Chronicles II - 2 దినవృత్తాంతములు 20 | View All

1. ఇది యయిన తరువాత మోయాబీయులును అమ్మో నీయులును మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతుమీదికి వచ్చిరి.

1. Later the Moabites, Ammonites, and some Meunites came to start a war with Jehoshaphat.

2. అంతలో కొందరు వచ్చిసముద్రము ఆవలనుండు సిరియ నులతట్టునుండి గొప్ప సైన్యమొకటి నీమీదికి వచ్చుచున్నది; చిత్తగించుము, వారు హససోన్‌తామారు అను ఏన్గెదీలో ఉన్నారని యెహోషా పాతునకు తెలియజేసిరి.

2. Messengers came and told Jehoshaphat, 'A large army is coming against you from Edom, from the other side of the Dead Sea. They are already in Hazazon Tamar!' (Hazazon Tamar is also called En Gedi.)

3. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవాయొద్ద విచారించుటకు మనస్సు నిలుపు కొని, యూదాయంతట ఉపవాసదినము ఆచరింపవలెనని చాటింపగా

3. Jehoshaphat was afraid, so he decided to ask the Lord what to do. He announced that no one in Judah should eat during this special time of prayer to God.

4. యూదావారు యెహోవావలని సహాయ మును వేడుకొనుటకై కూడుకొనిరి, యెహోవాయొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలోనుండి జనులు వచ్చిరి.

4. The people of Judah came together to ask the Lord for help; they came from every town in Judah.

5. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాలయెదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనులమధ్యను నిలువబడి

5. The people of Judah and Jerusalem met in front of the new courtyard in the Temple of the Lord. Then Jehoshaphat stood up,

6. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై యున్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే; నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట కెవరికిని బలము చాలదు.

6. and he said, 'Lord, God of our ancestors, you are the God in heaven. You rule over all the kingdoms of the nations. You have power and strength, so no one can stand against you.

7. నీ జనులైన ఇశ్రాయేలీయుల యెదుటనుండి ఈ దేశపు కాపురస్థులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాముయొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే.
యాకోబు 2:23

7. Our God, you forced out the people who lived in this land as your people Israel moved in. And you gave this land forever to the descendants of your friend Abraham.

8. వారు అందులో నివాసముచేసి, కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరవైనను, మామీదికి వచ్చినప్పుడు మేము ఈమందిరము ఎదుటను నీ యెదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొఱ్ఱపెట్టినయెడల

8. They lived in this land and built a Temple for you. They said,

9. నీవు ఆలకించి మమ్మును రక్షిం చుదువని అనుకొని, యిచ్చట నీ నామఘనతకొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా.

9. 'If trouble comes upon us, or war, punishment, sickness, or hunger, we will stand before you and before this Temple where you have chosen to be worshiped. We will cry out to you when we are in trouble. Then you will hear and save us.'

10. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోను మోయా బీయులతోను శేయీరు మన్యవాసులతోను యుద్ధము చేయనియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారియొద్దనుండి తొలగి పోయిరి.

10. 'But now here are men from Ammon, Moab, and Edom. You wouldn't let the Israelites enter their lands when the Israelites came from Egypt. So the Israelites turned away and did not destroy them.

11. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మా కిచ్చిన నీ స్వాస్థ్య ములోనుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టిం చుము.

11. But see how they repay us for not destroying them! They have come to force us out of your land, which you gave us as our own.

12. మా దేవా, నీవు వారికి తీర్పుతీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను.

12. Our God, punish those people. We have no power against this large army that is attacking us. We don't know what to do, so we look to you for help.'

13. యూదావారందరును తమ శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలువబడిరి.

13. All the men of Judah stood before the Lord with their babies, wives, and children.

14. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జెకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతనిమీదికి రాగా అతడీలాగు ప్రకటించెను

14. Then the Spirit of the Lord entered Jahaziel. (Jahaziel was Zechariah's son. Zechariah was Benaiah's son. Benaiah was Jeiel's son, and Jeiel was Mattaniah's son.) Jahaziel, a Levite and a descendant of Asaph, stood up in the meeting.

15. యూదావారలారా, యెరూషలేము కాపు రస్థులారా, యెహోషాపాతు రాజా, మీరందరును ఆలకించుడి; యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యీ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును.

15. He said, 'Listen to me, King Jehoshaphat and all you people living in Judah and Jerusalem. The Lord says this to you: 'Don't be afraid or discouraged because of this large army. The battle is not your battle, it is God's.

16. రేపు వారిమీదికి పోవుడి; వారు జీజు అను ఎక్కుడుమార్గమున వచ్చెదరు, మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగుకొనదగ్గర వారిని కనుగొందురు.

16. Tomorrow go down there and fight those people. They will come up through the Pass of Ziz. You will find them at the end of the ravine that leads to the Desert of Jeruel.

17. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు; యూదావారలారా, యెరూషలేమువారలారా, మీరు యుద్ధపంక్తులు తీర్చినిలువబడుడి; మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు; భయపడకుడి జడియకుడి, రేపు వారిమీదికి పోవుడి, యెహోవా మీతో కూడ ఉండును.

17. You won't need to fight in this battle. Just stand strong in your places, and you will see the Lord save you. Judah and Jerusalem, don't be afraid or discouraged, because the Lord is with you. So go out against those people tomorrow.''

18. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమ స్కారము చేసెను; యూదావారును యెరూషలేము కాపు రస్థులును యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి.

18. Jehoshaphat bowed facedown on the ground. All the people of Judah and Jerusalem bowed down before the Lord and worshiped him.

19. కహాతీయుల సంతతివారును కోరహీయుల సంతతి వారునగు లేవీయులు నిలువబడి గొప్ప శబ్దముతో ఇశ్రా యేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించిరి.

19. Then some Levites from the Kohathite and Korahite people stood up and praised the Lord, the God of Israel, with very loud voices.

20. అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి; వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడియూదావారలారా, యెరూషలేము కాపురస్థులారా, నా మాట వినుడి; మీ దేవుడైన యెహో వాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు; ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురనిచెప్పెను.

20. Jehoshaphat's army went out into the Desert of Tekoa early in the morning. As they were starting out, Jehoshaphat stood and said, 'Listen to me, people of Judah and Jerusalem. Have faith in the Lord your God, and you will stand strong. Have faith in his prophets, and you will succeed.'

21. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడచుచుయెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను.

21. Jehoshaphat listened to the people's advice. Then he chose men to be singers to the Lord, to praise him because he is holy and wonderful. As they marched in front of the army, they said, 'Thank the Lord, because his love continues forever.'

22. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారిమీదికి వచ్చిన అమ్మోనీయులమీదను మోయాబీయుల మీదను శేయీరు మన్యవాసులమీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి.

22. As they began to sing and praise God, the Lord set ambushes for the people of Ammon, Moab, and Edom who had come to attack Judah. And they were defeated.

23. అమ్మోనీయులును మోయాబీయులును శేయీరు మన్యనివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారిమీద పడిరి; వారు శేయీరు కాపురస్థులను కడముట్టించిన తరువాత తమలో ఒకరి నొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి.

23. The Ammonites and Moabites attacked the Edomites, destroying them completely. After they had killed the Edomites, they killed each other.

24. యూదా వారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యముతట్టు చూడగా వారు శవములై నేలపడియుండిరి, ఒకడును తప్పించుకొనలేదు.

24. When the men from Judah came to a place where they could see the desert, they looked at the enemy's large army. But they only saw dead bodies lying on the ground; no one had escaped.

25. యెహోషాపాతును అతని జనులును వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవములయొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను; వారు తమకిష్టమైనంతమట్టుకు తీసికొని తాము కొని పో గలిగినంతకంటె ఎక్కువగా ఒలుచు కొనిరి; కొల్లసొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు మూడు దినములు పట్టెను.

25. When Jehoshaphat and his army came to take their valuables, they found many supplies, much clothing, and other valuable things. There was more than they could carry away; there was so much it took three days to gather it all.

26. నాల్గవ దినమున వారు బెరాకా లోయలో కూడిరి; అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటివరకును ఆ చోటికి బెరాకా లోయ యని పేరు.

26. On the fourth day Jehoshaphat and his army met in the Valley of Beracah and praised the Lord. That is why that place has been called the Valley of Beracahn to this day.

27. ఈలాగున యెహోవా వారి శత్రువులమీద వారికి జయము అను గ్రహించి వారిని సంతోషపరచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యూదావారును యెరూషలేమువారును వారందరికి ముందు యెహోషా పాతును సాగి వెళ్లిరి;

27. Then Jehoshaphat led all the men from Judah and Jerusalem back to Jerusalem. The Lord had made them happy because their enemies were defeated.

28. వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారాలను వాయించుచు బూరలు ఊదుచువచ్చిరి.

28. They entered Jerusalem with harps, lyres, and trumpets and went to the Temple of the Lord.

29. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని దేశముల రాజ్యముల వారందరు వినగా దేవుని భయము వారందరిమీదికి వచ్చెను.

29. When all the kingdoms of the lands around them heard how the Lord had fought Israel's enemies, they feared God.

30. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టునున్నవారిని జయించి అతనికి నెమ్మది ననుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా నుండెను.

30. So Jehoshaphat's kingdom was not at war. His God gave him peace from all the countries around him.

31. యెహోషాపాతు యూదారాజ్యమును ఏలెను. అతడు ఏలనారంభించినప్పుడు ముప్పదియయిదు సంవత్సర ములవాడై యెరూషలేములో ఇరువదియయిదు సంవత్సర ములు ఏలెను; అతని తల్లి షిల్హీ కుమార్తె, ఆమె పేరు అజూబా,

31. Jehoshaphat ruled over the country of Judah. He was thirty-five years old when he became king, and he ruled in Jerusalem for twenty-five years. His mother's name was Azubah daughter of Shilhi.

32. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రియైన ఆసామార్గమందు నడచుచు దానిలోనుండి తొలగిపోకుండెను.

32. Jehoshaphat was good like his father Asa, and he did what the Lord said was right.

33. అయితే అప్పటికింకను జనులు తమ పితరుల దేవుని వెదకుటకు తమ హృదయములను స్థిరపరచుకొనలేదు, అతడు ఉన్నతస్థలములను తీసివేయలేదు.

33. But the places where gods were worshiped were not removed, and the people did not really want to follow the God of their ancestors.

34. యెహోషాపాతు చేసిన కార్యములన్నిటినిగూర్చి హనానీ కుమారుడైన యెహూ రచించిన గ్రంథమందు వ్రాయబడియున్నది. ఈ యెహూ పేరు, ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు కన బడుచున్నది.

34. The other things Jehoshaphat did as king, from the beginning to the end, are written in the records of Jehu son of Hanani, which are in the book of the kings of Israel.

35. ఇది యయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను.

35. Later, Jehoshaphat king of Judah made a treaty with Ahaziah king of Israel, which was a wrong thing to do.

36. తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలెనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించిరి.

36. Jehoshaphat agreed with Ahaziah to build trading ships, which they built in the town of Ezion Geber.

37. అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడునగు ఎలీయెజెరునీవు అహజ్యాతో స్నేహము చేసికొంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతుమీద ప్రవచనమొకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్లజాల కుండ బద్దలైపోయెను.

37. Then Eliezer son of Dodavahu from the town of Mareshah spoke against Jehoshaphat. He said, 'Jehoshaphat, because you joined with Ahaziah, the Lord will destroy what you have made.' The ships were wrecked so they could not sail out to trade.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles II - 2 దినవృత్తాంతములు 20 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యూదా యొక్క ప్రమాదం మరియు బాధ. (1-13) 
ఆపద సమయాల్లో, అవి బహిరంగమైనా లేదా వ్యక్తిగతమైనా, మన ప్రాథమిక దృష్టి సహాయం కోసం దేవుని వైపు మళ్లడం. ఇది జాతీయ ఉపవాసం మరియు ప్రార్థన కోసం నియమించబడిన రోజుల విలువను నొక్కి చెబుతుంది. దైవిక నుండి మార్గదర్శకత్వం కోసం మన మొత్తం అన్వేషణలో, మనం వినయంతో సంప్రదించాలి, మన స్వంత లోపాలను గుర్తించాలి మరియు దేవుని దయ మరియు బలంపై మాత్రమే ఆధారపడాలి.
యెహోషాపాట్ దైవిక ప్రావిడెన్స్ యొక్క అత్యున్నత అధికారాన్ని గుర్తించి, మన తరపున దాని జోక్యాన్ని అభ్యర్థిస్తున్నాడు. మనం నమ్మకంగా ఎంచుకున్న మరియు సేవ చేసిన దేవుణ్ణి తప్ప మనం ఎవరిని వెతకాలి మరియు ఉపశమనం కోసం మన నమ్మకాన్ని ఉంచాలి? ఎవరైతే తమ వనరులను దేవుని సేవకు అంకితం చేస్తారో వారు అతని రక్షణ మరియు సంరక్షణను నిశ్చయంగా ఎదురు చూడగలరు.
ప్రతి నిష్కపట విశ్వాసి అబ్రహం వారసత్వాన్ని పంచుకుంటాడు మరియు దేవునితో ప్రత్యేక సంబంధాన్ని అనుభవిస్తాడు. శాశ్వతమైన ఒడంబడిక అటువంటి వ్యక్తులతో దృఢంగా స్థాపించబడింది మరియు అన్ని వాగ్దానాలు వారికి అందుబాటులో ఉంటాయి. మానవ స్వభావంలో రక్షకునిగా అవతారమెత్తడం ద్వారా దేవుని ప్రేమలో మనం హామీని పొందుతాము.
యెహోషాపాట్ ఆలయాన్ని దేవుని దయగల ఉనికికి చిహ్నంగా పేర్కొన్నాడు. తన విరోధులు చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా దేవునికి విజ్ఞప్తి చేస్తాడు. మన మంచి పనులకు దురుద్దేశంతో ప్రతిస్పందించే వారి నుండి శత్రుత్వం ఎదురైనప్పుడు దేవుని న్యాయాన్ని కోరడం పూర్తిగా సముచితం. తన గణనీయమైన సైనిక బలం ఉన్నప్పటికీ, యెహోషాపాట్ వినయంగా, "నీవు లేకుండా మాకు శక్తి లేదు, మేము నీపై ఆధారపడతాము" అని అంగీకరించాడు.

జహాజీల్ విజయ ప్రవచనం. (14-19) 
సభ మధ్యలో, ఒక లేవీయుడికి జోస్యం చెప్పే ఆత్మ ప్రసాదించబడింది. ఈ ఆత్మ, గాలితో సమానంగా, స్వేచ్ఛగా మరియు అనూహ్యంగా కదులుతుంది. దేవునిపై విశ్వాసం ఉంచేలా వారిని ప్రేరేపించాడు. ఒక క్రైస్తవ సైనికుడు వారి ఆధ్యాత్మిక శత్రువులను ఎదుర్కొన్నట్లే, శాంతి దేవుడు వారి విజయాన్ని కేవలం విజయానికి మించి ఉండేలా చేస్తాడు. మా సవాళ్ల ద్వారా, మేము సుసంపన్నతను కనుగొంటాము. ప్రయోజనాలు మనవి అయితే, అన్ని మహిమలను దేవునికి ఆపాదించడం చాలా ముఖ్యం.

యూదా కృతజ్ఞతలు. (20-30) 
దేవునిపై అచంచలమైన విశ్వాసాన్ని కొనసాగించాలని యెహోషాపాట్ తన సైనికులను ప్రోత్సహించాడు. అలాంటి విశ్వాసం ఒక వ్యక్తిలో నిజమైన ధైర్యాన్ని నింపుతుంది మరియు దేవుని శక్తి, దయ మరియు వాగ్దానాలపై దృఢమైన దృఢ నిశ్చయం కంటే గందరగోళ క్షణాలలో హృదయాన్ని స్థిరీకరించడంలో మరేదీ సహాయపడదు. మనం ప్రభువుపై నమ్మకం ఉంచి, మన స్తోత్రాలను అర్పించేటప్పుడు, యేసుక్రీస్తు ద్వారా పాపుల పట్ల ఆయన చూపే శాశ్వతమైన దయపై మనం ప్రత్యేకంగా దృష్టి పెడతాము.
ప్రత్యర్థి వలె పూర్తిగా ఓడిపోయిన సైన్యం చాలా అరుదుగా ఉంది. దేవుడు తరచూ దుష్టులను ఒకరి పతనానికి ఎలా కారణమవుతాడో ఇది వివరిస్తుంది. మరియు చాలా అరుదుగా కృతజ్ఞతతో మరింత గంభీరమైన వ్యక్తీకరణలతో విజయాన్ని స్మరించుకుంటారు.

అహజ్యాతో యెహోషాపాతు పొత్తు. (31-37)
యెహోషాపాట్ దేవుని ఆరాధనకు అంకితభావంతో ఉన్నాడు మరియు తన ప్రజలు దానితో అనుసంధానించబడి ఉండేలా కృషి చేశాడు. అయినప్పటికీ, దేవుడు అతనికి ప్రసాదించిన విశేషమైన ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ - విజయాన్ని అందించడమే కాకుండా సంపద కూడా - అతను దుష్ట రాజుతో తనకు తానుగా జతకట్టడం నిజంగా కృతజ్ఞత లేనిది. దేవుని అసంతృప్తికి గురికావడం కంటే అతను ఏ ఫలితాన్ని ఊహించగలడు? అయినప్పటికీ, అతను హెచ్చరికను పట్టించుకోలేదని తెలుస్తోంది. అహజ్యా తరువాత అతనిని బలవంతంగా చేయమని కోరినప్పుడు, యెహోషాపాతు నిరాకరించాడు 1 రాజులు 22:49. పర్యవసానంగా, కూటమి తెగిపోయింది మరియు దైవిక మందలింపు దాని ఉద్దేశించిన ప్రభావాన్ని కలిగి ఉంది, కనీసం తాత్కాలికంగానైనా.
మన శాశ్వతమైన ఆత్మలను కోల్పోకుండా కాపాడిన ఏవైనా ఎదురుదెబ్బలకు మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. మనలను చురుగ్గా వెంబడించి, మన అతిక్రమణలలో నశించిపోకుండా విడిచిపెట్టిన ప్రభువును స్తుతిద్దాం.



Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |