Psalms - కీర్తనల గ్రంథము 132 | View All

1. యెహోవా, దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకము చేసికొనుము.

శీర్షిక – 120వ కీర్తన శీర్షిక చూడండి. ఈ కీర్తనను సొలొమోను లేక సొలొమోను రోజుల్లో ఎవరన్నా కవి గానీ ప్రవక్త గానీ రాశాడని చాలామంది బైబిలు పండితులు భావిస్తున్నారు. సొలొమోను కట్టించిన దేవాలయంలోకి దేవుని మందసాన్ని తీసుకువచ్చిన సమయం కోసం బహుశా ఈ కీర్తన రాసి ఉండవచ్చు (1 రాజులు 6:37-38; 1 రాజులు 8:1-6 1 రాజులు 8:62-63). దేవుడు తన ప్రార్థన ఆలకించాలని కోరుతూ రచయిత దావీదు పేరునూ అతడు పడిన కష్టాలనూ ప్రస్తావించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు విశ్వాసులు అంతకన్నా ఉన్నతమైన పేరున ప్రార్థన చెయ్యవచ్చు. దావీదు కుమారుడూ దావీదు ప్రభువూ మన రక్షకుడూ అయిన యేసుక్రీస్తు నామం అది. మన స్వంత యోగ్యతను బట్టి దేవుణ్ణి సమీపించలేము గాని “దేవా, యేసునూ ఆయన కడగండ్లన్నీ జ్ఞాపకం చేసుకో” అని ప్రార్థించవచ్చు.

2. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట యిచ్చి

2 సమూయేలు 7:1-2; 1 దినవృత్తాంతములు 28:2. దావీదు తన భవనంలో ఉంటూ ఇస్రాయేల్‌వారి మధ్య దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్న ఒడంబడిక మందసం గుడారంలో ఉండిపోవడం సరికాదు అనుకున్నాడు. దావీదు చేసిన ఈ మొక్కుబడి అతని చరిత్రను చెప్పిన భాగంలో ఎక్కడా కనిపించదు. దావీదు దేవుణ్ణెంతగా ప్రేమించాడో తన ప్రజల మధ్య దేవుని నివాస స్థలం విషయం ఎంత ఆసక్తి చూపాడో తెలిపేందుకు ఈ మాటలు ఇక్కడ రాయబడ్డాయి. దేవుని పని గురించి నిద్ర కరువైన రాత్రులు మనమెన్ని గడిపాం?

3. యాకోబుయొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడిచేసెను.

4. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచువరకు యాకోబుయొక్క బలిష్ఠునికి ఒక నివాసస్థలము నేను చూచువరకు

5. నా వాసస్థానమైన గుడారములో నేను బ్రవేశింపను నేను పరుండు మంచముమీది కెక్కను నా కన్నులకు నిద్ర రానియ్యను నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియ్యననెను.
అపో. కార్యములు 7:46

6. అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి యాయరు పొలములలో అది దొరికెను.

“విన్నాం”అంటే బహుశా దేవుని ఒడంబడిక మందసం గురించి విన్నాం అని అర్థం కావచ్చు.

7. ఆయన నివాసస్థలములకు పోదము రండి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదము రండి.

“నివసించే చోటికీ”– జెరుసలంలోని దేవాలయం (కీర్తనల గ్రంథము 5:7; కీర్తనల గ్రంథము 122:1-2). “పాదపీఠం”– ఇస్రాయేల్‌లో దేవుడు ఒడంబడిక పెట్టెమీద కెరూబులకు పైగా ఆసీసుడై ఉన్నాడనీ ఒడంబడిక పెట్టె ఆయన పాదపీఠంగా ఉందనీ రాసి ఉంది (కీర్తనల గ్రంథము 80:1; కీర్తనల గ్రంథము 99:1; 1 దినవృత్తాంతములు 28:2).

8. యెహోవా, లెమ్ము నీ బలసూచకమైన మందసముతో కూడ రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము.

సంఖ్యాకాండము 10:35-36. సొలొమోను కాలంలో ఒడంబడిక పెట్టెను అతి పవిత్ర స్థలంలోకి తీసుకువెళ్ళిన సంగతిని ఇది తెలియజేస్తున్నది – 1 రాజులు 8:6.

9. నీ యాజకులు నీతిని వస్త్రమువలె ధరించుకొందురుగాక నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు గాక.

యెషయా 61:3 యెషయా 61:10; జెకర్యా 3:4; మలాకీ 3:3; ఎఫెసీయులకు 6:14. తన సేవకులూ విశ్వాసులందరి విషయంలోనూ దేవుడు ఆశించేది ఇదే. నిజమైన నీతిన్యాయాలు నిజమైన ఆనందాన్నీ తెస్తాయి. పాపం దుఃఖాన్ని, దైన్యాన్ని ఇస్తుంది.

10. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై యుండకుము.

వ 1. ఇక్కడ అభిషిక్తుడు అంటే దావీదు స్థానంలో రాజుగా అభిషేకం పొందిన సొలొమోను కావచ్చు. అంతేగాక అతడి తరువాత వచ్చిన రాజులందరి గురించైనా కావచ్చు.

11. నీ గర్భఫలమును నీ రాజ్యముమీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనినయెడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుస రించినయెడల వారి కుమారులుకూడ నీ సింహాసనముమీద నిత్యము కూర్చుందురని
లూకా 1:32, అపో. కార్యములు 2:30

దేవుణ్ణి ప్రేమిస్తూ దావీదు ఆయనకు మొక్కుబళ్ళు చేశాడు. దావీదును ప్రేమిస్తూ దేవుడు అతనికి వాగ్ధానాలు చేశాడు. దేవునికీ ఆయన పిల్లలకూ మధ్య ఉన్న పరస్పర ప్రేమే ఆధ్యాత్మిక జీవనం. దావీదుతో దేవుడు చేసిన ఒడంబడిక గురించి నోట్స్ కీర్తనల గ్రంథము 89:3-4 కీర్తనల గ్రంథము 89:19-37; 2 సమూయేలు 7:11-16. యేసుప్రభువు దావీదు రాజవంశంలో జన్మించి దావీదు సింహాసనానికి వారసుడయ్యాడు – లూకా 1:32-33.

12. యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేసెను ఆయన మాట తప్పనివాడు.

13. యెహోవా సీయోనును ఏర్పరచుకొని యున్నాడు. తనకు నివాసస్థలముగా దానిని కోరుకొని యున్నాడు.

యెహోవాదేవుడు సీయోనును ఎన్నుకున్నది అందులోని కొండలు, భవనాల గురించి కాదు. దేవునికి ఉన్న శ్రద్ధ మనుషులపైనే గాని ప్రదేశాలపై కాదు.

14. ఇది నేను కోరినస్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించెదను

తన ప్రజల మధ్య ఎప్పటికీ దేవుని విశ్రాంతి స్థలం ఉంది. వారితో నివసించాలన్న ఆయన అభిలాషను తెలియజెప్పే వైనమే బైబిలంతా (నిర్గమకాండము 25:8 నోట్‌). దేవుడు నిజానికీ జెరుసలం నగరాన్ని వదిలిపెట్టేసి దాన్ని శత్రువుల చేతిలో పడనిచ్చాడు (యెహె 10వ అధ్యాయం దేవుని మహిమా ప్రకాశం జెరుసలం నుంచి తరలిపోవడం గురించీ, యిర్మీయా 52వ అధ్యాయం జెరుసలం పతనం గురించీ వర్ణిస్తున్నాయి). అయితే దేవుడు తన ప్రజలనెన్నడూ విడిచిపెట్టలేదు. ఈ వచనం, ఇలాంటివే ఇతర వచనాలనూ బట్టి చూస్తే భవిష్యత్తులో దేవుని ఉద్దేశాల్లో ఇస్రాయేల్ దేశంలో ఉన్న జెరుసలం నగరానికి పాత్ర ఉంటుందని కనిపిస్తుంది (యెహెఙ్కేలు 48:35; జెకర్యా 14:16-21).

15. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను

16. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింప జేసెదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు.

వ 9. ఈ క్రొత్త ఒడంబడిక యుగంలో విశ్వాసులంతా యాజులే. నిర్గమకాండము 28:1 నోట్ చూడండి.

17. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ జేసెదను నా అభిషిక్తునికొరకు నే నచ్చట ఒక దీపము సిద్ధపరచి యున్నాను.
లూకా 1:69

“శృంగం (కొమ్ము)”– కీర్తనల గ్రంథము 75:4-5; కీర్తనల గ్రంథము 89:17; కీర్తనల గ్రంథము 92:10. ఇక్కడ కొమ్ము అధికారం, బలప్రభావాలు ఉన్న వ్యక్తికీ అంటే రాజుకు సూచనగా ఉంది. లూకా 1:69 లో ఈ పదం యేసుప్రభువును ఉద్దేశించి వాడబడింది. “దీపం”– 1 రాజులు 11:36; 1 రాజులు 15:4. దావీదు రాజవంశం కొనసాగుతుందని చెప్పడానికి ఇక్కడ దీపం సూచనగా వాడబడింది. లోకానికి వెలుగైన యేసుప్రభువుకు దావీదు ఒక చిహ్నం. యేసుప్రభువుతో పోల్చుకుంటే చుట్టూ ఉన్న చీకట్లో దావీదు దీపం గుడ్డిగా కొడిగడుతున్న వెలుతురులాంటిది (లూకా 1:78; లూకా 2:32; యోహాను 8:12; ప్రకటన గ్రంథం 21:22-23).

18. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింప జేసెదను అతని కిరీటము అతనిమీదనే యుండి తేజరిల్లును అనెను.

“అవమానం”– కీర్తనల గ్రంథము 6:10; కీర్తనల గ్రంథము 35:26; కీర్తనల గ్రంథము 44:7; కీర్తనల గ్రంథము 53:5; కీర్తనల గ్రంథము 71:13. అవమానాన్నే వస్త్రంగా ధరించుకోవడానికీ, నీతిన్యాయాలనూ రక్షణనూ వస్త్రంగా ధరించుకోవడానికీ ఎంత తేడా (వ 9,16)! “కిరీటం”– హెబ్రీయులకు 2:9; ప్రకటన గ్రంథం 19:11-12.Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |