Nehemiah - నెహెమ్యా 13 | View All

1. ఆ దినమందు వారు మోషేగ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవునియొక్క సమాజమును ఎన్నటికి చేరకూడదు.

“మోయాబువాళ్ళలో”– ద్వితీయోపదేశకాండము 23:3-6.

2. వారు అన్నపానములు తీసికొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్రాహపరచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను.

“అన్నపానాలతో”– వారు చేసినదాన్ని బట్టి మాత్రమే కాక చేయకుండా మానుకున్న దాన్ని బట్టి కూడా మోయాబు, అమ్మోను వాళ్ళకు శిక్ష పడిన విషయం గమనించండి. సంఖ్యాకాండము 3:23; న్యాయాధిపతులు 5:23; 1 సమూయేలు 12:23; మత్తయి 25:24-27 మత్తయి 25:41-46 పోల్చిచూడండి. “దీవెన”– సంఖ్యాకాండము 23:11-12; సంఖ్యాకాండము 24:10; ఆదికాండము 50:20 నోట్.

3. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జనసమూహమును ఇశ్రాయేలీయులలోనుండి వెలివేసిరి.

4. ఇంతకుముందు మన దేవుని మందిరపు గదిమీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబీయాతో బంధు త్వము కలుగజేసికొని

బాధ్యత గల పదవిలో ఉండి ఈ వ్యక్తి తన ప్రజలపట్ల, తన దేవుని పట్ల ద్రోహిగా ప్రవర్తించాడు. టోబీయా యూదులకు బద్ధ శత్రువు. దేవుని పని జరగనీయకుండా శాయశక్తులా పోరాడాడు – నెహెమ్యా 2:10; నెహెమ్యా 4:3; నెహెమ్యా 6:1 నెహెమ్యా 6:17-18. ఎల్‌యాషీబు ఇలా ఎందుకు చేశాడో రాసిలేదు. బహుశా టోబీయా కుటుంబంతో వియ్యం అందుకున్నాడేమో. బహుశా టోబీయాదగ్గర డబ్బు ఏమన్నా పుచ్చుకున్నాడేమో. ఏది ఏమైనా గౌరవనీయులైన మనుషులే ఎంత నీచానికి ఒడిగట్టగలరో అన్న విషయంలో ఇది మనకు హెచ్చరిక. యూదుల బద్ధ విరోధికి దేవుని ఆలయ ఆవరణలో స్థలాన్ని ఇచ్చాడు. అందులోనూ గతంలో దేవుని ఉపకరణాలు పెట్టుకునే గదిలో! బైబిలు సత్యాలనూ సూత్రాలనూ అలక్ష్యం చేసి ఫణంగా పెట్టినందువల్ల ఫలితం ఇదే. 2 థెస్సలొనీకయులకు 2:3-4 పోల్చిచూడండి. ప్రతి విశ్వాసికీ ఎంతో అవసరమైన నియమం ఎఫెసీయులకు 4:27 లో ఉంది.

5. నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో పదియవ భాగమును క్రొత్త ద్రాక్షా రసమును లేవీయులకును గాయకులకును ద్వారపాలకుల కును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద, అతనికి ఒకగొప్ప గదిని సిద్ధముచేసి యుండెను.

6. ఆ సమయములో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్త హషస్త యేలుబడియందు ముప్పది రెండవ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్నిదినము లైన తరువాత రాజునొద్ద సెలవుపుచ్చుకొని

నెహెమ్యా 5:14-16. “బబులోను”– ఎజ్రా 5:13 చూడండి. అర్తహషస్త పారసీక దేశానికీ, పారసీకులు ఓడించిన మిగతా ప్రాంతాలన్నిటికీ చక్రవర్తి.

7. యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబీ యాకు ఒక గది యేర్పరచి చేసిన కీడంతయు తెలిసికొని

8. బహుగా దుఃఖపడి ఆ గదిలోనుండి టోబీయాయొక్క సామగ్రియంతయు అవతల పారవేసి, గదులన్నియు శుభ్రముచేయుడని ఆజ్ఞాపింపగా వారాలాగు చేసిరి.

నెహెమ్యా కార్యశూరుడు – వ 25. దేవుని ఆలయం ఆవరణంలో దేవుని శత్రువులు చోటు సంపాదించుకోవడం చూచి ఊరికే ఉండలేడు. ఏమీ చేయకుండా, పాపాన్నీ దుర్మార్గాన్నీ అంగీకరించడానికి బదులు వాటిని ఎదిరించి పోరాడ్డమే అతని మతం. అన్ని తరాల్లోనూ ఇలాంటి వ్యక్తులు అనేకమంది ఉంటే ఎంత బావుంటుంది! మత్తయి 21:12-13; అపో. కార్యములు 5:1-11; 1 కోరింథీయులకు 5:1-5 పోల్చిచూడండి.

9. పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేనక్కడికి మరల తెప్పించితిని.

అమ్మోనువాడు టోబీయా ఉన్న గది అతడిమూలంగా అశుద్ధమైపోయింది. ఆలయం అన్ని భాగాలూ, ఆవరణమూ కేవలం పవిత్రమైన ఉద్దేశాల కోసమే. ఆత్మ సంబంధమైన దేవాలయం విషయం కూడా ఇంతే – 1 కోరింథీయులకు 3:16-17; 1 కోరింథీయులకు 6:13 1 కోరింథీయులకు 6:19-20; 2 కోరింథీయులకు 7:1.

10. మరియు లేవీయులకు రావలసిన పాళ్లు వారికి అందక పోవుటచేత సేవచేయు లేవీయులును గాయకులును తమ పొలములకు పారిపోయిరని తెలిసికొని

వీరు తమ శపథాన్ని భంగపరుస్తున్నారు – నెహెమ్యా 10:37-39. ప్రమాణాలు చెయ్యడం తేలికే. నిలబెట్టుకోవడం కష్టం.

11. నేను అధిపతులతో పోరాడిదేవుని మందిరమును ఎందుకు లక్ష్యపెట్టలేదని అడిగి, వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని.

12. అటుతరువాత యూదులందరును ధాన్య ద్రాక్షారసతైలములలో పదియవ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి.

నాయకులు ఖచ్చితంగా వ్యవహరిస్తే ప్రజలు తరచుగా లోబడుతారు.

13. నమ్మకముగల మనుష్యులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని సాదోకు అను శాస్త్రిని లేవీయులలో పెదాయాను ఖజానామీద నేను కాపరులగా నియమించితిని; వారి చేతిక్రింద మత్తన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను; మరియు తమ సహో దరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింప బడెను.

“నమ్మకమైనవారు”– 2 రాజులు 12:15; 2 రాజులు 22:7.

14. నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపకముంచుకొని, నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము.

15. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్షతొట్లను త్రొక్కుటయు, గింజలుతొట్లలో పోయుటయు, గాడిదలమీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును ద్రాక్షపండ్లను అంజూరపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతిదినమున యెరూషలేములోనికి తీసికొని వచ్చుటయు చూచి, యీ ఆహారవస్తువులను ఆ దినమున అమ్మినవారిని గద్దించితిని.

“విశ్రాంతి దినాన”– నిర్గమకాండము 20:8-10; నిర్గమకాండము 34:21. వీళ్ళు మరో శపథాన్ని భంగం చేస్తున్నారు – నెహెమ్యా 10:31.

16. తూరుదేశస్థులును కాపురముండి, యెరూషలేములోను విశ్రాంతిదినములో యూదులకును చేపలు మొదలైన నానా విధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి.

17. అంతట యూదుల ప్రధానులను నేనెదురాడి విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి మీ రెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు?

“మందలించి”– పాపాన్ని మందలించకుండా ఊరుకుంటే అది వ్యాపించి ఆధ్యాత్మిక సేవను నాశనం చేస్తుంది. పాపం చేసేవారిని గద్దించడం దేవుడు నియమించిన నాయకుల పరిచర్యలో భాగం – యెషయా 58:1; 2 తిమోతికి 3:16; 2 తిమోతికి 4:2; 1 తిమోతికి 5:20.

18. మీ పితరులును ఇట్లు చేసి దేవునియొద్దనుండి మనమీదికిని యీ పట్టణ స్థులమీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయులమీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పితిని.

19. మరియు విశ్రాంతిదినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు, విశ్రాంతిదినము గడచువరకు వాటిని తియ్యకూడదనియు నేనాజ్ఞాపించితిని మరియు విశ్రాంతిదినమున ఏ బరువైనను లోపలికి రాకుండ గుమ్మములయొద్ద నా పనివారిలో కొందరిని కావలి యుంచితిని.

“చీకటి పడుతూ”– సూర్యాస్తమయం నుండి తిరిగి సూర్యాస్తమయం వరకు ఒక రోజు అని యూదుల లెక్క (లేవీయకాండము 23:32). “ఆజ్ఞ జారీ చేశాను”– పాపాన్ని కేవలం గద్దించి ఊరుకోవడంతో నెహెమ్యా తృప్తిపడలేదు. దాన్ని లేకుండా చేసేందుకు చర్యలు తీసుకున్నాడు.

20. వర్తకులును నానావిధములైన వస్తువులను అమ్మువారును ఒకటి రెండు మారులు యెరూష లేము అవతల బసచేసికొనగా

21. నేను వారిని గద్దించి వారితో ఇట్లంటినిమీరు గోడచాటున ఎందుకు బసచేసి కొంటిరి? మీరు ఇంకొకసారి ఈలాగు చేసినయెడల మిమ్మును పట్టుకొందునని చెప్పితిని; అప్పటినుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు.

22. అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు, విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయు లకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, యిందును గూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము.

“శుద్ధి చేసుకుని”– నెహెమ్యా 12:30 నోట్. “జ్ఞాపకముంచుకొని” - నెహెమ్యా 5:19 నోట్.

23. ఆ దినములలో అష్డోదు అమ్మోను మోయాబు సంబంధు లైన స్త్రీలను వివాహము చేసికొనిన కొందరు యూదులు నాకు కనబడిరి.

24. వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాటలాడువారు. వారు ఆ యా భాషలు మాటలాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికిని రాదు.

ఇప్పుడు విశ్వాసులు అవిశ్వాసులను పెళ్ళి చేసుకున్నప్పుడు (క్రైస్తవులకు ఇది నిషేధం – 2 కోరింథీయులకు 6:14-18 మొ।।) వారికి పుట్టే పిల్లలు విశ్వాస భాష మాట్లాడాలో అవిశ్వాస భాష మాట్లాడాలో తెలియక తికమక పడుతారు. ఇలాంటి వివాహాల్లోని విచారకరమైన ఫలితాల్లో ఇది ఒకటి.

25. అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తలవెండ్రుకలను పెరికివేసిమీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు,మీ కుమా రులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారిచేత దేవుని పేరట ప్రమాణము చేయించి

ద్వితీయోపదేశకాండము 25:2. కొన్ని సార్లు దుర్మార్గం సమూలంగా తుడిచి పెట్టాలంటే గట్టి చర్యలు అవసరం. అయితే ఇప్పుడు క్రైస్తవులు తీసుకొనే చర్యలు ఆత్మ సంబంధంగా, ఆచరణాత్మకంగా ఉండాలే గాని, వాటిలో బలాత్కారం ఉండకూడదు.

26. ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతనివంటి రాజు లేకపోయినను, అతడు తన దేవునిచేత ప్రేమింపబడినవాడై ఇశ్రాయేలీయులందరిమీద రాజుగా నియమింపబడినను, అన్యస్త్రీలు అతనిచేత సహా పాపము చేయించలేదా?

27. కాగా ఇంత గొప్పకీడు చేయునట్లును, మన దేవునికి విరోధముగా పాపము చేయు నట్లును అన్యస్త్రీలను వివాహము చేసికొనిన మీవంటివారి మాటలను మేము ఆలకింపవచ్చునా? అని అడిగితిని.

కొందరి దృష్టిలో అంత పెద్ద పొరపాటుగా అనిపించనిది దేవుని మనిషి దృష్టిలో ఘోర పాపం. దేవునికి చేరువగా ఉండేవారికీ, దూరంగా ఉండేవారికీ మధ్య ఉండే ఒక తేడా ఇది.

28. ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడునైన యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటునకు అల్లుడాయెను. దానినిబట్టి నేను అతని నాయొద్దనుండి తరిమితిని.

దుర్మార్గంతో రాజీపడిపోవడానికి మరో ఉదాహరణ. ప్రముఖయాజి మనవడు సన్‌బల్లట్ (నెహెమ్యా 2:10; నెహెమ్యా 4:1 నెహెమ్యా 4:7-8) కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు – 2 దినవృత్తాంతములు 18:1 మొదలైనవి పోల్చిచూడండి.

29. నా దేవా, వారు యాజక ధర్మమును, యాజకధర్మపు నిబంధనను, లేవీయుల నిబంధ నను అపవిత్రపరచిరి గనుక వారిని జ్ఞాపకముంచకొనుము.

తన యాజులు ఇస్రాయేల్ ప్రజల్లోని స్త్రీలనే వివాహమాడాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు (లేవీయకాండము 21:14). దేవుని శాసనాన్ని మీరి వీరు తమ పదవినీ, ఉద్యోగాన్నీ అపవిత్రపరచారు. మలాకీ 2:1-9 పోల్చిచూడండి.

30. ఈలాగున వారు ఏ పరదేశులలోను కలియకుండ వారిని పవిత్రపరచి, ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవచేయునట్లు నియమించితిని.

ఎల్‌యాషిబ్ లాంటి మనుషులు పాపంతో రాజీపడిపోయిన స్థితిలో ఉంటే ఎజ్రా నెహెమ్యాలు దేవుని శాసనాలను, సూత్రాలను కట్టుదిట్టంగా ఆచరణలో పెట్టడం ద్వారా యూదుల మతం, మార్గం పూర్తిగా అంతరించి పోకుండా సహాయం చేశారు.

31. మరియు కావలసి వచ్చినప్పుడెల్ల కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసికొని వచ్చునట్లుగా నేను నియమించితిని. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము.

నెహెమ్యా 10:34; నెహెమ్యా 13:14 నెహెమ్యా 13:22. “నా దేవా”– సాధారణంగా దేవుని పనికి ఆటంకంగా వచ్చే కొన్ని విషయాలు, వాటితో విజయవంతంగా ఎలా పోరాడాలో ఈ గ్రంథంలో తెలుసుకోగలం. ఇలాంటి అడ్డంకులకు మూలాధారం భ్రష్టమైన మనుషుల హృదయం, లేక సైతాను, అతడి దూతలు కావచ్చు (2 కోరింథీయులకు 2:11). నెహెమ్యా, అతడితో ఉన్నవారు వీటిని ఎదుర్కోవలసి వచ్చింది – హేళన (నెహెమ్యా 2:19; నెహెమ్యా 4:1-3), హింస (నెహెమ్యా 4:7-8), బెదిరింపులు (నెహెమ్యా 4:11; నెహెమ్యా 6:9), అన్యాయాన్ని చూచి కలిగే నిరుత్సాహం (నెహెమ్యా 5:1-2), మోసకరమైన పన్నాగాలు (నెహెమ్యా 6:1-4; ఎజ్రా 4:1-2), అసత్య ప్రచారం (నెహెమ్యా 6:5-7), దేవుని వాక్కును పట్టించుకోకుండా భయంతో పనులు చేసే శోధనలు (నెహెమ్యా 6:10-13), ప్రజల్లో పాపం (నెహెమ్యా 5:6-9; నెహెమ్యా 13:15-18 నెహెమ్యా 13:23-27), అబద్ధ ప్రవక్తలు (నెహెమ్యా 6:14), తమలోనే ఉన్న ద్రోహి (నెహెమ్యా 13:4-5 నెహెమ్యా 13:28), దేవుని సేవకుని ప్రతిష్ఠను దెబ్బ తీసే ప్రయత్నాలు (నెహెమ్యా 6:6-7 నెహెమ్యా 6:13). ఎజ్రా గ్రంథంలో ఇలాంటివి మరి రెండున్నాయి – దేవుని పనికి సహాయపడతానని మోసకరంగా వచ్చి ఆ పనిని నాశనం చేయబూనుకోవడం, పనిని మాన్పించేందుకు ప్రభుత్వాధికారాన్ని వాడుకోవడం (ఎజ్రా 4:1-24). సైతాను, మనుషులు చేసే కుటిల పన్నాగాలను జయించేందుకూ దేవుని పనిని చక్కగా చేసి ముగించుకోవడానికీ అవసరమైన లక్షణాలను నెహెమ్యా గ్రంథంలో చూస్తాం. అవేమిటంటే – ఆ పని పట్ల భారం (నెహెమ్యా 1:4; నెహెమ్యా 2:3), పనికి సంపూర్ణంగా అర్పించుకోవడం (నెహెమ్యా 2:4-5), ప్రార్థన జీవితం, ప్రతి దాన్లోను దేవునికి స్థానమివ్వడం (నెహెమ్యా 1:4; నెహెమ్యా 2:4; నెహెమ్యా 4:4 నెహెమ్యా 4:9; నెహెమ్యా 6:9; నెహెమ్యా 13:14 నెహెమ్యా 13:22 నెహెమ్యా 13:29), నమ్మకం (నెహెమ్యా 2:20; నెహెమ్యా 4:14), ఆచరణ యోగ్యంగా పథకాలూ ఏర్పాట్లూ సిద్ధం చేసుకోవడం (నెహెమ్యా 2:11-18; నెహెమ్యా 4:13-23), ఇతరులను పనిలో పురిగొల్పడం (నెహెమ్యా 4:14; నెహెమ్యా 8:10), దేవునికోసం స్థిరంగా నిలబడడానికి దృఢ మనసు (నెహెమ్యా 4:14-23), దైవానుసారమైన జీవనంలో ఎడతెగక ఉండడం (నెహెమ్యా 5:14-19), పాపాన్ని ఎదుర్కొని పరిష్కరించబూనుకోవడం (నెహెమ్యా 5:6-13; నెహెమ్యా 13:8-11 నెహెమ్యా 13:25-30), వివేచనాశక్తి (నెహెమ్యా 6:1-13), దేవుని వాక్కును నొక్కి చెప్పడం (నెహెమ్యా 8:1-18).Shortcut Links
నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |