Job - యోబు 14 | View All

1. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును.

ఇంత అల్పుడు, గడ్డిపోచవంటివాడు అయిన మనిషి గురించి దేవుడు ఇంతగా ఎందుకు పట్టించుకుంటున్నాడు? అని యోబుకు ఆశ్చర్యం వేస్తున్నది.

2. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును.

3. అట్టివాని మీద నీవు కనుదృష్టి యుంచియున్నావు తీర్పు నొందుటకై నన్ను నీ యెదుటికి రప్పించియున్నావు.

4. పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు?ఆలాగున ఎవడును పుట్టనేరడు.

ఇక్కడి అంశం ‘మనిషి’. పాపభూయిష్టమైన మానవతలో నుంచి పవిత్ర స్వభావం రాదు. తాను మానవుడు కాబట్టి తనది కూడా భ్రష్ట స్వభావమని యోబుకు తెలుసు. అపవిత్రమైనదేది తనలో లేదని యోబు చెప్పలేడు.

5. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది.మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించి యున్నావు

యోబు వాదించేదేమిటంటే మానవ జీవితం ఎలాగూ శూన్యమూ, వ్యర్థమే గదా. అలాంటప్పుడు దేవుడు ఆపదలూ కష్టాలూ పంపడం మానుకుని మనిషి తనకు చేతనైనట్టు బ్రతికేలా అతణ్ణి ఎందుకు వదిలివేయడు?

6. కూలివారివలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించువరకు వారు విశ్రమము నొందునట్లు వారివైపు చూడకయుండుము.

7. వృక్షము నరకబడినయెడల అది తిరిగి చిగుర్చుననియుదానికి లేతకొమ్మలు వేయుననియు నమ్మకముకలదు.

యోబు గానీ అతని స్నేహితులు గానీ బైబిల్లో మరెవరూ గానీ పునర్జన్మపై నమ్మకం ఉంచినట్టు లేదు. యోబు 11:12 నోట్ చూడండి. మనిషి చనిపోయి సజీవంగా తిరిగి లేవడమనే సత్యాన్ని ఆ సమయానికి దేవుడింకా వెల్లడి చేయలేదు. మరణం అంటే కటిక చీకటి ప్రదేశంలో మరి ఇక ఎన్నడూ తిరిగి లేవని శాశ్వతమైన నిద్ర అన్న అభిప్రాయంలో ఉన్నాడు యోబు. ఇది గాక మరో విధంగా అనుకునేందుకు అతనికి దేవునినుంచి ఎలాంటి సందేశమూ అందలేదు.

8. దాని వేరు భూమిలో పాతదై పోయినను దాని అడుగుమొద్దు మంటిలో చీకిపోయినను

9. నీటి వాసన మాత్రముచేత అది చిగుర్చునులేత మొక్కవలె అది కొమ్మలు వేయును.

10. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు.నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమై పోవుదురు?

11. తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో ఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు.

12. ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు.ఎవరును వారిని నిద్ర లేపజాలరు.

13. నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతోమేలునీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచినయెడల ఎంతో మేలునాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరుచున్నాను.

మనిషికి కలిగిన దుస్థితిని యోబు తలపోసు కుంటూ ఉంటే అతని మనసులో ఒక ఆలోచన చోటు చేసుకోసాగినట్టుంది. అతని హృదయంలో చిన్న ఆశాదీపం వెలిగింది. మనిషి ఒకవేళ తిరిగి బ్రతకడం అసాధ్యం కాదేమో. చావు తరువాత మళ్ళీ బ్రతుకు ఉండి నిర్దోషుల యోగ్యత రుజువు కావడం, ప్రశ్నలన్నిటికీ జవాబులు, సమస్యలన్నింటికీ పరిష్కారాలు దొరకడం జరగవచ్చునేమో. అలా జరిగితే ఎంత బావుంటుంది! ఇహలోకం బాధలను, దుఃఖాన్ని ఎంత తేలికగా భరించవచ్చు. 14వ వచనంలో యోబు అడిగిన ప్రశ్నకు క్రొత్త ఒడంబడికలో యేసుప్రభువు జవాబిచ్చాడు. మనిషి చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు. యేసుప్రభువు చనిపోయి సజీవంగా లేచాడు. ఒక సమయం వస్తున్నది – మనుషులంతా బ్రతికి లేస్తారు (మత్తయి 16:21; మత్తయి 28:1-7; యోహాను 5:28-29; యోహాను 11:25; 1 కోరింథీయులకు 15:20-24; 1 థెస్సలొనీకయులకు 4:13-18). కానీ యోబుకు సంతోషం కలిగించేందుకు ఈ ధన్యకరమైన సత్యం అతనికి తెలియదు.

14. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఆలాగుండినయెడల నాకు విడుదల కలుగువరకు నా యుద్ధదినములన్నియు నేను కనిపెట్టియుందును

15. ఆలాగుండిన యెడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.

16. అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు నా పాపమును సహింపలేకయున్నావు

చనిపోయి సజీవంగా లేవడం గురించిన ఆలోచనలు, తద్వారా రేకెత్తిన ఆశాభావం యోబులో అప్పుడు గతించిపోయాయి. అతని బాధకరమైన పరిస్థితులు, కమ్ముకు వచ్చిన నిరాశ క్రింద అవి నలిగిపోయాయి. అయితే ఈ ఊహ అతని మనసు పొరల్లో ఎక్కడో తన పని సాగిస్తూనే ఉంది. కాసేపటికి మరింత బలంగా నిశ్చయతతో ఈ ఊహ బయటికి వచ్చింది (యోబు 19:25-27). 16,17 వచనాల్లో యోబు తన జీవితంలో పాపం ఉందని ఒప్పుకోవడం గమనించండి. దాన్ని కాదనడం లేదు. అతను అనేదేమిటంటే ప్రస్తుతం తనకు వచ్చిన భయంకరమైన విపత్తులకు పాత్రుడయ్యేటంత ఘోరమైన పాపం ఏదీ తాను చెయ్యలేదని.

17. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడియున్నది నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు.

18. పర్వతమైనను పడిపోయి నాశనమగును కొండయైనను దాని స్థానము తప్పును.

19. జలము రాళ్లను అరగదీయునుదాని ప్రవాహములు భూమియొక్క ధూళిని కొట్టుకొనిపోవును నీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు.

20. నీవు వారిని ఎల్లప్పుడు గెలుచుచున్నావు గనుక వారు గతించిపోవుదురునీవు వారికి ముఖవికారము కలుగజేసి వారిని వెళ్లగొట్టుచున్నావు.

21. వారి కుమారులు ఒకవేళ షునత వహించినను అదివారికి తెలియకపోవును.వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికిపట్టెనని వారు గ్రహింపకయుందురు.

22. తమమట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురు తమమట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు.Shortcut Links
యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |