Chronicles II - 2 దినవృత్తాంతములు 27 | View All

1. యోతాము ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేములో పదునారు సంవత్సర ములు ఏలెను; అతని తల్లి సాదోకు కుమార్తె; ఆమె పేరు యెరూషా.

1. yothaamu elanaarambhinchinappudu iruvadhi yayidhendlavaadai yerooshalemulo padunaaru samvatsara mulu elenu; athani thalli saadoku kumaarthe; aame peru yerooshaa.

2. యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రియైన ఉజ్జియాయొక్క చర్య యంతటి ప్రకారముచేయుచు యెహోవా దృష్టికి యధార్థముగానే ప్రవర్తించెను; అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి.

2. yehovaa mandiramulo praveshinchuta thappa athadu thana thandriyaina ujjiyaayokka charya yanthati prakaaramucheyuchu yehovaa drushtiki yadhaarthamugaane pravarthinchenu; athani kaalamulo janulu marintha durmaargamugaa pravarthinchuchundiri.

3. అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపెలు దగ్గరనున్న గోడ చాలమట్టుకు కట్టించెను.

3. athadu yehovaa mandirapu etthu dvaaramunu kattinchi opelu daggaranunna goda chaalamattuku kattinchenu.

4. మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను.

4. mariyu athadu yoodhaa parvathamulalo praakaarapuramulanu kattinchi aranyamulalo kotalanu durgamulanu kattinchenu.

5. అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధముచేసి జయించెను గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరము అతనికి రెండు వందల మణుగుల వెండిని పదివేల కొలల గోధుమలను పదివేల కొలల యవలను ఇచ్చిరి; ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరు సంవత్సరమును మూడవ సంవత్సరమును అతనికి చెల్లించిరి.

5. athadu ammoneeyula raajuthoo yuddhamuchesi jayinchenu ganuka ammoneeyulu aa samvatsaramu athaniki rendu vandala manugula vendini padhivela kolala godhumalanu padhivela kolala yavalanu ichiri; ee prakaaramugaa ammoneeyulu maru samvatsaramunu moodava samvatsaramunu athaniki chellinchiri.

6. ఈలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచ బడెను.

6. eelaaguna yothaamu thana dhevudaina yehovaa drushtiki yathaarthamugaa pravarthinchi balaparacha badenu.

7. యోతాము చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన యుద్ధములన్నిటిని గూర్చియు, అతని చర్యను గూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.

7. yothaamu chesina yithara kaaryamulanu goorchiyu, athadu chesina yuddhamulannitini goorchiyu, athani charyanu goorchiyu ishraayelu yoodhaaraajula granthamandu vraayabadiyunnadhi.

8. అతడు ఏలనారం భించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేములో పదునారు సంవత్సరములు ఏలెను.

8. athadu elanaaraṁ bhinchinappudu iruvadhi yayidhendlavaadai yerooshalemulo padunaaru samvatsaramulu elenu.

9. యోతాము తన పితరులతో కూడ నిద్రించెను; అతడు దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజాయెను.

9. yothaamu thana pitharulathoo kooda nidrinchenu; athadu daaveedu pattanamandu paathipettabadenu; athani kumaarudaina aahaaju athaniki badulugaa raajaayenu.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles II - 2 దినవృత్తాంతములు 27 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యూదాలో జోతాము పాలన.

ప్రజలు అవినీతిలో నిమగ్నమై, ధర్మానికి నిబద్ధత లేకపోవడాన్ని బహిర్గతం చేశారు. జోతామ్‌కు దేశంలో ఒక సంస్కరణను ప్రారంభించాలనే ఉద్దేశ్యం ఉండవచ్చు. వ్యక్తులు బలమైన నైతిక స్వభావాన్ని కలిగి ఉండటం సాధ్యమే అయినప్పటికీ వారు చేయగలిగిన వాటిని సాధించడానికి అవసరమైన ధైర్యం మరియు అభిరుచి లేదు. ఈ పరిస్థితి నిజంగా ప్రజలపై కొంత నిందలు వేస్తుంది. జోతాము శ్రేయస్సును అనుభవించాడు మరియు బలాన్ని పెంచుకున్నాడు. మన విశ్వాసం పట్ల మనకున్న అచంచలమైన అంకితభావం తప్పులను నిరోధించే మరియు సమాజానికి సానుకూలంగా దోహదపడే మన సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రభువు తరచుగా తెలివైన మరియు భక్తిగల నాయకులను ఇతరులతో భర్తీ చేస్తాడు, వారి ఆశీర్వాదాలను అభినందించడంలో విఫలమైన ప్రజలకు వారి లోపాలు మరియు దుర్గుణాలు శిక్షగా పనిచేస్తాయి.


Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |