Job - యోబు 39 | View All

1. అడవిలోని కొండమేకలు ఈనుకాలము నీకు తెలియునా? లేళ్లు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా?

1. “యోబూ, కొండ మేకలు ఎప్పడు పుట్టాయో నీకు తెలుసా? తల్లి జింక పిల్లను పెట్టెటప్పుడు నీవు గమనిస్తావా?

2. అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా? అవి యీనుకాలము ఎరుగుదువా?

2. యోబూ, తల్లి కొండ మేక, తల్లి జింక వాటి పిల్లలను ఎన్నాళ్లు మోస్తాయో నీకు తెలుసా? అవి పుట్టడానికి సరైన సమయం ఎప్పుడో నీకు తెలుసా?

3. అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును.

3. అవి పండుకొంటాయి, వాటి పిల్లలు పుడతాయి. అప్పుడు వాటి పురిటినొప్పులు పోతాయి.

4. వాటి పిల్లలు పుష్టికలిగి యెడారిలో పెరుగును అవి తల్లులను విడిచిపోయి వాటియొద్దకు తిరిగి రావు.

4. తల్లి కొండ మేక పిల్లలు, తల్లి జింక పిల్లలు పొలాల్లో బలంగా పెరుగుతాయి. అప్పుడు అవి వాటి నివాసాలు వదలి పోతాయి, తిరిగి రావు.

5. అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడెవడు? అడవిగాడిద కట్లను విప్పినవాడెవడు?

5. “యోబూ, అడవి గాడిదలను స్వేచ్ఛగా తిరుగనిచ్చినది ఎవరు? వాటి తాళ్లు ఊడదీసి, వాటిని స్వేచ్ఛగా పోనిచ్చినది ఎవరు?

6. నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పుపఱ్ఱను దానికి నివాసస్థలముగాను నియమించితిని.

6. అడవి గాడిదకు నివాసంగా అరణ్యాన్ని ఇచ్చింది నేనే (యెహోవాను). అవి నివాసం ఉండుటకు ఉప్పు భూములను నేను వాటికి ఇచ్చాను.

7. పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు.

7. అడవి గాడిద అల్లరి పట్టణాలకు దగ్గరగా వెళ్లదు. ఏ మనిషీ వాటిని సాధువు చేసి, బండి లాగుటకు బలవంతం చేయలేడు.

8. పర్వతముల పంక్తియే దానికి మేతభూమి ప్రతివిధమైన పచ్చని మొలకను అది వెదకుకొనును.

8. అడవి గాడిదలు కొండల్లో నివసిస్తాయి. అక్కడే అవి గడ్డి తింటాయి. తినుటకు పచ్చగా ఏమైనా ఉంటుందేమో అని అక్కడే అవి చూస్తాయి.

9. గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ శాలలో నిలుచునా?

9. “యోబూ, అడవి ఆబోతు నీకు పని చేయటానికి లోబడుతుందా? రాత్రిపూట అది నీ కొట్టంలో ఉంటుందా ?

10. పగ్గము వేసి గురుపోతును నాగటిచాలులో కట్ట గలవా? అది నీచేత తోలబడి లోయలను చదరము చేయునా?

10. యోబూ, కేవలం తాడుతోనే అడవి ఆబోతు నీ పొలం దున్నేటట్టు చేయగలవా? నీ కోసం అది లోయలను దున్నుతుందా?

11. దాని బలము గొప్పదని దాని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించెదవా?

11. యోబూ, అడవి ఆబోతు బలాన్ని నీ పని కోసం ఉపయోగించుకొనేందుకు నీవు దానిమీద ఆధార పడగలవా? మహా కష్టతరమైన నీ పని అది చేస్తుంది అనుకొంటావా?

12. అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్లమందున్న ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా?

12. నీ ధాన్యాన్ని పోగుచేసి నీ కళ్లం చోటుకు అది తీసుకొని వస్తుందని దాన్ని నీవు నమ్మగలవా?

13. నిప్పుకోడి సంతోషముచేత రెక్కల నాడించును. రెక్కలును వెండ్రుకలును దాని కున్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా?

13. నిప్పుకోడి సంతోషంగా ఉంది, గనుక అది దాని రెక్కలు రెప రెప లాడిస్తుంది. (కానీ అది ఎగుర లేదు) కానీ నిప్పుకోడి రెక్కలు కొంగ రెక్కల్లాంటివి కావు.

14. లేదుసుమీ, అది నేలను దాని గుడ్లను పెట్టును ధూళిలో వాటిని కాచును.

14. నిప్పుకోడి నేలమీద గుడ్లు పెడుతుంది. ఇసుకలో అవి వెచ్చగా అవుతాయి.

15. దేనిపాదమైన వాటిని త్రొక్క వచ్చుననియైనను అడవిజంతువు వాటిని చితక ద్రొక్కవచ్చుననియైనను అనుకొనకయే యున్నది.

15. ఎవరైనా ఆ గుడ్లు మీద నడచి వాటిని పగులగొట్టవచ్చని లేక ఏదైనా అడవి జంతువు వాటిని పగుల గొట్టవచ్చని నిప్పుకోడి మరచిపోతుంది.

16. తన పిల్లలు తనవికానట్టు వాటియెడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు

16. “నిప్పుకోడి తన పిల్లలను చూడదు. ఆ పిల్లలు తనవి కానట్టే చూస్తూంది. దాని పిల్లలు చస్తే దాని ప్రయాస అంతా వ్యర్థం అయిందనే విషయం దానికి లక్ష్యం లేదు.

17. దేవుడు దానిని తెలివిలేనిదిగా జేసెను ఆయన దానికి వివేచనాశక్తి ననుగ్రహించి యుండ లేదు.

17. ఎందుకంటే, నేను (దేవుణ్ణి) నిప్పుకోడికి జ్ఞానం ఇవ్వలేదు. నిప్పుకోడి తెలివి తక్కువది. నేను దాన్ని అలాగే చేశాను.

18. అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్క రించును.

18. కానీ నిప్పుకోడి పరుగెత్తటానికి లేచినప్పుడు గుర్రాన్ని, దాని రౌతును చూచి అది నవ్వుతుంది. ఎందుకంటే, అది గుర్రం కంటే వేగంగా పరుగెత్తుతుంది గనుక.

19. గుఱ్ఱమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా?

19. “యోబూ, గుర్రానికి బలం నీవు ఇచ్చావా? లేక దాని మెడ మీద జూలు వెంట్రుకలను నీవు పెట్టావా?

20. మిడతవలె అది గంతులు వేయునట్లు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము.

20. యోబూ, మిడత ఎగిరినట్టుగా నీవు గుర్రాన్ని దూకించగలవా? గుర్రం గట్టిగా సకిలిస్తుంది, మనుష్యుల్ని భయపెడ్తుంది.

21. మైదానములో అది కాలు దువ్వి తన బలమునుబట్టి సంతోషించును అది ఆయుధధారులను ఎదుర్కొనబోవును.

21. గుర్రం, తనకు చాలా బలం ఉందని సంతోషిస్తుంది. అది నేలమీద కాలితో గీకుతుంది. యుద్ధానికి వెళ్లేటప్పుడు గుర్రం వేగంగా పరుగెత్తుంది

22. అది భయము పుట్టించుదానిని వెక్కిరించి భీతినొంద కుండును ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు.

22. భయాన్ని చూచి గుర్రం నవ్వుతుంది. అది భయపడదు. యుద్ధం నుండి అది పారిపోదు.

23. అంబుల పొదియు తళతళలాడు ఈటెలును బల్లెమును దానిమీద గలగల లాడించబడునప్పుడు

23. గుర్రం మీద అంబులపొది వణకుతుంది. దానిరౌతువద్ద ఉన్న బల్లెం, ఆయుధాలు సూర్యకాంతిలో తళతళలాడుతాయి.

24. ఉద్దండకోపముతో అది బహుగా పరుగులెత్తును అది బాకానాదము విని ఊరకుండదు.

24. గుర్రం చాలా ఉల్లాసంగా ఉంటుంది. నేలమీద అది చాలా వేగంగా పరుగెత్తుతుంది. బూరధ్వని వింటే గుర్రం ఇంక నిలబడలేదు.

25. బాకానాదము వినబడినప్పుడెల్ల అది అహా అహా అనుకొని దూరమునుండి యుద్ధవాసన తెలిసి కొనును సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధఘోషను వినును.

25. బూర మ్రోగినప్పుడు గుర్రం ‘ఓ హో’ అంటుంది. దూరం నుంచే అది యుద్ధాన్ని పసికడుతుంది. సేనాని కేకలు వేసే ఆజ్ఞలను, ఇతర యుద్ధ ధ్వనులను అది వింటుంది.

26. డేగ నీ జ్ఞానముచేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞవలననే తన రెక్కలు దక్షిణదిక్కునకు చాచునా?

26. “యోబూ, డేగ దాని రెక్కలు విప్పి దక్షిణంగా ఎగిరేటప్పుడు ఎలా ఎగరాలో డేగకు నీవు నేర్పించావా?

27. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధి కెక్కునా? తన గూడు ఎత్తయినచోటను కట్టుకొనునా?

27. యోబూ, పక్షిరాజు ఎగరాలని, పర్వతాల్లో ఎత్తుగా దాని గూడు కట్టుకోవాలని నీవు దానికి ఆజ్ఞాపించావా?

28. అది రాతికొండమీద నివసించును కొండపేటుమీదను ఎవరును ఎక్కజాలని యెత్తు చోటను గూడు కట్టుకొనును.

28. పక్షిరాజు కొండ మీద బండపైన నివసిస్తుంది. ఆ బండ పక్షిరాజు యొక్క కోట.

29. అక్కడనుండియే తన యెరను వెదకును. దాని కన్నులు దానిని దూరమునుండి కనిపెట్టును.

29. పక్షిరాజు తన దుర్గంలోనుండి తన ఆహారం కోసం వెదకుతుంది. దూరంలో ఉన్న ఆహారాన్ని అది చూడగలదు.

30. దాని పిల్లలు రక్తము పీల్చును హతులైనవారు ఎక్కడనుందురో అక్కడనే అది యుండును.
లూకా 17:37

30. పక్షిరాజు పిల్లలు రక్తం తాగుతాయి. అవి చచ్చిన శవాల చుట్టూరా చేరుతాయి.”Shortcut Links
యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |