Chronicles I - 1 దినవృత్తాంతములు 3 | View All

1. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులెవరనగా యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు; కర్మెలీయురాలైన అబీగయీలునకు పుట్టిన దానియేలు రెండవవాడు,

1. హెబ్రోను పట్టణంలో దావీదుకు కొందరు కుమారులు పుట్టారు. ఆ కుమారులు ఎవరనగా: దావీదు మొదటి కుమారుడు అమ్నోను. అమ్నోను తల్లి పేరు అహీనోయము. ఆమె యెజ్రెయేలుకు చెందిన స్త్రీ, రెండవ కుమారుని పేరు దానియేలు. అతని తల్లి పేరు అబీగయీలు. ఆమె కర్మేలుకు చెందినది.

2. గెషూరు రాజైన తల్మయి కుమార్తెయైన మయకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు, హగ్గీతు కుమారుడైన అదోనీయా నాల్గవ వాడు,

2. మూడవ కుమారుడు అబ్షాలోము. తల్మయి కుమార్తెయగు మయకా అతని తల్లి. తల్మయి గెషూరుకు రాజు. నాల్గవ కుమారుని పేరు అదోనీయా. అతని తల్లి పేరు హగ్గీతు.

3. అబీటలు కనిన షెఫట్య అయిదవవాడు, అతని భార్యయైన ఎగ్లాకనిన ఇత్రెయాము ఆరవవాడు,

3. ఐదవ కుమారుడు షెఫట్య. అతని తల్లి పేరు అబీటలు. ఆరవవాడు ఇత్రెయాము. ఇతని తల్లి దావీదు భార్య ఎగ్లా.

4. ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి, అచ్చట అతడు ఏడు సంవత్సరముల ఆరునెలలు ఏలెను,

4. దావీదుకు ఈ ఆరుగురు కుమారులు హెబ్రోనులో జన్మించారు. దావీదు అక్కడ ఏడు సంవత్సరాల ఆరు నెలలపాటు పాలించాడు. దావీదు యెరూషలేములో ముప్పదిమూడు సంవత్సరాలు రాజుగా ఉన్నాడు.

5. యెరూష లేములో ముప్పది మూడు సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమీ్మయేలు కుమార్తె యైన బత్షెబవలన కలిగిన షిమ్యా షోబాబు నాతాను సొలొమోను అను నలుగురు

5. దావీదుకు యెరూషలేములో పుట్టిన సంతానమెవరనగా: బత్షెబకు నలుగురు సంతానం. వారు షిమ్యా, షోబాబు, నాతాను మరియు సొలొమోను. బత్షెబ అమ్మీయేలు కుమార్తె.

7. ఎల్యాదా ఎలీపేలెటు అను తొమ్మండ్రు కుమారులు.

7. [This verse may not be a part of this translation]

8. ఉపపత్నులవలన కలిగినవారుగాక వీరందరు దావీదునకు జననమైరి; తామారు వీరికి సహోదరి.

8. [This verse may not be a part of this translation]

9. సొలొమోనునకు రెహబాము కుమారుడు, అతని కుమారుడు అబీయా.

9. వారంతా దావీదు కుమారులు. దావీదుకు ఇంకా దాసీ వలన కూడ కుమారులు కలిగారు. తామారు దావీదు కుమార్తె.

10. అబీ యాకు ఆసా కుమారుడు, ఆసాకు యెహోషాపాతు కుమా రుడు
మత్తయి 1:7-10

10. సొలొమోను కుమారుడు రెహబాము. రెహబాము కుమారుడు అబీయా. అబీయా కుమారుడు ఆసా. ఆసా కుమారుడు యెహోషాపాతు.

11. యెహోషాపాతునకు యెహోరాము కుమారుడు, యెహోరామునకు అహజ్యా కుమారుడు, అహజ్యాకు యోవాషు కుమారుడు,

11. యెహోషాపాతు కుమారుడు యెహోరాము. యెహోరాము కుమారుడు అహజ్యా. అహజ్యా కుమారుడు యోవాషు.

12. యోవాషునకు అమజ్యా కుమారుడు అమజ్యాకు అజర్యా కుమారుడు, అజర్యాకు యోతాము కుమారుడు

12. యోవాషు కుమారుడు అమజ్యా. అమజ్యా కుమారుడు అజర్యా. అజర్యా కుమారుడు యోతాము.

13. యోతామునకు ఆహాజు కుమా రుడు, ఆహాజునకు హిజ్కియా కుమారుడు, హిజ్కియాకు మనష్షే కుమారుడు,

13. యోతాము కుమారుడు ఆహాజు. ఆహాజు కుమారుడు హిజ్కియా. హిజ్కియా కుమారుడు మనష్షే.

14. మనష్షేకు ఆమోను కుమారుడు, ఆమోనునకు యోషీయా కుమారుడు.

14. మనష్షే కుమారుడు ఆమోను. ఆమోను కుమారుడు యోషీయా.

15. యోషీయా కుమారులెవరనగా జ్యేష్ఠుడు యోహానాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాల్గవవాడు షల్లూము.
మత్తయి 1:11

15. యోషీయా కుమారులెవరనగా: యోహానాను మొదటి కుమారుడు. రెండవవాడు యెహోయాకీము. మూడవ కుమారుడు సిద్కియా. నాల్గవవాడు షల్లూము.

16. యెహోయాకీము కుమారులలో యెకొన్యా అను ఒకడుండెను, అతని కుమారుడు సిద్కియా.
మత్తయి 1:11

16. యెహోయాకీము సంతానంలో యెకొన్యా, అతని కుమారుడు: సిద్కియా, అతని కుమారుడు వున్నారు .

17. యకొన్యా కుమారులు అస్సీరు షయల్తీయేలు
మత్తయి 1:12, లూకా 3:37

17. యెహోయాకీను బబలోనులో బందీ అయిన పిమ్మట యెకొన్యా సంతానం ఎవరనగా: షయల్తీయేలు,

18. మల్కీరాము, పెదాయా, షెనజ్జరు, యెకమ్యా, హోషామా మరియు నెదబ్యా.

19. పెదాయా కుమారులు జెరుబ్బాబెలు షిమీ; జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము హనన్యా; షెలోమీతు వారికి సహోదరి.
మత్తయి 1:12

19. పెదాయా కుమారులు జెరుబ్బాబెలు, షిమీ. జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము, హనన్యా, షెలోమీతు మరియు వారి సహోదరి.

20. హషుబా ఓహెలు బెరెక్యాహసద్యా యూషబెస్హెదు అను మరి యయిదుగురుండిరి.

20. జెరుబ్బాబెలుకు ఐదుగురు కుమారులు. వారి పేర్లు: హషుబా, ఓహెలు, బెరెక్యా, హసద్యా మరియు యూషబెస్హెదు.

21. హనన్యా కుమారులు పెలట్యా యెషయా, రెఫాయా కుమారులును అర్నాను కుమారులును ఓబద్యా కుమారులును షెకన్యా కుమారులును.

21. హనన్యా కుమారులు పెలట్యా, యెషయా, రెఫయా, అర్నాను, ఓబద్యా మరియు షెకన్యా .

22. షెకన్యా కుమారులలో షెమయా అను ఒకడుండెను; షెమయా కుమారులు ఆరుగురు. హట్టూషు ఇగాలు బారియహు నెయర్యా షాపాతు.

22. షెకన్యా సంతతిలో షెమయా ఒకడు. షెమయాకు ఆరుగురు కుమారులు: వారు షెమయా, హట్టూషు, ఇగాలు బారియహు, నెయర్యా, షాపాతు.

23. నెయర్యాకు ముగ్గురు కుమారులు: వారు ఎల్యోయేనై, హిజ్కియా, అజీక్రాము.

24. ఎల్యోయేనై కుమారులు ఏడుగురు: వారు హోదవయా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయ్యా మరియు అనాని.Shortcut Links
1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |