Chronicles I - 1 దినవృత్తాంతములు 4 | View All

1. యూదా కుమారులెవరనగా పెరెసు హెష్రోను కర్మీ హూరు శోబాలు.

1. yoodhaa kumaarulevaranagaa peresu heshronu karmee hooru shobaalu.

2. శోబాలు కుమారుడైన రెవాయా యహతును కనెను, యహతు అహూమైని లహదును కనెను, ఇవి సొరాతీయుల వంశములు.

2. shobaalu kumaarudaina revaayaa yahathunu kanenu, yahathu ahoomaini lahadunu kanenu, ivi soraatheeyula vanshamulu.

3. అబీయేతాము సంతతివా రెవరనగా యెజ్రెయేలు ఇష్మా ఇద్బాషు వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని.

3. abeeyethaamu santhathivaa revaranagaa yejreyelu ishmaa idbaashu veeri sahodari peru hajjelelponi.

4. మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును హూషాయీయులకు పితరుడగు ఏజెరును, వీరు బేత్లెహేమునకు తండ్రియైన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు.

4. mariyu gedoreeyulaku pitharudagu penooyelunu hooshaayeeyulaku pitharudagu ejerunu, veeru betlehemunaku thandriyaina ephraathaaku jyeshthudagu hoorunaku kumaarulu.

5. తెకోవ తండ్రియైన అష్షూరు నకు హెలా నయరా అను ఇద్దరు భార్యలుండిరి.

5. tekova thandriyaina ashshooru naku helaa nayaraa anu iddaru bhaaryalundiri.

6. నయరా అతనికి అహుజామును హెపెరును తేమనీని హాయ హష్తారీని కనెను. వీరు నయరాకు పుట్టిన కుమా రులు.

6. nayaraa athaniki ahujaamunu heperunu themaneeni haaya hashthaareeni kanenu. Veeru nayaraaku puttina kumaa rulu.

7. హెలా కుమారు లెవరనగా జెరెతు సోహరు ఎత్నాను.

7. helaa kumaaru levaranagaa jerethu soharu etnaanu.

8. కోజు ఆనూబును జోబేబాను హారుము కుమారుడైన అహర్హేలుయొక్క వంశములను కనెను.

8. koju aanoobunu jobebaanu haarumu kumaarudaina ahar'heluyokka vanshamulanu kanenu.

9. యబ్బేజు తన సహోదరులకంటె ఘనము పొందినవాడై యుండెను వేదనపడి యితని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరుపెట్టెను.

9. yabbeju thana sahodarulakante ghanamu pondinavaadai yundenu vedhanapadi yithani kantinani athani thalli athaniki yabbeju ani perupettenu.

10. యబ్బేజు ఇశ్రాయేలీ యుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టినీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను.

10. yabbeju ishraayelee yula dhevunigoorchi morrapettineevu nannu nishchayamugaa aasheervadhinchi naa sarihaddunu vishaala parachi nee cheyyi naaku thoodugaa unda dayachesi naaku keeduraakunda daanilonundi nannu thappinchumu ani praarthimpagaa dhevudu athadu manavichesina daanini athaniki dayachesenu.

11. షూవహు సహోదరుడైన కెలూబు ఎష్తోనునకు తండ్రియైన మెహీరును కనెను.

11. shoovahu sahodarudaina keloobu eshthoonunaku thandriyaina meheerunu kanenu.

12. ఎష్తోను బేత్రాఫాను పాసెయను ఈర్నాహాషునకు తండ్రియైన తెహిన్నాను కనెను, వీరు రేకావారు.

12. eshthoonu betraaphaanu paaseyanu eernaahaashunaku thandriyaina tehinnaanu kanenu, veeru rekaavaaru.

13. కనజు కుమారులు ఒత్నీయేలు శెరాయా; ఒత్నీయేలు కుమారులలో హతతు అను ఒక డుండెను.

13. kanaju kumaarulu otneeyelu sheraayaa; otneeyelu kumaarulalo hathathu anu oka dundenu.

14. మెయానొతై ఒఫ్రాను కనెను, శెరాయా పనివారి లోయలో నివసించువారికి తండ్రియైన యోవా బును కనెను, ఆ లోయలోనివారు పనివారై యుండిరి.

14. meyaanothai ophraanu kanenu, sheraayaa panivaari loyalo nivasinchuvaariki thandriyaina yovaa bunu kanenu, aa loyalonivaaru panivaarai yundiri.

15. యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరూ ఏలా నయము; ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను.

15. yephunne kumaarudaina kaalebu kumaarulu eeroo elaa nayamu; elaa kumaarulalo kanaju anu okadundenu.

16. యెహల్లెలేలు కుమారులు జీఫు జీఫా తీర్యా అశర్యేలు.

16. yehallelelu kumaarulu jeephu jeephaa theeryaa asharyelu.

17. ఎజ్రా కుమారులు యెతెరు మెరెదు ఏఫెరు యాలోను; మెరెదు భార్య మిర్యామును షమ్మయిని ఎష్టెమోను వారికి పెద్దయయిన ఇష్బాహును కనెను.

17. ejraa kumaarulu yeteru meredu epheru yaalonu; meredu bhaarya miryaamunu shammayini eshtemonu vaariki peddayayina ishbaahunu kanenu.

18. అతని భార్యయైన యెహూదీయా గెదోరునకు ప్రధానియైన యెరె దును శోకోకు ప్రధానియైన హెబెరును జానోహకు ప్రధానియైన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసికొనిన ఫరో కుమార్తెయైన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే.

18. athani bhaaryayaina yehoodeeyaa gedorunaku pradhaaniyaina yere dunu shokoku pradhaaniyaina heberunu jaanohaku pradhaaniyaina yekootheeyelunu kanenu. Meredu vivaahamu chesikonina pharo kumaartheyaina bityaaku puttina kumaarulu veere.

19. మరియనహము సహోదరియైన హూదీయా భార్యయొక్క కుమారులెవరనగా గర్మీయు డైన కెయీలా మాయకాతీయుడైన ఎష్టెమో.

19. mariyu nahamu sahodariyaina hoodeeyaa bhaaryayokka kumaarulevaranagaa garmeeyu daina keyeelaa maayakaatheeyudaina eshtemo.

20. sheemonu kumaarulu amnonu rinnaa benhaanaanu theelonu. Ishee kumaarulu johethu benjohethu.

21. యూదా కుమారుడైన షేలహు కుమారులెవరనగా లేకాకు ప్రధానియైన ఏరు మారేషాకు ప్రధానియైన లద్దాయు; సన్నపు వస్త్రములు నేయు అష్బేయ యింటి వంశకులకును

21. yoodhaa kumaarudaina shelahu kumaarulevaranagaa lekaaku pradhaaniyaina eru maareshaaku pradhaaniyaina laddaayu; sannapu vastramulu neyu ashbeya yinti vanshakulakunu

22. యోకీ మీయులకును కోజే బాయీయులకును యోవాషువారికిని మోయాబులో ప్రభుత్వము నొందిన శారాపీయులకును యాషూ బిలెహెమువారికిని అతడు పితరుడు; ఇవి పూర్వ కాలపు సంగతులే.

22. yokee meeyulakunu koje baayeeyulakunu yovaashuvaarikini moyaabulo prabhutvamu nondina shaaraapeeyulakunu yaashoo bilehemuvaarikini athadu pitharudu; ivi poorva kaalapu sangathule.

23. వారు కుమ్మరివాండ్లయి నెతాయీము నందును గెదేరానందును కాపురముండిరి; రాజు నియమము చేత అతనిపని విచారించుటకై అచ్చట కాపురముండిరి.

23. vaaru kummarivaandlayi nethaayeemu nandunu gedheraanandunu kaapuramundiri; raaju niyamamu chetha athanipani vichaarinchutakai acchata kaapuramundiri.

24. shimyonu kumaarulu nemooyelu yaameenu yaareebu jerahu shaavoolu.

25. షావూలునకు షల్లూము కుమారుడు, షల్లూమునకు మిబ్శాము కుమారుడు, మిబ్శా మునకు మిష్మా కుమారుడు.

25. shaavoolunaku shalloomu kumaarudu, shalloomunaku mibshaamu kumaarudu, mibshaa munaku mishmaa kumaarudu.

26. మిష్మా కుమారులలో ఒకడు హమ్మూయేలు; హమ్మూయేలునకు జక్కూరు కుమారుడు, జక్కూరునకు షిమీ కుమారుడు.

26. mishmaa kumaarulalo okadu hammooyelu; hammooyelunaku jakkooru kumaarudu, jakkoorunaku shimee kumaarudu.

27. షిమీకి పదునారుగురు కుమారులును ఆరుగురు కుమార్తెలును కలిగిరి; అయితే అతని సహోదరులకు ఎంతో మంది కుమారులు కలుగలేదు; యూదావారు వృద్ధియైనట్లు వారి వంశములన్నియు వృద్ధికాలేదు.

27. shimeeki padunaaruguru kumaarulunu aaruguru kumaarthelunu kaligiri; ayithe athani sahodarulaku enthoo mandi kumaarulu kalugaledu; yoodhaavaaru vruddhiyainatlu vaari vanshamulanniyu vruddhikaaledu.

28. వారు బెయేరషెబాలోను మోలాదాలోను హజర్షువలులోను

28. vaaru beyershebaalonu molaadaalonu hajarshuvalulonu

29. బిల్హాలోను ఎజెములోను తోలాదులోను బెతూయేలులోను

29. bil'haalonu ejemulonu thoolaadulonu bethooyelulonu

30. హోర్మాలోను సిక్లగులోను బేత్మర్కాబోతులోను హాజర్సూసాలోను బేత్బీరీలోను షరాయిములోను కాపురముండిరి.

30. hormaalonu siklagulonu betmarkaabothulonu haajarsoosaalonu betbeereelonu sharaayimulonu kaapuramundiri.

31. దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి.

31. daaveedu elubadi varaku vaaru aa pattanamulalo kaapuramundiri.

32. ఏతాము అయీను రిమ్మోను తోకెను ఆషాను అనువారి ఊళ్లు అయిదు.

32. ethaamu ayeenu rimmonu thookenu aashaanu anuvaari oollu ayidu.

33. బయలువరకు ఆ పట్టణముల పొలములు వారి వశమున ఉండెను; ఇవి వారి నివాసస్థలములు, వంశావళి పట్టీలు వారికుండెను.

33. bayaluvaraku aa pattanamula polamulu vaari vashamuna undenu; ivi vaari nivaasasthalamulu, vamshaavali patteelu vaarikundenu.

34. వారు మెషోబాబు యమ్లేకు అమజ్యా కుమారుడైన యోషా,

34. vaaru meshobaabu yamleku amajyaa kumaarudaina yoshaa,

35. యోవేలు అశీయేలు కుమారుడైన శెరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడైన యెహూ.

35. yovelu asheeyelu kumaarudaina sheraayaaku puttina yoshibyaa kumaarudaina yehoo.

36. elyoyenai yahakobaa yeshohaayaa ashaayaa adeeyelu yesheemeeyelu benaayaa;

37. షెమయాకు పుట్టిన షిమీ కుమారుడైన యెదాయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిపి కుమారుడైన జీజా అనువారు.

37. shemayaaku puttina shimee kumaarudaina yedaayaaku puttina allonu kumaarudaina shipi kumaarudaina jeejaa anuvaaru.

38. పేళ్లవరుసను వ్రాయబడిన వీరు తమతమ వంశములలో పెద్దలైయుండిరి; వీరి పితరుల యిండ్లు బహుగా వర్ధిల్లెను.

38. pellavarusanu vraayabadina veeru thamathama vanshamulalo peddalaiyundiri; veeri pitharula yindlu bahugaa vardhillenu.

39. వీరు తమ మందలకొరకు మేత వెదకుటకై గెదోరునకు తూర్పుననున్న పల్లపుస్థలమునకు పోయి

39. veeru thama mandalakoraku metha vedakutakai gedorunaku thoorpunanunna pallapusthalamunaku poyi

40. మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమునుగల విశాలదేశమును కనుగొనిరి; పూర్వ మందు హాముయొక్క వంశపువారు అక్కడ కాపుర ముండిరి.

40. manchi balakaramaina methayu nemmadhiyu sukhamunugala vishaaladheshamunu kanugoniri; poorva mandu haamuyokka vanshapuvaaru akkada kaapura mundiri.

41. పేళ్లవరుసను వ్రాయబడియుండు వీరు యూదా రాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడినవారి గుడారములను నివాసస్థలములను పడగొట్టి వారిని హతముచేసి, అచ్చట తమ గొఱ్ఱెలకు తగిన మేత కలిగియుండుటచేత నేటివరకు వారి స్థానములను ఆక్రమించుకొని యున్నారు.

41. pellavarusanu vraayabadiyundu veeru yoodhaa raajaina hijkiyaa dinamulalo acchatiki vachi acchata kanabadinavaari gudaaramulanu nivaasasthalamulanu padagotti vaarini hathamuchesi, acchata thama gorrelaku thagina metha kaligiyundutachetha netivaraku vaari sthaanamulanu aakraminchukoni yunnaaru.

42. షిమ్యోను కుమారులైన వీరిలో ఐదువందలమంది తమపైని ఇషీ కుమారులైన పెలట్యాను నెయర్యాను రెఫాయాను ఉజ్జీయేలును అధి పతులగా నిర్ణయించుకొని శేయీరు మన్నెమునకు పోయి

42. shimyonu kumaarulaina veerilo aiduvandalamandi thamapaini ishee kumaarulaina pelatyaanu neyaryaanu rephaayaanu ujjeeyelunu adhi pathulagaa nirnayinchukoni sheyeeru mannemunaku poyi

43. అమాలేకీయులలో తప్పించుకొనిన శేషమును హతముచేసి నేటివరకు అచ్చట కాపురమున్నారు.

43. amaalekeeyulalo thappinchukonina sheshamunu hathamuchesi netivaraku acchata kaapuramunnaaru.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles I - 1 దినవృత్తాంతములు 4 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

వంశావళి.

ఈ అధ్యాయంలో, మేము యూదా గురించి అదనపు సమాచారం అందించాము, ఇది అన్ని తెగలలో అతిపెద్దది మరియు అత్యంత ప్రసిద్ధమైనది. అదేవిధంగా, సిమియోన్ యొక్క వృత్తాంతం కూడా అందించబడింది. ఈ అధ్యాయంలో ప్రాముఖ్యత కలిగిన ప్రధాన వ్యక్తి జబేజ్. అతని సోదరులలో జాబెజ్ యొక్క ఉన్నత స్థితికి నిర్దిష్ట కారణం బహిర్గతం చేయనప్పటికీ, అతని ప్రత్యేకత ప్రార్థన యొక్క భక్తిపూర్వక అభ్యాసంలో ఉందని స్పష్టమవుతుంది. నిజమైన గొప్పతనానికి మార్గం దేవుని ఉద్దేశాలకు అనుగుణంగా మరియు తీవ్రమైన ప్రార్థనలో నిమగ్నమవ్వడానికి నిబద్ధతతో ప్రకాశిస్తుంది.
జబెజ్ ప్రార్థన ఈ క్రింది విధంగా వివరించబడింది: అతను సజీవుడు మరియు నిజమైన దేవుణ్ణి వేడుకున్నాడు, ప్రార్థనలను వినగల మరియు ప్రతిస్పందించగల ఏకైక వ్యక్తి. తన ప్రార్థన అంతటా, అతను తన ప్రజలతో దేవుని ఒడంబడికను అంగీకరిస్తాడు, ఈ సందర్భంలో తన అభ్యర్థనలను రూపొందించాడు. ముఖ్యంగా, అతను తన కోరికలను స్పష్టంగా చెప్పడం మానుకున్నాడు, బదులుగా అవ్యక్త అవగాహనను ఎంచుకున్నాడు. ఈ విధానం అతని వినయాన్ని నొక్కి చెబుతుంది, ఎందుకంటే అతను తన స్వంత సామర్థ్యాల ఆధారంగా వాగ్దానాలు చేయడం మానుకున్నాడు, బదులుగా తనను తాను పూర్తిగా దేవునికి అప్పగించాలని ఎంచుకున్నాడు. జాబెజ్ యొక్క విన్నపాన్ని ఈ క్రింది విధంగా క్లుప్తీకరించవచ్చు: "ప్రభూ, నన్ను ఆశీర్వదించడం మరియు రక్షించడం నీ చిత్తమైతే, నేను మీ శాశ్వతమైన సేవ మరియు ఆజ్ఞ కోసం పూర్తిగా నన్ను అర్పించుకుంటాను."
టెక్స్ట్‌లో చిత్రీకరించినట్లుగా, ఈ డైలాగ్ తీవ్రమైన మరియు నిజమైన కోరికను ప్రతిబింబిస్తుంది. నిజమైన దీవెనలు, ప్రత్యేకించి ఆధ్యాత్మిక స్వభావం కలిగినవి – నిజమైన పదార్థాన్ని కలిగి ఉండే మరియు ప్రత్యక్షమైన ఫలితాలకు దారితీసే ఆశీర్వాదాలు జబేజ్ యొక్క ప్రధానమైన అభ్యర్ధన. రెండవ అభ్యర్థన అతని క్షితిజాల విస్తరణకు సంబంధించినది, దేవునితో అతని ఆధ్యాత్మిక సంబంధం మరియు స్వర్గపు రాజ్యంలో అతని వారసత్వం పరంగా. మూడవదిగా, తన ప్రయత్నాలను నడిపించడంలో, రక్షించడంలో, బలోపేతం చేయడంలో మరియు ఆర్కెస్ట్రేట్ చేయడంలో దేవుని హస్తం సమృద్ధిగా ఉందని గుర్తించి, దేవుని స్థిరమైన మార్గదర్శకత్వం మరియు ఉనికి కోసం జాబెజ్ వేడుకుంటున్నాడు. చివరగా, జబెజ్ అన్ని రకాల చెడుల నుండి దైవిక రక్షణను వేడుకున్నాడు - పాపం యొక్క దుష్ప్రవర్తన మాత్రమే కాకుండా, అతని ప్రత్యర్థుల ప్రతికూలతలు మరియు పథకాలు కూడా, దుఃఖం యొక్క నిజమైన స్వరూపులుగా, అక్షరార్థంలో జబేజ్‌గా మారకుండా నిరోధించాలనే లక్ష్యంతో.
విశేషమేమిటంటే, దేవుడు జబేజ్ విన్నపాన్ని మన్నిస్తాడు, హృదయపూర్వక ప్రార్థనకు దేవుని ప్రతిస్పందనను హైలైట్ చేస్తుంది. ప్రార్థన పట్ల దేవుడు శ్రద్ధ వహిస్తాడనే భావన అస్థిరంగా ఉంటుంది. వినడానికి అతని సుముఖత ఎటువంటి అవరోధాల వల్ల ప్రభావితం కాలేదు.



Shortcut Links
1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |