Chronicles II - 2 దినవృత్తాంతములు 28 | View All

1. ఆహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది సంవత్సర ములవాడై యెరూషలేములో పదునారు సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదువలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు.

1. aahaaju ēlanaarambhin̄chinappuḍu iruvadhi samvatsara mulavaaḍai yerooshalēmulō padunaaru samvatsaramulu ēlenu. Athaḍu thana pitharuḍaina daaveeduvale yehōvaa drushṭiki yathaarthamugaa pravarthimpalēdu.

2. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడచి, బయలు దేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించెను.

2. athaḍu ishraayēlu raajula maargamulandu naḍachi, bayalu dhevathaa roopamulugaa pōtha vigrahamulanu cheyin̄chenu.

3. మరియు అతడు బెన్‌ హిన్నోము లోయయందు ధూపము వేసి ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియలచొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను.

3. mariyu athaḍu ben‌ hinnōmu lōyayandu dhoopamu vēsi ishraayēleeyula yeduṭanuṇḍi yehōvaa thoolivēsina janamula hēyakriyalachoppuna thana kumaarulanu agnilō dahin̄chenu.

4. అతడు ఉన్నతస్థలములలోను కొండలమీదను ప్రతి పచ్చనిచెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను.

4. athaḍu unnathasthalamulalōnu koṇḍalameedanu prathi pacchanicheṭṭu krindanu balulu arpin̄chuchu dhoopamu vēyuchu vacchenu.

5. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజుచేతి కప్పగించెను. సిరియనులు అతని ఓడించి అతని జనులలో చాలమందిని చెరపట్టుకొని దమస్కునకు తీసికొనిపోయిరి. అతడును ఇశ్రాయేలు రాజుచేతికి అప్పగింపబడెను; ఆ రాజు అతని లెస్సగా ఓడించెను.

5. anduchetha athani dhevuḍaina yehōvaa athanini siriyaa raajuchethi kappagin̄chenu. Siriyanulu athani ōḍin̄chi athani janulalō chaalamandhini cherapaṭṭukoni damaskunaku theesikonipōyiri. Athaḍunu ishraayēlu raajuchethiki appagimpabaḍenu; aa raaju athani lessagaa ōḍin̄chenu.

6. రెమల్యా కుమారుడైన పెకహు యూదావారిలో పరాక్రమశాలులైన లక్ష ఇరువది వేలమందిని ఒక్కనాడు హతముచేసెను. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికిట్టిగతి పట్టెను.

6. remalyaa kumaaruḍaina pekahu yoodhaavaarilō paraakramashaalulaina laksha iruvadhi vēlamandhini okkanaaḍu hathamuchesenu. Vaaru thama pitharula dhevuḍaina yehōvaanu visarjin̄chinanduna vaarikiṭṭigathi paṭṭenu.

7. పరాక్రమ శాలియైన ఎఫ్రాయిమీయుడగు జిఖ్రీ రాజసంతతివాడైన మయశేయాను సభాముఖ్యుడైన అజ్రీకామును ప్రధాన మంత్రియైన ఎల్కొనానును హతము చేసెను.

7. paraakrama shaaliyaina ephraayimeeyuḍagu jikhree raajasanthathivaaḍaina mayashēyaanu sabhaamukhyuḍaina ajreekaamunu pradhaana mantriyaina elkonaanunu hathamu chesenu.

8. ఇదియు గాక ఇశ్రాయేలువారు తమ సహోదరులైన వీరిలోనుండి స్త్రీలనేమి కుమారుల నేమి కుమార్తెల నేమి రెండు లక్షల మందిని చెరతీసికొని పోయిరి. మరియు వారియొద్దనుండి విస్తారమైన కొల్లసొమ్ము తీసికొని దానిని షోమ్రోనునకు తెచ్చిరి.

8. idiyu gaaka ishraayēluvaaru thama sahōdarulaina veerilōnuṇḍi streelanēmi kumaarula nēmi kumaarthela nēmi reṇḍu lakshala mandhini cheratheesikoni pōyiri. Mariyu vaariyoddhanuṇḍi visthaaramaina kollasommu theesikoni daanini shomrōnunaku techiri.

9. యెహోవా ప్రవక్తయగు ఓదేదు అను ఒకడు అచ్చట ఉండెను. అతడు షోమ్రోనునకు వచ్చిన సమూహము ఎదుటికిపోయి వారితో ఈలాగు చెప్పెనుఆల కించుడి, మీ పితరుల దేవుడైన యెహోవా యూదావారి మీద కోపించినందుచేత ఆయన వారిని మీ చేతికి అప్ప గించెను; మీరు ఆకాశమునంటునంత రౌద్రముతో వారిని సంహరించితిరి.

9. yehōvaa pravakthayagu ōdhedu anu okaḍu acchaṭa uṇḍenu. Athaḍu shomrōnunaku vachina samoohamu eduṭikipōyi vaarithoo eelaagu cheppenu'aala kin̄chuḍi, mee pitharula dhevuḍaina yehōvaa yoodhaavaari meeda kōpin̄chinanduchetha aayana vaarini mee chethiki appa gin̄chenu; meeru aakaashamunaṇṭunantha raudramuthoo vaarini sanharin̄chithiri.

10. ఇప్పుడు మీరు యూదావారిని యెరూషలేము కాపురస్థులను మీకొరకు దాసులుగాను దాసురాండ్రుగాను లోపరచుకొన దలచియున్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాకయున్నారా?

10. ippuḍu meeru yoodhaavaarini yerooshalēmu kaapurasthulanu meekoraku daasulugaanu daasuraaṇḍrugaanu lōparachukona dalachiyunnaaru. mee dhevuḍaina yehōvaa drushṭiki meeru maatramu aparaadhulu kaakayunnaaraa?

11. యెహోవా మహోగ్రత మీమీద రేగియున్నది గనుక నా మాట ఆలకించి మీ సహోదరులలోనుండి మీరు చెరపట్టిన వీరిని విడచి పెట్టుడి.

11. yehōvaa mahōgratha meemeeda rēgiyunnadhi ganuka naa maaṭa aalakin̄chi mee sahōdarulalōnuṇḍi meeru cherapaṭṭina veerini viḍachi peṭṭuḍi.

12. అప్పుడు ఎఫ్రాయిమీయుల పెద్దలలో యోహానాను కుమారుడైన అజర్యా మెషిల్లేమోతు కుమారుడైన బెరెక్యా షల్లూము కుమారుడైన యెహిజ్కియా హద్లాయి కుమారుడైన అమాశా అనువారు యుద్ధమునుండి వచ్చినవారికి ఎదురుగా నిలువబడి వారితో ఇట్లనిరి

12. appuḍu ephraayimeeyula peddalalō yōhaanaanu kumaaruḍaina ajaryaa meshillēmōthu kumaaruḍaina berekyaa shalloomu kumaaruḍaina yehijkiyaa hadlaayi kumaaruḍaina amaashaa anuvaaru yuddhamunuṇḍi vachinavaariki edurugaa niluvabaḍi vaarithoo iṭlaniri

13. యెహోవా మన మీదికి అపరాధశిక్ష రప్పించునట్లు మీరు చేసియున్నారు. చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు. మన పాపములను అపరాధములను పెంపు జేయుటకు మీరు పూనుకొని యున్నారు; మన అపరాధము అధికమై యున్నది. ఇశ్రాయేలువారమైన మన మీద మహోగ్రత రేగియున్నది.

13. yehōvaa mana meediki aparaadhashiksha rappin̄chunaṭlu meeru chesiyunnaaru. cherapaṭṭina veerini meeru ikkaḍiki rappimpakooḍadu. Mana paapamulanu aparaadhamulanu pempu jēyuṭaku meeru poonukoni yunnaaru; mana aparaadhamu adhikamai yunnadhi. Ishraayēluvaaramaina mana meeda mahōgratha rēgiyunnadhi.

14. కాగా అధిపతులును సమాజముగా కూడినవారును కన్నులార చూచుచుండగా ఆయుధస్థులు చెరపట్టినవారిని కొల్లసొమ్మును విడచిపెట్టిరి.

14. kaagaa adhipathulunu samaajamugaa kooḍinavaarunu kannulaara choochuchuṇḍagaa aayudhasthulu cherapaṭṭinavaarini kollasommunu viḍachipeṭṭiri.

15. పేళ్లు ఉదాహరింపబడినవారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపుసొమ్ముచేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె బెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదలమీద ఎక్కించి ఖర్జూరవృక్షములుగల పట్టణమగు యెరికోకు వారి సహో దరులయొద్దకు వారిని తోడుకొనివచ్చిరి; తరువాత వారు షోమ్రోనునకు మరల వెళ్లిరి.

15. pēḷlu udaaharimpabaḍinavaaru appuḍu lēchi cherapaṭṭabaḍina vaarini chepaṭṭi dōpusommuchetha vaarilō vastraheenulaina vaariki baṭṭalu kaṭṭin̄chi vaariki vastramulanu paadharakshalanu dharimpajēsi annapaanamulichi thalalaku noone beṭṭin̄chi vaarilō balaheenulaina vaarini gaaḍidalameeda ekkin̄chi kharjooravrukshamulugala paṭṭaṇamagu yerikōku vaari sahō darulayoddhaku vaarini thooḍukonivachiri; tharuvaatha vaaru shomrōnunaku marala veḷliri.

16. ఆ కాలమందు ఎదోమీయులు మరల వచ్చి యూదా దేశమును పాడుచేసి కొందరిని చెరపట్టుకొని పోగా

16. aa kaalamandu edōmeeyulu marala vachi yoodhaa dheshamunu paaḍuchesi kondarini cherapaṭṭukoni pōgaa

17. రాజైన ఆహాజు తనకు సహాయము చేయుడని అష్షూరు రాజులయొద్దకు వర్తమానము పంపెను.

17. raajaina aahaaju thanaku sahaayamu cheyuḍani ashshooru raajulayoddhaku varthamaanamu pampenu.

18. ఫిలిష్తీయులు షెఫేలా ప్రదేశములోని పట్టణములమీదను యూదా దేశమునకు దక్షిణపు దిక్కుననున్న పట్టణములమీదను పడి బేత్షెమెషును అయ్యాలోనును గెదెరోతును శోకోను దాని గ్రామములను, తిమ్నాను దాని గ్రామములను, గివ్జూెనును దాని గ్రామములను ఆక్రమించుకొని అక్కడ కాపురముండిరి.

18. philishtheeyulu shephēlaa pradheshamulōni paṭṭaṇamulameedanu yoodhaa dheshamunaku dakshiṇapu dikkunanunna paṭṭaṇamulameedanu paḍi bētshemeshunu ayyaalōnunu gederōthunu shōkōnu daani graamamulanu, thimnaanu daani graamamulanu, givjooenunu daani graamamulanu aakramin̄chukoni akkaḍa kaapuramuṇḍiri.

19. ఆహాజు యూదాదేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసియుండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదావారిని హీనపరచెను.

19. aahaaju yoodhaadheshamunu digambarinigaa chesi yehōvaaku drōhamu chesiyuṇḍenu ganuka yehōvaa ishraayēlu raajaina aahaaju chesina daanini baṭṭi yoodhaavaarini heenaparachenu.

20. అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరు అతనియొద్దకు వచ్చి అతని బాధపరచెనే గాని అతని బలపరచలేదు.

20. ashshooruraajaina thiglatpilēseru athaniyoddhaku vachi athani baadhaparachenē gaani athani balaparachalēdu.

21. ఆహాజు భాగము లేర్పరచి, యెహోవా మందిరములోనుండి యొక భాగమును, రాజనగరులోనుండి యొక భాగమును, అధిపతుల యొద్ద నుండి యొక భాగమును తీసి అష్షూరు రాజున కిచ్చెను గాని అతడు అతనికి సహాయము చేయలేదు.

21. aahaaju bhaagamu lērparachi, yehōvaa mandiramulōnuṇḍi yoka bhaagamunu, raajanagarulōnuṇḍi yoka bhaagamunu, adhipathula yoddha nuṇḍi yoka bhaagamunu theesi ashshooru raajuna kicchenu gaani athaḍu athaniki sahaayamu cheyalēdu.

22. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి యధిక ముగా అతిక్రమములు జరిగించెను; అట్లు చేసినవాడు ఈ ఆహాజు రాజే.

22. aapatkaalamandu athaḍu yehōvaa drushṭiki mari yadhika mugaa athikramamulu jarigin̄chenu; aṭlu chesinavaaḍu ee aahaaju raajē.

23. ఎట్లనగాసిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించెదనను కొని, తన్ను ఓడించిన దమస్కువారి దేవతలకు బలులు అర్పించెను; అయితే అవి అతనికిని ఇశ్రాయేలువారికిని నష్టమునకే హేతువులాయెను.

23. eṭlanagaasiriyaa raajula dhevathalu vaariki sahaayamu cheyuchunnavi ganuka vaaṭi sahaayamu naakunu kalugunaṭlu nēnu vaaṭiki balulu arpin̄chedhananu koni, thannu ōḍin̄china damaskuvaari dhevathalaku balulu arpin̄chenu; ayithē avi athanikini ishraayēluvaarikini nashṭamunakē hēthuvulaayenu.

24. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూష లేమునందంతట బలిపీఠములను కట్టించెను.

24. aahaaju dhevuni mandirapu upakaraṇamulanu samakoorchi vaaṭini tegagoṭṭin̄chi yehōvaa mandirapu thalupulanu moosivēyin̄chi yeroosha lēmunandanthaṭa balipeeṭhamulanu kaṭṭin̄chenu.

25. యూదా దేశములోని పట్టణములన్నిటిలోను అతడు అన్యుల దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి, తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.

25. yoodhaa dheshamulōni paṭṭaṇamulanniṭilōnu athaḍu anyula dhevathalaku dhoopamu vēyuṭakai balipeeṭhamulanu kaṭṭin̄chi, thana pitharula dhevuḍaina yehōvaaku kōpamu puṭṭin̄chenu.

26. అతడుచేసిన యితర కార్యములను గూర్చియు, అతని చర్య యంతటిని గూర్చియు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.

26. athaḍuchesina yithara kaaryamulanu goorchiyu, athani charya yanthaṭini goorchiyu yoodhaa ishraayēlu raajula granthamandu vraayabaḍiyunnadhi.

27. ఆహాజు తన పితరులతో కూడ నిద్రించి యెరూషలేము పట్టణమునందు పాతి పెట్టబడెనుగాని ఇశ్రాయేలీయుల రాజుల సమాధులకు అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజాయెను.

27. aahaaju thana pitharulathoo kooḍa nidrin̄chi yerooshalēmu paṭṭaṇamunandu paathi peṭṭabaḍenugaani ishraayēleeyula raajula samaadhulaku athaḍu thēbaḍalēdu. Athani kumaaruḍaina hijkiyaa athaniki badulugaa raajaayenu.Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |