Chronicles II - 2 దినవృత్తాంతములు 24 | View All

1. యోవాషు ఏలనారంభించినప్పుడు ఏడు సంవత్స రముల యీడుగలవాడై యెరూషలేములో నలువది ఏండ్లు ఏలెను; అతని తల్లి బెయేరషెబా కాపురస్థురాలైన జిబ్యా.

2. యాజకుడైన యెహోయాదా బ్రదికిన దినములన్నియు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను.

3. యెహోయాదా అతనికి యిద్దరు భార్యలను పెండ్లి చేసెను; అతడు కుమారులను కుమార్తెలను కనెను.

4. అంతట యెహోవా మందిరమును బాగుచేయవలెనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను గనుక

5. అతడు యాజకులను లేవీయులను సమకూర్చిమీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరము బాగు చేయుటకై ఇశ్రా యేలీయులందరియొద్దనుండి ధనమును ఏటేట సమకూర్చుచు, ఈ కార్యమును మీరు త్వరపెట్టవలెనని వారికాజ్ఞ ఇచ్చెను. వారు దానిని త్వరగా చేయకపోయినందున

6. రాజు ప్రధానయాజకుడగు యెహోయాదాను పిలిచిఆ దుర్మార్గురాలైన అతల్యాకుమారులు దేవుని మందిర మును పాడుచేసి, యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ఠోపకరణముల నన్నిటిని బయలుదేవతపూజకు ఉప యోగించిరి.

7. సాక్ష్యపు గుడారమును బాగుచేయుటకైయూదాలో నుండియు యెరూషలేములోనుండియు ఇశ్రాయేలీయుల సమాజకులచేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీ వెందుకు చెప్పి తెప్పించలేదని యడిగెను.

8. కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిరద్వారము బయట ఉంచిరి.

9. మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీయులకు నిర్ణ యించిన కానుకను యెహోవాయొద్దకు జనులు తేవలెనని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి.

10. కాగా అధిపతులందరును జనులందరును సంతోషముగా కానుకలను తీసికొని వచ్చి చాలినంతమట్టుకు పెట్టెలో వేసిరి.

11. లేవీయులు ఆ పెట్టెను రాజు విమర్శించు స్థలము నకు తెచ్చుచు వచ్చిరి; అందులో ద్రవ్యము విస్తారముగా నున్నట్టు కనబడినప్పుడెల్ల, రాజుయొక్క ప్రధాన మంత్రియు ప్రధాన యాజకుడు నియమించిన పై విచా రణకర్తయు వచ్చి, పెట్టెలోనున్న ద్రవ్యమును తీసి యథా స్థానమందు దానిని ఉంచుచు వచ్చిరి; వారీచొప్పున పలు మారు చేయుటచేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడెను.

12. అప్పుడు రాజును యెహోయాదాయును యెహోవా మందిరపు పనిచేయువారికి దానినిచ్చి, యెహోవా మందిరమును బాగుచేయుటకై కాసెవారిని వడ్లవారిని, యెహోవా మందిరమును బలపరచుటకు ఇనుపపని యిత్తడిపని చేయువారిని కూలికి కుదిర్చిరి.

13. ఈలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాని బలపరచిరి.

14. అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదా యొద్దకును తీసికొనిరాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడు నట్లును, దహనబలుల నర్పించుటయందు ఉపయోగపడు నట్లును, ఉపకరణములను గరిటెలను వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. యెహోయాదాయున్న యన్నిదినములు యెహోవా మందిరములో దహనబలులు నిత్యమును అర్పింపబడెను.

15. యెహోయాదా దినములు గడచిన వృద్ధుడై చని పోయెను; అతడు చనిపోయినప్పుడు నూట ముప్పది ఏండ్ల వాడు.

16. అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికిని తన యింటివారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజులదగ్గర అతని పాతి పెట్టిరి.

17. యెహోయాదాచని పోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను.

18. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడచి, దేవతాస్తంభములకును విగ్రహములకును పూజచేసిరి; వారు, చేసిన యీ యప రాధము నిమిత్తము యూదావారిమీదికిని యెరూషలేము కాపురస్థులమీదికిని కోపము వచ్చెను.

19. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారియొద్దకు ప్రవక్త లను పంపగా ఆ ప్రవక్తలు వారిమీద సాక్ష్యము పలికిరిగాని వారు చెవియొగ్గక యుండిరి.

20. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జెకర్యామీదికి రాగా అతడు జనులయెదుట నిలువబడిమీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు; మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించియున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను.
మత్తయి 23:35, లూకా 11:51

21. అందుకు వారతనిమీద కుట్రచేసి, రాజు మాటనుబట్టి యెహోవా మందిరపు ఆవరణములోపల రాళ్లు రువి్వ అతని చావగొట్టిరి.
హెబ్రీయులకు 11:37

22. ఈ ప్రకారము రాజైన యోవాషు జెకర్యా తండ్రియైన యెహోయాదా తనకు చేసిన ఉప కారమును మరచినవాడై అతని కుమారుని చంపించెను; అతడు చనిపోవునప్పుడుయెహోవా దీని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక యనెను.

23. ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యము యోవాషు మీదికి వచ్చెను; వారు యూదాదేశముమీదికిని యెరూష లేముమీదికిని వచ్చి, శేషములేకుండ జనుల అధిపతులనందరిని హతముచేసి, తాము పట్టుకొనిన కొల్లసొమ్మంతయు దమస్కు రాజునొద్దకు పంపిరి.

24. సిరియనులు చిన్నదండుతో వచ్చినను యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతివిస్తార మైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగెను.

25. వారు యోవాషును విడచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగియై యుండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్యదోషము నిమిత్తము అతని సేవకులు అతనిమీద కుట్రచేసి, అతడు పడకమీద ఉండగా అతని చంపిరి. అతడు చనిపోయిన తరు వాత జనులు దావీదు పట్టణమందు అతని పాతి పెట్టిరి గాని రాజుల సమాధులలో అతని పాతిపెట్టలేదు.

26. అతనిమీద కుట్రచేసినవారు అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడగు జాబాదు, మోయాబురాలైన షిమీతు కుమారుడగు యెహోజాబాదు అనువారు.

27. అతని కుమారులను గూర్చియు, అతనిమీద చెప్పబడిన అనేకమైన దేవోక్తులను గూర్చియు, అతడు దేవుని మందిరమును బాగుచేయు టను గూర్చియు రాజుల సటీక గ్రంథములో వ్రాయబడి యున్నది. అతనికి బదులుగా అతని కుమారుడైన అమజ్యా రాజాయెను.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles II - 2 దినవృత్తాంతములు 24 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యూదాకు చెందిన యోవాషు, దేవాలయం బాగుచేయబడింది. (1-14) 
ఆలయ పునరుద్ధరణ పట్ల యోవాషు‌కున్న ఉత్సాహం యెహోయాదాను కూడా మించిపోయింది. భౌతిక ఆలయాలను నిర్మించడం అనేది దేవునికి అంకితమైన సజీవ దేవాలయాలుగా మారడం కంటే సరళమైనది. ఏదేమైనా, మతపరమైన ఆరాధన కోసం ఉద్దేశించిన స్థలాల పునరుద్ధరణ ఒక గొప్ప ప్రయత్నంగా నిలుస్తుంది, ఇది అందరి మద్దతుకు అర్హమైనది. చురుకైన వ్యక్తుల కొరత కారణంగా అనేక విలువైన పనులు అసంపూర్తిగా ఉన్నాయి.

యోవాషు విగ్రహారాధనలో పడతాడు, అతని సేవకులచే చంపబడ్డాడు. (15-27)
ఒక పాలకుడు లేదా ప్రజలు దైవభక్తిగల, ఆసక్తిగల మరియు విలువైన వ్యక్తులను పోగొట్టుకున్నప్పుడు వారికి ఎదురయ్యే తీవ్ర పరిణామాలను పరిశీలించండి. విశ్వాసానికి సంబంధించిన విషయాలలో అంతర్గత విశ్వాసం నుండి పనిచేయవలసిన కీలకమైన అవసరాన్ని ఇది నొక్కి చెబుతుంది. తత్ఫలితంగా, తల్లిదండ్రులు, మతాధికారులు లేదా సహచరులు మరణించడం వల్ల ఒకరి మతపరమైన భక్తిని కోల్పోరు. పాలకులు మరియు సాధారణ పౌరులు ఇద్దరూ తరచూ ముఖస్తుతిలో చిక్కుకుంటారు, ఇది వారి పతనానికి దారి తీస్తుంది. నిజమైన దయ మాత్రమే శాశ్వతమైన ఫలాలను ఉత్పత్తి చేయడానికి వ్యక్తికి శక్తినిస్తుంది. యెహోయాదా కుమారుడైన జెకర్యా, ప్రవచనాత్మతో నిండినవాడు, ప్రజల అతిక్రమణలను పరిష్కరించడానికి ధైర్యంగా లేచాడు. మార్గనిర్దేశం చేసే వెలుగుగా దేవుని వాక్యంతో ఆయుధాలు పొందిన మంత్రులు, మానవ పాపాలను బహిర్గతం చేసే మరియు దైవిక ప్రావిడెన్స్‌ను వివరించే పనిని చేపట్టారు. విషాదకరంగా, జెకర్యా ప్రభువు ఇంటి ప్రాంగణంలో రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. నిష్క్రమించే అమరవీరుడి మాటలను జాగ్రత్తగా చూసుకోండి: "ప్రభువు దానిని చూసి వారిని బాధ్యులను చేస్తాడు!" ఈ మాటలు ప్రతీకార స్ఫూర్తి నుండి ఉద్భవించలేదు, కానీ ప్రవచనాత్మకమైనది. సిరియన్ల నిష్క్రమణకు ముందు దేవుడు యోవాషు‌ను శారీరకంగా, మానసికంగా లేదా రెండూగా బాధపెట్టాడు. ప్రతీకారం వ్యక్తులను వెంబడించినప్పుడు, ఒక ఉపద్రవము యొక్క ముగింపు కేవలం మరొక ప్రతిక్రియ యొక్క ప్రారంభాన్ని తెలియజేస్తుంది. చివరికి, యోవాషు తన పరిచారకులచే చంపబడ్డాడు. ఈ ప్రతీకారాలను అతనిపై విధించిన "భారాలు" అని పిలుస్తారు, ఎందుకంటే దేవుని ఉగ్రత ఒక బరువైన భారం, ఏ మానవుడూ భరించలేనంత అపారమైనది. మార్గనిర్దేశం కోసం మనం దేవుణ్ణి వేడుకుందాం, నిటారుగా ఉన్న హృదయాలను అలవర్చుకోండి మరియు చివరి వరకు ఆయన మార్గాన్ని స్థిరంగా కొనసాగించండి.



Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |