Job - యోబు 5 | View All

1. నీవు మొరలిడినయెడల నీకు ఉత్తరమీయగలవాడెవడైన నుండునా? పరిశుద్దదూతలలో ఎవనితట్టు తిరుగుదువు?

దీని అర్థం ఇదై ఉండవచ్చు – తాను పలికిన మాటల్లో సత్యం ఎంత తేటగా ఉందంటే ఎవరూ దాన్ని వ్యతిరేకించడానికి ప్రయత్నించకూడదని ఎలీఫజు ఉద్దేశం. యోబు దీనికి అంగీకరించక తన వాదానికి మద్దతుగా మనుషులను గానీ దేవదూతలను గానీ తెచ్చుకుందామనుకుంటే ఎవరూ అతని పక్షంగా మాట్లాడరని ఎలీఫజు భావం.

2. దౌర్భాగ్యమునుగూర్చి యేడ్చుటవలన మూఢులు నశిం చెదరు బుద్ధిలేనివారు అసూయవలన చచ్చెదరు.

తన కష్టాలు, విపత్తుల మూలంగా యోబు కోపంతో మండిపడినా, క్షేమంగా ఉన్నవారిని చూచి అసూయపడినా అదంతా యోబు నాశనానికే దారి తీస్తుందని ఎలీఫజు భావం.

3. మూఢుడు వేరు తన్నుట నేను చూచియున్నాను అయినను తోడనే అతని నివాసస్థలము శాపగ్రస్తమనికనుగొంటిని.

యోబుమీదికి వచ్చిన విపత్తుల్లాంటి ఇబ్బందులనే ఎలీఫజు వర్ణిస్తున్నాడు అంటే, 3వ వచనంలో తాను చెప్పిన మూర్ఖుడి పరిస్థితే ప్రస్తుతం యోబు పరిస్థితి అని కూడా అనుకొన్నట్టు కనిపిస్తుంది. యోబు తనకంటే యోగ్యుడు అని ఎలీఫజుకు ఎంతమాత్రం తెలిసినట్టు లేదు (యోబు 1:8). ఇదంతా యోబు ఓపికగా వినడం ఆశ్చర్యమే.

4. అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురుగుమ్మములో నలిగిపోవుదురువారిని విడిపించువాడెవడును లేడు.

5. ఆకలిగొనినవారు అతని పంటను తినివేయుదురుముండ్ల చెట్లలోనుండియు వారు దాని తీసికొందురుబోనులు వారి ఆస్తికొరకు కాచుకొనుచున్నవి

6. శ్రమ ధూళిలోనుండి పుట్టదు.బాధ భూమిలోనుండి మొలవదు.

ఎలీఫజు భావం ఏమిటంటే విపత్తులనేవి ప్రకృతి సిద్ధమైనవి కావు, వాటంతట అవి రావు. అవి ఒక ఆధ్యాత్మిక నియమంవల్ల తప్పనిసరిగా కలిగే ఫలితాలు. మనిషి జన్మపాపం వల్లా, చేసే పాప కార్యాల వల్లా కష్టాలు కలుగుతాయి. దేవుడు పాపాన్నీ బాధలనూ కలిపి కట్టాడు. ఈ క్రమాన్ని ఎవరూ తప్పించుకోలేరు.

7. నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు.

8. అయితే నేను దేవుని నాశ్రయించుదును.దేవునికే నా వ్యాజ్యెమును అప్పగించుదును.

తానే గనుక యోబు పరిస్థితుల్లో ఉంటే ఏం చేసేవాడో చెప్తున్నాడు. అంటే యోబు అలా చెయ్యడం లేదు అని నిరసన అన్నమాట.

9. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు.

మనుషుల పట్ల దేవుని వ్యవహారాలను ఎలీఫజు చిత్రిస్తున్నాడు. తద్వారా యోబు దేవునివైపు తిరిగి కరుణించమని ప్రార్థిస్తాడని ఎలీఫజు ఆశ. ఇక్కడ దేవుని గురించి చాలా ఉన్నతమైన భావాలను వెలిబుచ్చుతున్నాడు – దేవుడు అద్భుతాలు చేసేవాడు కాబట్టి యోబు కోల్పోయిన ఆస్తిపాస్తులన్నిటినీ అద్భుతమైన రీతిలో తిరిగి సమకూర్చగలడు – 9 వ; తన సృష్టి పట్ల దయగల సర్వాధికారి (వ 10); మనుషుల వ్యవహారాల్లో న్యాయం జరిగిస్తాడు. యుక్తిపరులైన దుర్మార్గులను శిక్షించి వారిచేత పీడించబడేవారిని విడిపిస్తాడు (11-16). 13వ వచనంలో కొంత భాగాన్ని పౌలు 1 కోరింథీయులకు 3:19 లో ఎత్తిరాశాడు.

10. ఆయన భూమిమీద వర్షము కురిపించువాడు పొలములమీద నీళ్లు ప్రవహింపజేయువాడు.

11. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడువారిని క్షేమమునకు లేవనెత్తును.
లూకా 1:52, యాకోబు 4:10

12. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చ నేరకుండ ఆయన వారి ఉపాయములను భంగపరచును

13. జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును కపటుల ఆలోచనను తలక్రిందుచేయును
1 కోరింథీయులకు 3:19

14. పగటివేళ వారికి అంధకారము తారసిల్లును రాత్రి ఒకడు తడువులాడునట్లు మధ్యాహ్నకాలమునవారు తడువులాడుదురు

15. బలాఢ్యుల నోటి ఖడ్గమునుండి, వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును.

16. కావున బీదలకు నిరీక్షణ కలుగును అక్రమము నోరు మూసికొనును.

17. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడుకాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము.

ఈ వచనాల్లోని సత్యం సామెతలు 3:11-12; హెబ్రీయులకు 12:5-6 లో కనిపిస్తుంది. ఇది మనోహరమైన సత్యం. కానీ అప్పటి పరిస్థితుల్లో యోబుకు అవసరమైనది ఇది కాదు. ఎందుకంటే యోబు పడుతున్న బాధలు అతను చేసిన పాపాలకు శిక్షగా రాలేదు. ఇందులో దేవుని ముఖ్యోద్దేశమేమంటే యోబు యోగ్యతను రుజువు చేయడం, సైతాను నోరు మూయించడం. ఉపదేశకుడు చేసే ప్రసంగాలు వినేవాళ్ళ పరిస్థితులకు వర్తించకుంటే అవి ఎంత మంచివైనా ఏం లాభం?

18. ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థపరచును.

19. ఆరు బాధలలోనుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు.

ఎలీఫజు అంటున్నాడు, యోబు గనుక దేవుని సంకల్పానికి లోబడి ఆయన పంపిన శిక్షను ఓపికతో భరిస్తే దేవుడు అతణ్ణి కష్టాలనుండి తప్పిస్తాడు (వ 19,20), అతని ఆస్తిని తిరిగి సమకూరుస్తాడు (వ 22-24), అతను పోగొట్టుకున్న సంతతికి బదులుగా మరింతమంది పిల్లలను ఇస్తాడు (వ 26), అతనికి తిరిగి ఆరోగ్యాన్ని చేకూరుస్తాడు (వ 18,26).

20. క్షామకాలమున మరణమునుండియు యుద్ధమున ఖడ్గబలమునుండియు ఆయన నిన్ను తప్పించును.

21. నోటిమాటలచేత కలుగు నొప్పి నీకు తగులకుండ ఆయన నిన్ను చాటుచేయును ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు.

22. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసికొని యుందువు అడవిమృగములు నీతో సమ్మతిగా నుండును.

23. ప్రళయమును క్షామమును వచ్చునప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు అడవిమృగములకు నీవు ఏమాత్రమును భయపడవు

24. నీ డేరా క్షేమనివాసమని నీకు తెలిసియుండును నీ యింటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి యుండదు.

25. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబికులు భూమిమీద పచ్చికవలె విస్తరించుదురనియు నీకు తెలియును.

26. వాటి కాలమున ధాన్యపుపనలు ఇల్లు చేరునట్లు పూర్ణవయస్సుగలవాడవై నీవు సమాధికి చేరెదవు.

27. మేము ఈ సంగతి పరిశోధించి చూచితివిు, అది ఆలాగే యున్నది.

బిల్దదు, జోఫరుల తరుఫున కూడా ఎలీఫజు మాట్లాడాడు. యోబుకు ఆ పరిస్థితిలో విని, దాని ప్రకారం చెయ్యడానికి తగిన సత్యాన్ని తాను చెప్తున్నాడని ఎలీఫజుకు గట్టి నమ్మకం.Shortcut Links
యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |