Job - యోబు 9 | View All

1. అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

1. అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:

2. వాస్తవమే, ఆ సంగతి అంతేయని నేనెరుగుదును.నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును?

2. “అవును, నీవు చెప్పేది సత్యమే అని నాకు తెలుసు. అయితే మానవుడు దేవుని దృష్టిలో ఎలా నిర్దోషిగా ఉండగలడు?

3. వాడు ఆయనతో వ్యాజ్యెమాడ గోరినయెడలవేయి ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకుఉత్తరమియ్యలేడు.

3. ఒక మనిషి దేవునితో వాదించలేడు. దేవుడు వెయ్యి ప్రశ్నలు అడుగవచ్చు. కానీ ఒక్కదానికి కూడా ఏ మనిషీ జవాబు యివ్వలేడు.

4. ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడుఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడు?

4. దేవుని జ్ఞానం లోతైనది, ఆయన శక్తి గొప్పది. దేవునితో పోరాడిన ఏ మనిషీ బాధపడకుండా తప్పించుకోలేడు.

5. వాటికి తెలియకుండ పర్వతములను తీసివేయువాడు ఆయనే ఉగ్రతకలిగి వాటిని బోర్లదోయువాడు ఆయనే

5. దేవుడు పర్వతాలను కదిలిస్తాడు. కాని వాటికి తెలియదు. ఆయనకు కోపం వచ్చినప్పుడు పర్వతాలను తలక్రిందులు చేస్తాడు.

6. భూమిని దాని స్థలములో నుండి కదలించువాడుఆయనేదాని స్తంభములు అదరచేయువాడు ఆయనే

6. భూమిని కంపింప చేయటానికి దేవుడు భూకంపాలను పంపిస్తాడు. భూమి పునాదులను దేవుడు కంపిపజేస్తాడు.

7. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు ఆయన నక్షత్రములను మరుగుపరచును.

7. దేవుడు సూర్యునితో మాట్లాడి దానిని ఉదయించకుండా చేయగలడు. ప్రకాశించకుండా, నక్షత్రాలకు ఆయన తాళం వేసి పెట్టగలడు.

8. ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరచువాడు సముద్రతరంగములమీద ఆయన నడుచుచున్నాడు.

8. దేవుడే ఆకాశాలను చేశాడు. మహాసముద్ర తరంగాల మీద ఆయన నడుస్తాడు.

9. ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణనక్షత్రరాసులను చేసినవాడు.

9. [This verse may not be a part of this translation]

10. ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను లెక్కలేనన్ని అద్భుతక్రియలను ఆయన చేయుచున్నాడు.

10. మనుష్యులు గ్రహించలేని ఆశ్చర్యకర కార్యాలను దేవుడు చేస్తాడు. దేవుని మహా అద్భుతాలకు అంతం లేదు.

11. ఇదిగో ఆయన నా సమీపమున గడచిపోవుచున్నాడుగాని నేనాయనను కనుగొనలేను నా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు.

11. దేవుడు నన్ను దాటి వేళ్లేటప్పుడు నేను ఆయనను చూడలేను. దేవుడు పక్కగా వెళ్లేటప్పుడు ఆయన గొప్పతనాన్ని నేను గ్రహించలేను.

12. ఆయన పట్టుకొనిపోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగినవాడెవడు?

12. దేవుడు దేనినై నా తీసివేస్తే, ఏ ఒక్కరూ ఆయన్ని వారించలేరు. ‘ఏమిటి నీవు చేస్తున్నది?’ అని ఎవ్వరూ ఆయనతో అనలేరు.

13. దేవుని కోపము చల్లారదురాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు.

13. దేవుడు తన కోపాన్ని తగ్గించుకోడు. రాహాబు సహాయకులకు కూడా దేవుడంటే భయం.”

14. కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటివాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేనేపాటివాడను?

14. యోబు ఇంకా ఇలా చెప్పాడు: “కనుక నేను దేవునితో వాదించలేను. ఆయనతో వాదించేందుకు నేను వాడాల్సిన మాటలు నాకు తెలియవు.

15. నేను నిర్దోషినై యుండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను న్యాయకర్తయని నేనాయనను బతిమాలుకొనదగును.

15. యోబు అనే నేను నిర్దోషిని. కానీ ఆయనకు నేను జవాబు ఇవ్వలేను. నా న్యాయమూర్తిని (దేవుని) ప్రాధేయపడడం మాత్రమే నేను చేయగలిగింది అంతా.

16. నేను మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన నాకుత్తరమిచ్చినను ఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మజాలను.

16. ఒకవేళ నేను ఆయనకు మొరపెట్టినా, ఆయన జవాబిచ్చినా, దేవుడు నా ప్రార్థన విన్నాడని నేను నమ్మను.

17. ఆయన ఆలకింపక పెనుగాలిచేత నన్ను నలుగగొట్టు చున్నాడు నిర్ణిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు

17. నన్ను అణచివేయటానికి దేవుడు తుఫానులు పంపిస్తాడు. ఏ కారణం లేకుండానే ఆయన నాకు ఇంకా ఎక్కువ గాయాలు కలిగిస్తాడు.

18. ఆయన నన్ను ఊపిరి తీయనియ్యడు చేదైనవాటిని నాకు తినిపించును.

18. దేవుడు నన్ను మళ్లీ శ్వాస పీల్చనీయడు. ఆయన నన్ను ఇంకా ఎక్కువ కష్టపెడతాడు.

19. బలవంతుల శక్తినిగూర్చి వాదము కలుగగా-నేనే యున్నానని ఆయన యనును న్యాయవిధినిగూర్చి వాదము కలుగగా-ప్రతివాదిగా నుండ తెగించువాడెవడని ఆయన యనును?

19. నేను దేవుణ్ణి ఓడించలేను. దేవుడు శక్తిమంతుడు. దేవుని న్యాయస్థానానికి వెళ్లి నాకు న్యాయం చేకూర్చేటట్టు నేను చేయలేను. దేవుణ్ణి న్యాయస్థానానికి రమ్మని ఆయనను ఎవరు బలవంతం చేస్తారు?

20. నా వ్యాజ్యెము న్యాయమైనను నా మాటలు నామీద నేరము మోపును నేను యథార్థవంతుడనైనను దోషియని ఆయన నన్ను నిరూపించును.

20. యోబు అనే నేను నిర్దోషిని, కాని నేను చెప్పే మాటలు నేను దోషిలా కనబడేటట్టు చేస్తాయి. కనుక, నేను నిర్దోషిని, కాని నా నోరు నేను దోషిని అని ప్రకటిస్తుంది.

21. నేను యథార్థవంతుడనైనను నాయందు నాకిష్టములేదునేను నా ప్రాణము తృణీకరించుచున్నాను.

21. నేను నిర్దోషిని, కాని నన్ను గూర్చి నేను లక్ష్య పెట్టను. నా సోంత జీవితం నాకు అసహ్యం.

22. ఏమి చేసినను ఒక్కటే కావున-యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదములేకుండ ఆయన అందరిని నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను.

22. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కనుక ‘దేవుడు నిర్దోషులను, దుర్మార్గులను కూడా నాశనం చేస్తాడు’ అని నేను తలస్తాను.

23. సమూలధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనముచేయగానిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును.

23. ఏదో ఒక దారుణం జరిగి ఒక నిర్దోషి అకస్మాత్తుగా చనిపోయినప్పుడు అతని శ్రమను చూసి దేవుడు నవ్వుతాడు.

24. భూమి దుష్టులచేతికి అప్పగింపబడియున్నదివారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండ ఆయన చేయును.ఆయన గాక ఇవి అన్నియు జరిగించువాడు మరి ఎవడు?

24. భూమిని దుర్మార్గుడు చేజిక్కించుకున్నప్పుడు దేవుడు న్యాయమూర్తులను గుడ్డివాళ్లను చేస్తాడా? ఇది దేవుడు చేయకపోతే ఇంకెవరు చేశారు?

25. పరుగుమీద పోవువానికంటె నా దినములు త్వరగా గతించుచున్న విక్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి.

25. “పరుగెత్తేవాని కంటె వేగంగా నా రోజులు గడిచి పోయాయి. నా రోజులు ఎగిరిపోతున్నాయి, వాటిలో సంతోషం లేదు.

26. రెల్లుపడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవునుఎరమీదికి విసురున దిగు పక్షిరాజువలె అవి త్వరపడిపోవును.

26. జమ్ము పడవలు పోయేలా నా రోజులు వేగంగా పోతున్నాయి. పక్షిరాజులు తాము పట్టుకొన్న జంతువుల మీదికి దూసుకు వచ్చినట్టుగా నా రోజులు వేగంగా గడిచి పోతున్నాయి.

27. నా శ్రమను మరచిపోయెదననియుదుఃఖముఖుడనై యుండుట మాని సంతోషముగానుండెదననియు నేను అనుకొంటినా?

27. “నేను ఆరోపణలు చేయను, నేను నా బాధ మరచిపోతాను, నా ముఖం మార్చుకొని, నవ్వుతూ ఉంటాను’ అని ఒక వేళ నేను చెప్పినా,

28. నా సమస్త బాధలకు భయపడి వణకుచున్నానునీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చ యముగా ఎరిగియున్నాను

28. నాకు నా శ్రమ అంతటిని గూర్చి ఇంకా భయమే. ఎందుకంటే నేను దోషిని అని దేవుడు ఇంకా చెబుతున్నాడని నాకు తెలుసు గనుక.

29. నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను గదా కాబట్టి నాకు ఈ వ్యర్థప్రయాసమేల?

29. నేను దోషిని అని ఇది వరకే తీర్పు తీర్చబడింది. కనుక నేను ఇంకా ఎందుకు వ్రయత్నిస్తూ ఉండాలి. పోనీ దానిని, ‘మర్చిపో’ అని అంటాను నేను.

30. నేను హిమముతో నన్ను కడుగుకొనిననుసబ్బుతో నా చేతులు కడుగుకొనినను

30. మంచుతో నన్ను నేను కడుగుకొన్నా, సబ్బుతో నేను నా చేతులు కడుగుకొన్నా

31. నీవు నన్ను గోతిలో ముంచెదవు అప్పుడు నేను నా స్వంతవస్త్రములకై అసహ్యుడనగుదును.

31. దేవుడు నన్ను చావు గోతిలొ పడవేస్తాడు. అప్పుడు నా వస్త్రాలే నన్ను ద్వేషిస్తాయి.

32. ఆయన నావలె నరుడు కాడునేను ఆయనతో వ్యాజ్యెమాడజాలనుమేము కలిసి న్యాయవిమర్శకు పోలేము.

32. దేవుడు నాలా మనిషి కాడు. అందుకే నేను ఆయనకు జవాబు ఇవ్వలేను. న్యాయస్థానంలో మేము ఒకరి నొకరం కలుసుకొలేం.

33. మా యిద్దరిమీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకులేడు.

33. మాకు మధ్య నిలబడేందుకు ఎవరైనా ఉంటే బాగుండును. మా ఇద్దరికీ న్యాయంగా తీర్పు తీర్చేవారు ఎవరైనా ఉంటే బాగుండును.

34. ఆయన తన దండమును నామీదనుండి తీసివేయవలెనునేను భ్రమసిపోకుండ ఆయన తన భయంకర మహాత్మ్యమును నాకు కనుపరచకుండవలెను.

34. దేవుని శిక్షా దండాన్ని తీసువేసుకొనే వారు ఎవరైనా ఉంటే బాగుండును. అప్పుడు దేవుడు నన్ను ఇంకెంత మాత్రము భయపెట్టడు.

35. అప్పుడు ఆయనకు భయపడక నేను మాటలాడెదను, ఏలయనగా నేను అట్టివాడను కాననుకొనుచున్నాను.

35. అప్పుడు నేను దేవునికి భయపడకుండా నేను చెప్పదలచుకొన్నది చెప్పగలుగుతాను. కానీ ఇప్పుడు నేను అలా చేయలేను.Shortcut Links
యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |