Nehemiah - నెహెమ్యా 11 | View All

1. జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధపట్టణమగు యెరూష లేమునందు పదిమందిలో ఒకడు నివసించునట్లును, మిగిలిన తొమ్మండుగురు వేరు పట్టణములలో నివసించునట్లును చీట్లు వేసిరి.
మత్తయి 4:5

1. The leaders of the people took up residence in Yerushalayim; while the rest of the people cast lots to bring one-tenth of them to live in Yerushalayim the holy city, with the other nine-tenths in the other cities.

2. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పు కొనినవారిని జనులు దీవించిరి.

2. The people blessed all those who volunteered to live in Yerushalayim.

3. యెరూష లేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే, యూదాపట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివ సించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలీయులును యాజ కులును లేవీయులును నెతీనీయులును సొలొమోనుయొక్క దాసుల వంశస్థులును నివాసము చేసిరి.

3. In the cities of Y'hudah, everyone lived on his own property- the people of Isra'el, the [cohanim], the [L'vi'im], the temple servants and the descendants of Shlomo's servants. But the leaders of the province lived in Yerushalayim.

4. మరియు యెరూష లేములో యూదులలో కొందరును బెన్యామీనీయులలో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా, జెకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయా, యితడు షెఫట్యకు పుట్టిన అమర్యా కుమారుడు, వీడు షెఫట్యకు పుట్టిన పెరెసు వంశస్థుడగు మహలలేలు కుమారుడు.

4. Some of those living in Yerushalayim were from people of Y'hudah, and others were from people of Binyamin. Those from the people of Y'hudah were: 'Atayah the son of 'Uziyah, the son of Z'kharyah, the son of Amaryah, the son of Sh'fatyah, the son of Mahalal'el, from the descendants of Peretz;

5. మరియషిలోనికి పుట్టిన జెకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన అదాయా కుమారుడైన హజాయాకు కలిగిన కొల్హోజెకు పుట్టిన బారూకు కుమారుడైన మయశేయా నివసించెను.

5. and Ma'aseiyah the son of Barukh, the son of Kol-Hozeh, the son of Hazayah, the son of 'Adayah, the son of Yoyariv, the son of Z'kharyah, who belonged to the family of Shelah.

6. యెరూషలేములో నివాసము చేసిన పెరెసు వంశస్థులందరును బలవంతులైన నాలుగువందల అరువది ఎనమండుగురు.

6. The total number of descendants of Peretz living in Yerushalayim was 468 courageous men.

7. బెన్యామీనీయులలో ఎవరనగా యోవేదు పెదాయా కోలాయా మయశేయా ఈతీయేలు యెషయా అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు.

7. These are the people of Binyamin: Salu the son of Meshulam, the son of Yo'ed, the son of P'dayah, the son of Kolayah, the son of Ma'aseiyah, the son of Iti'el, the son of Yesha'yah.

8. అతని తరువాత గబ్బయి సల్లయి; వీరందరును తొమ్మిదివందల ఇరువది యెనమండుగురు;

8. After him: Gabai, Salai; 928 in all.

9. జిఖ్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను. సెనూయా కుమారుడైన యూదా పట్టణముమీద రెండవ అధికారియై యుండెను.

9. Yo'el the son of Zikhri was their overseer, and Y'hudah the son of Hasnu'ah was second in charge of the city.

10. యాజకులలో ఎవరనగా యోయారీబు కుమారుడైన యెదా యాయు యాకీనును

10. From the [cohanim]: Y'da'yah the son of Yoyariv, Yakhin,

11. శెరాయా దేవుని మందిరమునకు అధిపతియై యుండెను. ఇతడు మషుల్లాము సాదోకు మెరాయోతు అహీటూబులను పితరుల వరుసలో హిల్కీ యాకు పుట్టెను.

11. S'rayah the son of Hilkiyah, the son of Meshulam, the son of Tzadok, the son of M'rayot, the son of Achituv, the supervisor of the house of God,

12. ఇంటిపని చేసినవారి సహోదరులు ఎనిమిదివందల ఇరువది యిద్దరు. మరియు పితరులైన మల్కీయాషూరు జెకర్యా అవీ్జు పెలల్యాల వరుసలో యెరోహామునకు పుట్టిన అదాయా.

12. and their kinsmen who did the work for the house; in all 822; and 'Adayah the son of Yerocham, the son of P'lalyah, the son of Amtzi, the son of Z'kharyah, the son of Pash'chur, the son of Malkiyah;

13. పెద్దలలో ప్రధానులైన ఆ అదాయా బంధువులు రెండువందల నలువది యిద్దరు. మరియు ఇమ్మేరు మెషిల్లేమోతె అహజైయను పితరుల వరుసలో అజరేలునకు పుట్టిన అమష్షయి.

13. with his kinsmen, heads of fathers' clans, 242; and 'Amash'sai the son of 'Azar'el, the son of Achzai, the son of Meshillemot, the son of Immer;

14. బల వంతులైనవారి బంధువులు నూట ఇరువది యెనమండుగురు. వారికి జబ్దీయేలు పెద్దగా ఉండెను; ఇతడు ఘనులైన వారిలో ఒకని కుమారుడు.

14. with his kinsmen, courageous men, 128; their overseer was Zavdi'el the son of HaG'dolim.

15. లేవీయులలో ఎవరనగా, షెమయా. ఇతడు బున్నీకి పుట్టిన హషబ్యాకనిన అజ్రీకాము కుమారుడైన హష్షూబునకు పుట్టినవాడు.

15. From the [L'vi'im]: Sh'ma'yah the son of Hashuv, the son of 'Azrikam, the son of Hashavyah, the son of Buni,

16. లేవీయు లలో ప్రధానులైన వారిలో షబ్బెతైయును యోజా బాదును దేవుని మందిర బాహ్య విషయములో పై విచారణచేయు అధికారము పొందిరి.

16. and Shabtai and Yozavad, from the leaders of the [L'vi'im], who were in charge of external affairs for the house of God;

17. ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా ప్రార్థన స్తోత్రముల విషయములో ప్రధానుడు; తన సహోదరులలో బక్బుక్యాయును యెదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దాయును ఈ విషయములో అతని చేతిక్రింది వారు

17. and Matanyah the son of Mikha, the son of Zavdi, the son of Asaf, the leader who began the thanksgiving prayer; and Bakbukyah, the second among his kinsmen; and 'Avda the son of Shamua, the son of Galal, the son of Y'dutun.

18. పరిశుద్ధ పట్టణములో ఉన్న లేవీయులందరు రెండువందల ఎనుబది నలుగురు.

18. All the [L'vi'im] in the holy city numbered 284.

19. ద్వారపాలకులైన అక్కూబు టల్మోను గుమ్మములు కాయువారును నూట డెబ్బది యిద్దరు.

19. The gatekeepers: 'Akuv, Talmon and their kinsmen, who kept watch at the gates, numbered 172.

20. ఇశ్రా యేలీయులలో శేషించిన యాజకులు లేవీయులు మొదలైన వారు యూదా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్థ్యములో వారు ఉండిరి.

20. The rest of Isra'el, [[the rest of]] the [cohanim] and [[the rest of]] the [L'vi'im] were in all the cities of Y'hudah, each on his own property.

21. నెతీనీయులు ఓపెలులో నివసించిరి. జీహాయు గిష్పాయును నెతీనీయులకు ప్రధానులు.

21. The temple servants lived in the 'Ofel; Tzicha and Gishpa were in charge of the temple servants.

22. యెరూషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మత్తన్యా కుమారుడైన హషబ్యా కనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు; ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరముయొక్క పనిమీద అధికారులు

22. The overseer of the [L'vi'im] in Yerushalayim was 'Uzi the son of Bani, the son of Hashavyah, the son of Matanyah, the son of Mikha, from the descendants of Asaf the singers; [[he was]] in charge of the work of the house of God.

23. వారిని గూర్చిన విధి యేదనగా, గాయకులు వంతులప్రకారము ఒప్పందముమీద తమ పనిచేయవలెను, లేవీయులు రాజు యొక్క ఆజ్ఞనుబట్టి దినక్రమేణ జరుగు పనులు చూడవలెను.

23. For they were subject to the king's orders; and there was a fixed schedule for the singers, assigning them their daily duties.

24. మరియయూదాదేశస్థుడగు జెరహు వంశస్థుడైన మెషేజ బెయేలు కుమారుడగు పెతహయా జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను.

24. P'tachyah the son of Mesheizav'el, from the descendants of Zerach the son of Y'hudah, was the king's deputy in all affairs concerning the people.

25. వాటి పొలములలోనున్న పల్లెలు చూడగా యూదా వంశస్థులలో కొందరు కిర్యతర్బాలోను దానికి సంబంధించిన పల్లెలలోను దీబోనులోను దానికి సంబంధించిన పల్లెలలోను యెకబ్సెయేలులోను దానికి సంబంధించిన పల్లెలలోను

25. As for the villages and their surrounding fields: some of the people of Y'hudah lived in Kiryat-Arba and its villages, in Divon and its villages, in Y'kabze'el and its villages,

26. యేషూవలోను మెలాదాలోను బేత్పెలెతులోను.

26. in Yeshua, in Moladah, in Beit-Pelet,

27. హజర్షువలులోను బెయేరషెబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను

27. in Hatzar-Shu'al and its villages, in Be'er-Sheva and its villages,

28. సిక్లగులోను మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను

28. in Ziklag, in M'khonah and its villages,

29. in 'Ein-Rimmon, in Tzor'ah, in Yarmut,

30. జానోహలోను అదు ల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించినవారు. మరియబెయేరషెబా మొదలుకొని హిన్నోము లోయవరకు వారు నివసించిరి.

30. Zanoach, Adulam and their villages, in Lakhish and its surrounding fields, and in 'Azekah and its villages. Thus they occupied the territory from Be'er-Sheva as far as the Hinnom Valley.

31. గెబ నివాసులగు బెన్యామీనీయులు మిక్మషులోను హాయిలోను బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను

31. The people of Binyamin lived from Geva onward, in Mikhmas and 'Ayah, in Beit-El and its villages,

32. అనాతోతులోను నోబులోను అనన్యాలోను

32. and in 'Anatot, Nov, 'Ananyah,

33. హాసోరులోను రామాలోను గిత్తయీములోను

33. Hatzor, Ramah, Gittayim,

34. హాదీదులోను జెబోయిములోను నెబల్లాటులోను

34. Hadid, Tzvo'im, N'valat,

35. లోదులోను పనివారి లోయ అను ఓనోలోను నివసించిరి.

35. Lud, Ono and Gei-Harashim.

36. మరియు లేవీయుల సంబంధ మైనవారిలో యూదా వంశస్థులలోనివారు బెన్యామీనీ యులమధ్య భాగములు పొందిరి.

36. Of the [L'vi'im], some divisions from Y'hudah settled in Binyamin.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Nehemiah - నెహెమ్యా 11 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ప్రజల పంపిణీ.
చరిత్ర అంతటా, వ్యక్తులు సాధారణ ప్రజల శ్రేయస్సు కంటే వారి వ్యక్తిగత సౌలభ్యం మరియు ప్రయోజనాలకు స్థిరంగా ప్రాధాన్యతనిస్తున్నారు. తమ విశ్వాస సూత్రాల కంటే తమ స్వప్రయోజనాలకే తరచుగా ప్రాధాన్యతనిచ్చే మత పెద్దలలో కూడా ఈ ధోరణి గమనించవచ్చు. కొంతమంది మాత్రమే పవిత్రమైన విషయాల పట్ల మరియు పవిత్ర స్థలాల పట్ల అటువంటి అచంచలమైన అంకితభావాన్ని ప్రదర్శించారు, వారు వారి కొరకు భోగాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ, సద్గురువులు మరియు ఆధ్యాత్మిక వృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉన్న చోట మన ఆత్మలు ఆనందాన్ని పొందాలని భావించడం సహేతుకమైనది. దైవిక నగరం పట్ల మరియు రక్షకునితో మన సంబంధాన్ని సులభతరం చేసే వాటన్నిటి పట్ల మనకు ఈ ఆప్యాయత లేకపోతే, ప్రభువు సన్నిధిలో ఉండటానికి ఈ లోకం నుండి బయలుదేరే ఆలోచనను మనం ఎలా స్వీకరించగలం? ప్రాపంచిక కోరికలలో స్థిరపడిన వారికి, దేవుని భూసంబంధమైన చర్చిలో కనిపించే పవిత్రత కంటే కొత్త జెరూసలేం యొక్క సంపూర్ణమైన పవిత్రత భరించడం చాలా సవాలుగా ఉంటుంది. మన ప్రాథమిక అన్వేషణలో దేవుని అనుగ్రహాన్ని కోరడం మరియు ఆయన మహిమను ప్రచారం చేయడం వంటివి ఉండాలి. దేవుని నగరం యొక్క పవిత్ర రాజ్యంలోకి ప్రవేశించాలనే ఆశావహ నిరీక్షణను కొనసాగిస్తూ, మన సంబంధిత పాత్రలలో సహనం, సంతృప్తి మరియు ఉపయోగాన్ని పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నించాలి.



Shortcut Links
నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |