఈ విచారణ యేల? ఇది జరుగవలసిన హేతువేమి? జరిగినయెడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగును అని మనవిచేసెను.

3. anduku yōvaaburaajaa naa yēlina vaaḍaa, yehōvaa thana janulanu ippuḍunnavaarikaṇṭe nooranthalu ekkuvamandhini cheyunugaaka;vaarandaru naa yēlinavaani daasulukaaraa? Naa yēlinavaaniki ee vichaaraṇa yēla? Idi jarugavalasina hēthuvēmi? Jariginayeḍala ishraayēleeyulaku shiksha kalugunu ani manavichesenu.

4. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమందంతట సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను.

4. ayinanu yōvaabu maaṭa chellaka raaju maaṭayē chellenu ganuka yōvaabu ishraayēlu dheshamandanthaṭa san̄charin̄chi thirigi yerooshalēmunaku vachi janula saṅkhya verasi daaveedunaku appagin̄chenu.

5. ఇశ్రాయేలీయులందరిలో కత్తి దూయువారు పదకొండు లక్షల మందియు యూదా వారిలో కత్తి దూయువారు నాలుగు లక్షల డెబ్బదివేల మందియు సంఖ్యకు వచ్చిరి.

5. ishraayēleeyulandarilō katthi dooyuvaaru padakoṇḍu lakshala mandiyu yoodhaa vaarilō katthi dooyuvaaru naalugu lakshala ḍebbadhivēla mandiyu saṅkhyaku vachiri.

6. రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక అతడు లేవి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు.

6. raaju maaṭa yōvaabunaku asahyamugaa uṇḍenu ganuka athaḍu lēvi benyaameenu gōtra sambandhulanu aa saṅkhyalō cherchalēdu.

7. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుటచేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టెను.

7. ee kaaryamu dhevuni drushṭiki prathikoolamaguṭachetha aayana ishraayēleeyulanu baadhapeṭṭenu.

8. దావీదునేను ఈ కార్యముచేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొఱ్ఱపెట్టగా

8. daaveedunēnu ee kaaryamuchesi adhika paapamu techukoṇṭini, nēnu mikkili avivēkamugaa pravarthin̄chithini, ippuḍu nee daasuni dōshamu pariharin̄chumani dhevunithoo morrapeṭṭagaa

9. యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఈలాగు సెలవిచ్చెనునీవు వెళ్లి దావీ దుతో ఇట్లనుము.

9. yehōvaa daaveedunaku darshakuḍagu gaaduthoo eelaagu selavicchenuneevu veḷli daavee duthoo iṭlanumu.

10. యెహోవా సెలవిచ్చునదేమనగామూడు విషయములు నేను నీయెదుట నుంచుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకొనినయెడల దాని నీకు చేయుదును.

10. yehōvaa selavichunadhemanagaamooḍu vishayamulu nēnu neeyeduṭa nun̄chuchunnaanu, vaaṭilō okadaanini neevu kōrukoninayeḍala daani neeku cheyudunu.

11. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి యిట్లనెను

11. kaavuna gaadu daaveedu noddhaku vachi yiṭlanenu

12. మూడేండ్ల పాటు కరవు కలుగుట, మూడు నెలలపాటు నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరుమగా నీవు వారియెదుట నిలువ లేక నశించిపోవుట, మూడు దినములపాటు దేశమందు యెహోవా కత్తి, అనగా తెగులు నిలుచుటచేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమందంతట నాశనము కలుగజేయుట, అను వీటిలో ఒకదానిని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు; కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరమియ్యవలెనో దాని యోచించుము.

12. mooḍēṇḍla paaṭu karavu kaluguṭa, mooḍu nelalapaaṭu nee shatruvulu katthidoosi ninnu tharumagaa neevu vaariyeduṭa niluva lēka nashin̄chipōvuṭa, mooḍu dinamulapaaṭu dheshamandu yehōvaa katthi, anagaa tegulu niluchuṭachetha yehōvaa dootha ishraayēleeyula dheshamandanthaṭa naashanamu kalugajēyuṭa, anu veeṭilō okadaanini neevu kōrukonumani yehōvaa selavichuchunnaaḍu; kaavuna nannu pampina vaaniki nēnu ēmi pratyuttharamiyyavalenō daani yōchin̄chumu.

13. అందుకు దావీదునేను మిక్కిలి యిరుకులో చిక్కియున్నాను; యెహోవా మహా కృపగలవాడు, నేను మనుష్యులచేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను.

13. anduku daaveedunēnu mikkili yirukulō chikkiyunnaanu; yehōvaa mahaa krupagalavaaḍu, nēnu manushyulachethilō paḍaka aayana chethilōnē paḍudunu gaaka ani gaaduthoo anenu.

14. కావున యెహోవా ఇశ్రాయేలీయులమీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో డెబ్బదివేలమంది చచ్చిరి.

14. kaavuna yehōvaa ishraayēleeyulameediki tegulu pampagaa ishraayēleeyulalō ḍebbadhivēlamandi chachiri.

15. యెరూషలే మును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను; అతడు నాశనము చేయబోవుచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపమొంది నాశనముచేయు దూతతోచాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెల వియ్యగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్లమునొద్ద నిలిచెను.

15. yerooshalē munu naashanamu cheyuṭakai dhevuḍu oka doothanu pampenu; athaḍu naashanamu cheyabōvuchuṇḍagaa yehōvaa chuchi aa cheṭu vishayamai santhaapamondi naashanamucheyu doothathoochaalunu, ippuḍu nee cheyyi aapumani sela viyyagaa aa dootha yebooseeyuḍaina ornaanu kaḷlamunoddha nilichenu.

16. దావీదు కన్నులెత్తి చూడగా, భూమ్యా కాశముల మధ్యను నిలుచుచు, వరదీసిన కత్తిచేత పట్టుకొని దానిని యెరూషలేముమీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలును గోనె పట్టలు కప్పుకొనినవారై సాష్టాంగపడగా

16. daaveedu kannuletthi chooḍagaa, bhoomyaa kaashamula madhyanu niluchuchu, varadeesina katthichetha paṭṭukoni daanini yerooshalēmumeeda chaapina yehōvaa dootha kanabaḍenu. Appuḍu daaveedunu peddalunu gōne paṭṭalu kappukoninavaarai saashṭaaṅgapaḍagaa

17. దావీదుజనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనేగదా? పాపము చేసి చెడుతనము జరిగించినవాడను నేనేగదా? గొఱ్ఱెలవంటివారగు వీరేమి చేసిరి? నా దేవుడవైన యెహోవా, బాధపెట్టు నీ చెయ్యి నీ జనులమీద నుండ కుండ నామీదను నా తండ్రి యింటివారిమీదను ఉండ నిమ్మని దేవునితో మనవిచేసెను.

17. daaveedujanulanu en̄chumani aagna ichinavaaḍanu nēnēgadaa? Paapamu chesi cheḍuthanamu jarigin̄chinavaaḍanu nēnēgadaa? Gorrelavaṇṭivaaragu veerēmi chesiri? Naa dhevuḍavaina yehōvaa, baadhapeṭṭu nee cheyyi nee janulameeda nuṇḍa kuṇḍa naameedanu naa thaṇḍri yiṇṭivaarimeedanu uṇḍa nimmani dhevunithoo manavichesenu.

18. యెబూసీయుడైన ఒర్నాను కళ్లమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్లవలెనని దావీదునకు ఆజ్ఞ నిమ్మని యెహోవా దూత గాదునకు సెలవియ్యగా

18. yebooseeyuḍaina ornaanu kaḷlamunandu yehōvaaku oka balipeeṭamunu kaṭṭin̄chuṭakai daaveedu acchaṭiki veḷlavalenani daaveedunaku aagna nimmani yehōvaa dootha gaadunaku selaviyyagaa

19. యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్లెను.

19. yehōvaa naamamuna gaadu palikina maaṭa prakaaramu daaveedu veḷlenu.

20. ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చు చుండెను; అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు, అతడును అతనితో కూడనున్న అతని నలుగురు కుమారు లును దాగుకొనిరి.

20. ornaanu appuḍu gōdhumalanu noorchu chuṇḍenu; athaḍu venukaku thirigi doothanu chuchinappuḍu, athaḍunu athanithoo kooḍanunna athani naluguru kumaaru lunu daagukoniri.

21. దావీదు ఒర్నానునొద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి, కళ్లములోనుండి వెలుపలికి వచ్చి, తల నేల మట్టునకు వంచి దావీదుకు నమస్కారము చేసెను.

21. daaveedu ornaanunoddhaku vachinappuḍu ornaanu daaveedunu chuchi, kaḷlamulōnuṇḍi velupaliki vachi, thala nēla maṭṭunaku van̄chi daaveeduku namaskaaramu chesenu.

22. ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్లపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాని నాకు తగిన క్రయమునకిమ్మని దావీదు ఒర్నానుతో అనగా

22. ee tegulu janulanu viḍichipōvunaṭlugaa ee kaḷlapu pradheshamandu nēnu yehōvaaku oka balipeeṭamunu kaṭṭin̄chuṭakai daani naaku thagina krayamunakimmani daaveedu ornaanuthoo anagaa

23. ఒర్నానురాజైన నా యేలినవాడు దాని తీసికొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయును గాక; ఇదిగో దహనబలులకు ఎద్దులు కట్టెలకై నురిపిడి సామగ్రి నైవేద్యమునకు గోధుమ పిండి; ఇదియంతయు నేనిచ్చెదనని దావీదుతో అనెను.

23. ornaanuraajaina naa yēlinavaaḍu daani theesikoni thana drushṭiki anukoolamainaṭṭu cheyunu gaaka; idigō dahanabalulaku eddulu kaṭṭelakai nuripiḍi saamagri naivēdyamunaku gōdhuma piṇḍi; idiyanthayu nēnicchedhanani daaveeduthoo anenu.

24. రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసికొని యెహోవాకు దహనబలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాని తీసికొందునని ఒర్నానుతో చెప్పి

24. raajaina daaveedu aṭlu kaadu, nēnu nee sotthunu ooraka theesikoni yehōvaaku dahanabalulanu arpin̄chanu, nyaayamaina krayadhanamichi daani theesikondunani ornaanuthoo cheppi

25. ఆ భూమికి ఆరువందల తులముల బంగారమును అతని కిచ్చెను.

25. aa bhoomiki aaruvandala thulamula baṅgaaramunu athani kicchenu.

26. పిమ్మటదావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి. దహనబలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆకాశములోనుండి దహనబలిపీఠము మీదికి అగ్నివలన అతనికి ప్రత్యుత్తరమిచ్చెను.

26. pimmaṭadaaveedu yehōvaaku acchaṭa oka balipeeṭamunu kaṭṭin̄chi. Dahanabalulanu samaadhaana balulanu arpin̄chi yehōvaaku morrapeṭṭagaa aayana aakaashamulōnuṇḍi dahanabalipeeṭhamu meediki agnivalana athaniki pratyuttharamicchenu.

27. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరల వరలో వేసెను.

27. yehōvaa doothaku aagnaapimpagaa athaḍu thana katthini marala varalō vēsenu.

28. యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందు యెహోవా తనకు ప్రత్యుత్తరమిచ్చెనని దావీదు తెలిసికొని అచ్చటనే బలి అర్పించెను

28. yebooseeyuḍaina ornaanu kaḷlamandu yehōvaa thanaku pratyuttharamicchenani daaveedu telisikoni acchaṭanē bali arpin̄chenu

29. మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహనబలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందుండెను.

29. mōshē araṇyamandu cheyin̄china yehōvaa nivaasapu guḍaaramunu dahanabalipeeṭamunu aa kaalamandu gibiyōnulōni unnatha sthalamanduṇḍenu.

30. దావీదు యెహోవాదూత పట్టుకొనిన కత్తికి భయపడినవాడై దేవునియొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ల లేకుండెను.

30. daaveedu yehōvaadootha paṭṭukonina katthiki bhayapaḍinavaaḍai dhevuniyoddha vichaarin̄chuṭaku aa sthalamunaku veḷla lēkuṇḍenu.Shortcut Links
1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |