Job - యోబు 27 | View All

1. యోబు ఇంకను ఉపమానరీతిగా ఇట్లనెను

జోఫరు తన వంతు ప్రకారం ఇక్కడేదన్నా చెపుతాడేమోనని యోబు ఆగి ఉండవచ్చు. జోఫరు ఏమీ అనలేదు. కాబట్టి యోబు కొనసాగించాడు.

2. నా ఊపిరి యింకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటనుబట్టియు

యోబు ఒట్టు చేసి చెప్పడం ఈ గ్రంథంలో ఇదే మొదటి సారి, చివరి సారి. దేవుడు తనకు న్యాయం తీర్చకుండా తనను బాధలపాలు చేశాడని యోబు నమ్మకం. అయితే జాగ్రత్తగా గమనించి చూస్తే యోబు దేవుణ్ణి నిరాకరించలేదు, ఆయనలో నమ్మకాన్ని వదిలివేయలేదు.

3. నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాకులపరచిన సర్వశక్తునితోడు

ఆదికాండము 2:7.

4. నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు నా నాలుక మోసము నుచ్చరించుటలేదు.

పరిస్థితులు ఎలా ఉన్నాయని నమ్ముతున్నాడో అదే రీతిగా వాటిని బయటికి చెప్పాలని యోబు నిర్ణయించుకున్నాడు. వాదంలో గెలవాలని తన స్నేహితులను మోసం చేయడు. తాను ఏ ఘోర పాపమూ చేయలేదని తనకు తెలిసినప్పుడు అలాంటిది చేశానని ఒప్పుకోడు. అది నిజం కాకపోయినా అలా ఒప్పుకుంటే స్నేహితుల మెప్పునూ దేవుని దయనూ సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా చెయ్యడు.

5. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పు కొననుమరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను.

6. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయమునన్ను నిందింపదు.

తాను నిజాయితీ, రుజువర్తన, నీతిన్యాయాలతో జీవించానని అతనికి తెలుసు. అదే దారిన పోవాలని అతని దృఢ సంకల్పం. యోబు తన ఆస్తినీ కుటుంబాన్నీ ఆరోగ్యాన్నీ దేవుని సహవాసాన్నీ కోల్పోయాడు. ఇలాంటి విపత్తులన్నిటి మధ్య ఒక్క విషయాన్ని మాత్రం పోగొట్టుకోకూడదని నిశ్చయించుకున్నాడు – తన నీతి నిజాయితీలు, తన చిత్తశుద్ధి. అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం, చెడ్డగా ప్రవర్తించడం మొదలు పెట్టడు. అతడు ఇలా చెపుతున్నట్టున్నాడు: “అంతా పోయినా, దేవుడు నన్ను ముక్కచెక్కలు చేసినా, మనుషులు నన్ను తృణీకరించినా నా యథార్థతను మాత్రం వదలుకోను. నేను ఒంటరివాడినైపోయినా, పేదరికం పాలైనా, దుర్భరమైన రోగం పీడించినా, ప్రపంచం నన్ను ఎగతాళి చేసినా, స్నేహితులు నన్ను అపార్థం చేసుకొన్నా, పరలోకం నన్ను చూచి ముఖం చిట్లించినా నేను మాత్రం నిజాయితీగా యథార్థవంతుడుగా కొనసాగుతాను. కనీసం నా నీతి నిజాయితీలనైనా పోగొట్టుకోకుండా నిలుపుకోవాలని నా కృత నిశ్చయత!” ఈ రోజుల్లో కూడా దేవుడు ఇలాంటి మనుషులను మనకు ఇస్తాడు గాక – తమ నిజాయితీ వదులుకోవడం కంటే తమ ప్రాణాలను వదలడం మేలని భావించే మనుషులు. యోబు 2:3 లో దేవుడు యోబును గురించి అలా మాట్లాడాడంటే ఆశ్చర్యమేముంది?

7. నాకు శత్రువులైనవారు దుష్టులుగా కనబడుదురు గాక నన్నెదిరించువారు నీతిలేనివారుగా కనబడుదురు గాక.

8. దేవుడు వాని కొట్టివేయునప్పుడు వాని ప్రాణము తీసివేయునప్పుడు భక్తిహీనునికి ఆధారమేది?

దేవుడంటే భయభక్తులు లేనివారి గురించి జోఫరు, బిల్దదు కూడా ఇలాంటి మాటలే ఉపయోగించి మాట్లాడారు (యోబు 8:13; యోబు 20:5). వారితో తాను ఈ విషయంలో ఏకీభవిస్తున్నట్టు యోబు చెప్తున్నాడు.

9. వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొఱ్ఱ వినువా?

10. వాడు సర్వశక్తునియందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా?

11. దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను.

ఇప్పటివరకు దుర్మార్గులు తరచుగా పండు వృద్ధాప్యంవరకూ జీవిస్తారనీ, ఈ లోకంలో దేవుని తీర్పు వారి పైకి రాదనీ యోబు చెప్పాడు (యోబు 21:7-13 యోబు 21:30-33; యోబు 24:2-12). అయితే తన స్నేహితులు తన మాటలను సరిగా అర్థం చేసుకోలేదన్న విషయం గ్రహించి కొంత ఆందోళన పడుతున్నట్టున్నాడు. తాను దుర్మార్గులను వెనకేసుకు వస్తున్నట్టు వారు అర్థం చేసుకున్నారా? దుర్మార్గత లాభదాయకమనీ, కాబట్టి నీతిన్యాయాలతో బ్రతకడం కంటే దుర్మార్గంగా ప్రవర్తించడమే మేలనీ తాను బోధిస్తున్నట్టు వాళ్ళకు అనిపించిందా? యోబు 15:4 లో ఎలీఫజు ఆరోపణ చూడండి. ఈ అధ్యాయంలో యోబు వివరణ చెప్తూ ఒకవేళ తాను తన స్నేహితుల మనస్సులో తప్పుడు అభిప్రాయాన్ని కలిగించానేమో అన్న సందేహంతో దాన్ని సరి చేయ చూచుకున్నాడు. బహుశా తాను ఈ చర్చలో ఒక వైపునే మరీ గట్టిగా వాదించానని గ్రహించాడేమో. మనుషులు వాదనలో పడి ఉద్రేకాలు పెరిగితే తరచుగా జరిగేది ఇదే. ఇప్పుడు 13-23 వచనాల్లో దుష్టులు లోకంలో శిక్షకు గురి కావచ్చని పూర్తిగా ఒప్పుకుంటున్నాడు. దుర్మార్గులకు సంభవించేదాన్ని గురించి యోబు స్నేహితులు మాట్లాడిన ధోరణే దాదాపుగా ఇక్కడ యోబు మాటల్లో కనిపిస్తున్నది. వారి వాదనను యోబు చేపట్టినట్టుగా ఇక్కడ అనిపిస్తూవుంది. అయితే యోబు అలా ఎంత మాత్రమూ చేయడం లేదు. స్నేహితుల సిద్ధాంతం ఇది – ఈ లోకంలో దేవుడు ఎప్పుడూ న్యాయవంతులకు ప్రతిఫలమిచ్చి దుష్టులను దండిస్తాడు. నిర్దోషుల మీదికి విపత్తులేవీ రానియ్యడు, దుర్మార్గులను తప్పించుకు పోనియ్యడు. వాదనకు అనుకూలంగా యోబు పైనున్న వాదంలో రెండో భాగానికి అంగీకరించేందుకు సిద్ధమే గాని మొదటి దాని విషయం మట్టుకు కాదు. దుర్మార్గుల మీదికి విపత్తులు వస్తాయని ఒప్పుకుంటాడు గాని న్యాయవంతుల మీదికి రావన్నది మాత్రం అంగీకరించడు. దుర్మార్గులకు సంభవించేదాని విషయంలో తన స్నేహితుల వాదానికి అంగీకరించడం వల్ల యోబు వాదానికి నిలకడ లేకుండా పోయిందని చెప్పవచ్చు. యోబు మాటలు చదివేవారికి అతను తన స్నేహితుల వాదంతో ఎక్కువగా ఏకీభవిస్తున్నాడని అనిపించవచ్చు. (చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది. యోబు ఏ విషయాన్నీ నాన్చి చెప్పడు. అతను చెప్పదలుచుకున్న దేదైనా సరే బల్ల గుద్ది చెప్తాడు.) ఏది ఏమైనా అతని మాటలవల్ల ఒక ఫలితం మాత్రం తప్పకుండా చేకూరింది – అతను దుర్మార్గులను సమర్థిస్తున్నాడని గానీ ఒక మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా తేడా ఏమీ లేదని వాదిస్తున్నాడని గానీ అతని స్నేహితులు ఇక తప్పు పట్టడానికి వీలు లేకుండా పోయింది.

12. మీలో ప్రతివాడు దాని చూచియున్నాడు మీరెందుకు కేవలము వ్యర్థమైనవాటిని భావించు చుందురు?

13. దేవునివలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది ఇది బాధించువారు సర్వశక్తునివలన పొందు స్వాస్థ్యము

14. వారి పిల్లలు విస్తరించినయెడల అది ఖడ్గముచేత పడు టకే గదా వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు.

15. వారికి మిగిలినవారు తెగులువలన చచ్చి పాతిపెట్ట బడెదరు వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి.

16. ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగుచేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధ పరచుకొనినను

17. వారు దాని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు దాని కట్టుకొనెదరు నిరపరాధులు ఆ వెండిని పంచుకొనెదరు.

18. పురుగుల గూళ్లవంటి యిండ్లు వారు కట్టుకొందురు కావలివాడు కట్టుకొను గుడిసెవంటి యిండ్లు వారు కట్టుకొందురు.

19. వారు ధనముగలవారై పండుకొందురు గాని మరల లేవరు కన్నులు తెరవగానే లేకపోవుదురు.

20. భయములు జలప్రవాహములవలె వారిని తరిమి పట్టు కొనును రాత్రివేళ తుఫాను వారిని ఎత్తికొనిపోవును.

21. తూర్పుగాలి వారిని కొనిపోగా వారు సమసి పోవు దురు అది వారి స్థలములోనుండి వారిని ఊడ్చివేయును

22. ఏమియు కరుణ చూపకుండ దేవుడు వారిమీద బాణములు వేయును వారు ఆయన చేతిలోనుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోవుదురు.

23. మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు వారి స్థలములోనుండి వారిని చీకొట్టి తోలివేయుదురు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Job - యోబు 27 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

జాబ్ అతని నిజాయితీని నిరసించాడు. (1-6) 
యోబ్ సహచరులు చివరకు తన భావాలను వ్యక్తీకరించడానికి అనుమతించారు మరియు అతను తీవ్రమైన మరియు అర్థవంతమైన స్వరంతో కొనసాగించాడు. యోబు తన కేసు యొక్క నీతి మరియు దేవునిపై తన విశ్వాసం గురించి ఖచ్చితంగా ఉన్నాడు మరియు అతను ఇష్టపూర్వకంగా తన పరిస్థితిని దైవిక చిత్తానికి అప్పగించాడు. అయితే, యోబు తన బాధలు మరియు బాధలకు సంబంధించి దేవుని చర్యల గురించి మాట్లాడినప్పుడు సరైన గౌరవాన్ని ప్రదర్శించలేదు. దుర్మార్గపు ఆత్మ యొక్క ప్రయత్నాలను ధిక్కరించడం, మనం మన చిత్తశుద్ధిని అంటిపెట్టుకుని ఉన్నంత కాలం మన మనస్సాక్షి స్పష్టంగా ఉంటుందని దృఢమైన నిర్ణయం తీసుకోవడం, చెడు ఉద్దేశాలను బలహీనపరుస్తుంది.

కపటుడు ఆశ లేనివాడు. (7-10) 
ఒక కపటు మరియు దుష్ట వ్యక్తి యొక్క స్థితి చాలా దయనీయంగా ఉన్నట్లు యోబు గమనించాడు. వారు తమ మోసపూరిత మార్గాల కారణంగా బాహ్యంగా అభివృద్ధి చెందినప్పటికీ మరియు వారు గడిచే వరకు వారి అహంకార ఆశావాదానికి కట్టుబడి ఉన్నప్పటికీ, దేవుడు వారి ఆత్మలను కోరినప్పుడు దాని విలువ ఏమిటి? మన విశ్వాసంలో మనం ఎంత ఎక్కువ ఓదార్పుని పొందుతామో, మనం దానిని మరింత గట్టిగా గ్రహిస్తాము. దేవునితో తమకున్న సంబంధాన్ని ఆనందించని వారు ప్రాపంచిక సుఖాల ద్వారా వెంటనే ఆకర్షితులవుతారు మరియు జీవితంలోని సవాళ్లతో తక్షణమే మునిగిపోతారు.

దుష్టుల దయనీయమైన ముగింపు. (11-23)
అదే విషయానికి సంబంధించి, యోబు సహచరులు తమ మరణానికి ముందు దుష్టుల బాధలు వారి తప్పుల పరిమాణానికి ఎలా సరిపోతాయో చర్చించారు. అయితే, ఇది అలా కాకపోయినా, వారి మరణానంతర పరిణామాలు ఇంకా భయంకరంగా ఉంటాయని జాబ్ ఆలోచించాడు. జాబ్ ఈ కాన్సెప్ట్‌ని ఖచ్చితంగా ప్రెజెంట్ చేసే బాధ్యతను తీసుకున్నాడు. నీతిమంతుడైన వ్యక్తికి, మరణం వారిని ఖగోళ రాజ్యానికి తీసుకువెళ్లే అనుకూలమైన గాలిని పోలి ఉంటుంది, అయితే దుష్ట వ్యక్తికి, అది వారిని నాశనం వైపు తిప్పే తుఫానును ప్రతిబింబిస్తుంది. వారి జీవితకాలంలో, వారు దయతో కూడిన ఉపశమనాల నుండి ప్రయోజనం పొందారు, కానీ ఇప్పుడు దైవిక సహనం యొక్క యుగం ముగిసింది, మరియు వారిపై దేవుని ఉగ్రత కురిపించబడుతుంది. దేవుడు ఒక వ్యక్తిని పడగొట్టిన తర్వాత, అతని కోపం నుండి తప్పించుకోవడం లేదా భరించడం ఉండదు. తెరచిన బాహువులచే సూచించబడిన దైవిక దయ యొక్క ఆలింగనంలో ఆశ్రయం పొందేందుకు ప్రస్తుతం నిరాకరిస్తున్న వారు, దైవిక ఉగ్రత బారి నుండి తప్పించుకోలేక పోతున్నారు, అది త్వరలో వాటిని తుడిచిపెట్టడానికి విస్తరిస్తుంది. అంతిమంగా, ఒక వ్యక్తి మొత్తం ప్రపంచాన్ని కూడగట్టుకుని, ఆ ప్రక్రియలో తన స్వంత ఆత్మను పోగొట్టుకున్నట్లయితే, ఏ లాభం పొందుతాడు?



Shortcut Links
యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |