Psalms - కీర్తనల గ్రంథము 103 | View All

1. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము.

ఇది దేవుని మంచితనంపై రాసిన గీతం. దీని ముఖ్యాంశం వ 8లో ఉంది. ఇది దేవుడు నిర్గమకాండము 34:6 లో తనగురించి వెల్లడి చేసుకొన్న సత్యం పై ఆధారపడి ఉంది. అలాంటి మంచి దేవునికి తాను అర్పించే స్తుతి అంతరంగంలో నుంచి నిష్కపటంగా ప్రవహించాలని కోరాడు. దావీదు అన్నిటినీ చూడగలిగిన, అన్నీ తెలిసిన దేవునికి మరి ఏ రకమైన స్తుతి అయినా అంగీకారం అవుతుందా? స్తుతి గురించి కీర్తనల గ్రంథము 33:1-3 చూడండి.

2. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము

ఇది దేవుని మంచితనంపై రాసిన గీతం. దీని ముఖ్యాంశం వ 8లో ఉంది. ఇది దేవుడు నిర్గమకాండము 34:6 లో తనగురించి వెల్లడి చేసుకొన్న సత్యం పై ఆధారపడి ఉంది. అలాంటి మంచి దేవునికి తాను అర్పించే స్తుతి అంతరంగంలో నుంచి నిష్కపటంగా ప్రవహించాలని కోరాడు. దావీదు అన్నిటినీ చూడగలిగిన, అన్నీ తెలిసిన దేవునికి మరి ఏ రకమైన స్తుతి అయినా అంగీకారం అవుతుందా? స్తుతి గురించి కీర్తనల గ్రంథము 33:1-3 చూడండి.

3. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు.
మార్కు 2:7

దావీదు తనలో స్తుతి పెల్లుబికాలని దేవుడు తనపట్ల కృపను చూపిన అయిదు విధానాలను ధ్యానిస్తున్నాడు. దేవుడు క్షమిస్తాడు, నయం చేస్తాడు, విమోచిస్తాడు, కిరీటం ఇస్తాడు, తృప్తి పరుస్తాడు. ఈ జాబితాలో అన్ని అంశాలూ లేవు (కీర్తనల గ్రంథము 40:5). “క్షమిస్తున్నాడు”– కీర్తనల గ్రంథము 86:5; కీర్తనల గ్రంథము 130:8; నిర్గమకాండము 34:7; యెషయా 43:25; మత్తయి 12:31; ఎఫెసీయులకు 1:7; 1 యోహాను 1:9. క్షమాపణ ఇతర దీవెనలకు పునాది. అది లేకపోతే ఇతర దీవెనలన్నిటికీ ఎక్కువ విలువ ఉండదు. దేవుని క్షమాపణను మనం పొందకుండా మనకు ఆరోగ్యం, సిరిసంపదలు, బలం, కోరికలు తీరడం ఎందుకు? కొంతకాలం వాటిని అనుభవించి శాశ్వత నాశనానికి వెళ్ళిపోతే ప్రయోజనమేముంది? “నయం చేస్తున్నాడు”– కీర్తనల గ్రంథము 30:2; నిర్గమకాండము 15:26; మత్తయి 9:35. ఇది దావీదు వ్యక్తిగత అనుభవం. అందరి రోగాలనూ దేవుడు ఎప్పుడూ నయం చేస్తాడన్న వాగ్దానం కాదిది. కానీ మన నమ్మకం ద్వారా దేవుడు మన వ్యాధులు నయం చేయడం అనేది ఉంది (మత్తయి 9:28-29; యాకోబు 5:14 యాకోబు 5:16).

4. సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించు చున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచు చున్నాడు

“గోతిలోనుంచి”అంటే మరణం, నరకంనుంచి. వీటి నుంచి యెహోవా దేవుడొక్కడే రక్షించగలడు. కీర్తనల గ్రంథము 16:10; కీర్తనల గ్రంథము 49:15; కీర్తనల గ్రంథము 56:13; హెబ్రీయులకు 2:14-15. “కిరీటం”– కీర్తనల గ్రంథము 8:5. ఈ లోక రాజ్యాలు ఇవ్వగలిగిన ఏ కిరీటం కంటే కూడా అతి శ్రేష్ఠమైన కిరీటాన్ని దేవుడు ఇవ్వగలడు.

5. పక్షిరాజు ¸యౌవనమువలె నీ ¸యౌవనము క్రొత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు

6. యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికి న్యాయము తీర్చును

ఇస్రాయేల్ జాతి పట్ల, దేవుడంటే భయభక్తులు గలవారందరి పట్లా ఆయన మంచితనాన్ని దావీదు తలపోస్తున్నాడు. కీర్తనల గ్రంథము 12:5; కీర్తనల గ్రంథము 99:4; కీర్తనల గ్రంథము 146:7.

7. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను
రోమీయులకు 3:2

దేవుని మార్గాలను నేర్చుకోవాలని మోషే ప్రార్థించాడు (నిర్గమకాండము 33:13). దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చాడు. ప్రజలు తమ అపనమ్మకం, తిరుగుబాటుల వల్ల దేవుని చర్యలను మాత్రమే చూశారు. వాటిని కూడా త్వరగా మర్చిపోయారు (కీర్తనల గ్రంథము 78:11; కీర్తనల గ్రంథము 106:13). మోషేలాగా మనం కూడా దేవుని చర్యలను మనం అర్థం చేసుకోగలిగేలా ఆయన మనకు తన మార్గాలను నేర్పించాలని ప్రార్థించాలి (కీర్తనల గ్రంథము 25:4; కీర్తనల గ్రంథము 27:11; కీర్తనల గ్రంథము 86:11). అలాగని దేవుని విధానాలన్నిటినీ మనం ఈ లోకంలోనే నేర్చుకోగలమని కాదు (యెషయా 55:8-9; రోమీయులకు 11:33).

9. ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు.

10. మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు.

ఎజ్రా 9:13. మన పాపాలను బట్టి దేవుడు మనకు సంపూర్ణ శిక్ష విధిస్తే మనందరం నరకంలో ఉంటాం. ఎవరం తప్పించుకొనేవారం కాదు.

11. భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది.

కీర్తనల గ్రంథము 36:5; కీర్తనల గ్రంథము 57:10. తరువాతి వచనంలోనూ, ఇక్కడా దావీదు ఉద్దేశం కొలత తీసుకోవడానికి వీలులేనంత దూరం అని.

12. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూర పరచి యున్నాడు.

13. తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.

పాత ఒడంబడికలోనైతే దేవుడు తండ్రి అనే సత్యం కొద్దిగా కనిపిస్తున్నది. గాని క్రొత్త ఒడంబడికలోనైతే సంపూర్ణంగా, శోభాయమానంగా వెల్లడి అయింది (కీర్తనల గ్రంథము 68:5; 1 దినవృత్తాంతములు 22:10; యెషయా 9:6; మత్తయి 5:16; యోహాను 1:14 యోహాను 1:18; రోమీయులకు 8:15; 1 కోరింథీయులకు 8:6; ఎఫెసీయులకు 3:14-15; ఎఫెసీయులకు 4:6). తండ్రులందరిలోనూ ఉండవలసిన స్వభావం దేవునికి ఉంది. దేవుడు దయామయుడు, సానుభూతిపరుడు. తన పిల్లల సంక్షేమాన్నే అన్నిటికంటే ముఖ్యంగా వాంఛిస్తాడు, దానికోసం పని కొనసాగిస్తాడు.

14. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొను చున్నాడు.

15. నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును.

16. దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు.

17. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుస రించి నడచుకొను వారిమీద యెహోవాయందు భయభక్తులు గలవారిమీద
లూకా 1:50

మనిషి దౌర్భల్యాన్నీ, కొద్దిపాటి జీవితాన్నీ దావీదు దేవుని శాశ్వతమైన ఉనికికీ, నిత్యమైన అనుగ్రహానికీ పోలుస్తున్నాడు (కీర్తనల గ్రంథము 25:6; యోహాను 10:29; 1 పేతురు 1:3-5).

18. ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును.

ఈ కీర్తనలో చెప్పిన మేళ్ళన్నీ ఒకే రకం వ్యక్తులకే – దేవుని పట్ల భయభక్తులు గలవారే (వ 11,13), ఆయనకు లోబడేవారే వీటిని పొందగలరు. మనం దేవుణ్ణి గౌరవించి ఆయనకు విధేయులుగా ఉండేందుకు ప్రయత్నించకపోతే ఆయన ఇచ్చే దీవెనలను పొందాలని చూడడం వ్యర్థం. దేవునిపై భయభక్తుల గురించి కీర్తనల గ్రంథము 34:11-14; కీర్తనల గ్రంథము 111:10; ఆదికాండము 20:11; సామెతలు 1:7 నోట్స్ చూడండి.

19. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిర పరచియున్నాడు. ఆయన అన్నిటిమీదరాజ్యపరిపాలనచేయుచున్నాడు.

దేవుడు ఎంతో గొప్పవాడు. ఎంతో ఉత్తముడు. విశ్వానికంతటికీ అధినాధుడు – కీర్తనల గ్రంథము 47:1-3. అందువల్ల సృష్టి అంతా ఆయన్ను సన్నుతించాలని దావీదు చెపుతున్నాడు. కీర్తనల గ్రంథము 11:4; కీర్తనల గ్రంథము 47:2 కీర్తనల గ్రంథము 47:8; యెషయా 66:1; దానియేలు 4:17 దానియేలు 4:25; మత్తయి 5:34; ప్రకటన గ్రంథం 4:2.

20. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి.

21. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరు ఆయనను సన్నుతించుడి.

22. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము.

దావీదు తిరిగి ఈ కీర్తన మొదటి మాటల వైపు చూస్తున్నాడు. తాను చేయనిదాన్ని ఇతరులను చేయమని చెప్పడు.Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |