Psalms - కీర్తనల గ్రంథము 107 | View All

1. యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును.

ఈ కీర్తనలోని శ్రేష్ఠమైన ముఖ్యాంశం స్పష్టమే – దేవుడు మంచివాడు, సమస్తమైన కృతజ్ఞతలకూ స్తుతులకూ తగినవాడు. తన మహా మంచితనంలో ఆయన మనుషులను శ్రద్ధతో చూస్తూ ప్రార్థనలను వింటూ జవాబిస్తుంటాడు. కొంచెం పరిచయం తరువాత (వ 1-3), 4-32 వచనాల్లో రచయిత మనుషులను దేవుడు బాధల్లోనుంచి విడిపించిన నాలుగు ఉదాహరణలు ఇస్తున్నాడు. దేవుడలా చేశాడు కాబట్టి అందుకోసం దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మంచిది. ఇలా కృతజ్ఞతలు అర్పించవలసిందన్న ప్రోత్సాహం వ 1,8,15, 21,31లో ఉంది. బైబిల్లో మరెన్నో చోట్ల ఇది ఉంది (కీర్తనల గ్రంథము 106:1; కీర్తనల గ్రంథము 118:1; కీర్తనల గ్రంథము 136:1; 1 దినవృత్తాంతములు 16:34; యిర్మియా 33:11; 1 థెస్సలొనీకయులకు 5:18). వ 33-41లో రచయిత లోకంలో దేవుని తీర్పుల గురించి మాట్లాడుతున్నాడు (కీర్తనల గ్రంథము 105:7). ఆయన లోకమంతటి పైనా మహారాజు. నిజమైన జ్ఞానం గలవారు మనుషుల పట్ల దేవుని వ్యవహారాల్లో ఆయన జ్ఞానం, కృప ప్రేమలను కొంతవరకైనా చూచి గ్రహించగలుగుతారు. “కృతజ్ఞతలు”– కీర్తనల గ్రంథము 7:17; కీర్తనల గ్రంథము 50:14-15; కీర్తనల గ్రంథము 56:12; లేవీయకాండము 7:12-13; ఎఫెసీయులకు 5:20; 1 థెస్సలొనీకయులకు 5:18.

2. యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుదురు గాక విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించినవారును

“విడుదల పొందినవారు”– యెషయా 35:9-10; యెషయా 62:12; రోమీయులకు 3:24; ఎఫెసీయులకు 1:7; 1 పేతురు 1:18-19. కీర్తనల గ్రంథము 78:35 నోట్. “చెప్పాలి”– దేవుని ప్రజలు గొంతెత్తి దేవుడు తమకోసం చేసినవాటిని ఇతరులకు చెప్పాలి (కీర్తనల గ్రంథము 9:11; కీర్తనల గ్రంథము 73:28; కీర్తనల గ్రంథము 118:17; మత్తయి 10:32; అపో. కార్యములు 1:8; రోమీయులకు 1:15-16; ప్రకటన గ్రంథం 12:11).

3. తూర్పునుండి పడమటినుండి ఉత్తరమునుండి దక్షిణము నుండియు నానాదేశములనుండియు ఆయన పోగుచేసినవారును ఆమాట పలుకుదురుగాక.
మత్తయి 8:11, లూకా 13:29

ఎజ్రా, నెహెమ్యా కాలంలో ఇస్రాయేల్‌వారు బబులోను చెరనుండి తిరిగి వచ్చేసిన తరువాత ఈ కీర్తన రాసి ఉండవచ్చునని ఈ వచనాన్ని బట్టి కొందరు పండితులు భావించారు. ఇది నిజం కావచ్చు.

4. వారు అరణ్యమందలి యెడారిత్రోవను తిరుగులాడు చుండిరి. నివాస పురమేదియు వారికి దొరుకకపోయెను.

ప్రార్థనకు జవాబుగా దేవుడు మనుషులను విడిపించిన మొదటి ఉదాహరణ ఇది. చెరలోకి పోయినవారు తిరిగి వస్తుండగా వారికెదురైన ఇక్కట్ల గురించి ఇది తెలియజేస్తున్నది. ఇక్కడ శారీరకమైన బాధల వర్ణన కనిపిస్తున్నప్పటికీ, వీటిని విశ్వాసి ఆధ్యాత్మిక జీవిత యాత్రకూ, మార్గంలో ఎదురయ్యే కష్టాలకూ కూడా ఈ మాటలను వర్తింపజేసుకోవడం పొరపాటు కాదు.

5. ఆకలి దప్పులచేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను.

6. వారు కష్టకాలమందు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను

మనం ఎల్లప్పుడూ చేయవలసినది ఇదే (కీర్తనల గ్రంథము 34:6 కీర్తనల గ్రంథము 34:17; కీర్తనల గ్రంథము 50:15; కీర్తనల గ్రంథము 91:14-15). దేవుని వైపుకు మనం హృదయపూర్వకంగా తిరిగితే ఆయన మనల్ని కష్టాలనుంచి బయటికైనా తీసుకువస్తాడు, లేదా వాటిని భరించగలిగే కృపను, బలాన్ని ఇచ్చి అవన్నీ మన మేలుకే జరిగేలా చేస్తాడు.

7. వారొక నివాస పురము చేరునట్లు చక్కనిత్రోవను ఆయన వారిని నడిపించెను.

8. ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక

వ 15,21,31.

9. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు. ఆకలి గొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు.
లూకా 1:53

10. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున

ప్రార్థనకు జవాబుగా దేవుడు వారిని విడిపించిన రెండో ఉదాహరణ. ఇది శారీరకమైన చెర అయినప్పటికీ, ఆధ్యాత్మిక బానిసత్వం గురించి మనతో మాట్లాడవచ్చు. ఈ చెర ఆ ప్రజల పాప ఫలితం అయినప్పటికీ, వారు తనవైపు తిరిగినప్పుడు దేవుడు వారి ప్రార్థనను త్రోసిపుచ్చలేదు. కీర్తనల గ్రంథము 102:20; కీర్తనల గ్రంథము 143:3; యోబు 36:5; యెషయా 42:7; మీకా 7:8; లూకా 1:79.

11. బాధ చేతను ఇనుప కట్లచేతను బంధింప బడినవారై చీకటిలోను మరణాంధకారములోను నివాసముచేయువారి హృదయమును

కీర్తనల గ్రంథము 78:40; కీర్తనల గ్రంథము 106:7; విలాపవాక్యములు 3:42. దేవునికి వ్యతిరేకంగా తిరగబడడం మనల్ని తప్పనిసరిగా ఏదో ఒక రకమైన దాస్యంలోకి నడుపుతుంది.

12. ఆయన ఆయాసముచేత క్రుంగజేసెను. వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను.

13. కష్టకాలమందు వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను

14. వారి కట్లను తెంపివేసి చీకటిలోనుండియు మరణాంధకారములో నుండియు వారిని రప్పించెను.

15. ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

16. ఏలయనగా ఆయన యిత్తడి తలుపులను పగులగొట్టి యున్నాడు ఇనుపగడియలను విరుగగొట్టియున్నాడు.

యెషయా 45:1-2. దేవుడు తన ప్రజలను విడిపించడానికి లేచినప్పుడు ఏ తలుపులకూ, ద్వారబంధాలకూ కూడా వారిని చెరలో ఉంచడానికి శక్తి చాలదు (అపో. కార్యములు 12:5-11).

17. బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తనచేతను తమ దోషము చేతను బాధతెచ్చుకొందురు.

ప్రార్థనకు జవాబుగా దేవుడు మనుషులను విడిపించిన మూడో ఉదాహరణ పాపం, తిరుగుబాటు మూలంగా కలిగిన వ్యాధి గురించి ఇక్కడ చూస్తున్నాం. ఈ వ్యాధి సోకినవారు యెహోవాకు మొర పెట్టేవరకు మృత్యు ముఖంలో ఉన్నారు. – వ 18. వ 17లో వారిని మూర్ఖులు అనడం చూస్తున్నాం. వారి పాపం, తిరుగుబాటుల్లోనూ, దేవునివైపు తిరగడానికి వారు అంత జాగు చేయడంలోనూ వారి మూర్ఖత్వం బయటపడింది. అయితే ఇక్కడ దేవుని మహా దయను చూడండి. మూర్ఖులు సైతం తనను వెదికితే దేవుడు వారి ప్రార్థనలను కూడా వింటాడు. లేవీయకాండము 26:14-16.

18. భోజనపదార్థములన్నియు వారి ప్రాణమునకు అసహ్య మగును వారు మరణద్వారములను సమీపించుదురు.

19. కష్టకాలమందు వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను.

20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలోనుండి వారిని విడిపిం చెను.
అపో. కార్యములు 10:36, అపో. కార్యములు 13:26

21. ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయుఆశ్చర్య కార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

22. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించు దురుగాక.

23. ఓడలెక్కి సముద్రప్రయాణము చేయువారు మహాజలములమీద సంచరించుచు వ్యాపారముచేయు వారు

ప్రార్థనకు జవాబుగా దేవుని విడుదల తెలిపే నాలుగో ఉదాహరణ. తుఫాను సమయంలో సముద్రయానం చేసే నౌకలకు వాటిల్లే ప్రమాదాలు గొప్పవి. క్రొత్త ఒడంబడికలో ఇలాంటి సందర్భాల కోసం మత్తయి 8:23-27; అపో. కార్యములు 27:14-44 చూడండి. విశ్వాసి జీవిత నౌకాయానంలో పరలోక రేవును చేరడంలో కూడా అనేక ప్రమాదాలు, ఇక్కట్లు ఉన్నాయి.

24. యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి.

25. ఆయన సెలవియ్యగా తుపాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను

వ 29 పోల్చి చూడండి. తుఫాను రప్పించే ఒక దేవుడైతే, దానినుంచి కాపాడేది మరో దేవుడు అని పురాతన పురాణ కథలు చెప్తాయి. ఈనాటికీ కొందరు అదే నమ్ముతారు. కానీ ఇక్కడ అలా కాదు ఏకైక నిజ దేవుడు ఒక్కడే ఉన్నాడు. తుఫానులు రేపేదీ ఆయనే, నిమ్మళింపజేసేదీ ఆయనే.

26. వారు ఆకాశమువరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను.

27. మత్తులైనవారివలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి వారు ఎటుతోచక యుండిరి.

ఏం చెయ్యాలో తోచకపోయినప్పుడు, ఏం చెయ్యాలో తెలిసిన, అలా చెయ్యగలిగిన దేవునివైపుకు తిరగాలి.

28. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను.

29. ఆయన తుపానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను.

30. అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను.

31. ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్య కార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

32. జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక

33. దేశనివాసుల చెడుతనమునుబట్టి

మనుషుల జీవితాల్లో యెహోవాదేవుని సర్వ ఆధిపత్యాన్ని వెల్లడి చేసే ఇతర చర్యలు. లేవీయకాండము 26:19; ద్వితీయోపదేశకాండము 28:23-24; 1 రాజులు 17:1 1 రాజులు 17:7; కీర్తనల గ్రంథము 74:15; యెషయా 42:15; యెషయా 50:2.

34. ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువగల భూమిని చవిటిపఱ్ఱగాను మార్చెను.

35. అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి

36. వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకొనునట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్షతోటలు నాటి

37. వాటివలన సస్యఫలసమృద్ధి పొందునట్లును ఆయన ఆకలికొనినవారిని అచ్చట కాపురముంచెను

38. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధిక ముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనియ్యలేదు

39. వారు బాధవలనను ఇబ్బందివలనను దుఃఖమువలనను తగ్గిపోయినప్పుడు

40. రాజులను తృణీకరించుచు త్రోవలేని యెడారిలో వారిని తిరుగులాడ జేయు వాడు.

యోబు 12:21. దీనికి ఒక ఉదాహరణ దానియేలు 4:28-33 లో ఉంది.

41. అట్టి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తెను వాని వంశమును మందవలె వృద్ధిచేసెను.

42. యథార్థవంతులు దాని చూచి సంతోషించుదురు మోసగాండ్రందరును మౌనముగా నుందురు.

43. బుద్ధిమంతుడైనవాడు ఈ విషయములను ఆలోచించును యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక.

బైబిలు దేవుడు చేసిన పనులను ధ్యానించడం ద్వారా ఆయన గుణాల గురించి గొప్ప సంగతులను నేర్చుకోవచ్చు.Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |