Ezra - ఎజ్రా 9 | View All

1. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చిఇశ్రాయేలీయులును యాజకులును లేవీయు లును, కనానీయులు హిత్తీయులు పెరిజ్జీయులు యెబూ సీయులు అమ్మోనీయులు మోయాబీయులు ఐగుప్తీయులు అమోరీయులు అను దేశపు జనములలోనుండి తమ్మును తాము వేరు పరచుకొనక, వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు,
యోహాను 4:9

2. వారి కుమార్తెలను పెండ్లి చేసికొనుచు, తమ కుమారులకును తీసికొనుచు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనినవారైరి. ఈ అపరాధము చేసినవారిలో పెద్దలును అధికారులును నిజముగా ముఖ్యులై యుండిరని చెప్పిరి.

“పెండ్లి చేసుకొన్నారు”– నిర్గమకాండము 34:15-16; ద్వితీయోపదేశకాండము 7:3-6. ఇస్రాయేల్ ప్రత్యేకమైన జాతిగా, పవిత్ర ప్రజగా ఉండేందుకు దేవుడు పిలిచినవారు. తమ చుట్టూవున్న లోకంలోని పాపిష్టి జీవిత విధానాలకు భిన్నంగా వారి పవిత్ర జీవనం ఉండాలి. నేటి విశ్వాసుల విషయం కూడా ఇంతే (2 కోరింథీయులకు 6:14-18); (1 పేతురు 2:9). విచారమేమిటంటే దేవుణ్ణి తెలుసుకున్నామని చెప్పుకునేవాళ్ళు కూడా చాలామంది లోకంలోని అందరిలాగానే ఉండాలనుకొంటారు. దేవునికీ, ఆయన పవిత్రతకూ సాక్షులుగా ఉండవలసినది పోయి దేవుడంటే లెక్కలేని పర జనాల్లో కలిసిపోవాలనుకుంటారు. భ్రష్ట లోకంతో ఈ విధంగా రాజీపడడం ఎజ్రా కాలంలోనే గాక బైబిల్లో అనేక చోట్ల కనిపిస్తున్నది. ఈనాటి క్రైస్తవ సంఘాల సంగతైతే వేరే చెప్పనవసరం లేదు.

3. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని, నా తల వెండ్రుకలను నా గడ్డపు వెండ్రుకలను పెరికి వేసికొని విభ్రాంతిపడి కూర్చుంటిని.
మత్తయి 26:65

ఆదికాండము 37:34; యెహోషువ 7:6; న్యాయాధిపతులు 11:35; 2 సమూయేలు 13:19. దేవునిపట్ల, ఆయన ప్రజలపట్ల ఎజ్రాకున్న ప్రేమ లోతులు ఇక్కడ తెలుస్తున్నాయి. దేవునికి ఎక్కువ సమీపంగా ఉన్నవారు పాపం గురించి అంత నిర్ఘాంతపోతూ ఉంటారు. కీర్తనల గ్రంథము 119:136 పోల్చి చూడండి. ప్రత్యేక ప్రజగా ఉండేందుకూ, దేవుని శాసనాలను పాటించేందుకూ పదే పదే నిరాకరించడం ఆ ప్రజలకు శిక్షనూ దేవుని నామానికి అగౌరవాన్నీ తెచ్చి పెడుతుందని ఎజ్రాకు తెలుసు.

4. చెరపట్ట బడినవారి అపరాధమును చూచి, ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరును నాయొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేళవరకు కూర్చుంటిని.

“వణకే వారందరూ”– కీర్తనల గ్రంథము 119:120; యెషయా 66:2. అన్ని కాలాల్లోనూ దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకునేందుకు సాధనాలైన కొంతమంది ప్రజలను ఉంచుతాడు. వ 8; 2 రాజులు 19:30; యెషయా 1:9 మొ।। చూడండి.

5. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి, నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్లమీద పడి, నా దేవుడైన యెహోవాతట్టు చేతులెతి ్త

6. నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తి కొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై యున్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత యెత్తుగా పెరిగియున్నది.
లూకా 21:24

తనకు అంత కలవరం పుట్టించిన ఈ విషయంలో అతడు నిర్దోషి అయినప్పటికీ ఎజ్రా తన ప్రజల పాపం విషయంలో తనను కూడా వారిలో ఒకడుగా ఎంచుకున్నాడు. నెహెమ్యా 9:6-38; యెషయా 64:5-7; యిర్మియా 3:25 పోల్చిచూడండి. దూరాన నిలబడి వారిపై నేరం మోపలేదతడు. ఈ ప్రార్థననుంచి మనం ఇతరుల కోసం నిజమైన విజ్ఞాపన అంటే ఏమిటో నేర్చుకోవచ్చు. “సిగ్గు”– యిర్మియా 3:25; యిర్మియా 31:19; దానియేలు 9:7. యిర్మియా 3:3; యిర్మియా 6:15; జెఫన్యా 3:5; 1 కోరింథీయులకు 5:2 లకు ఉన్న తేడా చూడండి. కీర్తనల గ్రంథము 51:17 చూడండి.

7. మా పితరుల దినములు మొదలుకొని నేటివరకు మేము మిక్కిలి అపరాధులము; మా దోషములనుబట్టి మేమును మా రాజు లును మా యాజకులును అన్యదేశముల రాజుల వశమున కును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటిదినమున నున్నట్లు అప్పగింపబడుటచేత మిగుల సిగ్గునొందినవార మైతివిు.

“పూర్వీకుల”– 2 దినవృత్తాంతములు 29:6; కీర్తనల గ్రంథము 106:6-43; యిర్మియా 2:27; యెహెఙ్కేలు 23:35. “వశమై”– 2 దినవృత్తాంతములు 36:15-20. ప్రజలు దేవునికి లోబడేందుకు ఇష్టపడకపోతే మళ్ళీ అదే జరుగుతుందని ఎజ్రా భయం.

8. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి, మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల్ల జేయునట్లుగాను, మాలో ఒక శేషము ఉండ నిచ్చినట్లుగాను, తన పరిశుద్ధస్థలమందు మమ్మును స్థిరపరచునట్లుగాను, మా దేవుడైన యెహోవా కొంతమట్టుకు మాయెడల దయ చూపియున్నాడు.

9. నిజముగా మేము దాసులమైతివిు; అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మును విడువక, పారసీకదేశపు రాజులయెదుట మాకు దయ కనుపరచి, మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి, దాని పాడైన స్థలములను తిరిగి బాగుచేయుట కును, యూదాదేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయము1 నిచ్చుటకును కృప చూపించితివి.

“దాసులం”– నెహెమ్యా 9:36. వెట్టి చాకిరీ చేసే బానిసలు కాదు గాని వారంతా పారసీక రాజుల ఆధీనంలో ఉన్నారు. తమకంటూ స్వంతగా రాజు లేకుండా, తమ కార్యకలాపాలను ఇతరుల జోక్యం లేకుండా తామే నిర్వహించుకునే స్థితిలో లేరు. “పారసీక దేశ చక్రవర్తులను”– కోరెష్ మొదలు అర్తహషస్త వరకు వారంతా యూదుల పట్ల దయ చూపారు.

10. మా దేవా, యింత కృపనొందిన తరువాత మేమేమి చెప్ప గలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసులద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతివిు గదా.

11. వారుమీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అపవిత్రతచేతను వారు చేయు అసహ్యమైన వాటిచేతను అపవిత్రమాయెను, వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయెను.

12. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారుల కియ్యకుడి. వారి కుమార్తెలను మీ కుమారులకొరకు పుచ్చుకొనకుడి. మరియు వారికి క్షేమభాగ్యములు కలుగవలెనని మీరు ఎన్నటికిని కోరకుండినయెడల,మీరు బలముగానుండి, ఆ దేశముయొక్క సుఖమును అనుభవించి, మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దాని నప్పగించెదరని చెప్పిరి.

13. అయితే మా దుష్క్రియలను బట్టియు మా గొప్ప అపరాధములను బట్టియు ఈ శ్రమలన్నియు మామీదికి వచ్చిన తరువాత, మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మామీద ఉంచి, మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి

“తక్కువ శిక్ష”– ఖడ్గమూ, కరవూ, తమ దేశం, పట్టణాలు, ప్రజలపై గొప్ప వినాశనమూ, పరాయి దేశంలో దాస్యమూ అనే శిక్షలు వారికి వచ్చాయి. అయితే ఎజ్రా దృష్టిలో ఇది వారికి రావలసిన శిక్షకన్న తక్కువే. మనుషుల్లో ఆధ్యాత్మిక జ్ఞానం గలవారు అర్థం చేసుకునే సత్యం ఇది (కీర్తనల గ్రంథము 103:10). ఆధ్యాత్మికంగా గుడ్డితనం గలవారు మనుషులమీదికి రావలసిన బాధలకు దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. మనుషుల పాపాలకోసం దేవుడు వారిని శిక్షించడం అన్యాయం అనుకొంటారు.

14. ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసికొనిన యెడల, మేము నాశనమగువరకు శేషమైనను లేకుండునట్లును, తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండు నట్లును, నీవు కోపపడుదువు గదా.

“సంబంధాలు”– నెహెమ్యా 13:23-27. విశ్వాసులకు, అవిశ్వాసులకు మధ్య వివాహం దేవుని వాక్కుకు వ్యతిరేకం; చాలా శోచనీయమైన సంగతి కూడా. “కోపగించి”– ద్వితీయోపదేశకాండము 7:4; ద్వితీయోపదేశకాండము 11:16-17; ద్వితీయోపదేశకాండము 29:26-28; యెహోషువ 23:16; న్యాయాధిపతులు 2:20; సంఖ్యాకాండము 25:3; కీర్తనల గ్రంథము 90:7-11 నోట్స్ చూడండి.

15. యెహోవా ఇశ్రా యేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై యున్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము; మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థనచేసితిని.Shortcut Links
ఎజ్రా - Ezra : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |