శీర్షిక – 120 కీర్తన శీర్షిక చూడండి.
శత్రువులనుంచి గొప్ప విడుదలను ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. వారు ఘోషించే జలంలాగా అడవి మృగాల్లాగా (వ 6), క్రూరమైన వేటగాళ్ళలాగా (వ 7) ఇస్రాయేల్ పై విరుచుకుపడ్డారు. వారినుంచి విడుదల తమ జ్ఞానం, యుద్ధ నైపుణ్యం బలం వల్ల కాదని, దేవుడు తన వైపున ఉన్నాడన్న ఒక్క వాస్తవం వల్లే అని బహిరంగంగా ప్రకటించాలని రచయిత ఇస్రాయేల్ వారిని ప్రోత్సహిస్తున్నాడు. క్రీస్తు సంఘం కూడా శత్రుత్వం వహించిన లోకంలో ఉంది. దుర్మార్గులతో చేయి కలిపి సైతాను దాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. విశ్వాసులు ఇంతకు ముందూ, ఇప్పుడూ కూడా హేళనలు, బెదిరింపులు, అన్యాయాలు, బాధలు, హింసలు, హత్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ దేవుడు తన ప్రజల పక్షంగా ఉన్నాడు కాబట్టి క్రీస్తు సంఘం ఎన్నటికీ సమసిపోదు (మత్తయి 16:18; రోమీయులకు 8:31).