Chronicles II - 2 దినవృత్తాంతములు 15 | View All

1. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యామీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి యీలాగు ప్రకటించెను

1. And the sprete of God came vpo Asarias the sonne of Obed,

2. ఆసా, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరందరు నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపువారైనయెడల ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయనయొద్ద విచారణచేసినయెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జిం చినయెడల ఆయన మిమ్మును విసర్జించును,

2. which wente forth to Asa, and sayde vnto him: Heare me Asa and all Iuda & Ben Iamin: The LORDE is with you, whyle ye are with him: and yf ye seke him, he wylbe founde of you. But yf ye forsake him, he shal forsake you also.

3. నిజమైన దేవుడైనను ఉపదేశముచేయు యాజకులైనను, ధర్మశాస్త్ర మైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండ పోవును.

3. Neuertheles there shal be many dayes in Israel, that there shalbe no true God, no prest to teach, & no lawe.

4. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మళ్లుకొని ఆయనను వెదకి నపుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను.

4. And whan they turne in their trouble vnto the LORDE God of Israel, and seke him, he shalbe founde.

5. ఆ కాలములలో దేశముల కాపురస్థులందరిలోను గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్క పెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను.

5. At that tyme shall it not be well with him that goeth out and in: for there shal be greate vproures vpon all them yt dwell on the earth.

6. దేవుడు జనము లను సకలవిధములైన బాధలతో శ్రమపరచెను గనుక జనము జనమును, పట్టణము పట్టణమును, పాడు చేసెను.
మత్తయి 24:7, మార్కు 13:8, లూకా 21:10

6. For one people shall all to smyte another, & one cite another: for God shal vexe them wt all maner of trouble.

7. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును.
1 కోరింథీయులకు 15:58

7. But be ye stronge, and let not youre handes be feble: for youre worke hath his rewarde.

8. ప్రవక్తయైన ఓదేదు ప్రవచించిన యీ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యా మీనీయుల దేశమంతటినుండియు, ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములలోనుండియు హేయములైన విగ్రహములన్నిటిని తీసి వేసి, యెహోవా మంటపము ఎదుటనుండు యెహోవా బలిపీఠమును మరల కట్టించి

8. Whan Asa herde these wordes, and the propheciege (of Asarias the sonne) of Obed the prophet, he toke a corage vnto him, and put awaye the abhominacions out of all ye londe of Iuda and Ben Iamin, and out of the cities that he had wonne vpon mount Ephraim: and renued the LORDES altare, which stode before the porche of the LORDE.

9. యూదా వారినందరిని బెన్యామీనీయుల నందరిని, ఎఫ్రాయిము మనష్షే షిమ్యోను గోత్రస్థానము లలోనుండి వచ్చి వారిమధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవు డైన యెహోవా అతనికి సహా యుడై యుండుట చూచి ఇశ్రాయేలువారిలోనుండి విస్తారమైన జనులు అతని పక్షము చేరిరి.

9. And all Iuda and Ben Iamin gathered them selues together, and the straungers with them out of Ephraim, Manasses and Simeon: for there fell many vnto him out of Israel, whan they sawe that the LORDE his God was with him.

10. ఆసా యేలు బడియందు పదునైదవ సంవత్సరమున మూడవ నెలను వారు యెరూషలేములో కూడి

10. And they resorted vnto Ierusalem in the thirde moneth of the fyftenth yeare of the reigne of Asa,

11. తాము తీసికొనివచ్చిన కొల్లసొమ్ము లోనుండి ఆ దినమున ఏడువందల యెద్దులను ఏడు వేల గొఱ్ఱెలను యెహోవాకు బలులుగా అర్పించి

11. and the same daye offred they vnto the LORDE of the spoyle that they had broughte, seuen hudreth oxen, and seuen thousande shepe.

12. పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవాయొద్ద తాము విచారణచేయుదు మనియు

12. And they entred in to ye couenaunt, that they wolde seke the LORDE God of their fathers, with all their hert and with all their soule.

13. పిన్నలేగాని పెద్దలేగాని పురుషులేగాని స్త్రీలే గాని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాయొద్ద విచారణ చేయనివారికందరికిని మరణము విధించుదుమనియు నిష్కర్షచేసికొనిరి.

13. And who so euer wolde not seke ye LORDE God of Israel, shulde dye, both small & greate, both man and woman:

14. వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు, మేళములతోను బూరల నాదముతోను భేరీధ్వనులతోను యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి.

14. and they sware vnto the LORDE with loude voyce, with shoutinge, with trompettes and with shawmes.

15. ఈలాగు ప్రమాణము చేయబడగా యూదావారందరును సంతో షించిరి; వారు పూర్ణహృదయముతో ప్రమాణముచేసి పూర్ణమనస్సుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టునున్న దేశస్థులతో యుద్ధములు లేకుండ వారికి నెమ్మది కలుగజేసెను.

15. And all Iuda were glad ouer the ooth: for they had sworne with all their hert, and they soughte him with a whole wyll: and he was founde of them, and the LORDE gaue them rest on euery syde.

16. మరియు తన తల్లియైన మయకా అసహ్యమైన యొక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె యిక పట్టపుదేవియై యుండకుండ రాజైన ఆసా ఆమెను త్రోసివేసి, ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి ఛిన్నాభిన్నము చేసి కిద్రోను వాగుదగ్గర దాని కాల్చివేసెను.

16. And Asa ye kynge put downe his mother from the mynistracion, that she had founded in the groue vnto Miplezeth. And Asa roted out hir Miplezeth, and beate it in sunder, and brent it by the broke Cedron.

17. ఆసా ఉన్నత స్థలములను ఇశ్రాయేలీయులలోనుండి తీసివేయలేదు గాని యితడు బ్రదికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను.

17. But the hye places were not put downe out of Israel. Yet was the hert of Asa perfecte as longe as he lyued.

18. తన తండ్రి ప్రతిష్ఠించి నట్టియు, తాను ప్రతిష్ఠించినట్టియు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసికొని దేవుని మందిరమునం దుంచెను.

18. And loke what his father had halowed, and that he him selfe had halowed, he broughte it in to ye house of God, syluer, golde and ornametes.

19. ఆసా యేలుబడియందు ముప్పది యయిదవ సంవత్సరమువరకు యుద్ధములు జరుగలేదు.

19. And there was no warre vnto the fyue and thirtieth yeare of the reigne of Asa.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles II - 2 దినవృత్తాంతములు 15 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ప్రజలు దేవునితో గంభీరమైన ఒడంబడిక చేసుకుంటారు.

పూర్తి పరివర్తన యొక్క పని ఆసాకు చాలా సవాలుగా అనిపించింది, అతను దైవిక మద్దతు మరియు ఆమోదం గురించి నిశ్చయత పొందే వరకు దానిని చేపట్టడానికి సాహసించకుండా నిరోధించాడు. అతను మరియు అతని ప్రజలు దేవునికి నైవేద్యాలు సమర్పించారు, వారు పొందిన ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలుపుతూ మరియు మరింత దీవెనలు కావాలని అభ్యర్థించారు. మన ఆధ్యాత్మిక చర్యలు ఇప్పుడు ప్రార్థనలు మరియు ప్రశంసలను కలిగి ఉంటాయి. ప్రజలు ఇష్టపూర్వకంగా వ్యక్తిగతంగా మరియు నిష్కపటంగా దేవుడిని వెతకడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు-దేవుని అన్వేషణ, నిరంతర అన్వేషణ, ప్రతి సందర్భంలోనూ ఆయనను చేరుకోవడం కాకపోతే మతం అంటే ఏమిటి? మన మతపరమైన ఆచారాలు మన హృదయాల లోతుల నుండి ఉద్భవించనంత వరకు ఎటువంటి విలువను కలిగి ఉండవు; దేవుడు మన పూర్ణహృదయపూర్వకమైన భక్తిని కోరతాడు లేదా ఏదీ కోరడు. మన రక్షకుడైన దేవునికి మన విధేయత బహిరంగంగా ప్రకటించబడాలి మరియు అత్యంత గంభీరంగా మరియు బహిరంగంగా ప్రదర్శించబడాలి. చిత్తశుద్ధి లేని చర్యలు కేవలం శ్రమతో కూడిన దినచర్య మాత్రమే.


Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |