3. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగానుండి, తనవారందరితో సమాధానముగా మాటలాడుచు, తన జనులయొక్కక్షేమమును విచారించువాడును యూదులలో గొప్ప వాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టుడుగా ఉండెను.
“ప్రధాన మంత్రి”– ఎస్తేరు 9:4 నోట్ చూడండి.
“క్షేమంకోసం”– మనం చూచినంతవరకు అతడు తనకోసం గానీ ఎస్తేరు కోసం గానీ స్వార్థంతో అధికారం కావాలని ప్రాకులాడలేదు. దేవుని కృపవల్ల అధికారంలోకి వచ్చాక దాన్ని తన ప్రయోజనాలకోసం, తనకు ఆస్తి సమకూర్చుకోవడం కోసం ఉపయోగించలేదు. నెహెమ్యా 5:14-18; 2 సమూయేలు 8:15 మొదలైన చోట్ల నోట్స్ చూడండి. ఇస్రాయేల్ దీర్ఘ చరిత్ర అంతటిలోనూ వారి సంరక్షణ, క్షేమం కోసం మొర్దెకయి, ఎస్తేరు చేసినదాన్ని మరి ఏ వ్యక్తి చేయగలిగాడు?