Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
1. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను పండ్రెండవ నెల పదమూడవ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినము ననే యూదులు తమ పగవారిమీద అధికారము నొందినట్లు అగుపడెను.
“అదార్ నెల”– ఎస్తేరు 8:12. “ఓడించారు”– దేవుడు విశ్వాన్నంతటినీ సర్వాధిపతిగా ఏలుతున్నాడు. మనుషుల్లో ఏ స్థితినైనా ఏ పరిస్థితినైనా తలకిందులు చేయగలడు. 1 సమూయేలు 2:4-10 చూడండి.
2. యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో నుండు పట్టణములయందు తమకు కీడు చేయవలెనని చూచినవారిని హతముచేయుటకు కూడుకొనిరి. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరును వారి ముందర నిలువలేకపోయిరి.
కీర్తనల గ్రంథము 71:13 కీర్తనల గ్రంథము 71:24 పోల్చి చూడండి.
3. మొర్దెకైని గూర్చిన భయముతమకు కలిగినందున సంస్థానములయొక్క అధిపతులును అధి కారులును ప్రభువులును రాజు పని నడిపించువారును యూదులకు సహాయముచేసిరి.
4. మొర్దెకై రాజుయొక్క నగరులో గొప్పవాడాయెను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుటచేత అతని కీర్తి సంస్థానము లన్నిటియందు వ్యాపించెను.
“బలప్రభావాలు...వచ్చాయి”– ఆదికాండము 41:41-44; దానియేలు 2:48; దానియేలు 6:1-2 పోల్చి చూడండి. కీర్తనల గ్రంథము 75:6-7 చూడండి. దేవుని ప్రజల్లో జ్ఞానవంతులూ అధికారం గలవారూ ఏ కాలంలోనూ ఎక్కువమంది లేరు (1 కోరింథీయులకు 1:26-29). అయితే తన ఉద్దేశాలను నెరవేర్చుకునేందుకు దేవుడు కొందరిని ఉన్నత స్థితికి హెచ్చిస్తాడు.
5. యూదులు తమ శత్రువుల నందరిని కత్తివాత హతముచేసి వారిని నాశనముచేసి మనస్సు తీర తమ విరోధులకు చేసిరి.
6. షూషను కోటయందు యూదులు ఐదువందలమందిని చంపి నాశనముచేసిరి.
7. హమ్మెదాతా కుమారుడై యూదులకు శత్రువగు హామాను యొక్క పదిమంది కుమారులైన పర్షందాతా
హామాను గొప్పలు చెప్పుకున్న వాటన్నిటి విషయంలోనూ ఇది అంతిమ ఓటమి (ఎస్తేరు 5:11).
8. దల్పోను అస్పాతా పోరాతా
9. అదల్యా అరీదాతా పర్మష్తా
10. అరీసై అరీదై వైజాతా అను వారిని చంపిరి; అయితే కొల్ల సొమ్ము వారు పట్టుకొనలేదు.
“దోపిడీ సొమ్ము”– ఆదికాండము 14:23; 1 సమూయేలు 15:3 1 సమూయేలు 15:18-19 పోల్చిచూడండి.
11. ఆ దినమున షూషను కోటయందు చంపబడినవారి లెక్క రాజునకు తెలియ జెప్పగా
12. రాజు రాణియైన ఎస్తేరుతోయూదులు షూషను కోటయందు ఐదువందలమందిని హామానుయొక్క పదిమంది కుమారులను బొత్తిగా నాశనము చేసియున్నారు; రాజుయొక్క కొదువ సంస్థానములలో వారు ఏమిచేసి యుందురో; ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకనుగ్ర హింపబడును,నీవు ఇంకను అడుగునదేమి? అది దయచేయ బడునని సెలవియ్యగా
ఎస్తేరు 5:3 ఎస్తేరు 5:6; ఎస్తేరు 7:2.
13. ఎస్తేరు రాజవైన తమకు సమ్మతమైనయెడల ఈ దినము జరిగిన చొప్పున షూషను నందున్న యూదులు రేపును చేయునట్లుగాను, హామానుయొక్క పదిమంది కుమారులు ఉరికొయ్యమీద ఉరితీయింపబడు నట్లుగాను సెలవియ్యుడనెను.
“రేపు కూడా”– వ 5 నోట్ చూడండి. “ఉరి”– వారి మృతదేహాలను ప్రదర్శించడం కోసం (వ 7-10). అంటే జరిగిన న్యాయం బహిరంగంగా అందరికీ తెలిసి యూదులపై దాడి చేయదలచే వారందరికీ అదొక హెచ్చరికగా ఉండాలని.
14. ఆలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను; హామాను యొక్క పదిమంది కుమారులు ఉరి తీయింపబడిరి.
15. షూషనునందున్న యూదులు అదారు మాసమున పదు నాలుగవ దినమందు కూడుకొని, షూషనునందు మూడు వందలమందిని చంపివేసిరి; అయితే వారు కొల్లసొమ్ము పట్టుకొనలేదు.
16. రాజు సంస్థానములయందుండు తక్కిన యూదులు కూడుకొని, తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని అదారు మాసము పదమూడవ దిన మందు తమ విరోధులలో డెబ్బది యయిదువేల మందిని చంపివేసి, తమ పగవారివలన బాధలేకుండ నెమ్మదిపొందిరి; అయితేవారును కొల్లసొమ్ముపట్టుకొనలేదు.
17. పదునాలుగవ దినమందును వారు నెమ్మదిపొంది విందుచేసికొనుచు సంతోషముగా నుండిరి.
18. షూషనునందున్న యూదులు ఆ మాసమందు పదమూడవ దినమందును పదునాలుగవ దిన మందును కూడుకొని పదునైదవ దినమందు నెమ్మదిపొంది విందుచేసికొనుచు సంతోషముగా నుండిరి.
వ 26-28.
19. కాబట్టి ప్రాకారములులేని ఊళ్లలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు అదారు మాసము పదునాలుగవ దినమందు సంతోషముగానుండి అది విందుచేయదగిన శుభదినమనుకొని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచు వచ్చిరి.
20. మొర్దెకై యీ సంగతులను గూర్చి రాజైన అహష్వే రోషుయొక్క సంస్థానములన్నిటికి సమీపముననేమి దూర ముననేమి నివసించియున్న యూదులకందరికి పత్రికలను పంపి
21. యూదులు తమ పగవారిచేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదిన మనియు, ప్రతి సంవత్సరము అదారు నెలయొక్క పదు నాలుగవదినమును పదునైదవ దినమును వారు ఆచరించు కొనుచు
22. విందుచేసికొనుచు సంతోషముగా నుండి ఒకరి కొకరు బహుమానములను, దరిద్రులకు కానుకలను, పంప తగిన దినములనియు వారికి స్థిరపరచెను.
“బీదలకు”– ద్వితీయోపదేశకాండము 15:7-11 మొ।।. మన విందుల్లో సంబరాల్లో వీరు చేసినట్టుగానే పేదలనూ అవసరంలో ఉన్న వారినీ గుర్తు చేసుకుందాం.
23. అప్పుడు యూదులు తాము ఆరంభించినదానిని మొర్దెకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదు మని యొప్పుకొనిరి.
24. యూదులకు శత్రువగు హమ్మెదాతా కుమారుడైన అగా గీయుడగు హామాను యూదులను సంహరింప దలచి వారిని నాశనపరచి నిర్మూలము చేయవలెనని,పూరు, అనగా చీటి వేయించియుండగా
ఎస్తేరు 3:6-7. యూదులపై దాడిచేసే ముహూర్తం కోసం హామాను చీటి వేశాడు గాని ఫలితం లేకపోయింది. నిజానికి శుభ దినాలు, ముహూర్తాలు అంటూ ఏమీలేవు. ఇదంతా కేవలం మూఢ నమ్మకం. దేవుని ప్రజల జీవితాల్లో దీనికి తావుండకూడదు. మనం దేవుణ్ణి నమ్ముతూ ఆయనకు లోబడే ప్రతి దినమూ మంచిదే, అలా చేయని ప్రతి రోజూ దుర్దినమే.
25. ఎస్తేరు, విాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడుయోచన తన తలమీదికే వచ్చునట్లుగా చేసి, వాడును వాని కుమారులును ఉరికొయ్యమీద ఉరితీయ బడునట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను.
ఎస్తేరు 7:4-10.
26. కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటినిబట్టియు, ఈ సంగతినిబట్టియు, తాము చూచినదానినంతటినిబట్టియు తమమీదికి వచ్చిన దానిని బట్టియు
ఈ ఆధునిక కాలంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా యూదులు ఈ పూరీం పండుగను ఆచరిస్తారు. జెరుసలంలోని వారు దీన్ని ఆ నెల 15వ తేదీన, మిగతావాళ్ళంతా 14వ తేదీన ఆచరిస్తారు (వ 18,19). ఈ పండుగ హామాను కుతంత్రం నుండి కలిగిన గొప్ప విడుదల గురించిన జ్ఞాపకార్థ దినం. ఇది చరిత్రలోకెల్లా గొప్ప విడుదలల్లో ఒకటి. హామాను కుట్ర పన్నిన రీతిగా ప్రపంచంలోని యూదులందరినీ నాశనం చేయడం జర్మనీ నియంత హిట్లర్‌కు కూడా సాధ్యమయ్యేది కాదు (ఎస్తేరు 3:6). ఎందుకంటే హిట్లర్ చేతికి అందకుండా అమెరికాలోను, ప్రపంచంలోని ఇతర భాగాల్లో అనేకమంది యూదులున్నారు.
27. యూదులు ఈ రెండు దినములనుగూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమునుబట్టి వాటిని ఆచరించెదమనియు, ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబములోను ప్రతి సంస్థానములోను ప్రతి పట్టణములోను జ్ఞాపకము చేయబడునట్లుగా ఆచరించెదమనియు,
28. పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు, తమ సంతతి వారు వాటిని జ్ఞాపకముంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని, ఆ సంగతిని మరచి పోకుండునట్లు, తమమీదను, తమ సంతతివారిమీదను, తమతో కలిసికొనిన వారిమీదను ఇది యొక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి.
29. అప్పుడు పూరీమునుగూర్చి వ్రాయబడిన యీ రెండవ ఆజ్ఞను దృఢపరచుటకు అబీ హాయిలు కుమార్తెయును రాణియునైన ఎస్తేరును యూదుడైన మొర్దెకైయును ఖండితముగా వ్రాయించిరి.
30. మరియు యూదుడైన మొర్దెకైయును రాణియైన ఎస్తేరును యూదు లకు నిర్ణయించిన దానినిబట్టి వారు ఉపవాస విలాపకాలములు ఏర్పరచుకొని, అది తమమీదను తమ వంశపు వారిమీదను ఒక బాధ్యత యని యెంచుకొని వాటిని జరిగించెదమని యొప్పుకొనిన ప్రకారముగా
31. ఈ పూరీము అను పండుగదినములను స్థిరపరచుటకు అతడు అహష్వే రోషుయొక్క రాజ్యమందుండు నూట ఇరువదియేడు సంస్థానములలోనున్న యూదులకందరికి వారి క్షేమము కోరునట్టియు, విశ్వాసార్థ్వములగునట్టియు మాటలుగల పత్రికలు పంపెను.
“ఉపవాస”– ఎస్తేరు 4:3 ఎస్తేరు 4:16 చూడండి. ఈనాడు యూదులు “పూరీం”కు ముందు రోజు ఉపవాస దినంగా ఆచరిస్తారు. హామాను మూలంగా వారు ఎదుర్కొన్న గొప్ప విపత్తును జ్ఞాపకం చేసుకుంటూ ఇలా చేస్తారు.
32. ఈలాగున ఎస్తేరుయొక్క ఆజ్ఞచేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడెను.