Chronicles I - 1 దినవృత్తాంతములు 23 | View All

1. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయెను గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించెను.

1. Now when David reached old age, he made his son Solomon king over Israel.

2. మరియు అతడు ఇశ్రా యేలీయుల యధిపతులందరిని యాజకులను లేవీయులను సమకూర్చెను.

2. And he gathered together all the leaders of Israel with the priests and the Levites.

3. అప్పుడు లేవీయులు ముప్పది సంవత్సర ములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు కవిలెలో చేర్చబడిరి; వారి సంఖ్య ముప్పది యెనిమిది వేల పురుషులు.

3. The Levites were numbered from thirty years old and upward, and their number by census of men was 38,000.

4. వీరిలో ఇరువది నాలుగువేలమంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను, ఆరు వేలమంది అధిపతులుగాను, న్యాయాధిపతులుగాను ఉండిరి.

4. Of these, 24,000 were to oversee the work of the house of the LORD; and 6,000 [were] officers and judges,

5. నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరినాలుగు వేలమంది స్తుతిచేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్యవిశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి.

5. and 4,000 [were] gatekeepers, and 4,000 [were] praising the LORD with the instruments which David made for giving praise.

6. గెర్షోను కహాతు మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను షిమీ అనువారుండిరి.

6. David divided them into divisions according to the sons of Levi: Gershon, Kohath, and Merari.

7. లద్దాను కుమారులు ముగ్గురు;

7. Of the Gershonites [were] Ladan and Shimei.

8. పెద్దవాడగు యెహీయేలు, జేతాము యోవేలు

8. The sons of Ladan [were] Jehiel the first and Zetham and Joel, three.

9. షిమీ కుమారులు ముగ్గురు, షెలోమీతు హజీయేలు హారాను, వీరు లద్దాను వంశముయొక్క పితరుల పెద్దలు.

9. The sons of Shimei [were] Shelomoth and Haziel and Haran, three. These were the heads of the fathers' [households] of Ladan.

10. యహతు జీనా యూషు బెరీయా అను నలుగురును షిమీ కుమారులు.

10. The sons of Shimei [were] Jahath, Zina, Jeush and Beriah. These four [were] the sons of Shimei.

11. యహతు పెద్దవాడు జీనా రెండవవాడు. యూషునకును బెరీయాకును కుమారులు అనేకులు లేకపోయిరి గనుక తమ పితరుల యింటి వారిలో వారు ఒక్కవంశముగా ఎంచబడిరి.

11. Jahath was the first and Zizah the second; but Jeush and Beriah did not have many sons, so they became a father's household, one class.

12. కహాతు కుమారులు నలుగురు, అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.

12. The sons of Kohath were four: Amram, Izhar, Hebron and Uzziel.

13. అమ్రాము కుమారులు అహరోను మోషే; అహరోనును అతని కుమారులును నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి.

13. The sons of Amram were Aaron and Moses. And Aaron was set apart to sanctify him as most holy, he and his sons forever, to burn incense before the LORD, to minister to Him and to bless in His name forever.

14. దైవజనుడగు మోషే సంతతివారు లేవి గోత్రపువారిలో ఎంచబడిరి.

14. But [as for] Moses the man of God, his sons were named among the tribe of Levi.

15. మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు.

15. The sons of Moses [were] Gershom and Eliezer.

16. గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు.

16. The son of Gershom [was] Shebuel the chief.

17. ఎలీయెజెరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి, అయితే రెహబ్యాకు అనేకమంది కుమారులుండిరి.

17. The son of Eliezer was Rehabiah the chief; and Eliezer had no other sons, but the sons of Rehabiah were very many.

18. ఇస్హారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు.

18. The son of Izhar was Shelomith the chief.

19. హెబ్రోను కుమారులలో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండవవాడు, యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు.

19. The sons of Hebron [were] Jeriah the first, Amariah the second, Jahaziel the third and Jekameam the fourth.

20. ఉజ్జీయేలు కుమారులలో మీకా పెద్ద వాడు యెషీయా రెండవవాడు.

20. The sons of Uzziel [were] Micah the first and Isshiah the second.

21. మెరారి కుమారులు మహలి మూషి; మహలి కుమారులు ఎలియాజరు కీషు.

21. The sons of Merari were Mahli and Mushi. The sons of Mahli [were] Eleazar and Kish.

22. ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి కాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహము చేసికొనిరి.

22. Eleazar died and had no sons, but daughters only, so their brothers, the sons of Kish, took them [as wives].

23. మూషి కుమారులు ముగ్గురు, మహలి ఏదెరు యెరీమోతు.

23. The sons of Mushi [were] three: Mahli, Eder and Jeremoth.

24. వీరు తమ పితరుల యింటివారినిబట్టి లేవీయులుగా ఎంచబడిరి; పితరుల యిండ్లకు పెద్ద లైన వీరు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారై తమ తమ పేరుల లెక్కప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవచేయు పనివారైయుండిరి.

24. These were the sons of Levi according to their fathers' households, [even] the heads of the fathers' [households] of those of them who were counted, in the number of names by their census, doing the work for the service of the house of the LORD, from twenty years old and upward.

25. ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసియున్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు

25. For David said, 'The LORD God of Israel has given rest to His people, and He dwells in Jerusalem forever.

26. లేవీయులుకూడ ఇకమీదట గుడారమునైనను దాని సేవకొరకైన ఉపకరణ ములనైనను మోయ పనిలేదనియు దావీదు సెలవిచ్చెను.

26. 'Also, the Levites will no longer need to carry the tabernacle and all its utensils for its service.'

27. దావీదు ఇచ్చిన కడవరి యాజ్ఞనుబట్టి లేవీయులలో ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు ఎంచబడిరి.

27. For by the last words of David the sons of Levi [were] numbered from twenty years old and upward.

28. వీరు అహరోను సంతతివారి చేతిక్రింద పని చూచుటకును, వారి వశముననున్న యెహోవా మందిర సేవకొరకై సాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠితవస్తువులను శుద్ధిచేయుటకును, దేవుని మందిర సేవకొరకైన పనిని విచారించుటకును,

28. For their office is to assist the sons of Aaron with the service of the house of the LORD, in the courts and in the chambers and in the purifying of all holy things, even the work of the service of the house of God,

29. సన్నిధి రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని పులుసులేని భోజ్యములను పెనములో కాల్చు దానిని పేల్చుదానిని నానావిధమైన పరిమాణములు గలవాటిని కొలతగలవాటిని విచారించుటకును,

29. and with the showbread, and the fine flour for a grain offering, and unleavened wafers, or [what is baked in] the pan or what is well-mixed, and all measures of volume and size.

30. అనుదినము ఉదయ సాయంకాల ములయందు యెహోవానుగూర్చిన స్తుతి పాటలు పాడు టకును, విశ్రాంతిదినములలోను, అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహనబలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోను, లెక్కకు సరియైనవారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి.

30. They are to stand every morning to thank and to praise the LORD, and likewise at evening,

31. సమాజపు గుడారమును కాపాడుటయు, పరిశుద్ధస్థలమును కాపాడుటయు,

31. and to offer all burnt offerings to the LORD, on the sabbaths, the new moons and the fixed festivals in the number [set] by the ordinance concerning them, continually before the LORD.

32. యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులగు అహరోను సంతతివారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పనియైయుండెను.

32. Thus they are to keep charge of the tent of meeting, and charge of the holy place, and charge of the sons of Aaron their relatives, for the service of the house of the LORD.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles I - 1 దినవృత్తాంతములు 23 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

దావీదు సొలొమోను తన వారసుడిగా ప్రకటించాడు. (1-23) 
ఆలయాన్ని నిర్మించే బాధ్యతను అప్పగించిన తర్వాత, డేవిడ్ ఆలయ సేవకు సంబంధించిన విధానాలను ఏర్పాటు చేసి, దాని అధికారులను నిర్వహిస్తాడు. ఒకే కుటుంబంలోని సభ్యులను కలిసి పనిచేయడానికి కేటాయించే పద్ధతి వారిలో ఐక్యత మరియు సహకార భావాన్ని పెంపొందిస్తుంది.

లేవీయుల కార్యాలయం. (24-32)
ఇజ్రాయెల్‌లోని అనేక జనాభాతో, ఆలయ సేవలో ఎక్కువ మంది వ్యక్తులను చేర్చుకోవడం అవసరం అయింది. నైవేద్యాన్ని సమర్పించే ప్రతి ఇశ్రాయేలీయునికి సహాయం చేయడానికి ఒక లేవీయుడు అందుబాటులో ఉండేలా ఇది నిర్ధారిస్తుంది. పూర్తి చేయడానికి ఎక్కువ మొత్తంలో పని ఉన్నప్పుడు, పెద్ద శ్రామిక శక్తిని కలిగి ఉండటం తార్కికం. నిజమైన క్రైస్తవునికి మరియు ఇతరులకు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, కొత్త హృదయం మరియు ఆధ్యాత్మిక మనస్తత్వం కలిగి ఉండటం, దేవుని ఆజ్ఞలలో అపారమైన ఆనందాన్ని పొందడం మరియు అతని శాసనాలలో పునరుజ్జీవన విందును కనుగొనడం. ఈ గుణం నిజమైన క్రైస్తవుని మిగిలిన మానవాళి నుండి వేరు చేస్తుంది. ఆధ్యాత్మికంగా మొగ్గు చూపే వ్యక్తికి, ప్రతి సేవ తృప్తిని ఇస్తుంది. అటువంటి వ్యక్తి దేవుడు అప్పగించిన పనులలో స్థిరంగా పొంగిపోతాడు, అటువంటి సంతోషకరమైన సేవలో అటువంటి దయగల గురువు కోసం పని చేయడంలో అత్యంత ఆనందాన్ని పొందుతాడు. నాయకత్వ పాత్రకు పిలవబడినా లేదా పైన ఉంచబడిన వారి సంరక్షణను అప్పగించినా, ఆధ్యాత్మిక వ్యక్తి అస్పష్టంగా ఉంటాడు. మన లక్ష్యం ప్రభువును హృదయపూర్వకంగా వెతకడం మరియు చిత్తశుద్ధితో సేవ చేయడం, ఆయన బోధనలపై మనకున్న అచంచలమైన విశ్వాసం ద్వారా మిగిలిన వాటిని ఆయన దైవిక ఏర్పాటుకు అప్పగించడం.



Shortcut Links
1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |