Job - యోబు 34 | View All

1. అప్పుడు ఎలీహు మరల ఈలాగు చెప్పసాగెను

తన మాటలు జ్ఞానయుక్తమని ఎంత తేటతెల్లంగా ఉందంటే ఏమాత్రం వివేచనాశక్తి ఉన్న వాడైనా వాటికి అంగీకరించవలసిందే అని ఎలీహు నమ్మకం (యోబు 36:4 చూడండి).

2. జ్ఞానులారా, నా మాటలు వినుడి అనుభవశాలులారా, నాకు చెవియొగ్గుడి

3. అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును.

4. న్యాయమైనదేదో విచారించి చూతము రండి మేలైనదేదో మనంతట మనము విచారించి తెలిసి కొందము రండి.

5. నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను

యోబు మనసు ఎలాంటిదో దాని గురించి తన అభిప్రాయం ఎలీహు ఇక్కడ వెల్లడిస్తున్నాడు. 5వ వచనంలో యోబు మాటలు కొన్నిటిని తిరిగి వల్లిస్తున్నాడు (యోబు 13:18; యోబు 27:2). 6,9 వచనాల్లో యోబు చెప్పిన కొన్ని మాటల సారాంశం (తన ఉద్దేశంలో) ఏమిటో వర్ణిస్తున్నాడు. తాను నీతిన్యాయాలతో బ్రతికాడని చెప్పుకున్నప్పుడు తన స్నేహితులెవరూ ఆ మాటలు నమ్మలేదని యోబుకు తెలుసు. పరిస్థితులు కూడా దీనికి విరుద్ధంగానే సాక్ష్యమిస్తున్నట్టున్నాయి. 9వ వచనంలో ఉన్న మాటలను యోబు ఎన్నడూ పలకలేదు. అయితే యోబు పలికిన కొన్ని మాటలకు (యోబు 9:21-24; యోబు 21:7-9; యోబు 24:12) అర్థం ఇదే అని ఎలీహు భావించాడు. ఆ మాటకొస్తే తన నమ్మకం దీనికి వ్యతిరేకంగా ఉన్నదని సూచించే మాటలను యోబు పలికాడు (యోబు 21:14-16; యోబు 27:7-23; యోబు 28:28). 7,8 వచనాల్లో ఎలీహు యోబుపైన చేస్తున్న నేరారోపణలు బహు అన్యాయమైనవి. న్యాయమంటే ఎంతో ఇష్టమున్నవాడు సైతం (యోబు 32:3) అన్యాయంగా మాట్లాడగలడు. యోబుకు ఎత్తిపొడుపుగా మాట్లాడ్డం ఎంతో ఇష్టమని ఎలీహు 7వ వచనంలో సూచిస్తున్నాడు. జోఫరు కూడా యోబుపై ఈ నిందే మోపాడు (యోబు 11:3). నిజంగా తన స్నేహితులు చెప్పిన కొన్ని విషయాల పట్ల యోబు తిరస్కార బుద్ధి చూపాడు. ఎందుకంటే వాటికి తిరస్కారమే తగినది. అది ఎలా ఉన్నా, తనకు ఉన్నదని తాను భావించిన లోతైన జ్ఞానం మూలంగా ఎలీహు యోబును అర్థం చేసుకోలేదు.

6. న్యాయవంతుడనై యుండియు నేను అబద్దికునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెనని యోబు అనుచున్నాడు.

7. యోబువంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్లవలె తిరస్కారమును పానముచేయుచున్నాడు.

8. అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయెను భక్తిహీనులకు సహవాసి ఆయెను.

9. నరులు దేవునితో సహవాసము చేయుట వారి కేమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు.

10. విజ్ఞానముగల మనుష్యులారా, నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము

దేవుడు మనుషులపైకి పంపించే శిక్షలో ఇమిడివున్న దేవుని న్యాయాన్ని ఇప్పుడు ఎలీహు సమర్థించ బూనుకొన్నాడు. దేవుని న్యాయం గురించి ఎలీహుకు చాలా ఉన్నతమైన అభిప్రాయం ఉంది. యోబుకు సంభవించినదైనా సరే, దేవుని న్యాయాన్ని యోబు ఏ విధంగా విమర్శించినా సరే, ఈ లోకంలో ఏమి జరిగినా సరే, మనుషులపైకి ఎలాంటి విపత్తులూ బాధలూ వచ్చినా సరే, ఒక విషయం మాత్రం పచ్చి నిజం – దేవుడు తప్పు చేయడం అంటూ జరగదు (ఆదికాండము 18:25; ద్వితీయోపదేశకాండము 32:4; కీర్తనల గ్రంథము 11:7; కీర్తనల గ్రంథము 89:14; యిర్మియా 9:24; అపో. కార్యములు 17:31; ప్రకటన గ్రంథం 16:7 చూడండి). మనుషులు ఏం చేస్తారో దానికి సరిపోయిన ప్రతిఫలాన్నే దేవుడు ఇస్తాడని 11వ వచనంలో ఎలీహు అంటున్నాడు. బైబిల్లో దేవుని న్యాయం గురించి చెప్పిన మాటల సారం ఇదే (కీర్తనల గ్రంథము 62:12; సామెతలు 24:12; యిర్మియా 32:19; యెహెఙ్కేలు 33:20; మత్తయి 16:27; రోమీయులకు 2:6; 2 కోరింథీయులకు 5:10; ప్రకటన గ్రంథం 22:12). అయితే మిగతా ముగ్గురు స్నేహితుల్లాగానే ఎలీహు కూడా ఈ ప్రతిఫలం, లేక శిక్ష, ఇక్కడే ఈ లోకంలోనే కలుగుతుందని ఊహిస్తున్నాడు. క్రొత్త ఒడంబడికలో దేవుడు తీర్పుల గురించి వెల్లడించిన విషయాలు అతనికి తెలియదు (మత్తయి 25:33 మత్తయి 25:36; అపో. కార్యములు 17:31; 1 కోరింథీయులకు 5:10; ప్రకటన గ్రంథం 20:11-15). కాబట్టి మిగతా ముగ్గురు స్నేహితులు ఏది చెప్పారో ఎలీహు కూడా సరిగ్గా అదే చెప్తున్నాడు – యోబు దోషి. తన దుష్కార్యాలకు న్యాయమైన శిక్ష అతనికి కలిగింది. ఈ విధంగా యోబు బాధలకు యోబు స్నేహితులు ఇచ్చిన కారణం కంటే ఎలీహు మంచి కారణాన్ని ఇవ్వలేదు.

11. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారి కిచ్చును అందరికి వారి వారి మార్గములనుబట్టి వారికి ఫల మిచ్చును.

12. దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు.

13. ఎవడైన భూమిని ఆయనకు అప్పగింతపెట్టెనా? ఎవడైన సర్వప్రపంచ భారమును ఆయన కప్పగించెనా?

ఈ విశ్వాన్ని అంతటినీ ఏలే సర్వాధికారి దేవుడు. తనకు ఇష్టం వచ్చినది చేయగలడు, ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవలసిన పని లేదాయనకు.

14. ఆయన తన మనస్సు తనమీదనే ఉంచుకొనిన యెడల తన శ్వాసనిశ్వాసములను తనయొద్దకు తిరిగి తీసికొనిన యెడల

15. శరీరులందరు ఏకముగా నశించెదరు నరులు మరల ధూళియై పోవుదురు.

16. కావున దీని విని వివేచించుము నా మాటల నాలకింపుము.

17. న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా? న్యాయసంపన్నుడైన వానిమీద నేరము మోపుదువా?

వ 5; యోబు 40:8.

18. నీవు పనికిమాలినవాడవని రాజుతోనైనను మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా?

దేవుడు తన తీర్పుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు. ఆయన అన్నిటినీ చూడగలడు. ఆయనకు అన్నీ తెలుసు. అన్నిటిమీదా న్యాయంగా పరిపాలిస్తున్నాడు (కీర్తనల గ్రంథము 47:2 నోట్‌).

19. రాజులయెడల పక్షపాతము చూపనివానితోను బీదలకన్న ధనముగలవారిని ఎక్కువగా చూడని వాని తోను ఆలాగు పలుకుట తగునా? వారందరు ఆయన నిర్మించినవారు కారా?
యాకోబు 2:1

20. వారు నిమిషములో చనిపోవుదురు మధ్యరాత్రి ప్రజలు కల్లోలమునొంది నాశనమగుదురు బలవంతులు దైవికముగా కొనిపోబడెదరు.

21. ఆయన దృష్టి నరుల మార్గములమీద నుంచబడియున్నది ఆయన వారి నడకలన్నియు కనిపెట్టి చూచుచున్నాడు.

22. దుష్‌క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటియైనను మరణాంధకారమైనను లేదు.

23. ఒకడు న్యాయవిమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణచేయుట దేవునికి అగత్యము లేదు.

24. విచారణ లేకుండనే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు.

25. వారి క్రియలను ఆయన తెలిసికొనుచున్నాడు రాత్రియందు ఆయన నాశనము కలుగజేయగా వారు నలుగగొట్టబడుదురు.

26. దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును.

27. ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్యపెట్టకపోయిరి.

28. బీదల మొఱ్ఱను ఆయనయొద్దకు వచ్చునట్లు చేసిరి దీనుల మొఱ్ఱను ఆయనకు వినబడునట్లు చేసిరి.

29. ఆయన సమాధానము కలుగజేసినయెడల శిక్ష విధింప గలవాడెవడు?ఆయన తన ముఖమును దాచుకొనినయెడల ఆయనను చూడగలవాడెవడు? అది అనేకులను గూర్చినదైనను ఒకటే, ఒకని గూర్చిన దైనను ఒకటే

30. భక్తిహీనులు రాజ్యపరిపాలన చేయకుండునట్లు వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు

31. ఒకడునేను శిక్షనొందితిని నేను ఇకను పాపము చేయను

31,32 వచనాల్లోని మనిషిలాగా యోబును మాట్లాడమంటున్నాడు ఎలీహు. అలా కాని పక్షంలో దేవుడు అతణ్ణి కరుణిస్తాడన్న ఆశ లేదు.

32. నాకు తెలియనిదానిని నాకు నేర్పుము నేను దుష్కార్యము చేసియున్న యెడల ఇకను చేయనని దేవునితో చెప్పునా?

33. నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతికారముచేయునా? లేనియెడల నీవుందువా? నేను కాదు నీవేనిశ్చయింపవలెను గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము.

34. వివేచనగలవారు జ్ఞానముగలిగి నా మాట వినువారు నాతో నీలాగు పలుకుదురు

యోబు దీనమనస్సుతో పరితపించడానికి, తన పాపాలను ఒప్పుకోవడానికీ, దేవుని కరుణ కోసం ప్రాధేయపడేందుకూ నిరాకరిస్తున్నాడు కాబట్టి యోబు తిరుగుబాటు ధోరణి గల పాపి అని ఎలీహు అభిప్రాయం. ముగ్గురు స్నేహితులు కూడా ఇలాగే అనుకున్నారు. 36వ వచనం చూడండి. యోబు ఇప్పటికీ ఆసాంతం విషమ పరీక్షకు పూర్తిగా గురయ్యాడని ఎలీహు గ్రహించలేదా ఏమిటీ? యోబుకు ఇంకా రావలసిన బాధలు ఏమున్నాయి? ఎలీహు జరుపుతానన్న మధ్య వర్తిత్వం ఇదన్నమాట! మన రక్షకుడు క్రీస్తులాంటి మధ్యవర్తి వేరే ఎవరున్నారు? (హెబ్రీయులకు 2:17-18; హెబ్రీయులకు 4:15-16; 1 యోహాను 2:1).

35. యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి

36. దుష్టులవలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవలెనని నేనెంతో కోరుచున్నాను.

37. అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చు కొనుచున్నాడు మనయెదుట చప్పట్లుకొట్టి దేవునిమీద కాని మాటలు పెంచుచున్నాడు.


Shortcut Links
యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |

Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2023. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.